ఎర్రచందనం అక్రమ రవాణా: ఐదుగురి అరెస్ట్ | 5 arrested for illegal transportation of Red sandalwood logs | Sakshi
Sakshi News home page

ఎర్రచందనం అక్రమ రవాణా: ఐదుగురి అరెస్ట్

Feb 4 2016 5:47 PM | Updated on Sep 3 2017 4:57 PM

ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తున్న ఐదుగురిని చంద్రగిరి పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు.

చంద్రగిరి (చిత్తూరు జిల్లా) : ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తున్న ఐదుగురిని చంద్రగిరి పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. వీరి నుంచి ఒక వాహనంతోపాటు 20 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నామని తిరుపతి వెస్ట్ డీఎస్పీ వెంకటనారాయణ చెప్పారు. వీటి విలువ రూ.25 లక్షలు ఉంటుందన్నారు. నిందితులను తిరుపతి కోర్టుకు తరలించారు. వీరిపై గతంలోనూ ఎర్రచందనం అక్రమరవాణా కేసులున్నాయని తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement