13 లేదా 15న కొత్త కలెక్టర్ బాధ్యతలు! | 13 or 15, in charge of the new collector! | Sakshi
Sakshi News home page

13 లేదా 15న కొత్త కలెక్టర్ బాధ్యతలు!

Jul 10 2014 12:34 AM | Updated on Mar 21 2019 8:35 PM

13 లేదా 15న కొత్త కలెక్టర్ బాధ్యతలు! - Sakshi

13 లేదా 15న కొత్త కలెక్టర్ బాధ్యతలు!

జిల్లా కలెక్టర్‌గా నియమితులైన డాక్టర్ ఎన్.యువరాజ్ ఈ నెల 13న లేదా 15న బాధ్యతలు స్వీకరించనున్నట్లు సమాచారం.

విశాఖ రూరల్: జిల్లా కలెక్టర్‌గా నియమితులైన డాక్టర్ ఎన్.యువరాజ్ ఈ నెల 13న లేదా 15న బాధ్యతలు స్వీకరించనున్నట్లు సమాచారం. వుడా వైస్‌చైర్మన్‌గా విధులు నిర్వర్తిస్తున్న యువరాజ్ ప్రస్తుతం సెలవుపై తమిళనాడులో ఉన్నారు. ఆయన ఈ నెల 12న జిల్లాకు రానున్నారు. వీలైనంత వరకు ఈ నెల 13వ తేదీన కలెక్టర్‌గా చార్జ్ తీసుకోవాలని భావిస్తున్నట్టు సమాచారం. ఆరోజు కాని పక్షంలో 15వ తేదీన బాధ్యతలు స్వీకరించనున్నట్టు తెలిసింది. ప్రస్తుత కలెక్టర్ సాల్మన్ ఆరోఖ్యరాజ్ కూడా 13నే రిలీవ్ కానున్నట్టు సమాచారం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement