16 నుంచి ‘పది’ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ | 16th tenth' advanced supplementary exams | Sakshi
Sakshi News home page

16 నుంచి ‘పది’ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ

Jun 11 2014 2:17 AM | Updated on Sep 26 2018 3:25 PM

16 నుంచి ‘పది’ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ - Sakshi

16 నుంచి ‘పది’ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ

ఈ నెల 16 నుంచి 28 వరకు పదో తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఏజేసీ ఎండీ హషీమ్ షరీఫ్ తెలిపారు. మంగళవారం సాయంత్రం తన చాంబర్‌లో పరీక్షల

 పీఎన్‌కాలనీ: ఈ నెల 16 నుంచి 28 వరకు పదో తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఏజేసీ ఎండీ హషీమ్ షరీఫ్ తెలిపారు. మంగళవారం సాయంత్రం తన చాంబర్‌లో పరీక్షల నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మట్లాడుతూ ఆదివారం మినహా 16 నుంచి 28 వరకు పరీక్షలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. 16న ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ -1 (గ్రూప్-ఎ), ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ 1 (కాంపోజిట్ కోర్సు), 17న ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ -2 (గ్రూప్-ఎ), ఫస్ట్ లాంగ్వేజ్ పేపరు-2 (కాంపోజిట్ కోర్సు),
 
 ఓఎస్‌ఎస్సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్ -1 (సాంస్కృతం, ఆరబిక్, పార్శియన్), 18న సెకండ్ లాంగ్వేజ్, 19న ఇంగ్లీష్ పేపర్ -1 (కోడ్ నెంబర్లు 13 లేదా 29), 20న ఇంగ్లీష్ పేపర్ -2 (కోడ్ నెంబర్లు 14 లేదా 30), 21న గణితం పేపర్ -1, 23న గణితం -2, 24న జనరల్‌సైన్స్ పేపర్ -1, 25న జనరల్ పేపర్-2, 26న సాంఘికశాస్త్రం -1, 27న సాంఘికశాస్త్రం 2, 28న ఓఎస్‌ఎస్‌సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్ -2 ( సాంస్కృతం, అరబిక్, పార్శియన్) జరుగుతాయని తెలిపారు. జిల్లాలోని 22 కేంద్రాల్లో నిర్వహించే పరీక్షలకు 5789 మంది విద్యార్థులు హాజరు కానున్నట్టు తెలిపారు. జిల్లాలోని 22 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 22 మంది డిపార్టుమెంట్ ఆఫీసర్లు, ఐదు ఫ్లైయింగ్‌స్వాడ్‌లను ఏర్పాటు చేసినట్టు వివరించారు. సమావేశంలో డీఈవో ఎస్ అరుణకుమారి, పోస్టల్ సూపరింటెండెంట్ జె. ప్రసాదబాబు, సహాయ పోస్టల్ సూపరింటెండెంట్ అరవింద్ పండా, ఆర్టీసీ డీపో మేనేజర్ ఎం. ముకుందరావు, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ బి. జగన్నాదరావు, పరీక్షల సహాయ కమిషనర్ జీటీ నాయు డు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement