ఆటో బోల్తా: 9 మంది విద్యార్థులకు గాయాలు | 9 students injured as auto overturns | Sakshi
Sakshi News home page

ఆటో బోల్తా: 9 మంది విద్యార్థులకు గాయాలు

Mar 8 2016 6:00 PM | Updated on Sep 3 2017 7:16 PM

ఇంటర్ పరీక్ష రాసి ఆటోలో ఇళ్లకు వెళుతున్న విద్యార్థులు ప్రమాదానికి గురయ్యారు. మెదక్ జిల్లా రామాయంపేట శివారులో మంగళవారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది.

రామాయంపేట (మెదక్) : ఇంటర్ పరీక్ష రాసి ఆటోలో ఇళ్లకు వెళుతున్న విద్యార్థులు ప్రమాదానికి గురయ్యారు. మెదక్ జిల్లా రామాయంపేట శివారులో మంగళవారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది. బాధితుల కధనం మేరకు... మండలంలోని కల్వకుంట గ్రామానికి చెందిన కొందరు విద్యార్థినీ విద్యార్థులు రామాయంపేటలోని సాయికృప, స్నేహ కళాశాలల్లో చదువుకుంటున్నారు.

వారంతా మంగళవారం పరీక్ష రాసి మధ్యాహ్నం తిరిగి ఆటోలో బయలుదేరారు. వారు ప్రయాణిస్తున్న ఆటో రామాయంపేట శివారులో ప్రమాదవశాత్తు బోల్తా పడింది. ఈ ఘటనలో ఏడుగురు బాలికలు, ఇద్దరు బాలురు గాయపడ్డారు. ప్రమాద సమయంలో ఒక విద్యార్థి ఆటో నడుపుతున్నట్లు సమాచారం. క్షతగాత్రులను రామాయంపేటలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement