ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఆదివారంనాటికి 20.45 లక్షల మంది టీడీపీ సభ్యత్వం తీసుకున్నట్లు పార్టీ సంస్థాగత ఎన్నికల కన్వీనర్లు కిమిడి కళా వెంకట్రావు, పెద్దిరెడ్డిలు ఆదివారం తెలిపారు.
సాక్షి, హైదరాబాద్: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఆదివారంనాటికి 20.45 లక్షల మంది టీడీపీ సభ్యత్వం తీసుకున్నట్లు పార్టీ సంస్థాగత ఎన్నికల కన్వీనర్లు కిమిడి కళా వెంకట్రావు, పెద్దిరెడ్డిలు ఆదివారం తెలిపారు. ఏపీలో 17.60 లక్షల మంది, తెలంగాణలో 2.85 లక్షల మంది నమోదు చేసుకున్నారన్నారు.
జపాన్ నుంచి తిరిగి వచ్చిన పార్టీ అధినేత చంద్రబాబు సభ్యత్వ నమోదుపై ఆదివారం తన నివాసంలో పార్టీ నేతలతో సమీక్షించారు. కేంద్ర మంత్రి సుజనా చౌదరి కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం కళా వెంకట్రావు, పెద్దిరెడ్డిలు ఎన్టీఆర్ భవన్‌లో విలేకరులతో మాట్లాడారు. నెల రోజుల క్రితం ప్రారంభించిన ఈ ప్రక్రియ డిసెంబర్ 3వ తేదీతో ముగుస్తుందన్నారు.