13 మంది పేకాట రాయుళ్లు అరెస్ట్ | 13 arrested for playing cards | Sakshi
Sakshi News home page

13 మంది పేకాట రాయుళ్లు అరెస్ట్

Dec 11 2015 6:29 PM | Updated on Sep 3 2017 1:50 PM

వైఎస్సార్ జిల్లా రాయచోటి రూరల్ మండలం చిప్యాల గ్రామ పంచాయతీ అన్నమరాజుగారిపల్లె గ్రామంలో 13 మంది పేకాట రాయుళ్లు పట్టుబడ్డారు.

రాయచోటి టౌన్ (వైఎస్సార్ జిల్లా) : వైఎస్సార్ జిల్లా రాయచోటి రూరల్ మండలం చిప్యాల గ్రామ పంచాయతీ అన్నమరాజుగారిపల్లె గ్రామంలో 13 మంది పేకాట రాయుళ్లు పట్టుబడ్డారు. శుక్రవారం మధ్యాహ్నం గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో పేకాట శిబిరం నడుస్తోందన్న సమాచారంతో పోలీసులు దాడి చేసి 13 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.59,400 నగదును స్వాధీనం చేసుకున్నారు. దాడుల్లో సీఐ శ్యామారావు, ఎస్సై రమేష్‌బాబు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement