హైటెన్షన్ విద్యుత్ తీగ తెగిపడిన ఘటనలో కొద్దిలో ప్రమాదం తప్పింది. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా కడియం సమీపంలో శనివారం చోటుచేసుకుంది.
కడియం (తూర్పు గోదావరి) : హైటెన్షన్ విద్యుత్ తీగ తెగిపడిన ఘటనలో కొద్దిలో ప్రమాదం తప్పింది. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా కడియం సమీపంలో శనివారం చోటుచేసుకుంది. కడియం మండలం వేమగిరి వద్ద విశాఖ- విజయవాడ రహదారిపై శనివారం మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో 132 కెవి విద్యుత్ తీగ ఒక్కసారిగా తెగిపడింది.
అయితే తీగ నేలను తాకిన వెంటనే విద్యుత్ ట్రిప్ అయ్యే ఏర్పాటు ఉండటంతోపాటు ఆ సమయంలో రహదారిపై ఎవరూ లేకపోవటంతో ప్రమాదం తప్పింది. విషయం తెలుసుకున్న స్థానిక ఏఈ శ్రీనుబాబు సిబ్బందితో అక్కడికి చేరుకుని విద్యుత్ తీగను తొలగించే పని చేపట్టారు. దీంతో రహదారిపై ట్రాఫిక్ స్తంభించింది. విద్యుత్ తీగను తొలగించిన అనంతరం రాకపోకలను పునరుద్ధరించనున్నారు.