10 అడుగుల వైఎస్సార్‌ కాంస్య విగ్రహం

10 feet YSR bronze statue at Amadalavalasa - Sakshi

8న ఆముదాలవలసలో స్పీకర్‌ తమ్మినేనిచే ఆవిష్కరణ 

తెనాలి: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి జయంతి రోజైన ఈ నెల 8వ తేదీ రైతు దినోత్సవంగా జరుపుకోనున్న సందర్భంగా ప్రతిష్ట నిమిత్తం డాక్టర్‌ వైఎస్సార్‌ కాంస్య విగ్రహం గుంటూరు జిల్లా తెనాలిలో రూపుదిద్దుకుంది. తెనాలికి చెందిన శిల్పకళాసోదరులు పెదపాటి రామాచారి, మల్లికార్జునరావులు ఈ విగ్రహాన్ని ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు.

10 అడుగుల ఎత్తు కలిగిన డాక్టర్‌ వైఎస్సార్‌ విగ్రహానికి 450 కిలోల కంచును ఉపయోగించగా, విగ్రహ తయారీకి 75 రోజులు పట్టిందని శిల్పకారుడు రామాచారి తెలిపారు. కాగా, ఈ విగ్రహాన్ని 8న శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసలో రాష్ట్ర శాసనసభ సభాపతి తమ్మినేని సీతారాం ఆవిష్కరించనున్న నేపథ్యంలో విగ్రహాన్ని ఆదివారం తెనాలి నుంచి ఆముదాలవలసకు తరలించారు. 

డాక్టర్‌ వైఎస్‌ విగ్రహంతో శిల్పి పెదపాటి రామాచారి 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top