పదొంతుల సంబురం | 10 times happy ,telangana is state is approved | Sakshi
Sakshi News home page

పదొంతుల సంబురం

Dec 6 2013 3:49 AM | Updated on Mar 18 2019 9:02 PM

తెలంగాణ ప్రజాకాంక్షకు కేంద్ర కేబినేట్ పట్టం కట్టింది. తెలంగాణ రాజకీయ పక్షాల ఒత్తిడి ఫలించింది. రాయల తెలంగాణపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది

 వరంగల్ సిటీ, న్యూస్‌లైన్ : తెలంగాణ ప్రజాకాంక్షకు కేంద్ర కేబినేట్ పట్టం కట్టింది. తెలంగాణ రాజకీయ పక్షాల ఒత్తిడి ఫలించింది. రా యల తెలంగాణపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. జిల్లావ్యాప్తంగా తెలంగాణవాదులు గురువారం రాత్రి సంబరాల్లో మునిగిపోయా రు. జేఏసీ, తెలంగాణవాదులు, కాంగ్రెస్, టీఆ ర్‌ఎస్, విద్యార్ధి, ప్రజాసంఘాల నాయకులు, కార్యకర్తలు రోడ్లపైకి చేరి సంతోషాన్ని పంచుకున్నారు. అమరవీరుల స్థూపానికి నివాళులర్పించారు. బాణసంచా కాలచ్చడంతోపాటు స్వీట్లు పంపిణీ చేసి, కుంకుమ చల్లుకున్నారు.
 
  జై తెలంగాణ నినాదాలతో పలు సెంటర్లు మార్మోగారుు. కాంగ్రెస్ జిల్లా కార్యాలయంలో పార్టీ నగర కాంగ్రెస్ అధ్యక్షుడు తాడిశెట్టి విద్యాసాగర్ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. స్వీట్లు పంపిణీ చేసి సోనియాగాంధీకి కృతజ్ఞతలు తెలిపారు. వరంగల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మంద వినోద్‌కుమార్, నాయకులు బొద్దిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, బస్వరాజు కుమారస్వామి, మేకల బాబురావు, మహమూద్, నసీంజహాన్, తోట వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ చీఫ్‌విప్ గండ్ర వెంకటరమణారెడ్డి తన ఇంట్లో కార్యకర్తలతో కలిసి టపాసులు కాల్చి, మిఠాయిలు పంచారు. తెలంగాణ బొగ్గుగని కార్మికు ల సంఘం ఆధ్వర్యంలో సింగరేణి కార్మికులు అధిక సంఖ్యలో అంబేద్కర్ సెంటర్‌కు చేరుకుని బాణాసంచా కాల్చారు. మహబూబాబాద్ నెహ్రూ సెంటర్, జనగామ బస్టాండ్ సెంట ర్లలో తెలంగాణ స్వీట్లు పంపిణీ చేశారు.
 
  పరకాలలో ఎమ్మెల్యే మొలుగూరి బిక్షపతి ఆధర్యం లో తెలంగాణ సంబరాలు జరిగాయి. రాత్రి ఎనిమిదిన్నరకు మొదలైన సంబరాలు అర్థరాత్రి వరకు కొనసాగాయి. కాకతీయ యూని వర్సీటి విద్యార్థుల జై తెలంగాణ నినాదాలతో క్యాంపస్ ప్రాంగణం దద్దరిల్లింది. తెలంగాణ ప్రజా సంఘాలకు చెందిన నాయకులు, న్యా యవాదులు హన్మకొండలోని అమరవీరుల స్థూపం వద్దకు చేరుకుని కొవ్వత్తులు వెలిగించి నివాళులు అర్పించారు. టీఆర్‌ఎస్ మహిళా నాయకురాలు రహిమున్నిసా అమరవీరుల స్థూపాన్ని పట్టుకుని బోరున విలపించడం అందరినీ కలచివేసింది. బార్ అసోసియేషన్ నాయకుడు సహోదర్‌రెడ్డి, టీఆర్‌ఎస్ నాయకులు పెద్ది సుదర్శన్‌రెడ్డి, గంధం శివ, చిర్ర రాజు తదితరులు పాల్గొన్నారు. లేబర్‌కాలనీ, కొత్తవాడ, పోచమ్మమైదాన్ సెంటర్లకు పెద్ద సంఖ్యలో చేరుకున్న తెలంగాణ వాదులు బాణాసంచా కాల్చారు, రంగులు చల్లుకున్నారు. టీడీపీ నగర కమిటీ అధ్యక్షుడు అనిశెట్టి మురళి ఆధ్వర్యంలో హన్మకొండ చౌరస్తాలో సంబరాలు జరుపుకున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement