కాలువలో పడి బాలుడు గల్లంతు | 13 years old boy drowns in Canal | Sakshi
Sakshi News home page

కాలువలో పడి బాలుడు గల్లంతు

Nov 5 2015 7:17 PM | Updated on Sep 3 2017 12:04 PM

అమ్మమ్మతోపాటు కాలువ వద్దకు వెళ్లిన బాలుడు ఈత కొట్టేందుకు యత్నించిన క్రమంలో నీటిలో పడి గల్లంతయ్యాడు.

నార్పల (అనంతపురం) : అమ్మమ్మతోపాటు కాలువ వద్దకు వెళ్లిన బాలుడు ఈత కొట్టేందుకు యత్నించిన క్రమంలో నీటిలో పడి గల్లంతయ్యాడు. అనంతపురం జిల్లా నార్పల మండలంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మండలంలోని గడ్డం నాగయ్యపల్లికి చెందిన శ్రీనివాసులు కుమారుడు అనిల్(13) స్థానికంగా 8వ తరగతి చదువుతున్నాడు.

గురువారం మధ్యాహ్నం అతడు తన అమ్మమ్మతోపాటు హెచ్చెల్సీ కాల్వ వద్దకు వెళ్లాడు. ఆమె బట్టలు ఉతకటంలో నిమగ్నమై ఉండగా అనిల్ నీటిలోకి దిగాడు. ఈత కొట్టే క్రమంలో నీటి ప్రవాహానికి గల్లంతయ్యాడు. అప్పటి నుంచి బాలుడి కోసం గాలిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement