300కేజీల గంజాయి స్వాధీనం
విశాఖపట్టణం మాడుగుల ఘాట్ రోడ్డులో 300 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గంజాయి రవాణాకు పాల్పడుతున్న నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో గంజాయి అక్రమ రవాణాకు ఉపయోగించిన ఓ కారును సీజ్ చేశారు. గంజాయిని విశాఖపట్నం నుంచి ఓ వాహనంలో తరలిస్తుండగా ముందస్తు సమాచారం మేరకు పోలీసులు తనిఖీలు చేపట్టారు. నిందితులపై కేసు నమోదు చేసి స్టేషన్కు తరలించారు. నిందితులు తమిళనాడుకు చెందిన వారుగా పోలీసులు తెలిపారు.