మోసపోయిన యువతి కథ సుఖాంతం | A young boy cheated a woman,police married with that woman | Sakshi
Sakshi News home page

మోసపోయిన యువతి కథ సుఖాంతం

May 15 2015 2:38 AM | Updated on Sep 19 2018 8:32 PM

ప్రియుడి చేతిలో మోసపోయిన యువతి కథ గురువారం సుఖాంతమైంది...

- ఇరు కుటుంబాల వారితో చర్చించి ఒప్పించిన ఐసీడీఎస్ అధికారులు, పోలీసులు
- మోసగించిన యువకుడితో పెళ్లి జరిపించిన వైనం
పెద్దపంజాణి
: ప్రియుడి చేతిలో మోసపోయిన యువతి కథ గురువారం సుఖాంతమైంది. పెద్దపంజాణి మండలం ముత్తుకూరు పంచాయతీ పరిధిలో గల పోలేపల్లె గ్రామానికి చెందిన జ్యోతి(19)కి ఆరు నెలల క్రితం అరగొండ సమీపంలోని గొల్లపల్లె గ్రామానికి చెందిన ప్రేమ్‌కుమార్ మిస్డ్ కాల్‌తో పరిచయమయ్యాడు. ఈ పరిచయం ప్రేమగా మారింది. నెల రోజుల క్రితం ఇంట్లో నుంచి పారిపోయి పలమనేరులో ఒక అద్దె ఇల్లు తీసుకుని కలిసి ఉన్నారు. కొన్ని రోజుల క్రితం ఉద్యోగం కోసం వెళుతున్నట్లు చెప్పి ప్రేమ్‌కుమార్ ఆమెను వదిలించుకున్నాడు. ఆలస్యంగా విషయం తెలుసుకున్న యువతి పెద్దపంజాణి పోలీసులను ఆశ్రయించింది.

ఐసీడీఎస్ అధికారులు, పోలీసులు ప్రేమ్‌కుమార్ జాడ తెలుసుకుని ఇరు కుటుంబాలతో చర్చించి వారికి కౌన్సెలింగ్ ఇచ్చారు. ఇరు కుటుంబాలు పెళ్లికి అంగీకరించాయి. పెద్దపంజాణి  తహశీల్దార్ కార్యాలయ ఆవరణలోని విఘ్నేశ్వర స్వామి ఆలయంలో పెళ్లి జరిపించారు. దీంతో మిస్డ్ కాల్ ప్రేమ కాస్త పెళ్లితో సుఖాంతమైంది. ఐసీడీఎస్ ప్రాజెక్టు అధికారిణి సుజాతను పలువురు అభినందించారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ ఏసీడీపీవో ఎల్లమ్మ, సూపర్‌వైజర్ సులోచన ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement