పెళ్లి ఆటో బోల్తా : 20 మందికి గాయాలు | 20 injured as Auto overturns | Sakshi
Sakshi News home page

పెళ్లి ఆటో బోల్తా : 20 మందికి గాయాలు

Oct 29 2015 4:02 PM | Updated on Sep 3 2017 11:41 AM

పెళ్లి కొడుకుతో పాటు పెళ్లి బృందం ప్రయాణిస్తున్న ఆటో అదుపుతప్పి బోల్తా కొట్టింది.

భోగాపురం (విజయనగరం) : పెళ్లి కొడుకుతో పాటు పెళ్లి బృందం ప్రయాణిస్తున్న ఆటో అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ఘటనలో పెళ్లి కొడుకు సహా 20 మందికి గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించగా, వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉండటంతో.. విజయనగరం జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటన విజయనగరం జిల్లా భోగాపురం మండలం అగ్నివరం గ్రామ సమీపంలోని 43వ జాతీయ రహదారిపై గురువారం జరిగింది.

విశాఖ జిల్లా భీమిలి మండలం టి. నగరపాలెంకు చెందిన బాలసుబ్రహ్మణ్యం వివాహం విజయనగరం జిల్లా పూసపాటిరాగ మండలానికి చెందిన స్వాతితో జరుగనుండటంతో పెళ్లి బృందం ఆటోలో బయలుదేరింది. ఈ క్రమంలో ఆటో అగ్నివరం సమీపానికి చేరుకోగానే ఒక్కసారిగా అదుపుతప్పి బోల్తా కొట్టింది. దీంతో ఆటోలో ఉన్న 25 మందిలో 20 మందికి గాయాలయ్యాయి. వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని విజయనగరం జిల్లా ఆస్పత్రికి తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement