ఐఏఎస్లు, ఐపిఎస్ల విభజనపై నివేదిక | A Report on IAS and IPS Officials to Central Government | Sakshi
Sakshi News home page

ఐఏఎస్లు, ఐపిఎస్ల విభజనపై నివేదిక

Oct 30 2013 2:58 PM | Updated on Sep 27 2018 3:19 PM

ఐఏఎస్లు, ఐపిఎస్ల విభజనపై నివేదిక - Sakshi

ఐఏఎస్లు, ఐపిఎస్ల విభజనపై నివేదిక

రాష్ట్ర విభజన జరిగిన తరువాత రెండు రాష్ట్రాలకు ఐఏఎస్, ఐపిఎస్ అధికారుల విభజనకు సంబంధించిన నివేదికను రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు కేంద్రానికి సమర్పించింది.

ఢిల్లీ: రాష్ట్ర విభజన జరిగిన తరువాత రెండు రాష్ట్రాలకు ఐఏఎస్, ఐపిఎస్ అధికారుల  విభజనకు సంబంధించిన నివేదికను రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు కేంద్రానికి సమర్పించింది. ఏ ప్రాంతానికి ఎంతమంది వెళ్లాలో ఆ వివరాలు ఈ నివేదికలో పొందుపరిచారు.  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి ఈరోజు  కేంద్ర సిబ్బంది శాఖ సహాయ మంత్రి వి.నారాయణస్వామిని కలిసి ఈ నివేదిక అందజేశారు.

రాష్ట్ర విభజన ప్రక్రియను కేంద్రం వేగవంతం చేసిన నేపధ్యంలో అన్ని శాఖల నుంచి నివేదికలు తెప్పించుకుంటుంది. అందులో భాగంగానే ఈరోజు ఐఏఎస్, ఐపిఎస్ అధికారులకు సంబంధించిన నివేదిక అందుకుంది.

Advertisement
 
Advertisement
Advertisement