గుంటూరు జిల్లా తెనాలి మండలం కంచర్లపాలెంలో శుక్రవారం ఉదయం ఓ ట్రాక్టర్ బోల్తా పడింది.
తెనాలి : గుంటూరు జిల్లా తెనాలి మండలం కంచర్లపాలెంలో శుక్రవారం ఉదయం ఓ ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ఘటనలో కంచర్లపాలెం గ్రామానికి నలుగురు వ్యవసాయకూలీలకు గాయాలయ్యాయి. మొక్కజొన్న తోటలో పని చేసేందుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను తెనాలిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.