లారీ బోల్తా.. క్లీనర్ మృతి | 1 died in lorry accident | Sakshi
Sakshi News home page

లారీ బోల్తా.. క్లీనర్ మృతి

Nov 4 2015 9:05 AM | Updated on Jun 1 2018 8:54 PM

వేగంగా వెళ్తున్న లారీ అదుపుతప్పి బోల్తా కొట్టడంతో.. లారీ క్లీనర్ మృతిచెందగా డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి.

కూడేరు: వేగంగా వెళ్తున్న లారీ అదుపుతప్పి బోల్తా కొట్టడంతో.. లారీ క్లీనర్ మృతిచెందగా డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన అనంతపురం జిల్లా కూడేరు మండలం జెల్లిపల్లి గ్రామ శివారులో బుధవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. అనంతపురం నుంచి బళ్లారి వెళ్తున్న గాలి మరల లారీ జెల్లిపల్లి గ్రామ శివారులోని మూల మలుపు వద్ద అదుపుతప్పి బోల్తా కొట్టింది.

దీంతో తమిళనాడు రాష్ట్రంలోని కాంచిపురంకు చెందిన లారీ క్లీనర్ శంకర్(25) అక్కడికక్కడే మృతిచెందగా.. డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement