పాముకాటుతో బాలిక మృతి | 14 year old girl dies from Snake bite | Sakshi
Sakshi News home page

పాముకాటుతో బాలిక మృతి

Aug 29 2015 4:18 PM | Updated on Aug 20 2018 7:28 PM

ఇంటి ముందు పని చేసుకుంటున్న ఓ బాలిక పాము కాటుకు గురై మృతిచెందింది. ఈ సంఘటన కర్నూలు జిల్లా కోస్గి మండలం దుగ్గి గ్రామంలో శనివారం జరిగింది.

కోస్గి (కర్నూలు) : ఇంటి ముందు పని చేసుకుంటున్న ఓ బాలిక పాము కాటుకు గురై మృతిచెందింది. ఈ సంఘటన కర్నూలు జిల్లా కోస్గి మండలం దుగ్గి గ్రామంలో శనివారం జరిగింది. వివరాల ప్రకారం.. దుగ్గి గ్రామానికి చెందిన నర్సింహులు కుమార్తె నాగమ్మ(14) ఇంటి ముందు పిచ్చి మొక్కలు తొలగిస్తుండగా అకస్మాత్తుగా బయటకు వచ్చిన పాము ఆమెను కాటు వేసింది. ఇది గుర్తించిన బాలిక తల్లిదండ్రులు ఆస్పత్రికి తరలించడానికి ప్రయత్నిస్తుండగానే నాగమ్మ మృతిచెందింది.

Advertisement
 
Advertisement
Advertisement