20 అడుగుల గిరి నాగు పట్టివేత

సాక్షి, విశాఖ: జిల్లాలోని దేవరాపల్లి మండలం తెనుగుపూడి అటవీ సెక్షన్ పరిధిలోని సమీప పంట పొలాల్లో ఆదివారం అరుదైన భారీ గిరి నాగు హల్‌చల్ చేసింది. ఇది సుమారు 20 అడుగుల పొడవు ఉండటంతో ఆందోళన చెందిన గ్రామస్తులు స్థానిక అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. అధికారుల ఆదేశాలతో విశాఖపట్నం తూర్పు కనుమల వన్యప్రాణి సంరక్షణ సమితి ప్రతినిధి మూర్తి అక్కడకు చేరుకుని, సుమారు రెండు గంటల పాటు శ్రమించి అతికష్టం మీద గిరినాగును పట్టుకున్నారు. అనంతరం దానిని సమీపంలోని రిజర్వ్ ఫారెస్ట్‌లో విడిచిపెట్టారు. (నేడు గన్నవరం, విశాఖ నుంచి విమాన సర్వీసులు రద్దు)
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి