'రాష్ట్రానికి 58 ఎమ్మెల్సీ స్థానాలు కోరతాం' | Sakshi
Sakshi News home page

'రాష్ట్రానికి 58 ఎమ్మెల్సీ స్థానాలు కోరతాం'

Published Wed, Jul 16 2014 1:41 PM

'రాష్ట్రానికి 58 ఎమ్మెల్సీ స్థానాలు కోరతాం' - Sakshi

రాష్ట్రానికి 58 ఎమ్మెల్సీ స్థానాలు కోరాలని నిర్ణయించినట్లు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు వెల్లడించారు. బుధవారం హైదరాబాద్లో యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ... విభజన చట్టంలో జరిగిన లోపాలపై కేంద్ర హోంశాఖకు లేఖ రాయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఇప్పటికే అదే అంశంపై న్యాయశాఖ అధికారులతో సంప్రదించినట్లు చెప్పారు. ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే సవరణ బిల్లు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లు వివరించారు. రాష్ట్ర బడ్జెట్ సమావేశాలపై కసరత్తు ప్రారంభించినట్లు తెలిపారు.

 

ఆగస్టు రెండో వారం నుంచి ఆ సమావేశాలు ప్రారంభమయ్యే అవకాశం ఉందని చెప్పారు. ఆ బడ్జెట్ సమావేశాలు 18 రోజుల పాటు కొనసాగుతాయని పేర్కొన్నారు. ఆంధ్ర - తెలంగాణ సరిహద్దుల్లో కొత్తగా 8 చెక్పోస్టులు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. కర్నూలు, సున్నిపెంట, మాచర్ల, దాచెపల్లి, గరికపాడు, తిరువూరు, జీడుగుమిల్లి, కొండపల్లిలో చెక్పోస్టులు ఏర్పాట్లు చేస్తున్నట్లు యనమల విశదీకరించారు.

Advertisement
Advertisement