అనంతపురం రాజీవ్ కాలనీలో దారుణం జరిగింది. ఓ యువతిని (28) హతమార్చిన దుండగులు... మృతదేహాన్ని కాల్చివేసేందుకు తరలిస్తుండగా పోలీసులుకు పట్టుబడ్డారు.
అనంతపురం : అనంతపురం రాజీవ్ కాలనీలో దారుణం జరిగింది. ఓ యువతిని (28) హతమార్చిన దుండగులు... మృతదేహాన్ని కాల్చివేసేందుకు తరలిస్తుండగా పోలీసులుకు పట్టుబడ్డారు. బుక్కరాయ సముద్రం మండలం కొట్టాలపల్లి వద్ద ఇసుక అక్రమ రవాణా సందర్భంగా పోలీసులు ఈరోజు ఉదయం వాహనాలు తనిఖీలు చేస్తున్నారు. ఇద్దరు యువకులు అనుమానాస్పదంగా ప్రవర్తించటంతో పోలీసులు సోదాలు చేయగా అసలు విషయం బయటపడింది. పోలీసులు... యువతి మృతదేహంతో పాటు, కిరోసిన్ను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.