రెండు బైక్‌లు ఢీకొని ఇద్దరి మృతి | 2 died in 2 bikes collisioned incident | Sakshi
Sakshi News home page

రెండు బైక్‌లు ఢీకొని ఇద్దరి మృతి

Sep 16 2015 6:18 PM | Updated on Sep 3 2017 9:31 AM

వేగంగా ఎదురెదురుగా వస్తున్న రెండు బైక్‌లు ఢీకొని ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు.

ముత్తుకూరు(శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు): వేగంగా ఎదురెదురుగా వస్తున్న రెండు బైక్‌లు ఢీకొని ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలంలో బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది. చిల్లకూరు మండలం మోమిడి గ్రామానికి చెందిన సతీష్(30), జిల్లా కేంద్రంలోని పొర్లుకట్ట ప్రాంతానికి చెందిన అస్లాం సాహెబ్(35) రెండు వేర్వేరు బైక్‌లపై వస్తూ ముత్తుకూరులోని నార్లపూడి సమీపంలో ఢీకొన్నారు. దీంతో వారిద్దరూ తీవ్రగాయాలపాలై అక్కడికక్కడే చనిపోయారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని, దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement