హైకోర్టు తీర్పు; బాబుతో ఏబీ భేటీ

AB Venkateswara rao Meets Chandrababu Naidu - Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు శుక్రవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సమావేశమయ్యారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు పాటించాల్సిందేనంటూ హైకోర్టు స్పష్టం చేసిన నేపథ్యంలో వీరు భేటీ అయ్యారు. భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తున్నారు. హైకోర్టు తీర్పు తమకు వ్యతిరేకంగా రావడంతో మల్లగుల్లాలు పడుతున్నారు. ఉన్నత న్యాయస్థానం తీర్పుపై ఏవిధంగా ముందుకెళ్లాలనే దానిపై తర్జనభర్జన పడుతున్నట్టు తెలుస్తోంది. (చదవండి: ఇంటెలిజెన్స్‌ డీజీపై వేటు)

తమకు అనుకూలంగా వ్యవహరిస్తున్న వెంకటేశ్వరరావును బదిలీ చేయకుండా ఉండేందుకు చంద్రబాబు సర్కారు చివరకు ప్రయత్నాలు సాగించింది. ఈ క్రమంలో కేంద్ర ఎన్నికల సంఘానికి చంద్రబాబు ఘాటు లేఖ కూడా రాశారు. హైకోర్టు తలుపు తట్టినప్పటికీ రాష్ట్ర సర్కారు నగుబాటు తప్పలేదు. మరోవైపు  వెంకటేశ్వరరావు కోసం మొత్తం అధికార వ్యవస్థను అవమానాల పాల్జేశారని ఉన్నతాధికారులు మండిపడుతున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలను పాటించకుండా చంద్రబాబు అనుసరిస్తున్న వైఖరిని తప్పుబడుతున్నారు. (చదవండి: ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురు)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top