'చార్‌ధామ్' బాధలో వ్యక్తి మృతి | a man dies of chardham suffer | Sakshi
Sakshi News home page

'చార్‌ధామ్' బాధలో వ్యక్తి మృతి

Jun 27 2015 6:38 PM | Updated on Apr 3 2019 8:07 PM

అనంతపురం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది.

జోసెఫ్ నగర్: అనంతపురం నగరంలో విషాదం చోటుచేసుకుంది. తన కుటుంబ సభ్యులు ఛార్‌ధామ్ యాత్ర వరదల్లో చిక్కుకున్నారని తెలుసుకున్న ఓ వ్యక్తి మృతిచెందాడు. ఈ సంఘటన అనంతపురం పట్టణం లోని జోసెఫ్ నగర్‌లో శుక్రవారం రాత్రి జరిగింది.

వివరాలు.. కాలనీకి చెందిన కుళ్లాయప్ప (68) కుటుంబానికి చెందిన ఏడుగురు సభ్యులు ఈ నెల 15న ఛార్ ధామ్ యాత్రకు వెళ్లారు. రెండు రోజుల నుంచి ఉత్తరాఖండ్‌లో భారీగా వరదలు పోటెత్తడంతో తాము అందులో చిక్కుకున్నామని.. శుక్రవారం సాయంత్రం ఇంట్లో ఉన్న తండ్రి కుళ్లాయప్పకు  తెలియజేశారు. దీంతో.. ఆవేదన చెందిన కుళ్లాయప్ప గుండె ఆగి చనిపోయాడు.

Advertisement
 
Advertisement
Advertisement