300కేజీల గంజాయి స్వాధీనం | 300 kg of marijuana seized | Sakshi
Sakshi News home page

300కేజీల గంజాయి స్వాధీనం

Jan 4 2016 5:12 PM | Updated on May 3 2018 3:17 PM

విశాఖపట్టణం మాడుగుల ఘాట్ రోడ్డులో 300 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

విశాఖపట్టణం మాడుగుల ఘాట్ రోడ్డులో 300 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గంజాయి రవాణాకు పాల్పడుతున్న నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో గంజాయి అక్రమ రవాణాకు ఉపయోగించిన ఓ కారును సీజ్ చేశారు. గంజాయిని విశాఖపట్నం నుంచి ఓ వాహనంలో తరలిస్తుండగా ముందస్తు సమాచారం మేరకు పోలీసులు తనిఖీలు చేపట్టారు. నిందితులపై కేసు నమోదు చేసి స్టేషన్‌కు తరలించారు. నిందితులు తమిళనాడుకు చెందిన వారుగా పోలీసులు తెలిపారు.

 

Advertisement
 
Advertisement
Advertisement