256వ రోజు పాదయాత్ర డైరీ

256th day padayatra diary - Sakshi

06–09–2018, గురువారం  
జెర్రిపోతులపాలెం, విశాఖపట్నం జిల్లా 

ప్రజాస్వామిక విలువలే లేని సభలో ప్రజావాణికి విలువేముంటుంది?

అభిమానానికి హద్దులుండవు.. హనుమాన్‌ జంక్షన్‌ నుంచి వచ్చిన సాయిగణేశ్‌ ఐటీఐ చదువుతున్నాడట. రాత్రంతా రెండు రైళ్లు మారి.. ఐదు కిలోమీటర్లు నడిచిమరీ నన్ను చూడటానికి వచ్చాడట. వారంలో సెలవు రోజు పూలంగడిలో పనిచేయగా వచ్చిన కాస్త డబ్బుతో పాదయాత్రకు వచ్చి నన్ను కలిశానని చెబుతుంటే.. ఆ అభిమానానికి ముచ్చటేసింది. ‘బాగా చదువుకుని, అమ్మానాన్నలను బాగా చూసుకోవాలి’ అని  చెప్పాను. పట్టరాని సంతోషంతో తలూపాడు.

ఈ రోజు కూడా అధికార పార్టీ భూదోపిడీపైనే అధికంగా ఫిర్యాదులొచ్చాయి. సబ్బవరం, పరవాడ మండల రైతన్నలు కలిశారు. శాటిలైట్‌ టౌన్‌షిప్‌ నిర్మాణం పేరుతో.. ట్రైజంక్షన్‌ పరిధిలో బలవంతపు భూసేకరణకు పూనుకున్నారని వాపోయారు. పేద రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు. ఈ బలవంతపు భూసేకరణలో తనకు జరుగుతున్న అన్యాయాన్ని తట్టుకోలేక అధికారుల ఎదుటనే లంకా తాతారావు అనే రైతన్న గుండె ఆగి మరణించాడట. పేదల పొట్టకొట్టి, అధికార పెద్దలకు కట్టబెట్టే కార్యక్రమం కొనసాగుతున్నంత కాలం.. ఇలాంటి విషాద ఘటనలు ఆగవేమో..

జెర్రిపోతులపాలెం, చింతగట్ల గ్రామస్తులూ భూదోపిడీ బాధితులే. ఎస్సీలకు ఇచ్చిన అసైన్‌మెంటు భూముల్లో ఎన్టీఆర్‌ హౌసింగ్‌ పేరుతో చేస్తున్న అక్రమాల్ని వివరించారు. పేదల భూముల్లో రోడ్లేసుకుని చేస్తున్న అక్రమ క్వారీయింగ్‌ గురించి చెప్పారు. ఐవోసీ పైప్‌లైన్‌ కోసం.. టీడీపీ నేతల భూముల్ని తప్పించి.. పేదల భూముల్ని సేకరించాలన్న కుయత్నాల గురించి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ స్థలాలకు అధికారుల అండతో తప్పుడు రికార్డులు సృష్టించి టీడీపీవారు అమ్మేసుకుంటున్నారని వాపోయారు. పేదల ఆధార్‌ కార్డుల్లోనూ, రేషన్‌ కార్డుల్లోనూ చిన్న పొరపాటు ఉన్నా ఏళ్ల తరబడి సరిచేయరు. దాన్ని సాకుగా చూపి పింఛన్, రేషన్‌ ఎగ్గొడతారు. పచ్చనేతలు మాత్రం క్షణాల్లో తప్పుడు రికార్డులు సృష్టించుకుని.. పేదల భూముల్ని, ప్రభుత్వ ఆస్తుల్ని దోచుకుంటారు.  
 
సభ్య సమాజం తలదించుకునేలా టీడీపీ నేతలు దళిత మహిళను వివస్త్రను చేసి, దౌర్జన్యం చేసిన ఘటన ఈ జెర్రిపోతులపాలెంలోనే జరిగింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆ ఘోర సంఘటనకు బలైన బాధిత మహిళలు కలిశారు. కష్టకాలంలో తమకు అండగా నిలిచినందుకు నాకు కృతజ్ఞతలు తెలిపారు.  భూదందాలు, కబ్జాలలోనే టీడీపీ నేతలు, అధికార యంత్రాంగం తలమునకలైంది. పాలనను గాలికొదిలేశారు. ఉత్తరాంధ్ర విషజ్వరాలతో వణికిపోతున్నా.. వందలాది మంది పేదల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నా.. పట్టించుకోవడం లేదు. తన ఏడేళ్ల పాప విషజ్వరంతో కన్ను మూసిందని నందవరపువానిపాలెం అప్పలరాజు కన్నీటి పర్యంతమయ్యాడు.

ముదపాకలో చిత్తాడ శ్రీను అనే సోదరుడూ జ్వరంతోనే ప్రాణాలు కోల్పోయాడట. చాలా బాధేసింది. పరిస్థితులు ఇంత దారుణంగా ఉంటే, మెడికల్‌ ఎమర్జెన్సీ ప్రకటించాల్సిన పరిస్థితి ఉన్నా.. ఈ ప్రభుత్వానికి చీమకుట్టినట్టయినా లేదు. ప్రజా సమస్యల్ని చర్చించాల్సిన అసెంబ్లీని సైతం.. ప్రతిపక్షంపై బురద జల్లడానికి, గొంతు నొక్కడానికి వాడుకుంటున్నారు. ఆత్మస్తుతి, పరనిందకే పరిమితం చేశారు. చరిత్రలో ఎన్నడూ లేనంతగా 22 మంది ప్రతిపక్ష ఎమ్మెల్యేలను ప్రలోభపర్చుకుని, శాసనసభని అప్రజాస్వామిక వ్యవస్థగా మార్చేశారు. చట్టాలు చేసే సభలోనే చట్టాలను అపహాస్యం చేస్తున్నారు. ప్రజాస్వామిక విలువలే లేని సభలో ప్రజావాణికి విలువేముంటుంది?  
 
ముఖ్యమంత్రిగారూ.. మీకు, స్పీకర్‌ గారికి సూటి ప్రశ్న..
మీరు ప్రలోభపర్చుకుని పదవులిచ్చిన ఆ నలుగురు మంత్రులు ఏ పార్టీకి చెందినవారు? టీడీపీనా? వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీనా? అసెంబ్లీ సాక్షిగా స్పష్టంగా చెప్పగలిగే ధైర్యం, నిజాయితీ మీకున్నాయా? పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హతపై మీరు చేస్తున్న రాజ్యాంగ ఉల్లంఘనకు వ్యతిరేకంగా.. అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించిన మమ్మల్ని ప్రశ్నించడం.. దొంగే.. దొంగా.. దొంగా.. అన్నట్లుగా లేదా?  

-వైఎస్‌ జగన్‌

మరిన్ని వార్తలు

11-01-2019
Jan 11, 2019, 17:05 IST
సాక్షి, కడప: సుదీర్ఘ ప్రజాసంకల్పయాత్రను విజయవంతంగా పూర్తిచేసుకుని కడప జిల్లాకు చేరుకున్న ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి...
11-01-2019
Jan 11, 2019, 16:19 IST
చంద్రబాబు చర్మం దొడ్డైంది.. ధర్నాలు, రాస్తారోకోలతో చదువును పాడు చేసుకోవద్దు..
11-01-2019
Jan 11, 2019, 15:00 IST
సాక్షి, శ్రీకాకుళం: వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చరిత్రాత్మక ప్రజాసంకల్పయాత్రను విజయవంతం చేసిన ప్రజలకు,...
11-01-2019
Jan 11, 2019, 06:46 IST
ఎండమావిలో పన్నీటి జల్లులా...కష్టాల కడలిలో చుక్కానిలా ఇపుడుకొండంత అండ దొరికినట్టయింది.ఒక్కో పథకం ఒక్కో రత్నంలా జనంమోములో వెలుగునింపుతోంది.జననేత ఇచ్చిన భరోసాతోప్రతిఒక్కరిలో...
10-01-2019
Jan 10, 2019, 16:52 IST
సాక్షి, తిరుపతి: కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకోవడానికి ఏపీ ప్రతిపక్షనేత, వైఎస్సార్‌ సీపీ అధినేత వైఎస్‌ జగన్‌  అలిపిరి నుంచి...
10-01-2019
Jan 10, 2019, 15:52 IST
సాక్షి, విజయవాడ : ప్రజాసంకల్పయాత్ర ముగింపు సభను చూసి టీడీపీ నేతలకు చెమటలు పడుతున్నాయని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ బాపట్ల...
10-01-2019
Jan 10, 2019, 15:29 IST
సాక్షి, తిరుపతి: ఏపీ ప్రతిపక్షనేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. సంప్రదాయబద్ధంగా పట్టు వస్త్రాలు ధరించిన...
10-01-2019
Jan 10, 2019, 09:21 IST
బిందువు.. బిందువూ కలిసి సింధువైనట్లు.. అడుగు.. అడుగు కలిసి అభిమాన సంద్రమైంది. 14 నెలలు.. 3648 కిలోమీటర్లు.. అలుపెరగని బాటసారి...
10-01-2019
Jan 10, 2019, 08:51 IST
కాకినాడ: ప్రజా సంకల్ప పాదయాత్ర తుది అంకంలో ‘మేముసైతం’... అంటూ జిల్లాకు చెందిన పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద...
10-01-2019
Jan 10, 2019, 08:28 IST
కడప దాటి ప్రతి గడపలోకి వెళ్లాలని... ప్రతి పేదవాడి గుండెల్లో బాధను నేరుగా తెలుసుకోవాలని... పద్నాలుగు నెలల క్రితం ప్రతిపక్షనేత,...
10-01-2019
Jan 10, 2019, 08:21 IST
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: నేల ఈనిందా అన్నట్లు ఇచ్ఛాపురం కదం తొక్కింది. రాష్ట్ర ప్రజల్లో ప్రస్తుత చంద్రబాబు పాలనపై ఉన్న...
10-01-2019
Jan 10, 2019, 07:59 IST
శ్రీకాకుళం :పాదయాత్రలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ఎనలేని ప్రజాదరణ వచ్చింది. ప్రజల సమస్యలు తెలుసుకునే వారే నిజమైన నాయకులు. అలా.. జనంలో...
10-01-2019
Jan 10, 2019, 07:50 IST
శ్రీకాకుళం :గ్రామాల అభివృద్ధికి శ్రీకారం చుట్టాలి. ప్రజా సంకల్పయాత్ర  చేపట్టి ప్రజల బాధలు, కష్టాలు తెలుసుకోవాలన్న సంకల్పం ఎంతో మంచిది....
10-01-2019
Jan 10, 2019, 07:47 IST
శ్రీకాకుళం :ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకు సాగిన పాదయాత్రలో జన హృదయాలను వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గెలుచుకున్నారు. బడగు, బలహీన వర్గాలు...
10-01-2019
Jan 10, 2019, 07:45 IST
శ్రీకాకుళం :దివ్యాంగులను టీడీపీ ప్రభుత్వం విస్మరిస్తోంది. అంగవైకల్యంతో బాధపడుతున్నాను. పెన్షన్‌కు దరఖాస్తు చేసినా జన్మభూమి కమిటీలు తొలగించాయి. హిందీ బీఈడీ...
10-01-2019
Jan 10, 2019, 07:35 IST
శ్రీకాకుళం :క్యాన్సర్‌తో బాధపడుతున్నాను. ముంబైలో ఆపరేషన్‌ కూడా చేశారు. మళ్లీ ఆపరేషన్‌ చేయాలని చెబుతున్నారు. ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాం. మా...
10-01-2019
Jan 10, 2019, 07:32 IST
శ్రీకాకుళం :పాదయాత్రలో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి ప్రజల ముందుకు వెళ్లి వారి కష్టాలను తెలుసుకున్న నాయకుడిగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర...
10-01-2019
Jan 10, 2019, 07:30 IST
శ్రీకాకుళం :దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి నాడు అందించిన రామరాజ్యాన్ని నేడు తనయుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అందిస్తాడన్నది ప్రజాసంకల్పయాత్ర ద్వారా...
10-01-2019
Jan 10, 2019, 07:27 IST
శ్రీకాకుళం :రాజధాని భూములిస్తే మూడున్నరేళ్లలో ప్లాట్లు అభివృద్ధి చేసి ఇస్తామని సాక్షాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పినా కార్యరూపం దాల్చలేదు. నాలుగున్నరేళ్లు...
10-01-2019
Jan 10, 2019, 07:21 IST
శ్రీకాకుళం : ధర్మపురం గ్రామంలో సాగునీటి కాలువను అభివృద్ధి చేయాలి. 2000 ఎకరాలకు సాగునీరు అందించే ఈ కాలువ పనులు...
Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top