ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం.. | a love pair in chennai attempts suicide | Sakshi
Sakshi News home page

ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం..

Apr 11 2017 7:54 PM | Updated on Nov 6 2018 7:53 PM

నంగనల్లూరుకు చెందిన ప్రేమజంట మామల్లపురంలో ఆత్మహత్యకు ప్రయత్నించారు.

→ ప్రియుడు మృతి
→ ప్రాణాలతో పోరాడుతున్న ప్రియురాలు


తిరువొత్తియూరు: నంగనల్లూరుకు చెందిన ప్రేమజంట మామల్లపురంలో ఆత్మహత్యకు ప్రయత్నించారు. వీరిలో ప్రియుడు మృతి చెందగా ప్రియురాలు ఆందోళనకరస్థితిలో వైద్యం పొందుతున్నది. చెన్నై నంగనల్లూరుకు చెందిన వ్యక్తి శివగురునాథన్‌ (30) నుంగంబాక్కంలో వున్న ప్రైవేటు సెక్యూరిటీ సంస్థలో పని చేస్తున్నాడు. ఇతను, అదే సంస్థలో పని చేస్తున్న పెరంబలూరుకు చెందిన 24 ఏళ్ల యువతి ఇద్దరూ ప్రేమించుకున్నారు. వీరి ప్రేమకు యువతి కుటుంబీకులు వ్యతిరేకత తెలిపారు. జాతకములు సరిపడలేదని, మరో యువకుడితో పెండ్లి సంబంధాలు చూశారు. దీంతో వేదన చెందిన ప్రేమజంట ఆత్మహత్య చేసుకోవడానికి నిర్ణయించుకున్నారు.

ఇందుకోసం మామల్లపురంలో బస్సు నిలయం వద్ద వున్న లాడ్జిలో గది తీసుకున్నారు. ఈ క్రమంలో చాలా సమయం వరకు గది తలుపులు తెరచుకోకపోవడంతో పోలీసులు సహాయంతో లాడ్జి ఉద్యోగులు గది తలుపులు పగులగొట్టి చూశారు. ఆ సమయంలో నిద్రమాత్రలు మింగిన శివగురునాథన్‌ మృతి చెంది పడి వున్నాడు. సమీపంలో అతని ప్రియురాలు సృహ తప్పిన స్థితిలో ప్రాణాలతో పోరాడుతున్నది. వెంటనే ఆమెను చికిత్సకోసం చెంగల్పట్టు ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. అదే ఆసుపత్రిలో శివగురునాథన్‌ మృతదేహాన్ని శవపరీక్ష కోసం తీసుకొచ్చారు. ఈ సమచారం అందుకున్న ప్రేమికుల బంధువుల మధ్య ఘర్షణ జరిగింది. దీని తరువాత మెరుగైన చికిత్స కోసం వడపళణిలో ఉన్న ప్రైవేటు ఆసుపత్రిలో యువతిని అనుమతింప చేశారు. అక్కడ ఆమెకు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. దీనిపై మామల్లపురం పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement