మే లోపు ఆధార్ ప్రక్రియ పూర్తి | Aadhaar May deadline to complete the process | Sakshi
Sakshi News home page

మే లోపు ఆధార్ ప్రక్రియ పూర్తి

Feb 17 2015 6:06 AM | Updated on Sep 2 2017 9:29 PM

రా్రష్ట్ర ప్రజలందరికీ విశిష్ట ప్రాధికార గుర్తింపు సంఖ్య ‘ఆధార్’ జారీ ప్రక్రియను వచ్చే మే నెలలోగా పూర్తి చేస్తామని యూనిక్ ఐడెంటిఫికేషన్...

సాక్షి, హైదరాబాద్: రా్రష్ట్ర ప్రజలందరికీ విశిష్ట ప్రాధికార గుర్తింపు సంఖ్య ‘ఆధార్’ జారీ ప్రక్రియను వచ్చే మే నెలలోగా పూర్తి చేస్తామని యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండి యా(యూఐడీఏఐ) అసిస్టెంట్ డెరైక్టర్ జనరల్ దేవరతన్ కుమార్ తెలిపారు. రాష్ట్రంలో ఆధార్ ప్రక్రియ కొనసాగుతున్న తీరుపై యూఐడీఏఐ డెరైక్టర్ జనరల్ వి.ఎస్.మదన్ సోమవారం సచివాలయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యద ర్శి రాజీవ్‌శర్మతో చర్చించినట్లు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే పలు పథకాలతోపాటు ఓటరు గుర్తింపుకార్డుకు కూడా ఆధార్‌ను అనుసంధానించే విషయమై చర్చ జరిగిందని చెప్పారు. త మవద్ద ఉన్న లెక్కల ప్రకారం తెలంగాణలో వందశాతం ఆధార్ ప్రక్రియ పూర్తి అయిందన్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement