ఫార్మా ఫ్యాక్టరీలో పేలుడు: కార్మికులకు తీవ్ర గాయాలు | 15 people injured in Chemical Reactor Explosion Glochem pharma company in Parawada | Sakshi
Sakshi News home page

ఫార్మా ఫ్యాక్టరీలో పేలుడు: కార్మికులకు తీవ్ర గాయాలు

Jun 28 2014 10:58 AM | Updated on Sep 2 2017 9:31 AM

విశాఖపట్నం శివారులోని పరవాడలో గ్లోకెమ్ ఫార్మా ఫ్యాక్టరీలో శనివారం రసాయన ట్యాంకర్ లో పేలుడు సంభవించింది.

విశాఖపట్నం శివారులోని పరవాడలో గ్లోకెమ్ ఫార్మా ఫ్యాక్టరీలో శనివారం రసాయన ట్యాంకర్లో పేలుడు సంభవించింది. ఆ ప్రమాదంలో 15 మంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను గాజువాకలోని ఆసుపత్రికి తరలించారు. వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. ప్రమాద ఘటనపై సమాచారం అందుకున్న యాజమాన్యం హుటాహుటిన ఫ్యాక్టరీకి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును కార్మికులను అడిగి తెలుసుకున్నారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అమ్మెనియం రియాక్టర్ పేలిందని ఫ్యాక్టరీ కార్మికులు వెల్లడించారు. ఆ ప్రమాదం ఎలా జరిగిందనే అంశంపై విచారణ పోలీసులు విచారణ జరుపుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement