అనుమతులకు విరుద్దంగా ఇసుకను తరలిస్తున్న మూడు లారీలను రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
తాళ్లపుడి: అనుమతులకు విరుద్దంగా ఇసుకను తరలిస్తున్న మూడు లారీలను రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన పశ్చిమగోదావరి జిల్లా తాళ్లపుడి మండల కేంద్రంలో సోమవారం జరిగింది. వేగేశ్వరపురం నుంచి ఇసుకను తరలిస్తున్న రెండు లారీలను అడ్డుకున్న అధికారులు వాటి పై కేసులు నమోదు చేశారు. తాడిపుడి ఇసుక ర్యాంపు నుంచి అనుమతి లేకుండా ఇసుకను తరలిస్తున్నమరో లారీని అడ్డుకొని లారీ యజమానికి రూ. 45 వేలు జరిమాన విధించారు. కేసు నమోదు చేసి, లారీలను సీజ్ చేశారు.