ఆటో బోల్తా: వ్యక్తి మృతి, ఆరుగురికి గాయాలు | One died and 6 injureda as Auto overturns | Sakshi
Sakshi News home page

ఆటో బోల్తా: వ్యక్తి మృతి, ఆరుగురికి గాయాలు

Oct 16 2016 11:22 AM | Updated on Sep 4 2017 5:25 PM

వేగంగా వెళ్తున్న ఆటో అదుపు తప్పి బోల్తా కొట్టిన ఘటనలో ఓ వ్యక్తి మృతిచెందగా.. మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి.

గుత్తి (అనంతపురం): వేగంగా వెళ్తున్న ఆటో అదుపు తప్పి బోల్తా కొట్టిన ఘటనలో ఓ వ్యక్తి మృతిచెందగా.. మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ సంఘటన అనంతపురం జిల్లా గుత్తి చెరువు కట్ట వద్ద ఆదివారం ఉదయం చోటుచేసుకుంది.

ప్రయాణికులతో వెళ్తున్న ఆటో అదుపుతప్పి బోల్తా కొట్టడంతో ఓ వ్యక్తి మృతిచెందాడు. మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. క్షతగాత్రుల వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement