90% సాధారణ వైద్యంతోనే కోలుకుంటున్నారు

69 percent of Covid-19 victims had no virus symptoms - Sakshi

69 శాతం కోవిడ్‌–19 బాధితుల్లో వైరస్‌ లక్షణాలు లేవు 

వ్యాధి నిరోధక శక్తి ఎక్కుగా ఉండటంతో కరోనా లక్షణాలు కన్పించడం లేదు 

కానీ వీరి ద్వారానే ఎక్కువ మందికి వ్యాప్తి 

ఐసీఎంఆర్‌ అధ్యయనంలో వెల్లడి

సాక్షి, అమరావతి: దేశంలో కరోనా బాధితుల్లో 90 శాతం మంది సాధారణ వైద్యంతోనే కోలుకుంటున్నారని, ఒక్క శాతం రోగులకు మాత్రమే వెంటిలేటర్‌ ద్వారా చికిత్స అందించాల్సి వస్తోందని ఐసీఎంఆర్‌ (భారత వైద్య పరిశోధన సంస్థ) పేర్కొంది. దేశ వ్యాప్తంగా నిర్వహించిన పరీక్షలపై ఐసీఎంఆర్‌ చేసిన అధ్యయన వివరాలను సంస్థ డిప్యూటీ డైరెక్టర్‌ గంగా కేడ్కర్‌ తెలిపారు. 

► దేశంలో బుధవారం ఉదయం వరకు నిర్వహించిన పరీక్షల్లో 19,484 మందికి పైగా కోవిడ్‌–19 వైరస్‌ సోకినట్లు తేలింది. కరోనా బారిన పడిన వారిలో 3,870 మంది కోలుకున్నారు.. 640 మంది మరణించారు.
► వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు, వ్యాధి నిరోధక శక్తి అతి తక్కువగా ఉన్న వారు మాత్రమే మరణిస్తున్నారు. 
► దేశంలో కోవిడ్‌–19 వైరస్‌ సోకిన 69 శాతం మందిలో కరోనా వ్యాధికి సంబంధించిన లక్షణాలు కనిపించలేదు. అయితే వీరి ద్వారానే ఎక్కువ మందికి కరోనా వ్యాపిస్తోంది.  
► కోవిడ్‌–19 సోకిన 14 రోజుల్లోపు కరోనా లక్షణాలు బయటపడతాయి.వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారిలో నాలుగైదు రోజుల్లోనే లక్షణాలు బయటపడతాయి. వ్యాధి నిరోధకశక్తి ఎక్కువగా ఉన్న వారిలో 14 రోజుల తర్వాత కూడా బయటపడవు.  
► కోవిడ్‌–19 బారిన పడినప్పటికీ 69 శాతం మందిలో కరోనా లక్షణాలు కన్పించకపోవడానికి కారణం వారిలో వ్యాధి నిరోధక శక్తి అధికంగా ఉండటమే. 
► మన దేశంలో కోవిడ్‌–19 సోకినా కరోనా లక్షణాలు కన్పించని వారి నుంచి ఆ వైరస్‌ వ్యాప్తి ఎక్కువగా ఉందని.. అది ఎంత శాతం అన్నది తేలాల్సి ఉంది.  
► చైనాలో లాక్‌ డౌన్‌ ఎత్తేసిన తర్వాత చేసిన పరీక్షల్లో 78 శాతం మందికి కోవిడ్‌–19 వైరస్‌ సోకినట్లు తేలినా కరోనా లక్షణాలు కన్పించలేదు. అయితే వీరి ద్వారానే 62 శాతం మందికి వైరస్‌ వ్యాపించింది. ఇలాంటి వారి సంఖ్య సింగపూర్‌లో 48 శాతంగా ఉంది.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top