జసిత్‌ క్షేమం; ఎస్పీకి ఫోన్‌ చేసిన సీఎం జగన్‌

4 Year Old Jasith Released From Kidnappers CM Jagan Appreciate Police - Sakshi

జసిత్‌ రక్షించడంతో 50 శాతం పని పూర్తయింది

కిడ్నాపర్లను పట్టుకుంటేనే పనిపూర్తి : సీఎం జగన్‌

సాక్షి, మండపేట: రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపిన నాలుగేళ్ల చిన్నారి జసిత్‌ కిడ్నాప్‌ కథ సుఖాంతం అయింది. నాలుగు రోజుల ఉత్కంఠకు తెరదించుతూ.. కుతుకులూరు చింతాలమ్మ గుడివద్ద బాలున్ని కిడ్నాపర్లు గురువారం తెల్లవారుజామున వదిలి వెళ్లారు. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎస్పీ అద్నాన్‌ నయీం అస్మీ చొరవ వల్లే తమ పిల్లాడు క్షేమంగా ఇల్లు చేరాడని కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జసిత్‌ క్షేమంగా ఇల్లు చేరడంపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ హర్షం వ్యక్తం చేశారు. కేసు వివరాలను డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ సీఎంకు వివరించడంతో ఆయన ఎస్పీకి ఫోన్‌ చేశారు.
(చదవండి : జసిత్‌ను వదిలిపెట్టిన కిడ్నాపర్లు..!)

జసిత్‌ను రక్షించడంలో జిల్లా ఎస్పీ నయీం అస్మీ, ఇతర సిబ్బంది కృషిని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అభినందించారు. జసిత్‌ను రక్షించడంతో పోలీసుల పని యాభై శాతమే పూర్తయిందని, కిడ్నాపర్లను పట్టుకుంటే మిగిలిన యాభై శాతం పూర్తవుతుందని సీఎం వ్యాఖ్యానించినట్టు సమాచారం. కిడ్నాప్‌నకు పాల్పడిన వారిని వెంటనే పట్టుకుని చట్టం ముందు నిలబెట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్టు తెలిసింది. పోలీసుల పనితీరుపై స్థానికులు ప్రశంసలు కురిపించారు. జసిత్‌ రాకతో ఆ ప్రాంతమంతా జనంతో నిండిపోయింది. పండుగ వాతావరణం నెలకొంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top