1500 కేజీల గంజాయి స్వాధీనం | 1500 kg ganja seized in paderu mandal | Sakshi
Sakshi News home page

1500 కేజీల గంజాయి స్వాధీనం

Jun 8 2016 12:10 PM | Updated on Sep 4 2017 2:00 AM

1500 కేజీల గంజాయి స్వాధీనం

1500 కేజీల గంజాయి స్వాధీనం

విశాఖపట్టణం జిల్లా పాడేరు మండలం పెద్దబయలు గ్రామ శివారులోని ఈదులపుట్టు వద్ద ఒరిస్సాకు అక్రమంగా తరలిస్తున్న 1500 కిలోల గంజాయిని ఎక్సైజ్ అధికారులు బుధవారం పట్టుకున్నారు.

విశాఖపట్టణం : విశాఖపట్టణం జిల్లా పాడేరు మండలం పెద్దబయలు గ్రామ శివారులోని ఈదులపుట్టు వద్ద ఒరిస్సాకు అక్రమంగా తరలిస్తున్న 1500 కిలోల గంజాయిని ఎక్సైజ్ అధికారులు బుధవారం పట్టుకున్నారు. ఈ సందర్బంగా ముగ్గురిని అరెస్ట్‌చేశారు. ముందస్తు సమాచారం మేరకు ఎక్సైజ్ సీఐ శ్రీనివాసరావు సిబ్బందితో కలసి తనిఖీలు నిర్వహించారు.

ఈ సందర్భంగా గంజాయిని తరలిస్తున్న వ్యాన్‌తోపాటు....  సదరు వాహనానికి పైలట్‌గా వెళుతున్న స్కార్పియో వాహనాన్ని ఎక్సైజ్ సిబ్బంది ఆపారు. గంజాయిని స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. అందుకు సంబంధించి ముగ్గురిని ఎక్సైజ్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే రెండు వాహనాలను సీజ్ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement