పవన్ కల్యాణ్‌ది కుర్రతనం | A. Kodandarami Reddy takes on Pawan Kalyan | Sakshi
Sakshi News home page

పవన్ కల్యాణ్‌ది కుర్రతనం

May 3 2014 8:03 AM | Updated on Mar 22 2019 5:33 PM

పవన్ కల్యాణ్‌ది కుర్రతనం - Sakshi

పవన్ కల్యాణ్‌ది కుర్రతనం

జనసేన అధినేత, సినీనటుడు పవన్ కల్యాణ్‌ది కుర్రతనమని, అందుకే పూటకో మాట మాట్లాడుతూ తన అపరిపక్వతను చా టుకుంటున్నారని సినీ దర్శకుడు, వైసీపీ నేత ఎ.కోదండరామిరెడ్డి విమర్శించారు

 వైఎస్సార్ సీపీ నేత, సినీ దర్శకుడు కోదండరామిరెడ్డి
 
 పాలకోడేరు : జనసేన అధినేత, సినీనటుడు పవన్ కల్యాణ్‌ది కుర్రతనమని, అందుకే పూటకో మాట మాట్లాడుతూ తన అపరిపక్వతను చా టుకుంటున్నారని సినీ దర్శకుడు, వైసీపీ నేత ఎ.కోదండరామిరెడ్డి విమర్శించారు. శుక్రవారం కుముదవల్లిలో భూపతిరాజు రవిరాజు నివాసం వద్ద శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. పవన్ కల్యాణ్ పార్టీ పెట్టిన తర్వాత పోటీ చేయనని ఒకసారి, జేపీకి మద్దతు ఇస్తానని మరోసారి, ఆ తర్వాత బీజేపీకే తన మద్దతు అన్నారని, మళ్లీ  టీడీపీకి మద్దతు ఇస్తాననడంలోనే ఆయన వ్యవహారశైలి తెలుస్తుందన్నారు.
 
 
 పవన్‌కు ఆవేశమే కాని విజ్ఞత లేదని కోదండరామిరెడ్డి విమర్శించారు. నిత్యం ప్రజల్లో ఉండి వారి కష్టాల్లో పాలుపంచుకుంటున్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని పవన్ కల్యాణ్ విమర్శించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో తుదికంటా పోరాడింది వైఎస్ జగన్ మాత్రమేనని, చంద్రబాబునాయుడు రాష్ట్ర విభజనకు అనుకూలంగా లేఖ ఇచ్చిన విషయం తెలియదా అని పవన్ కల్యాణ్‌ని నిలదీశారు. రాష్ట్ర విభజన అడ్డుకునేందుకు చంద్రబాబు ఏం చేశారో పవన్ కల్యాణ్ చెప్పాలని కోదండరామిరెడ్డి డిమాండ్ చేశారు. సమావేశంలో పార్టీ నేతలు భూపతిరాజు ఆంజనేయరాజు, రవికుమార్‌రాజు, రాగాల ఆదినారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement