తిరుమలలో నాగుపాము కలకలం | 6 feet cobra at balaji nagar in Tirumala | Sakshi
Sakshi News home page

తిరుమలలో నాగుపాము కలకలం

May 31 2015 9:02 AM | Updated on Sep 3 2017 3:01 AM

తిరుమలలో ఓ పెద్ద నాగు పాము స్థానికులను పరుగులు తీయించింది.

తిరుమల : తిరుమలలో ఓ పెద్ద నాగు పాము స్థానికులను పరుగులు తీయించింది. బాలాజీనగర్‌లోని ఐదో లైనులో ఓ ఇంటి సమీపంలో శనివారం ఆరడుగుల పొడవున్న నాగుపాము కనిపించింది. దీన్ని చూసిన మహిళలు, పిల్లలు భయంతో కేకలు వేస్తూ పరుగులు తీశారు. సమాచారం అందుకున్న టీటీడీ ఉద్యోగి భాస్కరనాయుడు అక్కడకు చేరుకుని నాగుపామును చాకచక్యంగా పట్టుకుని తీసుకెళ్లడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement