కొండాపురం మండలం కొమ్మి గ్రామంలో మంగళవారం విషాదం చోటుచేసుకుంది.
శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా(కొండాపురం) : కొండాపురం మండలం కొమ్మి గ్రామంలో మంగళవారం విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తూ ఊరి చివరన ఉన్న చెరువులో పడి ఎస్‌కే బాదీ(8) అనే బాలుడు మృత్యువాతపడ్డాడు. బాలుడి మృతదేహాన్ని గ్రామస్తులు వెలికి తీశారు. చిన్నారి మృతితో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి.