15 మంది పేకాటరాయుళ్ల అరెస్టు | 15 people arrested pekatarayulla | Sakshi
Sakshi News home page

15 మంది పేకాటరాయుళ్ల అరెస్టు

Mar 27 2015 3:52 AM | Updated on Aug 20 2018 4:44 PM

టాస్క్‌ఫోర్సు పోలీసులు నగరంలోని రెండు వేర్వేరు చోట్ల జరిపిన దాడుల్లో 15 మంది పేకాట రాయుళ్లను గురువారం అరెస్టు చేశారు.

ఎంవీపీ కాలనీ: టాస్క్‌ఫోర్సు పోలీసులు నగరంలోని రెండు వేర్వేరు చోట్ల జరిపిన దాడుల్లో 15 మంది పేకాట రాయుళ్లను గురువారం అరెస్టు చేశారు. వారి నుంచి సుమారు రూ.95 వేల నగదు, 15 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వివరాలివి... బోయపాలెం దరి చిలుకూరి లే అవుట్‌లో పేకాడుతున్న 9 మందితో పాటు, 9 సెల్‌ఫోన్లు, రూ.80,250 నగదు స్వాధీన పరచుకున్నారు. వీరిని భీమిలి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. తాటిచెట్లపాలెంలోని రాజీవ్ గృహకల్పలో పేకాడుతున్న ఆరుగురిని అరెస్ట్ చేసి, వారి నుంచి 6 సెల్‌ఫోన్లు, రూ.14,380 నగదు స్వాధీనపరచుకుని ఫోర్తుటౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
 
వ్యభిచార గృహంపై దాడులు
 మురళీనగర్‌లో గణేష్ ఎన్‌క్లేవ్‌లో వ్యభిచారం నిర్వహిస్తున్న వ్యక్తులను టాస్క్‌ఫోర్సు పోలీసులు అరెస్ట్ చేశారు. అక్కడ కొద్ది రోజులుగా వ్యభిచారం నిరహిస్తున్నారన్న సమాచారంతో దాడులు నిర్వహించారు. వ్యభిచార గృహం నిర్వాహకులు దండాల రాములమ్మతో పాటు ఒక విటుడు, ఒక యువతిని అరెస్టు చేశారు. వారి నుంచి రూ.4,500 నగదు, రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకుని కంచరపాలెం పోలీసులకు అప్పగించారు. ఈ దాడుల్లో టాస్క్‌ఫోర్సు ఏసీపీ చిట్టిబాబు, సీఐ ఇలియాస్ మహ్మద్, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement