ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురు

High Court Says AP Government Should Follow CEC Orders - Sakshi

సాక్షి, అమరావతి: చంద్రబాబు సర్కార్‌కు హైకోర్టులో చుక్కెదురైంది. ఏపీలో అధికారుల బదిలీలకు సంబంధించి సీఈసీ ఆదేశాల్లో జోక్యం చేసుకునేందుకు హైకోర్టు నిరాకరించింది. ఇంటెలిజెన్స్‌ డీజీ ఏబీ వెంకటేశ్వరరావు సహా ముగ్గురు ఐపీఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే సీఈసీ నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఏపీ ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు శుక్రవారం తీర్పును వెలువరించింది. ఈసీ ఆదేశాల్లో తాము జోక్యం చేసుకోలేమని హైకోర్టు తేల్చిచెప్పింది. బదిలీలపై ఏపీ ప్రభుత్వ వాదనను తోసిపుచ్చింది. అంతేకాకుండా ఈసీ ఆదేశాలను శిరసావహించాల్సిందేనని ప్రభుత్వానికి స్పష్టం చేసింది. 

వివరాల్లోకి వెళ్తే.. ఏబీ వెంకటేశ్వరరావును విధుల నుంచి తప్పిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం(సీఈసీ) జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ రాష్ట్రప్రభుత్వం హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేయడం తెలిసిందే. ఈ ఉత్తర్వులను ఏకపక్షంగా ప్రకటించి, ఇందుకు సంబంధించిన తదుపరి చర్యలన్నింటినీ నిలిపేయాలని కోరుతూ సాధారణ పరిపాలన శాఖ(జీఏడీ) కార్యదర్శి శ్రీకాంత్‌ ఈ పిటిషన్‌ వేశారు. తామిచ్చిన ఫిర్యాదు మేరకే ఏబీ వెంకటేశ్వరరావు, ఇద్దరు ఎస్పీలను సీఈసీ విధుల నుంచి తప్పించిందని, అందువల్ల ఈ వ్యాజ్యంలో తమ వాదనలు వినాలంటూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి వి.విజయసాయిరెడ్డి కూడా అనుబంధ పిటిషన్‌ వేశారు. (చదవండి: అప్పుడలా..ఇప్పుడిలా..ఎలా బాబూ..)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top