ముగ్గురు చిన్నారులను అతి కిరాతకంగా చంపేసిన మానవ మృగం నరేందర్‌రెడ్డి(36) ఆత్మహత్య చేసుకున్నాడు.
ముగ్గురు చిన్నారుల సజీవదహనం కేసు
భైంసా/బాసర, న్యూస్‌లైన్: ముగ్గురు చిన్నారులను అతి కిరాతకంగా చంపేసిన మానవ మృగం నరేందర్‌రెడ్డి(36) ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదిలాబాద్ జిల్లా బాసర గోదావరి నదిలోని రెండో స్నానఘట్టాల వద్ద అతని మృతదేహం నీటిలో తేలుతూ కనిపించింది. నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం దూపల్లికి చెందిన చిన్నారులు సిరి, అక్షర, ఖుషీలను నరేందర్‌రెడ్డి గురువారం సజీవ దహనం చేసిన విషయం తెలిసిందే. అదే రోజు నిందితుడు ఆదిలాబాద్ జిల్లా బాసర సమీపంలోని గోదావరి వద్దకు వచ్చినట్లు గుర్తించారు. నిజామాబాద్ ఎస్పీ తరుణ్‌జోషి, డీఎస్పీ అనిల్ కుమార్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతుని జేబులోని మూడు ఏటీఎం కార్డులను, ద్విచక్రవాహనం తాళం చెవిని, కారు తాళం చెవి, జేబులోని పర్సు, అందులో ఉన్న రూ.650 నగదును స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాన్ని ముథోల్ ఏరియా ఆసుపత్రికి తరలించారు.