పశ్చిమగోదావరి జిల్లా ద్వారకా తిరుమల వద్ద ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది.
ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా ద్వారకా తిరుమల వద్ద ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. స్వామి వారి కొండపై నుంచి అధిక వేగంతో కిందకి వస్తున్న ప్రైవేట్ బస్సు అదుపు తప్పి సమీపంలోని చెరువు గట్టుపైకి దూసుకువెళ్లి... సెడన్గా ఆగింది. ఈ ప్రమాదంలో 17 మంది ప్రయాణికులు గాయపడ్డారు. దీంతో స్థానికులు వెంటనే స్పందించి పోలీసుకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని స్థానికుల సహాయంతో క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు.
వారి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారని తెలిపారు. ఈ ప్రమాదం చోటు చేసుకున్నప్పుడు బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారని పోలీసులు చెప్పారు. బస్సులోని ప్రయాణికులంతా విశాఖపట్నం జిల్లా పద్మనాభపురం మండలం మద్దివాసులను పోలీసులు వెల్లడించారు. బస్సు బ్రేక్ ఫెయిల్ వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు.