breaking news
-
తిరుమలపై ఇంత పెద్ద నింద వేస్తారా?
టీటీడీలో అన్యమతస్తుల అంశంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ చేసిన వ్యాఖ్యలను భూమన కరుణాకర్‌రెడ్డి ఖండించారు. బండి సంజయ్ వ్యాఖ్యలతో తిరుపతి ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయని.. ఇది శ్రీవారి ఆలయంపై జరిగిన దాడిగానే పరిగణిస్తున్నామని అన్నారాయన. టీటీడీ సభ్యుడి సమక్షంలోనే బండి సంజయ్ అలా ఎలా ప్రకటించారని.. దీనిపై స్పందించాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వానికి కచ్చితంగా ఉందని భూమన డిమాండ్ చేస్తున్నారు. సాక్షి, తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్యమతస్తులైన ఉద్యోగుల వ్యవహారం తెలంగాణ ఎంపీ, కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై మాజీ చైర్మన్, వైఎస్సార్సీపీ నేత భూమన కరుణాకర్‌రెడ్డి స్పందించారు. ఇంత పెద్ద నింద వేసినా.. కూటమి ప్రభుత్వం, టీటీడీ ఇప్పటిదాకా స్పందించకపోవడం దారుణమని అన్నారాయన. టీటీడీలో 1,000 మంది అన్య మతస్తులు ఉన్నారని, వాళ్లను వెంటనే తొలగించాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ టీటీడీని హెచ్చరించారు. కేంద్ర మంత్రిగా ఉండి ఇలా ప్రకటన చేశారంటే ఆయన వద్ద ఏమైనా నివేదిక ఉందా?. ఆయన అలా ప్రకటన చేసిన టైంలో పక్కనే టీటీడీ పాలకమండలి సభ్యుడు భాను ప్రకాశ్ కూడా ఉన్నారు. అలాంటప్పుడు దీనిపై వివరణ ఇవ్వాల్సిన భాద్యత కూటమి ప్రభుత్వం, టీటీడీపైన కచ్చితంగా ఉందిటీటీడీ బోర్డులో 22 మంది అన్యమతస్తులైన ఉద్యోగులు ఉన్నారని, వారిని బదిలీ చేస్తున్నట్లు గతంలో ఈవో, చైర్మన్లు ప్రకటించారు. అలాంటప్పుడు బండి సంజయ్ 1,000 మంది అని ఎలా అంటారు?. రెండింటిలో ఏది నిజం? ఆయన(బండి సంజయ్) లెక్క ప్రకారం.. 20 శాతం మంది అన్యమతస్తులే ఉన్నట్లా?. అసలు తిరుమలపై ఇంత పెద్ద నింద ఎలా వేస్తారు?. ఇది భక్తుల మనోభావాలను దెబ్బ తీయడమే. కచ్చితంగా టీటీడీని, ఉద్యోగస్తులను అవమానించడమే.అధికారంలోకి రాగానే.. తిరుమలను ప్రక్షాళన చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. అలాంటప్పుడు తిరుపతి ప్రజలను నొప్పించిన బండి సంజయ్ ప్రకటన పట్ల ఎందుకు స్పందించరు. బండి సంజయ్ వ్యాఖ్యలు చేసి 24 గంటలు గడిచినా పవన్ కల్యాణ్ సహా కూటమి నేతలు, టీటీడీలు కనీసం స్పందించలేదు.. ఖండించలేదు అని భూమన అన్నారు. -
పోలీసు రాజ్యమా?.. బాబు నియంతృత్వ రాజ్యమా?
ప్రశ్నించే గొంతుకలను ప్రభుత్వ యంత్రాంగంతో అణిచివేస్తున్న చంద్రబాబు సర్కార్‌పై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారుసాక్షి, గుంటూరు: ప్రశ్నించే గొంతుకలను ప్రభుత్వ యంత్రాంగంతో అణిచివేస్తున్న చంద్రబాబు సర్కార్‌పై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఈ మేరకు ఎక్స్ ఖాతాలో శనివారం ఆయన సుదీర్ఘమైన ఓ పోస్ట్ ఉంచారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రశ్నించే హక్కుతో పాటు, నిరసన వ్యక్తం చేయడం అనేవి ఒక పునాది వంటివి. ప్రజలు తమ సమస్యలు ప్రస్తావించి, వాటి పరిష్కారం కోరడం అనేది రాజ్యాంగం కల్పించిన హక్కు. కానీ, దురదృష్టశాత్తూ మన ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాస్వామ్యంలో అత్యంత ముఖ్యమైన ప్రాథమిక హక్కులను, చంద్రబాబు సారథ్యంలోని ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా అణిచివేస్తోంది. పోలీసు యంత్రాంగాన్ని, వారి అధికారాన్ని పూర్తిగా దుర్వినియోగం చేస్తూ ప్రశ్నించే గొంతుకలను నిర్దాక్షిణ్యంగా నొక్కేస్తున్నారు. అది ఏ స్థాయికి చేరిందంటే, అసలు మనం అసలు ప్రజాస్వామ్యంలో ఉన్నామా? లేక నియంతృత్వంలోనా? అనే సందేహం కలుగుతోంది’.‘ప్రజలు తమ సమస్యలు లేవనెత్తినా, వారికి మద్దతుగా విపక్షం గళం విప్పినా ప్రభుత్వం సహించడం లేదు. దారుణంగా వేధిస్తున్నారు. లేని కేసులు సృష్టిస్తూ వారి గళాన్ని నొక్కడంతో పాటు, అసలు ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారే ఉండకూడదన్న విధంగా వ్యవహరిస్తున్నారు. ఈ ప్రక్రియలో రాష్ట్రంలో ఏ ఒక్కరిని కూడా ఈ ప్రభుత్వం విడిచిపెట్టడం లేదు. అలా ప్రజాస్వామ్య స్ఫూర్తి, పౌర హక్కులకు తీవ్ర భంగం కలిగిస్తున్నారు’.‘దీని వెనక ఉన్న ప్రధాన ఉద్దేశం ఒక్కటే. ఒక పద్దతి ప్రకారం ప్రజాస్వామ్య వ్యవస్థకు విఘాతం కలిగించడంతో పాటు, ప్రతిపక్షం అనేది లేకుండా చేయాలి. అలాగే ప్రశ్నించే ఏ గొంతుకా ఉండొద్దు’. అదే ఈ ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోంది.ఆ దిశలో ఈ ప్రభుత్వం చేసిన, చేస్తున్న చర్యలు. పద్దతి ప్రకారం ప్రజాస్వామ్యాన్నే అణిచి వేసేలా వ్యవహరిస్తున్న తీరు.. వివరాలు చూస్తే..👉 ఫిబ్రవరి 19, 2025. గుంటూరు మిర్చియార్డు.దారుణంగా ధరలు పతనం కావడంతో, మిర్చి రైతులు పడుతున్న కష్టాలు తెలుసుకుని, వారిని పరామర్శించేందుకు గుంటూరు మిర్చియార్డును సందర్శించాను. మిర్చి ధరలు రూ.27 వేల నుంచి ఏకంగా రూ.8 వేలకు పడిపోయాయి. ఆ పరిస్థితుల్లో నేను గుంటూరు మిర్చియార్డు సందర్శించి, ఆ రైతులను పరామర్శిస్తే కేసు నమోదు చేశారు.👉ఏప్రిల్ 8, 2025. శ్రీ సత్యసాయి జిల్లా. రామగిరి.‘టీడీపీ మూకల చేతిలో దారుణహత్యకు గురైన మా పార్టీకి చెందిన బీసీ నాయకుడు కురుబ లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు శ్రీ సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గంలోని రామగిరిలో పర్యటించాను. దానిపైనా కేసు నమోదు చేశారు. వైయస్సార్సీపీ రాప్తాడు నియోజకవర్గం కోఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డిపైనా కేసు పెట్టారు.👉జూన్ 11. 2025. ప్రకాశం జిల్లా పొదిలి.‘ఏ మాత్రం గిట్టుబాటు ధర లేక నానా ఇక్కట్లు పడుతున్న పొగాకు రైతులను పరామర్శకు వెళ్తే ఏకంగా మూడు కేసులు నమోదు చేశారు. పొగాకు బోర్డు సూచన మేరకు రైతులు 20 శాతం పొగాకు ఎక్కువ సాగు చేశారు. కానీ, ధరలు మాత్రం దారుణంగా పతనమయ్యాయి. ఈ పరిస్థితుల్లో నేను పొగాకు రైతుల పరామర్శకు వెళ్తే 3 కేసులు పెట్టారు. 15 మంది రైతులను జైళ్లకు పంపడంతో పాటు, నలుగురిని అరెస్టు చేశారు. చివరకు న్యాయస్థానం కూడా ఈ చర్యను తప్పు బట్టింది.👉జూన్ 18, 2025. పల్నాడు జిల్లా సత్తెనపల్లి.‘గత ఏడాది ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత పోలీసుల దారుణ వేధింపులకు గురై ఆత్మహత్య చేసుకున్న మా పార్టీ నాయకుడి కుటుంబాన్ని పరామర్శించేందుకు రెంటపాళ్ల వెళ్తే, అక్కడా కేసులు నమోదు చేశారు. 5 కేసులు నమోదు చేయడంతో పాటు, ఏకంగా 131 మందికి నోటీసులు జారీ చేశారు. ఇంకా సినిమా పోస్టర్లు ప్రదర్శించిన ఇద్దరిని అరెస్టు చేశారు.👉జూలై 9, 2025. బంగారుపాళ్యం. చిత్తూరు జిల్లా.‘ఏ మాత్రం కొనుగోళ్లు లేక తీవ్ర నష్టాల్లో కూరుకుపోయిన తోతాపురి మామిడి రైతులను పరామర్శించేందుకు చిత్తూరు జిల్లా, బంగారుపాళ్యంలోని మార్కెట్‌యార్డును సందర్శిస్తే.. అక్కడా ఏకంగా 5 కేసులు నమోదు చేశారు. 20 మందిని అదుపులోకి తీసుకున్నారు. రెండు రోజులు గడిచినా, వారి అరెస్టు చూపలేదు. కోర్టులో ప్రవేశపెట్టలేదు. వారంతా ఇంకా పోలీసుల అదుపులోనే ఉన్నారు.‘ప్రతి కేసుకు సంబంధించి ఒక ముగ్గురు, నలుగురి పేర్లు పెట్టి.. ఇంకా ఇతరులు అని రాస్తున్నారు. ఆ విధంగా తాము టార్గెట్ పెట్టుకున్న వారిని ఆ తర్వాత ఆ కేసులో జోడిస్తున్నారు. నా ప్రతి పర్యటనలో కూడా ప్రజలెవ్వరూ రాకుండా, తీవ్ర నిర్భంధం విధిస్తున్నారు. వైయస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలకు నోటీసులు జారీ చేయడమే కాకుండా, వారిని ముందస్తుగా హౌజ్ అరెస్ట్ చేస్తున్నారు. చివరకు రైతులను కూడా ఎక్కడికక్కడ కట్టడి చేస్తున్నారు. వారు రాకుండా నియంత్రించే కుట్ర చేస్తున్నారు. ఎక్కడ పడితే అక్కడ చెక్‌పోస్టులు పెట్టి, అడ్డుకుంటున్నారు’.రాష్ట్రంలో ఉన్నది ఒకే ఒక విపక్షం. ప్రజా సమస్యలపై పోరాడేది కూడా విపక్షమే. కానీ మా పార్టీని కూడా అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ.. అణిచివేసే ప్రయత్నాన్ని సీఎం చంద్రబాబుగారు నిరంతరం కొనసాగిస్తున్నారు. లేని కేసులు బనాయించడం, అరెస్టులు చేయడం, ఆ విధంగా దారుణంగా వేధించడం పరిపాటిగా మారింది. ఆ విధంగా ప్రజాస్వామ్య స్ఫూర్తికే విఘాతం కలిగించడమే కాకుండా, వాయిస్‌లెస్ పీపుల్ వాయిస్‌ను నొక్కేస్తున్నారు’. విధంగా అడ్డగోలు హామీలిచ్చి, ఏవీ అమలు చేయకుండా ఉన్న తమను ఎవరూ ప్రశ్నించకూడదు. వాటిపై ఎవరూ మాట్లాడకూడదు అనే విధంగా ఈ ప్రభుత్వం అత్యంత దారుణంగా వ్యవహరిస్తోంది’.CM @ncbn suppressing dissent with state machineryThe right to question, protest, and assemble forms the bedrock of democracy, empowering citizens to freely express their grievances and demand accountability. In Andhra Pradesh, however, this fundamental democratic process is…— YS Jagan Mohan Reddy (@ysjagan) July 12, 2025 -
మామిడి రైతుల రూపంలో లబ్ధి పొందింది టీడీపీవాళ్లే: బొత్స
సాక్షి, విశాఖ: ఏపీలో కూటమి ఏడాది పాలనలో ఏ రంగం చూసినా ఆరాచకం, అల్లకల్లోలమే మిగిలిందని ఆరోపించారు వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. రైతులను కించపరిచేలా ప్రభుత్వం పెద్ద పెద్దలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అవకాశం ఉంది కదా అని కూటమి నేతలు అన్నీ దోచేస్తున్నారు అంటూ విమర్శలు చేశారు. డ్రగ్స్‌లో విశాఖను ఇంటర్నేషనల్ సిటీ చేశారు అంటూ మండిపడ్డారు.ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ విశాఖలో మీడియాతో మాట్లాడుతూ..‘కూటమి ఏడాది పాలన అస్తవ్యస్తంగా ఉంది. ఏ వర్గం సంతృప్తిగా లేదు. రాష్ట్రంలో రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. వారి కష్టం ఆవిరి అయిపోతుంది. రైతులకు ప్రభుత్వం సాయం అందడం లేదు. రైతులను కించపరిచేలా ప్రభుత్వ పెద్దలు మాట్లాడుతున్నారు. మామిడి రైతుల రూపంలో లబ్ధి పొందింది టీడీపీవాళ్లే. మిర్చి, పొగాకు, ఆక్వా ఏ రంగం తీసుకున్నా ఇదే పరిస్థితి. వైఎస్ జగన్ రైతుల గురించి మాట్లాడితేనే వాళ్ల బాధలు తెలుస్తాయి. ప్రభుత్వం స్పందించే నాటికి పుణ్యకాలం గడిచిపోతోంది. ఎక్కడికక్కడ దోపిడీ నడుస్తోంది.మంత్రుల దోపిడీ..వైఎస్ జగన్ చిత్తూరు వెళ్ళాక కూటమి నేతలకు ఢిల్లీ వెళ్లాలనే ఆలోచన వచ్చింది. సీజన్ అయ్యాక పర్యటన ఎందుకు అని జగన్ ప్రశ్నించారు. అంతా అయిపోతే ఇప్పుడు మీరెందుకు ఢిల్లీ వెళ్లారు. పొగాకు రైతులకు కూడా ఇదే అన్యాయం జరిగింది. మిర్చి రైతుల సమస్య అంశంలో కూడా ఇదే జరిగింది. ఈ ప్రభుత్వంలో అంతా దోపిడీనే.. మంత్రుల అవినీతి ఎక్కువైందని చంద్రబాబు అన్నారు. వారి అనుకూల పత్రికలు కూడా అవే వార్తలు రాశాయి. రాజు ఎలాంటి వాడు అయితే మంత్రులు కూడా అలాగే ఉంటారు. ప్రభుత్వంలో మంత్రుల తీరు, పాలనను ఆక్షేపిస్తున్నాను. చంద్రబాబు సరిగ్గా ఉంటే అందరూ బాగుంటారు..డ్రగ్స్ సిటీగా విశాఖ..గంజాయిని అరికడతాం అని ప్రగల్భాలు పలికారు. గంజాయి పోయి ఇప్పుడు విశాఖలోకి డ్రగ్స్ వచ్చాయి. డ్రగ్స్ కేసులో పోలీసులు ఒక్కో రోజు ఒక్కో స్టేట్మెంట్ ఇచ్చారు. డ్రగ్స్‌లో విశాఖను ఇంటర్నేషనల్ సిటీ చేశారు. అభివృద్ధిలో విశాఖను ఏమీ చేయలేకపోయారు. ప్రశ్నిస్తే దేశ ద్రోహం కేసులు పెడుతున్నారు. యోగాంధ్ర వలన విశాఖకు ఉపయోగం ఏమిటి?. విశాఖలో జరుగుతున్న భూ బాగోతంపై సీఎం, గవర్నర్‌కు లేఖ రాస్తాను. ఈ రాష్ట్రంలో పరిపాలన లేదు. ప్రభుత్వ డొల్లతనం బయటపడుతుంది. ఇష్టారీతిన అప్పులు చేశారు. మీరు జగన్ ఇచ్చినట్టు ప్రజలకు ఏమైనా ఇచ్చారా?. ఏపీలో ప్రభుత్వ తీరు మాటలు గొప్ప ఊరు దిబ్బలా ఉంది. రాష్ట్రానికి పన్నుల రాబడి ఎందుకు తగ్గింది?. ప్రజల్లో కొనుగోలు శక్తి లేక ఆదాయం తగ్గుతోంది.సింగయ్య మృతి ఘటనలో కూడా పోలీసులపై ఒత్తిడి చేసి మరి స్టేట్మెంట్ ఇప్పించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా మహిళలపై అకృత్యాలు పెరిగాయి. ప్రభుత్వం, పోలీసు వ్యవస్థ మీద ఉన్న గౌరవం పోతే పరిస్థితి ఇలాగే ఉంటుంది. ఏపీఎండీసీ నుంచి తెచ్చిన రుణాల అవకతవకలపై మాట్లాడుతాను. తప్పులను ఎత్తి చూపుతాం. విశాఖలో పార్కులు కబ్జా చేస్తున్నారు. ఇష్టానుసారంగా టీడీఆర్ కుంభకోణాలకు తెర తీశారు. వైఎస్సార్సీపీ హయాంలో తప్పులు జరిగాయని మాటలు చెప్పారు. ఆ మాటలపై ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదు.కూటమి నేతల దోపిడీ, ఆరాచకం..సంవత్సర కాలంలో విద్యా వ్యవస్థను భ్రష్టుపట్టించారు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థ ఎలా ఉందో ప్రజలకు వివరిస్తా. నాడు-నేడు స్కీం ఆపడం మంచిది కాదు. అనకాపల్లిలో లిక్కర్ మాఫియా బయట పడింది. ప్రభుత్వ పెద్దల అండదండలతో లిక్కర్ మాఫియా నడుస్తోంది. ఎవరి పని వారిని చేసుకోనిస్తే ఇబ్బంది ఉండదు. రాష్ట్రంలో అధికారులకు స్వతంత్రం లేదు. సామాన్యుడికి ఐదు వెళ్ళు నోటిలోకి వెళ్లే పరిస్థితి లేదు. కూటమి నేతల దోపిడీ, ఆరాచకాలను ఎందుకు అరికట్టడం లేదు. సంవత్సరంలోనే ఇంతటి వ్యతిరేకత ఎప్పుడూ చూడలేదు. కూటమి హామీలు విని ప్రజలు మోసపోయారు. కూటమి నేతలు ప్రజల్లోకి వెళ్తున్నారు కదా ఫీడ్ బ్యాక్ తెప్పించుకోండి. మాట ఇచ్చాం అంటే ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. తప్పులు ఉంటే సరిదిద్దుకోండి. ఇంతటి దుర్మార్గపు ఆలోచనలు ఉన్న ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదు’ అంటూ తీవ్ర విమర్శలు చేశారు. -
ప్రభుత్వమే కామందుగా మారితే ఎలా?
‘రైతన్నలారా.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజధాని పేరుతో మళ్లీ భూ సేకరణకు దిగుతోంది. మీకు నష్టం ఖాయం. అందువల్ల ఎవరూ ప్రభుత్వానికి భూములివ్వొద్దు’ పెదపరిమి గ్రామంలో ఒక వ్యక్తి సైకిల్‌పై తిరుగుతూ మైక్ పెట్టుకుని మరీ చేస్తున్న ప్రకటన. రెడ్‌బుక్ పాలన కాబట్టి ఇలాంటి వారిపై టీడీపీ కార్యకర్తలు దాడులకు దిగి ఉండాల్సింది. కానీ.. అలాంటిదేమీ జరగలేదు. పైగా అందరూ ఆసక్తిగా వింటున్నారు. తొలివిడత భూసేకరణలో భాగమైన రైతులకు ఇచ్చిన హామీలేవీ నెరవేరకపోవడం వారి మెదళ్లల్లో కదులుతోందేమో!.రాజధాని అమరావతి పేరుతో ఇప్పటికే 33 వేల ఎకరాల భూమి సేకరించిన చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు మళ్లీ ఇంకో 36 వేల ఎకరాలు కావాలంటూ రంగంలోకి దిగింది. ఇది కాస్తా చాలా గ్రామాల్లో తీవ్ర అలజడికి కారణమైంది. తొలి విడతలో సేకరించిన భూమిలో 20 వేల ఎకరాల్లో ఎలాంటి కార్యకలాపాలూ చేపట్టకపోవడం మళ్లీ భూమి కావాలని అనడం చూసి ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. ప్రభుత్వం కూడా రైతుల ఆందోళనలు, అనుమానాలను తీర్చే ప్రయత్నమేదీ చేయడం లేదు. మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వర రావు వంటి వారు కూడా భూములిస్తే రైతులకు నష్టమేనని బహిరంగంగానే ప్రకటిస్తున్నారు.కానీ, చంద్రబాబు ప్రభుత్వం మాత్రం నలభై వేల ఎకరాలు తీసుకున్నా ప్రభుత్వానికి మిగిలేది పదివేల ఎకరాలేనని, ఎయిర్ పోర్టు, రైల్వే స్టేషన్ల వంటి వాటికి సరిపోగా కొంత భూమిని మాత్రమే అమ్ముకోగలమని చెబుతోంది. విజయవాడ సమీపంలో ఇప్పటికే ఒక విమానాశ్రయం ఉండగా కొత్తగా ఇంకోదాని అవసరమేంటి? కొత్తగా సేకరించే భూముల్లో 2500 ఎకరాలు అదానీ సంస్థకు కట్టబెట్టేందుకూ ప్రయత్నాలు సాగుతున్నట్లుగా తెలుస్తోంది.నాడా దొరికిందని గుర్రాన్ని కొంటారా?ఇవన్నీ ఒక ఎత్తు అయితే.. భూములివ్వమని రైతులు సైకిళ్లపై ప్రచారం చేస్తూంటే ప్రభుత్వం మాత్రం అబ్బే అలాంటిదేమీ లేదు.. అందరూ ఒప్పుకున్నట్టుగా ప్రచారం చేస్తోంది. ఇక్కడ ఒక మాట చెప్పుకోవాలి. కామాంధులకు భూదాహం ఎక్కువంటారు. కానీ, ప్రభుత్వమే భూదాహంతో వ్యవహరిస్తే, కామాంధులాగా మారితే ఏం చేయాలి!. ప్రజావసరాల కోసం ప్రభుత్వం భూమి తీసుకోవడం తప్పుకాదు. కానీ, ఆ అవసరాలు ఎంత అన్నదానిపై స్పష్టత ఉండాలి. అలా కాకుండా ప్రభుత్వాధినేతల ఇష్టాలకు తగ్గట్టుగా భూములు సమీకరించి భారీ రియల్ ఎస్టేట్ ప్రాజెక్టు అయిపోతుందని, కోట్ల రూపాయల లాభం వస్తుందని మభ్యపెడితేనే ప్రమాదం. నిజానికి ప్రభుత్వం తనకు అవసరమైన భూములను మంచి ధరకు రైతుల నుంచి ఖరీదు చేసి భవనాలు నిర్మించుకున్నా లక్షల కోట్ల వ్యయం కాదు.హైదరాబాద్ ఆయా రాజధానులకు ప్రభుత్వాలు ఎంత భూమి సేకరించారన్నది పరిశీలిస్తే ఏపీ ప్రభుత్వం భూదాహం ఎంతన్నది స్పష్టమవుతుంది. వేల ఎకరాల భూమి సేకరించి ఏకమొత్తంగా లక్షల కోట్లు వ్యయం చేసి మౌలిక సదుపాయాలు కల్పించడం వల్ల ప్రభుత్వానికి కలిసొచ్చేదేమీ ఉండదు. రాజధానిగా ఆ ప్రాంతం అభివృద్ధి చెందే క్రమంలో ప్రైవేటు సంస్థలే ఈ మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసుకుంటాయి. హైదరాబాద్ వంటి మహా నగరాల్లో ఎనెన్నో గేటెడ్ కమ్యూనిటీలు సొంతంగా మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసుకోవడం లేదు? అలా కాకుండా అన్నీ తామే చేస్తామంటే ఎలా? ఎప్పటికి కావాలి?.ప్రపంచ బ్యాంక్ షరతు..అభివృద్ధి చేసిన ప్లాట్లను రైతులకు ఎప్పుడిస్తారో ఇప్పటికీ స్పష్టత లేదు. వేల కోట్ల వ్యయమయ్యే మౌలిక సదుపాయాల వృద్ధి ఎప్పటికయ్యేనో తెలియదు. గిరాకీ వస్తే మంచిదేకానీ.. ప్రభుత్వమిచ్చే ప్లాట్లతో రైతులకు పెద్దగా ప్రయోజనం కలగకపోతే? అప్పుడు వారు ఎంత నష్టపోతారో తలచుకుంటేనే బాధ కలుగుతుంది!. ఈ నేపధ్యంలోనే ఒక సాధారణ రైతు.. మైక్ పట్టుకుని భూములు ఇవ్వవద్దని ప్రచారం చేస్తున్నారు. రెడ్‌బుక్ అరాచకం ఈ రైతుపైనా జరుగుతుందేమో తెలియదు. ప్రపంచ బ్యాంకు నుంచి తీసుకున్న రూ.15వేల కోట్ల రుణానికి సంబంధించి పెట్టిన షరతులలో భూముల అమ్మకం కూడా ఒకటి ఉందట. దాని ప్రకారం భూములు ఎప్పటి నుంచి అమ్ముతారని ఆ బ్యాంకు అడుగుతోందని కథనాలు వచ్చాయి. సుమారు వెయ్యి ఎకరాల భూమి ఎకరాకు రూ.25 నుంచి రూ.30 కోట్ల లెక్కన అమ్ముకోవచ్చునని అధికారులు ప్రపంచబ్యాంకుకు తెలిపారట. ఇదసలు సాధ్యమయ్యేదేనా?. ఈ ధరకు కొనగలిగే సంస్థలెన్ని? ఇదే వాస్తవమైతే ఈపాటికి వందల ఎకరాలు అమ్మి ఉండాలి కదా!. ప్రజలను మభ్య పెట్టినట్లు ప్రపంచ బ్యాంకును కూడా మాయ చేయాలని అనుకుంటున్నారా?.మరో విషయం ఏమిటంటే ప్రభుత్వం ఇచ్చే కౌలు రూ.30వేలు మాత్రమే ఉండడాన్ని రైతులు తప్పుపడుతున్నారు. కొత్తగా భూములు సమీకరించే చోట గ్రామస్తులు కొన్ని ప్రశ్నలు సంధిస్తున్నారు. ఎన్నికల ప్రణాళికలో చెప్పినట్టుగా ‘అన్నదాత సుఖీభవ’ కింద రైతులకు రూ.20 వేలు చెల్లిస్తే, ప్రధానమంత్రి కిసన్ యోజన కింద ఇంకో రూ.ఆరు వేలు వస్తాయని వీరంటున్నారు. అంటే.. భూములు తమ వద్దే ఉన్నా రూ.26 వేలు వస్తూండగా.. ప్రభుత్వానికి ఇస్తే వచ్చేది రూ.30 వేలు మాత్రమేనని వివరిస్తున్నారు. కేవలం రూ.4 వేల అదనపు ప్రయోజనం కోసం భూమిపై తమ హక్కులను ఎందుకు కోల్పోవాలని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే భూములు ఇచ్చిన రైతులు, కొనుగోలుదారులు.. బాగా నష్టపోయారు. అందువల్లే ఆయా గ్రామసభలలో రైతులు టీడీపీ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్‌ను, అధికారులను నిలదీస్తున్నారట. కొన్ని చోట్ల వ్యతిరేక నినాదాలు చేస్తున్నారు. అయినా రైతుల ఆమోదం దొరికినట్లు అధికారులు రాసేసుకుంటున్నారట. భూములు లాక్కుని తమకు బిచ్చగాళ్లగా చేయవద్దని కొందరు మొర పెట్టుకుంటున్నారు.గతంలో సంప్రదాయేతర ఇంధన వనరుల కోసం అదానీకి భూములు కేటాయిస్తే.. ఏపీని రాసిచ్చేస్తున్నారని నోరు పారేసుకున్న టీడీపీ మీడియా ఇప్పుడు అదానీ స్పోర్ట్స్ సిటీ గురించి మాత్రం పల్లెత్తు మాట అనడం లేదు. పైగా ఆయా సంస్థలకు ఎంత మొత్తానికి భూములు కేటాయిస్తున్నది కూడా గోప్యంగా ఉంచుతున్నారు. ఏపీ ప్రభుత్వం ప్రైవేటు సంస్థలు ఎకరాకు రూ.20 కోట్లకుపైగా వెచ్చించడానికి సిద్దపడకపోతే ఏం చేస్తారో తెలియదు. అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్లు నాలుగింటికి రెండున్నర ఎకరాల చొప్పున ఇస్తారట.అంతర్జాతీయ స్థాయిలో నిజంగా ఆ సెంటర్లు ఏర్పాటైతే ఈ స్థలం సరిపోతుందా? ప్రస్తుతం భూదాహంతో తహతహలాడిపోతున్న ప్రభుత్వ పెద్దలు లేచింది లేడికి ప్రయాణం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. రాజధాని ప్రాంతమంటే తమ సొంత జాగీరన్నట్లుగా భావిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. వేల కోట్ల అప్పులు సమీకరించిన ప్రభుత్వ నేతలకు ఇప్పుడు సలహాలు ఇచ్చినా వినే పరిస్థితిలో లేరన్న అభిప్రాయం ఉంది. అమరావతి ప్రజలకు, ముఖ్యంగా రైతులకు న్యాయం జరగాలని కోరుకోవడం తప్ప ఏమి చేయగలం! కొసమెరుపు ఏమిటంటే ఈ అదనపు భూమి సమీకరణపై మంత్రివర్గంలో తర్జనభర్జనపడి నిర్ణయం వాయిదా వేయడం!.-కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
పవన్ @పెద్దమ్మ భాషా పితామహ..
రామాయణాన్ని వాల్మీకి రాశారు.. వేద వ్యాసుడు రాసిన మహాభారతాన్ని కవిత్రయం అనువదించింది. మను చరిత్రను అల్లసాని పెద్దన రాశారు. జనగణమన గీతాన్ని రవీంద్రనాథ్ ఠాగూర్ రాశారు.. వందేమాతరం గీతాన్ని బంకించంద్ర ఛటర్జీ రచించారు.. అవన్నీ అందరికీ తెలుసు కానీ పెద్దమ్మ భాషను ఎవరు కనిపెట్టారు చెప్పండి.. షాక్ అయ్యారా.. లేదు మళ్ళీ చదవండి.. పెద్దమ్మ భాషను ఎవరు కనిపెట్టారు?.అదేంది మాతృభాషను అమ్మ భాష అంటారు అది అందరికీ తెలిసిందే. కానీ ఈ పెద్దమ్మ భాష ఏంది ఎప్పుడు వినలేదు అనుకుంటున్నారా.. ఈరోజే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కనిపెట్టారు.. ఆయన ఎవరితో పొత్తులో ఉంటే ఆ పాట పాడుతారు ఆ గుమ్మం ముందు ఆ ఆట ఆడతారు. ఆయన ఎవరికి తాబేదారుగా ఉంటే ఆ పార్టీ భజన గీతాలు నేరుస్తారు. గతంలో నన్ను మా అమ్మను ఎన్ని రకాలుగా అవమానించారు అంటూ తెలుగుదేశం మీద చిందులు తొక్కిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు తాజాగా ఇంకో 20 ఏళ్లు చంద్రబాబుకు పాలేరుగా ఉండడానికి సిద్ధం అని ప్రకటించారు.పాచిపోయిన లడ్లు ఇచ్చిన బీజేపీకి మనం తలవంచుతామా అంటూ అటూ ఇటూ తల ఎగరేసిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు బీజేపీ గుమ్మం ముందు బిస్కెట్లు ఏరుకుంటున్నారు. ఈ ఢిల్లీ వాళ్లకి అహంకారం ఎక్కువ సౌత్ ఇండియా వాళ్ళు అంటేనే వాళ్లకు లెక్కలేదు.. అలాంటి వారితో మనకు పొత్తా.. చెప్పండి చెప్పండి అంటూ ఊగిపోయిన పవన్ మళ్ళీ బీజేపీ పంచన చేరారు. ఉత్తర భారతదేశ పార్టీలు నాయకులకు దక్షిణ భారతదేశం అంటే చిన్న చూపు.. వాళ్లు తమ భాషను నాగరికతను సంస్కృతిని మనపై రుద్దుతున్నారు అంటూ చిందులు తొక్కిన పవన్ తాజాగా హిందీ భాషను అందరూ నేర్చుకోవాలని చెబుతున్నారు. దీనికి ఆయన సరికొత్త భాష్యం చెబుతున్నారు. మాతృభాష తల్లి అయితే హిందీ పెద్దమ్మ భాష అంటూ కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చారు.మరోవైపు దక్షిణ భారతదేశంలోని తమిళనాడులో హిందీ అంటేనే ఒప్పుకోవడం లేదు. తమిళులకు తమ మాతృభాషపై ఎనలేని మక్కువ ఉంది హిందీ మేము ఎందుకు నేర్చుకోవాలి అంటూ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ పెద్ద చర్చ లేవదీశారు. తమిళులు సాధ్యమైనంత వరకు పార్లమెంట్లో కూడా తమిళంలోనే మాట్లాడతారు. కేరళలో కూడా హిందీ అంటే వ్యతిరేకత ఉంది. కర్ణాటకలో ప్రజలు కన్నడం అంటే ప్రాణం పెడతారు. ఆంధ్రాలో కూడా హిందీకి ప్రాధాన్యం తక్కువే. కానీ పవన్ కళ్యాణ్ బీజేపీతో పొత్తు పెట్టుకున్నాక ఆయనకు హిందీ పట్ల ప్రేమ పెరిగిందో తన రాజకీయ అవసరాల కోసం ఇలా నటిస్తున్నారో అర్థం కావడం లేదు కానీ. దీని పెద్దమ్మ భాష అంటూ నెత్తికెత్తుకున్నారు. వాస్తవానికి ఆయన సందర్భాన్ని బట్టి ఒక అంశాన్ని మోస్తూ ఆ ఎపిసోడ్ గడిపేస్తూ ఉంటారు. ఆమధ్య కాకినాడ పోర్టులో రేషన్ బియ్యం చేస్తున్న నౌకను చూసి సీజ్ ది షిప్ అన్నారు. ఆ తరువాత ఆ అంశాన్ని వదిలేశారు. ఇప్పుడు యథావిధిగా రేషన్ బియ్యం విదేశాలకు తరలిపోతోంది. తిరుమల ప్రసాదంలో కొవ్వుంది అన్నారు.. నాల్రోజులు కాషాయం బట్టలు వేసుకుని హడావుడి చేశారు.. దాన్ని వదిలేశారు. వారాహి డిక్లరేషన్.. సనాతన ధర్మం అన్నారు.. దాన్ని పక్కనబెట్టారు. ఇప్పుడు తాజాగా హిందీ భాషను అందరూ నేర్చుకోవాలని అంటున్నారు.. మరి ఈ అంశాన్ని ఎప్పుడు వదిలేస్తారో చూడాలి.. సీజన్లను బట్టి ప్రాధాన్యాలు మార్చుకునే పవన్ కళ్యాణ్ ఊసరవెల్లికి సైతం కోచింగ్ ఇచ్చే స్థాయికి చేరుకున్నారు అని ప్రజలు విస్తుపోతున్నారు.-సిమ్మాదిరప్పన్న. -
బాబోరు మళ్లీ ఏసేశారు..!
చంద్రబాబు మళ్లీ ఏసేశారు.. ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా అది తన చలవ తన గొప్పతనమే అని చెప్పుకోవడం ఆయనకు జన్మతః వచ్చిన దురలవాటు. హైదరాబాదులో రింగ్ రోడ్డు ఏర్పాటు.. ఐటీ అభివృద్ధి. . పీవీ ఎక్స్‌ప్రెస్ ఫ్లైఓవర్ నిర్మాణం.. నగరంలో ఇతరత్రా ప్రాజెక్టుల తో పాటు ఫార్మా ఇండస్ట్రీ వంటివన్నీ తానే తీసుకొచ్చానని ఎన్నో మార్లు చంద్రబాబు చెప్పారు. అసలు గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్‌కి కూడా తానే స్ఫూర్తి అని ఎన్నోమార్లు చెప్పుకున్నారు.దేశంలో నేషనల్ హైవేస్ నిర్మించాలని నాటి ప్రధాని వాజపేయికి సలహా ఇచ్చింది కూడా తానేనని బాబు నిస్సిగ్గుగా చెప్పుకున్నారు. పీవీ సింధు. పుల్లెల గోపీచంద్ వంటివారికి ప్రోత్సాహం కూడా తానే ఇచ్చానన్నారు.. దేశంలో వెయ్యి.. రెండు వేల నోట్లను రద్దు చేయాలని మోదీకి చెప్పింది కూడా తానేనన్నారు. బాబు ప్రకటనలు చూసి నవ్వుకునేవాళ్ళు నవ్వుకున్నారు.. అది వేరే విషయం.ఇలా దేశంలో ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా అన్నిటికీ నేనే నేనే అని చెప్పుకోవడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య. పైగా తను ఏం చెప్పినా తానా తందానా అనడానికి సొంతంగా మీడియా కూడా ఉందాయే. కాబట్టి ఆయన ఆటలు అలా సాగుతున్నాయి మాటలు అలా ముందుకు వెళుతున్నాయి. దేశంలో సంక్షేమ పథకాలను తెచ్చిందే తెలుగుదేశం అని కూడా చెప్పుకున్నారు. ఎన్టీ రామారావు తొలిసారిగా కిలో బియ్యం రెండు రూపాయలకు ఇచ్చారని చంద్రబాబు ఎన్నోసార్లు చెప్పారు.కానీ అంతకుముందే కాంగ్రెస్ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఈ బియ్యం పథకాన్ని ప్రారంభించారు. హైదరాబాదులో ఐటీ పార్క్‌కు నాటి ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు శంషాబాద్ ఎయిర్పోర్ట్ వంటివి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో జరిగాయి. కానీ ఇవన్నీ చంద్రబాబు తన ఖాతాలో వేసుకున్నారు. తాజాగా ప్రపంచంలో జనాభా తగ్గిపోతోంది అంటూ టెస్లా వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ చేసిన ప్రకటనను సైతం చంద్రబాబు ఎత్తుకొచ్చారు.ప్రపంచ జనాభా తగ్గుతోందంటూ ప్రముఖ బిలియనీర్ ఎలాన్ మస్క్ ఆందోళన చెందుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జనాభా అంటే భారం కాదు.. జనమే ఆస్తి అంటూ కొత్త రాగం అందుకున్నారు. వెలగపూడి సచివాలయం వద్ద శుక్రవారం జరిగిన ప్రపంచ జనాభా దినోత్సవ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు ప్రసంగించారు. ప్రపంచంలో జనాభా రేటు తగ్గుతోంది. కానీ, జనాభానే దేశాభివృద్ధికి కీలకం. జనాభా అనేది భారం కాకుండా ఆస్తిగా భావించే కాలం వచ్చింది. ప్రపంచంలో ఏ దేశంలో యువత ఎక్కువ ఉంటే.. ఆ దేశం అభివృద్ధి చెందుతుంది. ఎక్కువ మంది పిల్లలు ఉంటే కొన్ని దేశాల్లో బహుమతులు కూడా ఇస్తున్నారు. హంగేరిలో పెద్దకుటుంబాలకు కార్లు ఇస్తున్నారు. చైనాలో ఆర్థిక సాయం అందిస్తున్నారు.సమైక్య రాష్ట్రంలో జనాభా నియంత్రణ కోసం పని చేశాం. ఇద్దరు పిల్లలు ఉంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అనర్హులని నేనే చట్టం తీసుకొచ్చా. (కేంద్రం ఇచ్చిన జనాభా నియంత్రణ పిలుపులో భాగంగా 1994 మే నెలలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఈ చట్టాన్ని ఆమోదించింది.. ఆ సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం.. కోట్ల విజయభాస్కర్‌రెడ్డి సీఎంగా ఉన్నారు).ఇప్పుడు ఆ పరిస్థితి మార్చుకోవాల్సిన సమయం వచ్చింది. జనాభా భారం కాదు.. జనమే ఆస్తి. భారతదేశంలో ఎక్కువ జనాభా ఉండటం మనకు పెద్ద వనరు. జనాభా నియంత్రణ కాదు.. నిర్వహణ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. నారా చంద్రబాబు నాయుడికు ఒక్కడే తనయుడు నారా లోకేష్. నారా లోకేష్‌కు ఒక్కడే కొడుకు.. దేవాన్ష్!!. మరి జనాభా పెంచండి..అని బోడి సలహాలు ఇచ్చే చంద్రబాబు తన కొడుకు లోకేష్ కు ఎందుకు ఎక్కువమంది పిల్లల్ని కనమని చెప్పలేదు. ఒకే ఒక్కడిని ఎందుకు కన్నాడు..బాబు రూల్స్ పెడతారు.. పాటించరు.. ఆయన నీతులు వల్లిస్తారు.. పాటించరు.-సిమ్మాదిరప్పన్న -
‘మహిళలు మీద చెయ్యి వేస్తే తాటా తీస్తానన్న పవన్ ఏమయ్యారు?
విశాఖ: కాకినాడ జీజీహెచ్ రంగరాయ మెడికల్ కాలేజీలో చోటు చేసుకున్న అత్యంత అమానుష ఘటనపై వైఎస్సార్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వరుదు కళ్యాణి ధ్వజమెత్తారు. ఇది ఏపీలో జరిగిన కీచక పర్వమని మండిపడ్డారు. ల్యాబ్ అసిస్టెంట్ కల్యాణ్ చక్రవర్తి.. మహిళల శరీర ఫోటోలు తీసి పంపడం అత్యంత దారుణమన్నారు. దీన్ని అడ్డం పెట్టకని నెలరోజులక పైగావారిని వేధింపులకు గురి చేయడమే కాకుండా బెదిరింపులకు సైత పాల్పడ్డారని మండిపడ్డారు. ఈ ఘటనపై శుక్రవారం(జూలై 11) ప్రెస్మీట్లో మాట్లాడిన వరుదు కళ్యాణి.. ‘ ఈ ఘటనను సాక్షి వెలుగులోకి తేవకపోతే కనుమరుగు అయ్యేది. మహిళలు మీద చెయ్యి వేస్తే తాటా తీస్తానన్న పవన్ కళ్యాణ్ ఏమయ్యారు?, 50 మంది మహిళలను నెల రోజుల నుంచి వేధిస్తే ఏమి చర్యలు తీసుకున్నారు. రాష్ట్రంలో మహిళల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది. 50 మంది మహిళలను వేధించిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలి. టీడీపీ నేతల మద్దతుతో మహిళలు, చిన్నారులపై హత్యలు, హత్యాచారాలు జరుగుతున్నాయి. ఈ దుర్మార్గాలు హోమ్ మంత్రి అనిత కంటికి కనిపించవా?, పోలీస్ వ్యవస్థను కక్ష సాధింపు చర్యలక ప్రభుత్వం వాడుకుంటుంది’ అని విమర్శించారు.నలుగురు సస్పెన్షన్ కాకినాడ జీజీహెచ్ మెడికల్ కాలేజ్ ఘటనలో నలుగుర్ని సస్పెండ్ చేశారు. వైద్య విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడిన ల్యాబ్ అసిస్టెంట్ కళ్యాణ్ చక్రవర్తితో పాటు రాజు, గోపాలకృష్ణ, ప్రసాద్‌లను సస్పెండ్ చేశారు. ఈ నలుగురిపై కేసు నమోద చేసి దర్యాప్త చేపట్టారు పోలీసులు. -
శ్రీకాకుళం జిల్లాలో వైఎస్సార్సీపీ కార్యకర్త దారుణ హత్య
సాక్షి, శ్రీకాకుళం: జిల్లాలో వైఎస్సార్సీపీ కార్యకర్త దారుణ హత్యకు గురయ్యారు. ఎచ్చెర్ల మండలం ఫరీదుపేట గ్రామంలో ఘటన చోటు చేసుకుంది. ఫరీద్ పేట సమీపంలోని నేషనల్ హైవే సర్వీస్ రోడ్డుపై వైఎస్సార్సీపీ కార్యకర్త సత్తారు గోపీని కర్రలు, రాళ్లతో కొట్టి దుండగులు హత్య చేశారు.పట్టపగలు నడిరోడ్డుపై హత్య జరగడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. టీడీపీ గుండాలే హత్య చేశారని వైఎస్సార్సీపీ నేతలు ఆరోపిస్తున్నారు. సత్తారు గోపీ వైఎస్సార్సీపీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. కాగా, ఎన్నికల ఫలితాలు వచ్చిన కొన్ని రోజులకే అదే గ్రామంలో కూన ప్రసాద్ అనే వైఎస్సార్సీపీ కార్యకర్తను దండగులు హత్య చేశారు. ఘటనా స్థలాన్ని జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్‌రెడ్డి పరిశీలించారు. -
మూడు కోతుల్లా మూసుకున్న బాబు, లోకేష్, పవన్
సాక్షి, ప్రకాశం: పేదలకు మంచి చేయాలనే ఆలోచన చంద్రబాబు ఏనాడూ లేదని.. ఈ పాలనలోనూ పేదపిల్లల చదువుకు మోకాలడ్డుపెడుతున్నారని మాజీ మంత్రి ఆర్కే రోజా అన్నారు. ఈవీఎంలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసం చేసిందని, అందుకే మ్యానిఫెస్టో రీకాలింగ్ పేరిట అని చంద్రబాబు మోసాన్ని ఎండగడుతున్నాం అని ఆమె అన్నారు.శుక్రవారం రీకాలింగ్ చంద్రబాబూస్ మేనిఫెస్టో కార్యక్రమంలో రోజా మాట్లాడుతూ.. ‘‘నాలుగోసారి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు కళ్లార్పకుండా అబద్దాలు చెపుతున్నారు. విజన్ ఉంది.. విస్తరాకుల కట్ట ఉంది అని చెప్పి.. స్కాంలలో విజనరీగా చెలామణి అవుతున్నారు. పేద పిల్లల చదువుకు చంద్రబాబు మోకాలు అడ్డు పెడుతున్నారు. పేదవాడిని మద్యం మత్తులో ఉంచి జీవితాన్ని నాశనం చేస్తున్నారు. చంద్రబాబు పాలనలో ప్రతీది కల్తీనే. చివరకు బడి పిల్లకు కూడా కల్తీ భోజనం పెడుతున్నారు.ఏపీలో మూడు కోతుల్లా బొమ్మల్లా.. కూటమి నాయకులు ముగ్గురు ఉన్నారు. దృతరాష్ట్ర పాలనతో చంద్రబాబు కళ్లు మూసుకున్నారు. విద్యార్దుల జీవితాలు నాశనం అవుతుంటే లోకేష్ చెవులు మూసుకొన్నారు. పవర్ లేని పవన్ కల్యాణ్ ఈ తండ్రీకొడుకుల అరాచకాలను ప్రశ్నించకుండా నోరు మూసుకుని కూర్చున్నారు. పేదలకు మంచి చేయాలనే ఆలోచన చంద్రబాబుకి లేదు. అదే ఉండి ఉంటే.. 2019కి ముందే ఆయన ప్రజల సంక్షేమం గురించి ఆలోచించి ఉండేవారు. విద్యాశాఖమంత్రి అంటే ఎలా ఉండాలో ఆదిమూలపు సురేష్‌ని చూసి నేర్చుకోవాలి. ఎలా ఉండకూడదో నారా లోకేష్‌ని చూసి తెలుసుకోవాలి. 2019-2024 జగన్ ప్రభుత్వం అమ్మ ఒడి ఇస్తే.. ఇప్పుడు దానిని సిగ్గులేకుండా తమ ఖాతాలో వేసుకున్నారు. చంద్రబాబు జగన్ ఇచ్చిన సంక్షేమ పథకాల పేర్లు మార్చుకొని చంద్రబాబు పాలన చేస్తున్నారు. రాష్ట్రంలో కూటమి ఎమ్మెల్యే లు ఇంటింటికి తిరిగే దమ్ము ఉందా? అని రోజా ప్రశ్నించారు.పోలీసులు ఉన్నది అధికార పార్టీకి ఊడిగం చెయ్యడం కోసం కాదు. శాంతి భద్రతల పరిరక్షణ కోసం, ప్రజల ప్రాణాల కోసం పని చెయ్యాలి. ఆంక్షలు పెడితే భయపడటానికి ఇక్కడ ఉన్నది లోకేష్ కార్యకర్తలు కాదు... జగన్ అనే సింహం కార్యకర్తలు. ఈవీఎంలతో గెలిచి ఎగిరెగిరి పడితే జనం ఎగరేసి కొడతారు జాగ్రత్త’’ అని కూటమి నేతలను ఉద్దేశించి రోజా అన్నారు. -
ఒక్క కూటమి ఎమ్మెల్యే అయినా రైతుల్ని పరామర్శించాడా?
రైతులను ఏమాత్రం పట్టించుకోని కూటమి ప్రభుత్వం.. వాళ్లను పరామర్శించడానికి వెళ్తున్న వైఎస్ జగన్‌ను మాత్రం అడ్డుకునే ప్రయత్నాలు చేస్తోందని వైఎస్సార్సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు పేర్ని నాని మండిపడ్డారు. బంగారుపాళ్యం పర్యటన సందర్భంగా కూటమి ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై శుక్రవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.సాక్షి, గుంటూరు: రైతుల కష్టాలను పట్టించుకోని కూటమి ప్రభుత్వం.. వాళ్లను పరామర్శించడానికి వెళ్తున్న వైఎస్ జగన్‌ను మాత్రం అడ్డుకునే ప్రయత్నాలు చేస్తోందని వైఎస్సార్సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు పేర్ని నాని మండిపడ్డారు. శుక్రవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కూటమి సర్కార్ రైతులను పట్టించుకోవడం లేదు. మామిడి, పొగాకు, మిర్చి రైతులకు గిట్టుబాటు ధర లేదు. రైతులు నిలదీస్తున్నా ఈ ప్రభుత్వానికి కనిపించడం లేదా?. దళారులు, మిల్లర్లు రైతులను దోచుకుంటుంటే మంత్రి ఏం చేస్తున్నారు?. మిర్చి రైతుల కోసం కేంద్రంతో ఒక్కసారైన మాట్లాడారా?. ఒక్క ఎమ్మెల్యే అయినా రైతుల్ని పరామర్శించారా?. జగన్ వెళ్తుటే మాత్రం అడ్డుకుంటున్నారు.. .. వైస్ జగన్ పరామర్శకు వెళ్తే అడ్డంకులు సృష్టిస్తారా?. పొగాకు రైతులతో మాట్లాడడానికి వెళ్తే రాళ్లతో దాడి చేయిస్తారా?. బంగారుపాళ్యం మార్కెట్‌కు 100 మీటర్ల దూరంలో హెలీప్యాడ్‌కు పర్మిషన్ ఇచ్చారా?. ఎల్లో మీడియాలో వైఎస్ జగన్‌పై విషం చిమ్మడమే పనిగా పెట్టుకున్నారు. కొంతమందికి కూలీ ఇచ్చి జగన్‌ను తిట్టిస్తున్నారు.... మామిడి కొనుగోలు విషయంలో వ్యవసాయ శాఖ మంత్రి, అధికారులు తలో మాట చెబుతున్నారు. ఏది నిజం? అసలు మామిడి కొనుగోళ్లకు సంబంధించిన రూ. 260 కోట్లకు జీవో వచ్చిందా?. రైతులను చంద్రబాబు ప్రభుత్వం దగా చేసింది అని పేర్ని నాని కూటమి సర్కార్‌పై మండిపడ్డారు. -
ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి వేధింపు.. టీడీపీ నేత ఆత్మహత్యాయత్నం
సాక్షి,నెల్లూరు: చంద్రబాబు ప్రభుత్వంలో టీడీపీ ఎమ్మెల్యేల వేధింపులు తాళ లేక ఆ పార్టీ నేతలు ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నిస్తున్నారు. తాజాగా, టీడీపీ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి వేధింపుల్ని భరించలేక జిల్లా మైనార్టీ ప్రధాన కార్యదర్శి ఇమామ్ భాషా ఆత్మహత్యాయత్నం చేసుకోవడం కలకలం రేపింది. కోవూరు నియోజకవర్గంలోనీ విడవలూరు మండలం ముదువర్తి గ్రామ పార్టీ కార్యాలయంలో ఇమామ్ భాషా మీడియాతో మాట్లాడారు. ప్రశాంతి రెడ్డి ఘోరంగా అవమానించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె చేసిన అవమానాన్ని తాను తట్టుకోలేకపోతున్నానంటూ వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు. అప్రమత్తమైన కార్యకర్తలు ఆయనను అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. -
బండారు శ్రావణికి మళ్లీ భంగపాటు!
శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణికి మరోసారి భంగపాటు ఎదురైంది. తన వర్గీయులకు మండల కన్వీనర్ల పదవులు ఇప్పించేందుకు ఆమె ప్రయత్నించగా.. సీనియర్లు పలువురు అడ్డుపడ్డారు. దీంతో అక్కడి టీడీపీ వర్గపోరు మళ్లీ తెర మీదకు వచ్చింది.సాక్షి, అనంతపురం: శింగనమల నియోజకవర్గంలో టూమెన్ కమిటీ అక్కడి ఎమ్మెల్యే బండారు శ్రావణికి కొరకరాని కొయ్యగా మారింది. తన వర్గీయుల కోసం ఆమె చేస్తున్న ప్రయత్నాలకు వరుసగా చెక్ పెడుతూ వస్తోంది. తాజాగా.. మండల కన్వీనర్ల ఎంపికలో ఈ వర్గపోరు మరోసారి బయటపడింది. తన వర్గం వాళ్లకు పదవులు ఇప్పించాలని శ్రావణి ప్రయత్నించగా.. సీనియర్ల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలో తమ వర్గీయులకే పదవులు ఇవ్వాలంటూ ఇటు శ్రావణి వర్గం, అటు మరో వర్గం గొడవకు దిగింది. టీడీపీ నేతల బాహా బాహీతో పంచాయితీ రోడ్డుకెక్కింది. ఎన్నికలకు ముందు నారా లోకేష్ యువ గళం పాదయాత్ర సమయం నుంచే టూమెన్ కమిటీకి, బండారు శ్రావణికి వైరం మొదలైంది. అటుపై ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయిన శ్రావణి.. నియోజకవర్గ వ్యవహారాల్లో తన వర్గీయులకు ప్రాధాన్యం ఇస్తూ వస్తున్నారు. అయితే.. మంత్రి నారా లోకేష్ అండ చూసుకుని ఆమె ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోందని, ఎలాగైనా ఆమె ఆధిత్యానికి పుల్‌స్టాప్ పెట్టాలని సీనియర్లు భావిస్తున్నారు. ఈ వ్యవహారాన్ని పార్టీ అధినేత చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నాల్లో ఉన్నట్లు సమాచారం. -
TTD: అన్యమతస్తులను కొనసాగిస్తూనే ఉంటారా?
తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్యమత ఉద్యోగుల వ్యవహారంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ భగ్గుమన్నారు. అసలు అలాంటి వాళ్లు విధుల్లో ఎందుకని.. వాళ్లను ఇంకా ఎందుకు కొనసాగిస్తున్నారని టీటీడీని నిలదీశారాయన. సాక్షి, తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానంపై కరీంనగర్(తెలంగాణ) బీజేపీ ఎంపీ, కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ భగ్గుమన్నారు. శుక్రవారం ఉదయం శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘టీటీడీలో అన్యమతస్తులకు ఉద్యోగాలు ఇవ్వడం ఏంటి?. అలాంటి వాళ్లను కొనసాగిస్తుండడం ఏంటి?. చర్చి, మసీదుల్లో హిందువులకు ఎవరైనా ఉద్యోగాలు ఇస్తున్నారా?.. .. అన్యమతస్తులైన ఉద్యోగుల వల్ల హిందూ ఆచార వ్యవహారాల్లో చాలా ఇబ్బందులు వస్తున్నాయి. స్వామివారిపై నమ్మకం లేని వారికి జీతభత్యాలు ఇవ్వడం ఎంతవరకు సమంజసం?. అలాంటి వాళ్లు ఉన్నారని బయటకు వస్తేనే సస్పెండ్ చేస్తారా?. టీటీడీ విషయంలో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయకండి. టీటీడీలో ఇతర మతస్థులకు ఉద్యోగాలు ఇవ్వకూడదు… ఉన్న ఉద్యోగులను వెంటనే తొలగించాలి’’ అని బండి సంజయ్ టీటీడీని డిమాండ్ చేశారు. అదే సమయంలో.. తెలుగు రాష్ట్రాల్లో దూపదీప నైవేద్య నోచుకోని ఆలయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత టీటీడీపైనే ఉందని స్పష్టం చేశారాయన. అనేక చారిత్రక పురాతన దేవాలయాల అభివృద్ధికి టీటీడీ తోడ్పాటు అందించాలి. కరీంనగర్లో శ్రీవారి ఆలయ నిర్మాణం కోసం భూమిపూజ నిర్వహించారు. ఈ నిర్మాణంతో పాటు కొండగట్టు, వేములవాడ, ఇల్లందకుంట రామాలయం అభివృద్ధికి టీటీడీ సహకరించాలని కోరుతున్నా అని బండి సంజయ్ అన్నారు. -
జగన్ చరిష్మాను మరింత పెంచుతున్న కూటమి సర్కారు!
మాజీ ముఖ్యమంత్రి, వైయస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి బంగారుపాళ్యం టూర్ అధికార తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి నేతల వెన్నులో వణుకు పుట్టించినట్లు అనిపిస్తోంది. ఈ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రులపై ఆగ్రహం వ్యక్తం చేశారన్న వార్తలు చూసిన తర్వాత.. కచ్చితంగా జగన్ అంటే వీరు ఎంతగా భయపడుతున్నారో అర్థమవుతుంది. నాలుగేళ్ల తర్వాత జరిగే ఎన్నికల గురించి ఇప్పటి నుంచే ఆందోళన చెందుతున్నట్లుంది. బంగారుపాళ్యంలో మామిడి రైతుల సమస్య ఏమిటి? కూటమి ప్రభుత్వం శ్రద్ద దేనిమీద ఉంది? ఎంతసేపు జగన్ మామిడి మార్కెట్ యార్డ్‌కు వెళుతున్నారే! ఈ సమస్య ప్రజలలోకి బాగా వెళ్లిపోతుందే! అన్న గొడవ తప్ప, రైతులను ఆదుకోవడం ద్వారా వారికి మేలు చేయాలన్న ఉద్దేశం ఎందుకు కనిపించలేదు!. పైగా జగన్ టూర్‌ను ఎలా విఫలం చేయాలన్న ఆలోచనతో చంద్రబాబు ప్రభుత్వం మరోసారి సెల్ఫ్ గోల్ వేసుకుంది. జగన్ మామిడి రైతుల పరామర్శకు వెళ్ళడం వల్ల ప్రభుత్వం కొంతైనా కదిలి వారికి రూ.260 కోట్లు ఇస్తామని ప్రకటించక తప్పలేదు. ఇది జగన్ వల్లే అయిందని రైతులు అనుకునే పరిస్థితిని కూటమి నేతలే స్వయంగా సృష్టించుకున్నారు. తోతాపురి మామిడి కొనుగోళ్లు సరిగా లేక, ధరలు దారుణంగా పడిపోయి రెండు నెలలుగా రైతులు నానా బాధలు పడుతున్నారు. మామిడి పండ్లతో రైతులు రోజుల కొద్దీ ఫ్యాక్టరీల వద్ద పడిగాపులు కాస్తున్న విషయం చిత్తూరు జిల్లా కూటమి నేతలు ఎవరూ ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లలేదా!. ఇంటిలెజెన్స్ వర్గాలు ప్రభుత్వానికి సమాచారం ఇవ్వలేదా? ఒకవేళ సమాచారమిచ్చినా ప్రభుత్వం పట్టించుకోలేదా?. కిలో మామిడి ధర చివరికి రెండు రూపాయలకు పడిపోయి కూలీ, రవాణా ఖర్చులు సైతం గిట్టుబాటు కాక, పలువురు రైతులు మామిడి పళ్లను రోడ్ల పక్కన పారబోసింది నిజం కాదా?అదేదో జగన్ టూర్లో కావాలని పోసినట్లు మంత్రులు, తెలుగుదేశం మీడియా గగ్గోలు పెడుతోంది. టీడీపీ మీడియా అయితే మరీ నీచంగా దండుపాళెం బ్యాచ్ అని, జగన్నాటకం అంటూ శీర్షికలు పెట్టి రైతులను అవమానిస్తూ, తమ అక్కసు తీర్చుకున్నాయి. జగన్‌కు మద్దతుగా కాని, తమ బాధలు చెప్పుకోవడానికి గాని రైతులు వస్తే ఇలా తప్పుడు కథనాలు రాయడం ఘోరం. టమోటాలు, ఇతర ఉత్పత్తులకు సరిగా ధర లేకపోతే రైతులు పలు సందర్భాల్లో కింద పారబోసి నిరసనలు తెలిపిన ఘటనలు ఎన్ని జరగలేదు? అసలు జగన్ టూర్ ప్రకటన వచ్చినప్పటి నుంచి పోలీసుల ద్వారా ఎన్ని అడ్డంకులు సృష్టించాలని ప్రభుత్వం తలపెట్టింది! ఎన్ని ఆంక్షలు పెట్టింది!.. ఎక్కడైనా ఇంతమందే రావాలని చెబుతారా? ఒకవేళ స్థలాభావం ఉంటే దానిని దృష్టిలో ఉంచుకుని వైసీపీ నేతలతో మాట్లాడి తగు ఏర్పాట్లు చేయవలసి ఉంటుంది. అలా కాకుండా 500 మంది మాత్రమే రావాలని, ఐదుగురితోనే మాట్లాడాలని, రైతులను ఆటోలలో ఎక్కించుకోకూడదని, మోటార్ బైక్‌లకు పెట్రోల్ పోయరాదని.. ఇలాంటి పిచ్చి ఆంక్షలు పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా జగన్ టూర్ పై క్యూరియాసిటీ పెంచారు. జగన్ బంగారుపాళ్యం వచ్చిన రోజున మూడు జిల్లాల ఎస్పీలు, పెద్ద సంఖ్యలో డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు, కానిస్టేబుళ్లు.. సుమారు రెండువేల మందిని నియమించారట. వీరు జనాన్ని రెగ్యులేట్ చేయడానికి కాకుండా, ప్రజలు అటువైపు రాకుండా చేయడం కోసం నానా పాట్లు పడ్డారట. బంగారుపాళ్యం చుట్టూరా పాతిక చెక్ పోస్టులు పెట్టారట. జగన్ ప్రభుత్వంలో చంద్రబాబు టూర్లలో ఇలా ఎప్పుడైనా చేశారా? అనపర్తి వద్ద భద్రతాకారణాల రీత్యా చంద్రబాబును అడ్డుకోకపోతే, మద్దతు దారులను వెంట బెట్టుకుని నడుచుకుంటూ వెళ్లారే? అప్పుడు పోలీసులు ఆయనకు సెక్యూరిటీ ఇచ్చారే తప్ప ఆపలేదే! చంద్రబాబు అప్పట్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్యక్రమాలు నిర్వహించినా పోలీసులు ఇలా అడ్డంకులు సృష్టించలేదు. చివరికి కందుకూరు వద్ద ఇరుకు రోడ్డులో సభ పెట్టిన ఫలితంగా తొక్కిసలాట జరిగి ఎనిమిది మంది మరణించినా చంద్రబాబుపై పోలీసులు కేసు పెట్టలేదు. అదే.. జగన్ సత్తెనపల్లి సమీపంలోని రెంటపాళ్లకు వెళుతున్నప్పుడు ఒక వ్యక్తికి కారు తగిలి గాయపడి మరణిస్తే, డ్రైవరుతోపాటు జగన్, ఇతర ప్రయాణీకులపై కేసులు పెట్టి సరికొత్త ట్రెండ్ సృష్టించిన ఘనత కూటమి సర్కార్ పొందింది. ఎక్కడ సభ పెట్టినా చంద్రబాబు ఈ ఘటనను ప్రస్తావించి జగన్‌కు మానవత్వం లేదని, ప్రమాదం జరిగినా కారు ఆపలేదని అన్యాయంగా ఆరోపణ చేస్తున్నారు. అదే తను పుష్కరాల సమయంలో తొక్కిసలాట జరిగి 29 మంది మరణిస్తే ఏమన్నారో మర్చిపోయారు. ప్రమాదాలు జరగవా! జగన్నాధ రథోత్సవంలో రోడ్డు యాక్సిడెంట్లు జరగడం లేదా? అంటూ మాట్లాడిన విషయం మాత్రం మానవత్వంతో కూడినదని జనం అనుకోవాలా? ఇలా ప్రతిదానిలో డబుల్ టాక్ చేయడం వల్ల అంత సీనియర్ నేత అయిన చంద్రబాబుకు ఏమి విలువ పెరుగుతుందో తెలియదు. బంగారుపాళ్యం వద్ద కొన్ని చోట్ల అవసరం లేకపోయినా పోలీసులు లాఠీలు ఝళిపించడంతో కొందరు గాయపడ్డారు. వైఎస్సార్సీపీ కార్యకర్త ఒకరి తలకు గాయమైంది. అతనిని పరామర్శకు కూడా జగన్ కారు దిగడానికి పోలీసులు అనుమతించలేదు. కర్ణాటకలో కిలో రూ.16లకు కేంద్రం మామిడి పంటను కొనుగోలు చేస్తుంటే, ఏపీలో ఎందుకు చేయడం లేదో కూటమి నేతలు ప్రశ్నించాలి కదా? అలా చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం భరిస్తున్న కిలోకు రూ.నాలుగు సబ్సిడీని కేంద్రం భరించాలని అడిగారట. చంద్రబాబు సొంత జిల్లాలోనే ఈ పరిస్థితి ఉంటే మిగిలిన ప్రాంతాల రైతుల గురించి వేరే చెప్పాలా? జగన్ గుంటూరు మార్కెట్ యార్డుకు వెళ్లి మిర్చి రైతులను పరామర్శిస్తే తప్ప, వారికి సాయం చేయాలని కూటమి సర్కార్ కేంద్రాన్ని కోరడానికి అంతగా చొరవ తీసుకోలేదు. పొదిలి వద్ద పొగాకు రైతుల కష్టాలను తెలుసుకోవడానికి జగన్ వెళ్లుతున్నారు అన్నప్పుడుగాని వారికి సాయం చేయడానికి ముందుకు రాలేదు. అంటే ఏమిటి దీని అర్థం? ప్రతిపక్షంగా ఉన్న పార్టీ నేత యాక్టివ్‌గా ఉంటే అది ప్రజలకు మేలు చేస్తుందనే కదా! ఇదే కదా ప్రజాస్వామ్యం. ఎమ్మెల్యేలు పెద్ద సంఖ్యలో లేకపోయినా, తన వెంట జనం ఉన్నారని జగన్ పదే, పదే రుజువు చేస్తున్న తీరు సహజంగానే చంద్రబాబు బృందానికి కలవరం కలిగిస్తుంది. అందుకే జగన్ వద్దకు జనం రాకుండా అడ్డుకోవాలని ప్రభుత్వం యత్నించింది. కాని ప్రజాస్వామ్యంలో అణచివేత విధానాల వల్ల ఉపయోగం ఉండదని అనుభవ పూర్వకంగా తెలియ చేసినట్లయింది. బంతిని ఎంత వేగంగా నేలకేసి కొడితే, అంతే వేగంగా అది పైకి లేస్తుందన్న సంగతి మరోసారి స్పష్టమైంది. పోలీసులు మెయిన్ రోడ్డుపై ప్రజలను అడ్డుకోవడానికి యత్నిస్తుంటే అనేక మంది కొండలు, గుట్టలు దాటుకుంటూ, అడవుల గుండా కూడా తరలిరావడం కనిపించింది. కొందరు యువకులు మోటార్ సైకిళ్తపై చిన్న, చిన్న డొంకల ద్వారా తరలివచ్చిన తీరుకు సంబంధించిన వీడియోలు అందరిని ఆకర్షించాయి. జగన్ ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా అదే తీరుగా ఉంది. ఇంత జనాభిమానం ఉన్న నేత గత ఎన్నికలలో ఎలా ఓడిపోయారో అర్థం కావడం లేదన్నది పలువురి భావన. అందుకే కూటమి సూపర్ సిక్స్‌తో పాటు ఈవీఎంలు, ఓట్ల మాయాజలం వంటి అనుమానాలు వ్యాప్తిలోకి వచ్చాయి. ఏది ఏమైనా ప్రభుత్వంలో కదలిక తీసుకు రావడానికి జగన్ యాత్రలు ఉపయోగపడుతుండడం హర్షించవలసిందే. ఆయన ప్రభావంతో ఆయా వర్గాల ప్రజలకు ముఖ్యంగా రైతులకు కొంతైనా మేలు జరగడం ఆహ్వానించదగ్గ పరిణామం. వైయస్సార్సీపీ కార్యకర్తలు కూటమి ప్రభుత్వానికి థాంక్స్ చెప్పాలి. జగన్‌కు టూర్లకు ఏదో విధంగా అంతరాయం కల్పించి ఆయనకు జనంలో ఉన్న క్రేజ్ అందరికి తెలిసేలా చేస్తున్నందుకు, ఆ ప్రజాకర్షణను ప్రభుత్వమే రోజురోజుకు మరింతగా పెంచుతున్నందుకు!. :::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
టీడీపీకి బిగ్ షాక్.. కీలక నేతల రాజీనామా
ఆళ్లగడ్డ: నంద్యాల జిల్లా శిరివెళ్ల మండలం గుంపరమాన్‌దిన్నె ఎంపీటీసీ తులసమ్మ, ఆమె భర్త, వాటర్ యూజర్స్ అసోసియేషన్ చైర్మన్ కుందనూరు మోహన్‌రెడ్డి తమ పదవులతో పాటు టీడీపీకి రాజీనామా చేసి ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియకు ఝలక్ ఇచ్చారు. తులసమ్మ శిరివెళ్ల ఎంపీడీఓ కార్యాలయం చేరుకుని ఎంపీడీఓ శివమల్లేశప్పకు రాజీనామా పత్రం అందజేశారు. ఆమె భర్త మోహన్‌రెడ్డి వాటర్ యూజర్స్ అసోసియేషన్ పదవికి రాజీనామా చేసేందుకు కేసీ కెనాల్ డీఈని సంప్రదించగా రాజీనామా పత్రం కలెక్టర్‌కు ఇవ్వాలని సూచించడంతో కలెక్టర్‌ను కలిసేందుకు వెళ్లారు.ఈ సందర్భంగా వారిద్దరూ మాట్లాడుతూ.. భూమా అఖిలప్రియను వెన్నంటి ఉంటూ ఆమె ఏ పార్టీలోకి మారితే.. అనుచరులతో కలిసి తాము కూడా వారి వెంట నడుస్తూ వచ్చామన్నారు. అయినా కార్యకర్తలకు సరైన న్యాయం, తగిన గుర్తింపు ఇవ్వడం లేదన్నారు. ఇలాంటి పార్టీలో ఉండటం ఇష్టంలేక పదవులతో పాటు పార్టీకి రాజీనామా చేశామన్నారు. ‘బి’ ట్యాక్స్ బాదుడు భరించలేకే.. అఖిలప్రియకు మోహన్‌రెడ్డి రూ.5 లక్షలు ‘బి’ ట్యాక్స్ చెల్లిస్తే తప్ప గుంప్రమాన్ దిన్నె వాటర్ యూజర్స్ అసోసియేషన్ చైర్మన్ పదవి దక్కలేదని టీడీపీ నేతలు చెబుతున్నారు. ఇటీవల అంగన్వాడీ పోస్ట్ ఖాళీ అవడంతో గ్రామానికి చెందిన ఒకరికి ఆ పోస్ట్ ఇవ్వాలని మోహన్‌రెడ్డి సిఫారసు చేయగా.. ఊరికే ఇచ్చే ప్రసక్తే లేదని, రూ.8 లక్షలు ‘బి’ ట్యాక్స్ కడితేనే ఇప్పిస్తామని చెప్పినట్టు టీడీపీలో చర్చ సాగుతోంది. అంత డబ్బు ఇవ్వలేరని చెప్పడంతో గ్రామంలో మరో వ్యక్తితో బేరం ఆడుతున్నట్టు తెలుసుకున్న మోహన్‌రెడ్డి రూ.8 లక్షలు కప్పం కట్టి అంగన్వాడీ పోస్ట్ ఇప్పించినట్టు సమాచారం. గుంప్రమాన్‌దిన్నె శివారు రాజనగరానికి సీసీ రోడ్లు వేసేందుకు మంజూరైన రూ.10 లక్షల నిధులను మోహన్‌రెడ్డికి తెలియకుండా గ్రామానికి చెందిన మరో వ్యక్తికి కమీషన్ కింద అమ్ముకున్నట్టు తెలుస్తోంది. మోహన్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కేసీ కెనాల్ అభివృద్ధికి మంజూరైన పనులను సైతం ‘బి’ ట్యాక్స్ పేరుతో ఎవరో కొత్త వ్యక్తులకు అమ్ముకోవడంపైనా అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం.ఈ నేపథ్యంలో భార్యాభర్తలిద్దరూ పదవులకు, టీడీపీకి రాజీనామా చేసినట్టు తెలుస్తోంది. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలకు చెందిన మండల, గ్రామస్థాయి నాయకులు వారి పరిధిలో మంజూరయ్యే అభివృద్ధి పనులు చేపట్టడం పరిపాటి. టీడీపీ అధికారంలోకి వచ్చాక ఎప్పుడూ లేనివిధంగా పని ఎక్కడైనా, పదవి ఏదైనా ‘బి’ ట్యాక్స్ చెల్లించాల్సి వస్తోంది. కప్పం కడితే చాలు వారు ఏ పారీ్టకి ఎంత సేవ చేశారు అని చూసే పనిలేకుండా పనులు, పదవులు కట్టబెడుతున్నారు. చేసేదిలేక దశాబ్దాలుగా చక్రం తిప్పిన నాయకులు సైతం పదవులు, పనులకు కప్పం కట్టాల్సి వస్తోంది.కప్పం కట్టి పదవులు పొందినా.. వాటి పరిధిలో చేపట్టే అభివృద్ధి పనులను వారికి ఇవ్వకుండా 20 శాతం కమీషన్ తీసుకుంటూ ఇతర ప్రాంతాలకు చెందిన కాంట్రాక్టర్లకు కట్టబెట్టడంతో టీడీపీ నేతలు ఒక్కొక్కరుగా తిరగబడుతున్నారు. కొందరు తాము కమీషన్ ఇచ్చేది లేదని ఎదురు తిరుగుతుండగా.. మరికొందరు తాము చైర్మన్లుగా, అధ్యక్షులుగా ఉన్నా సంబంధిత పనులను తమతో మాట మాత్రమైన చెప్పకుండా ఇతరులకు కట్టబెట్టడం ఏంటని అసహనం వ్యక్తం చేస్తున్నారు. -
‘నీకు పదిహేను వేలు.. నీకు పదిహేను వేలన్నారు.. ఏమైంది’
సాక్షి,కాకినాడ జిల్లా: ‘నీకు పదిహేను వేలు.. నీకు పదిహేను వేలు.. చిట్టి పాపా.. నీకు కూడా పదిహేను వేలు..’ ఏపీలో ఈ మధ్య బాగా ప్రచారంలోకి వచ్చిన డైలాగు. ప్రస్తుత మంత్రి నిమ్మల రామానాయుడు సైకిల్ వేసుకుని ఇంటింటికి వెళ్లి మరీ మహిళలు, పిల్లలందరికీ ఈ వాగ్ధానమిచ్చారు. కూటమి అధికారంలోకి రాగానే డబ్బులు తీసుకోవడమే ఆలస్యం అన్నట్లు మాట్లాడారు. యువతులు, గృహిణులు ఎవరు కనిపించినా.. ‘‘మీకు పద్దెనిమిది వేలు’’ అని, వలంటీర్ల దగ్గరకు వెళ్లి ‘‘మీకు నెలకు పదివేలు ఖాయం’’ అంటూ ఎన్నికల మేనిఫెస్టో కరపత్రం అందించి మరీ చెప్పి వచ్చారు. కానీ ఇప్పుడు కూటమి నేతలకు చెప్పిన మాటలకు చేసే చేతలకు అసలు పొంతన లేదనే విమర్శలు వెల్లువెత్తున్నాయి. తాజాగా, హంసవరం జడ్పీ,మోడల్ స్కూల్స్‌లో మెగా పేరెంట్స్ సమావేశంలో రచ్చ జరిగింది. విద్యార్ధుల తల్లిదండ్రుల తరపున తల్లికి వందనంపై సర్పంచ్ మేరి అధికారులను ప్రశ్నించారు. చాలా మందికి తల్లికి వందనం రూ.8వేలే అందినట్లు చెప్పారు.తల్లికి వందనం కింద రూ.15వేలు ఇస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. దీంతో మేరీ మాట్లాడుతుండగా..అధికారులు మైక్ కట్ చేశారు. కంగుతిన్న టీడీపీ నేతలు ప్రభుత్వం పరువుపోతుందంటూ మేరి చేతిలో మైకును లాక్కున్నారు. -
వైఎస్ జగన్ బంగారుపాళ్యం పర్యటన సక్సెస్.. కడుపు మంటతో ఎల్లో మీడియా..
సాక్షి,తిరుపతి: కూటమి ప్రభుత్వంలో గిట్టుబాటు ధర లేక తీవ్ర నష్టాల్లో కూరుకుపోయిన మామిడి రైతులను వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మార్కెట్ యార్డును సందర్శించారు. అక్కడ మామిడి రైతులను కలిసి, వారి కష్టాలు విన్నారు. రైతన్నకు అండగా నిలిచేందుకు వైఎస్ జగన్ చేపట్టిన బంగారుపాళ్యం మార్కెట్ యార్డు పర్యటన విజయవంతమైందని మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి అన్నారు.మామిడి రైతులకు అండగా నిలిచేందుకు జగన్ చేసిన బంగారుపాళెం పర్యటన విజయవంతం అవ్వడాన్ని జీర్ణించుకోలేని ఎల్లో మీడియా ఆంధ్రజ్యోతి, ఈనాడు, ఏబీఎన్, టీవీ5, ఈటీవీలు విషపు రాతలతో ఆయనపై ఉన్న ద్వేషాన్ని మరోసారి చాటుకున్నామని భూమన కరుణాకర్‌రెడ్డి మండిపడ్డారు.తిరుపతి క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. ‘వైఎస్ జగన్ కోసం వచ్చిన మామిడి రైతులను క్రూరమైన దొంగలు, అసాంఘిక శక్తులు, దండుపాళ్యం బ్యాచ్ అంటూ ఉచ్ఛం, నీచం మరిచి పతాకశీర్షికల్లో దూషించడం ద్వారా తమ కడుపుమంటను ఎల్లో మీడియా బయటపెట్టుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబును మోసేందుకు, నిత్యం భజన చేసేందుకు ఆ ప్రతికలు, మీడియా ఇంతగా దిగజారిపోవాలా అని ప్రశ్నించారు. ఇంకా ఆయనేమన్నారంటే... ..వైఎస్ జగన్ పర్యటనకు చిత్తూరు జిల్లాతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున రైతులు తమ కష్టాలను చెప్పుకోవాలని తరలివచ్చారు. కూటమి ప్రభుత్వం రెండు వేల మంది పోలీసులతో భద్రత పేరుతో అనేక ఆటంకాలు కల్పించింది. లాఠీచార్జీతో అభిమానులు, రైతులపై విరుచుకుపడింది. రహదారులను బారికెట్లతో మూసివేశారు. అయినా కూడా రైతులు గుట్టలు, పుట్టలు, కాలువలు, పొలాలు, తోటలను దాటుకుంటూ జగన్‌ను కలిసేందుకు వచ్చారు. ఇటువంటి అశేష జనవాహినిని చూసి కూటమి ప్రభుత్వానికి చెమటలు పట్టాయి. ..ఈ పర్యటన విజయవంతం అవ్వడంతో తట్టుకోలేక చంద్రబాబు, ఆయనకు బాకా ఊదే ఎల్లో మీడియా ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, ఏబీన్, ఈటీవీలు మామిడి రైతులపై ఇష్టారీతిగా ద్వేషాన్ని, విషాన్ని కుమ్మరించాయి. రైతులను రౌడీలు, దోపిడీదారులు, దుర్మార్గులుగా చిత్రీకరిస్తూ పతాక శీర్షికల్లో రాతలు రాశారు. ఆంధ్రజ్యోతి పత్రిక మొదటి పేజీలో 'బంగారుపాళెంలో దండుపాళ్యం' అంటూ వైఎస్ జగన్ నేతృత్వంలో వైఎస్సార్సీపీ అభిమానులను, రైతులు అరాచకం సృష్టించడానికి ప్రయత్నించారంటూ ఒక విషపు కథనాన్ని అచ్చేశారు. ..అదే పత్రికలో జగన్ పర్యటనకు అసలు జనాలే రాలేదంటూ మరో ఏడుపుగొట్టు కథనాని రాశారు. హెలిప్యాడ్ వద్దకు మూడువేల మంది జనం తోసుకువచ్చారంటూ అదే పచ్చ పత్రిక ఆంధ్రజ్యోతి మరో కథనం రాసింది. ఇలా ఏ రాస్తున్నారో కనీస స్పృహ కూడా లేకుండా ఆంధ్రజ్యోతిలో అడ్డగోలు కథనాలను ప్రచురించారు.గిట్టుబాటు రేటు ఇస్తే రైతులు రోడ్డుపై పంట పారేస్తారా?.. బంగారుపాళెంకు వచ్చింది రైతులే కాదు, ఎవరో రైతులకు చెందిన మామిడి కాయలను రోడ్డుపైన పారేశారంటూ ఇదే ఎల్లో మీడియా తప్పుడు రాతలు రాసింది. వైయస్ జగన్ వస్తున్నారని కాదు, కనీసం కోత ఖర్చులు, రవాణా ఖర్చులు కూడా గిట్టుబాటు కాకపోవడం, ఫ్యాక్టరీల వద్ద రోజుల తరబడి వేచిఉన్నా కొనుగోలు చేసేవారు లేక, మామిడి కాయలు కుళ్ళిపోతుండటంతో కడుపుమండిన రైతులు చిత్తూరు జిల్లా వ్యాప్తంగా మామిడి రైతులు మామిడి కాయలను రోడ్డుపై పారేసి వెళ్ళిపోయిన ఘటనలు అనేక ఉన్నాయి. రైతులను ఆదుకోవడంతో, గిట్టుబాటు ధర కల్పించడంలో విఫలం అవ్వడం వల్లే రైతులు తమ పంటను రోడ్డుపై పారేసి వెళ్ళిపోయారు. దీనిని ఈనాడు పత్రిక తనకి నచ్చినట్లుగా వక్రీకరణ కథనాలు రాశారు. అలాగే రైతులు కానీ కొందరితో జగన్మోహన్రెడ్డి ఎందుకు వచ్చారో మాకు అర్థం కాలేదంటూ కూడా మరో విషపు కథనాన్ని రాశారు.ఎల్లో మీడియాలో దుర్మార్గమైన థంబ్‌నెయిల్స్.. వైఎస్ జగన్‌ను ఎల్లో మీడియా ఎంత దుర్మార్గంగా చిత్రీకరించే ప్రయత్నం చేసినా ఆయనకు ప్రజల్లో ఉన్న ఆదరణను అణువంతైనా తగ్గించలేరు. ఇక టీవీ5, ఏబీఎన్ చానెల్స్‌లో అయితే 'పోలీసులా...నరికేయండ్రా', 'డీఎస్సీని నరికేయండ్రా...' జగన్ పబ్లిక్‌గా దొరికాడు అంటూ థంబ్‌నెయిల్స్ పెట్టి మరీ దుర్మార్గమైన వీడియో కథనాలను ప్రసారం చేశారు. ..ఒక ముఖ్యమంత్రి స్థాయిలో పనిచేసిన నాయకుడు ఎక్కడైనా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారా? ఇలా కార్యకర్తలను రెచ్చగొడుతూ ఆదేశాలు ఇస్తారా? 'పోలీసులపై రప్పా...రప్పా.. అంటూ రెచ్చిపోయిన జగన్', 'పరామర్శా... పొలిటికల్ ఈవెంటా?' 'పోలీసులను నరికేస్తారా...సర్కార్ ఏం చేస్తోంది' ఇలాంటి థంబ్ నెయిల్స్‌తో ఎల్లో మీడియా తన కడుపుమంటను, జగన్‌పై ఉన్న ధ్వేషాన్ని చాటుకునేందుకు సిగ్గూ,శరం లేకుండా దిగజారుడు కథనాలను ప్రచురించింది. ..గతంలో కశ్యప, భృగు, అత్రి, బృహస్పతి వంటి రుషులు లోకకళ్యాణం కోసం ప్రజలకు, పాలకులకు మంచిని బోధించేవారు. కానీ నేడు ఎల్లో మీడియా ఈ రుషులుగా భావించుకుని చంద్రబాబుకు తప్పుడు సలహాలు, విషపు కథనాలను ప్రచారం చేస్తూ అశాంతిని ఎలా రగిలించవచ్చో బోధిస్తున్నాయి. అలాగే ఈ ఎల్లో మీడియాకు టీడీపీ, జనసేన వారంతా సత్పురుషులు, వేదపండితులుగా కనిపిస్తున్నారు. వీరి నుంచి మాత్రమే ప్రజలు ఆశీస్సులను పొందాలని ఈ ఎల్లో మీడియా రుషులు చెబుతున్నారు. మిగిలిన వారంతా వారికి రాక్షసులతో సమానం.కూటమి ప్రభుత్వ సూచనల మేరకే పోలీస్ కేసులు..కూటమి ప్రభుత్వ నిర్భందాలు బద్దలు కొడుతూ రైతులు వైఎస్ జగన్ రాకను స్వాగతించారు. ఈ రైతులను మేం తీసుకురాలేదు, జన సమీకరణ అసలే చేయలేదు. పోలీసులు చెప్పిన రూట్ మ్యాప్ ప్రకారమే పర్యటన సాగినా కూడా మా పార్టీ నేతలపై తప్పుడు కేసులు పెట్టారు. రైతులు తమ మామిడి పంటను రోడ్డుపైన పారేస్తే, దానికి కూడా వైఎస్ జగన్ కారణమని పార్టీ నేతలపై కేసులు బనాయిస్తున్నారు. ..వైఎస్ జగన్‌పై కక్షసాధించాలనే తలంపుతోనే ఇలా చేస్తున్నారు. చివరికి వైఎస్ జగన్‌ను కలిసేందుకు వస్తే రౌడీషీట్లు కూడా తెరుస్తామని కూడా బెదిరించారు. మామిడి రైతులను కలుసుకునేందుకు వైయస్ జగన్ వస్తున్నారని తెలియగానే చంద్రబాబు హుటాహుటిన పల్ప్ ఫ్యాక్టరీ యజమానులుతో సమావేశం నిర్వహించారు. కేజీ రూ.6 కి కొనుగోలు చేయాల్సిందేనని ఒత్తిడి చేశారు. ప్రభుత్వం నాలుగు రూపాయలు ఇస్తుందని ప్రకటించింది. ..అప్పటి వరకు బయట ఉన్న వందల లారీలకు స్పీడ్‌గా టోకెన్లు జారీ చేసింది. ఇవ్వన్నీ వైఎస్ జగన్ వస్తున్నారని తెలిసిన తరువాత చేసినవే. గత ఏడాది వైఎస్ జగన్ హయాంలో మామిడికి మద్దతుధర కేజీకి రూ.29 రూపాయలు. నేడు చంద్రబాబు ప్రభుత్వంలో వస్తున్న ధర రూ.2 మాత్రమే. పొరుగురాష్ట్రం కర్ణాటకలో రెండున్నల లక్షల టన్నుల మామిడిని కేజీ రూ.16కి కొనుగోలు చేస్తామని కేంద్రాన్ని ఒప్పించుకోగలిగితే, మన ముఖ్యమంత్రి చంద్రబాబు ఎందుకు అలా చేయలేక పోయారు? గిట్టుబాటు ధర కోసం ప్రశ్నించే పొగాకు, మిర్చి, ధాన్యం రైతులు కూడా ఈ ఎల్లో మీడియా, కూటమి ప్రభుత్వ దృష్టిలో సంఘ విద్రోహులేనా? ఆఖరి అరగంట తరువాత జగన్‌కు భద్రతను లేకుండా చేశారు..వైఎస్ జగన్ పర్యటనకు సంబంధించి ఆఖరి అరగంట వరకు సెక్యూరిటీని టైట్ చేసి, తరువాత భద్రతను ఎందుకు పూర్తిగా వదిలేశారు. అంటే వైఎస్ జగన్‌ను ఏమైనా చేయాలనే కుట్ర దీనిలో దాగుందా? ఎక్కడా వైఎస్ జగన్‌కు పోలీస్ రక్షణ లేకుండా చేసేశారు. జెడ్‌ప్లస్ కేటగిరిలో ఉన్న నాయకుడి విషయంలో ఇలాగేనా చేసేది? రెండు వేల మంది పోలీసులు భద్రతా ఏర్పాట్లలో ఉంటే, మార్కెట్ యార్డ్‌లో మూడు వందల మంది పోలీసులను మోహరింపచేశారు. కానీ ఆఖరి క్షణంలో ఆయన పక్కన ఎవరూ లేకుండా పోవడం వెనుక కుట్ర ఉందనే అనుమానం కలుగుతోంది. -
సారీ.. ఈసారి క్రెడిట్ లోకేష్ బాబుకే!
కంప్యూటర్ కనిపెట్టింది ఎవరు?.. సెల్‌ఫోన్ కనిపెట్టింది ఎవరు?.. చార్లెస్ బబ్బేజ్, డాక్టర్ మార్టిన్ కూపర్లు. కానీ, తెలుగు రాష్ట్రాల ప్రజలను అడిగితే టక్కున చెప్పే పేరు.. నారా చంద్రబాబు నాయుడు. హా.. షాకయ్యారా!. సెటైరిక్‌గాలే లేండి. ప్రపంచంలో ఏమూల.. ఏం జరిగినా.. ఎవరు ఏం కనిపెట్టినా.. టెకనలాజియాకు ముడిపెట్టి ఆ క్రెడిట్ అంతా కొట్టేయాలని ఉవ్విళ్లూరుతుంటారు చంద్రబాబు. ఈసారి అలా క్రెడిట్‌ను తన కుమారుడు నారా లోకేష్‌కు కట్టబెట్టారు. తల్లికి వందనంపై పథకంపై సెల్ఫ్ డబ్బా కొట్టుకునే క్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు విచిత్రమైన వ్యాఖ్యలు చేశారు. తల్లికి వందనం అనే పథకం ఆలోచన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మైండ్లోంచి పుట్టిందని, ఆ క్రెడిట్ అంతా లోకేష్ బాబుకే దక్కుతుందని వ్యాఖ్యానించారాయన. పుట్టపర్తి నియోజకవర్గంలో కొత్త చెరువు స్కూల్లో సీఎం చంద్రబాబు చేసిన ఈ వ్యాఖ్యలు.. అక్కుడున్న విద్యార్థులనే కాదు, నెట్టింట విస్తుపోయేలా చేస్తున్నాయి. దేశంలో.. పేద కుటుంబాలకు విద్యా సహయార్థం పథకాన్ని ప్రవేశపెట్టిన తొలి వ్యక్తి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి. నవరత్నాల్లో భాగంగా.. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కొన్ని నెలలకే అమ్మ ఒడి పథకాన్ని ప్రవేశపెట్టారాయన. అయితే.. ఆ పథకాన్ని కూటమి ప్రభుత్వం తల్లికి వందనంగా మార్చేసుకుంది. పోనీ.. పథకం అయినా సక్రమంగా అమలు అవుతుందా? అంటే.. అదీ లేదు. అర్హతల పేరుతో మెలికలు పెట్టి చాలామందిని తొలగించింది. పైగా ఒక అకడమిక్ ఇయర్ సొమ్మును కాగితం మీద లెక్క పెట్టి.. తల్లుల అకౌంట్లలో జమ చేయకుండా ఎగ్గొట్టింది కూడా!. అలాంటిది జగన్ ప్రవేశపెట్టిన పథకాన్ని హైజాక్ చేసి.. తన తనయుడి ఆలోచనగా చంద్రబాబు ప్రమోట్ చేసుకోవడాన్ని కొందరు నెటిజన్లు ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. -
అయ్యవారిని చేయబోతే కోతి అయిందట!.. తేడా కొట్టిన బాబు స్కెచ్!
పెద్ద వీరుడొచ్చాడు.. అలాంటివాడితో పిల్లాడి బొడ్డు కోయిస్తే పెద్దయ్యాక వీడు కూడా వీరుడవుతాడని భావించిన తల్లిదండ్రులు వేలాదిమంది సమక్షంలో బిడ్డకు బొడ్డుకోసే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారట. ఆ మహావీరుడు జనాన్ని చూసి కత్తిని రకరకాలుగా తిప్పి.. విన్యాసాలు చేసి ఇదిగో చూడండి బొడ్డు కోస్తున్నాను అని చెప్పి ఇంకేదో కోసేశాడట.. దీంతో తల్లిదండ్రులు అయ్యో దేవుడా ఇదేందీ ఇలా జరిగిందని లోలోన కుమిలిపోతున్నారట.వాస్తవానికి వైఎస్ జగన్ పర్యటనలను ఆపడానికి.. జనం నుంచి ఆయన్ను దూరం చేయడానికి కూటమి నాయకులు రకరకాల ఎత్తులు వేస్తున్నారు. ఆయన పర్యటనలను నిర్వీర్యం చేయడం.. ప్రజల్లో జగనుకు ఆదరణ తగ్గిందని చెప్పడం కోసం ఎన్నో పథకాలు వేస్తున్నారు. అయినా సరే మొన్నటి గుంటూరు పర్యటన.. అంతకుముందు కడప ఇలా జగన్ ఎక్కడికి వెళ్తే అక్కడ జనం వేలాదిగా తరలివెళ్తున్నారు. దీంతో ఇక లాభం లేదనుకుని మామిడి రైతులకు మద్దతు తెలిపేందుకు వెళ్తున్న వైఎస్ జగన్ మీద ప్రభుత్వం బోలెడు ఆంక్షలు విధించింది.కేవలం 500 మందికి మించకుండా కార్యకర్తలు ఆయన వెంట ఉండాలని రూల్ తెచ్చింది. అంతేకాకుండా ఆ పర్యటనకు రకరకాలుగా కండీషన్లు పెట్టారు.. కండీషన్లు పెడితే జనానికి ఎక్కడో కాలుతుంది.. సరిగ్గా జగన్ పర్యటన విషయంలో కూడా అదే జరిగింది. బంగారుపాళ్యం పర్యటనను భగ్నం చేసేందుకు మూడు నాలుగు జిల్లాల ఎస్పీలు.. 9 మంది అదనపు ఎస్పీలు అంతకు డబుల్ డీఎస్పీలు.. వందలాదిమంది ఎస్సైలు కానిస్టేబుళ్లు కలిసి మొత్తం ఓ రెండు వేల మంది పోలీసులను జగన్ పర్యటనకు మోహరించారు. అదేంది 500 మందికి మించకుండా జనాన్ని రమ్మన్నారు కదా మరి మీరేందుకు రెండు వేల మంది వచ్చారు అని ప్రజలు అడిగే ప్రశ్నలకు పోలీసుల నుంచి ప్రభుత్వం నుంచి కూడా సమాధానం కరువైంది. ఇక పోలీసుల నిర్బంధం పెరిగిన కొద్దీ ప్రజల్లో కసి పెరిగింది. ఎవరో ఎస్సై వచ్చి మమ్మల్ని నియంత్రించడం ఏందీ.. మేము సినిమాకు వెళ్లాలా.. జాతరకు వెళ్లాలా.. జగన్ పర్యటనకు వెళ్లాలా అనేది మా ఇష్టం. మధ్యలో వీళ్ళ జోకుడు ఏమిటన్న ఫీల్ జనంలో మొదలైంది. ఒక్క చినుకుగా ప్రారంభమైన ఈ ఆత్మాభిమానం ఉప్పెనలా మారింది. గ్రామాలు దండుకట్టాయి.. పల్లెలు పరవశించాయి.. ఇంకేముంది మళ్ళీ వింటేజ్ జగన్ ఆవిష్కృతమయ్యారు.ఎక్కడికక్కడ వందలు వేలల్లో ప్రజలు చెట్టూ పుట్టా వాగు వంక దాటుకుని జగన్ వెంట నడిచారు.. మొత్తానికి నిర్బంధం ఎంత ఎక్కువైతే ప్రతిఘటన అంతకు వందింతలు ఉంటుందని ప్రజలు నిరూపించారు. పల్లెల్లో పోలీసుల రుబాబు పెరిగేసరికి అదే మొత్తంలో జగన్ పట్ల అభిమానం ఆదరణ రెట్టింపు అయ్యింది. దీంతో అయ్యవారి బొమ్మ గీయబోతే కోతి బొమ్మ వచ్చిందన్నట్లుగా జగన్ ప్రోగ్రాములు భగ్నం చేయబోగా అది కాస్తా ఎదురుతన్నింది. అన్నిటికి మించి జనాన్ని జగన్ నుంచి విడదీయడం అంత వీజీ కాదని పోలీసులకు ప్రభుత్వానికి అర్థమైంది. మొత్తానికి పోలీసులతోనే జగన్ పర్యటనలు సక్సెస్ అవుతున్నాయి అని ప్రజలు అర్థం చేసుకున్నారు . -సిమ్మాదిరప్పన్న -
చంద్రబాబు.. ఇంక మీ డ్రామాలు ఆపండి: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: రైతుల పక్షాన మేము నిలబడితే ఎల్లో మీడియా దౌర్బాగ్యపు మాటలు, రాతలు ఏంటి? ఈ ఆంక్షలు ఎందుకు? అని ప్రశ్నించారు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్. మామిడి రైతులకు కష్టాలే లేనట్టుగా, వారంతా ఆనందంతో కేరింతలు కొడుతున్నట్టుగా, సంబరాలు చేసుకుంటున్నట్టుగా రాతలు రాయడానికి, మాట్లాడటానికి సిగ్గు ఉండాలి?. చంద్రబాబు.. రైతులకు నిజంగా మీరు మేలు చేస్తే.. మంత్రి అచ్చెన్నాయుడిని ఎందుకు ఢిల్లీకి పంపారు? అని వైఎస్ జగన్ ప్రశ్నించారు.వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ నిన్నటి బంగారుపాళ్యం పర్యటనపై ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఈ సందర్బంగా రైతుల విషయమై.. చంద్రబాబు ప్రభుత్వానికి సూటిగా పలు ప్రశ్నలు సంధించారు. ఇదే సమయంలో పిచ్చి రాతలు రాసిన పచ్చ మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 1.చంద్రబాబు.. మీరు, మీ ఈనాడు, మీ ఆంధ్రజ్యోతి, మీ టీవీ-5లు సహా మీకు కొమ్ముకాస్తున్న ఎల్లోమీడియా మరింతగా దిగజారిపోయారు. నిన్న బంగారుపాళ్యంలో రైతులకు సంఘీభావంగా నా పర్యటనకు, మీరు ఎన్ని ఆంక్షలు పెట్టినా, వందలమందిని నోటీసులతో నిర్బంధించినా, అణచివేతకు దిగినా, చివరకు లాఠీఛార్జి చేసినా, వెరవక వేలాదిగా రైతులు స్వచ్ఛందంగా, తమగోడు చాటుతూ హాజరయ్యారు. ప్రభుత్వ తీరుపట్ల రైతుల్లో ఉన్న ఆగ్రహాన్ని రాష్ట్రం మొత్తం చూసింది. ఇదే సందర్భంలో కొంతమంది రైతులు, తమకు తీవ్ర నష్టం వచ్చినా ఈ ప్రభుత్వం పట్టించుకోకపోవడాన్ని, ఈ దేశం దృష్టికి తీసుకురావాలన్న ఉద్దేశంతో రోడ్లపై మామిడికాయలు వేసి నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు.ఇది నేరమన్నట్టుగా, రైతులను, వారి తరఫున ప్రశ్నిస్తున్న ప్రతిపక్షాన్ని పట్టుకుని రౌడీషీటర్లుగానూ, అసాంఘిక శక్తులుగానూ, దొంగలుగానూ చిత్రీకరిస్తూ వ్యాఖ్యానాలు చేస్తూ, మరోవైపు వక్రీకరిస్తూ తప్పుడు రాతలు మీ ఈనాడులో, మీ ఎల్లోమీడియాలో రాయించడం మీకే చెల్లింది. తప్పుడు వక్రీకరణలతో ఇలా మాట్లాడ్డం వ్యవసాయం పట్ల, రైతు సమస్యల పట్ల మీకు, మీ ప్రభుత్వానికి, మిమ్మల్ని భుజానమోస్తున్న మీ ఎల్లోమీడియాకు ఉన్న తేలికతనానికి, బాధ్యతారాహిత్యానికి నిదర్శనం. మామిడి రైతులకు కష్టాలే లేనట్టుగా, వారంతా ఆనందంతో కేరింతలు కొడుతున్నట్టుగా, సంబరాలు చేసుకుంటున్నట్టుగా మీరు రాస్తున్నారు, మాట్లాడుతున్నారు. ఇంతకన్నా నిస్సిగ్గుతనం ఏమైనా ఉంటుందా? చంద్రబాబుగారు మీరు పాలకుడని చెప్పుకోవడానికి మీకు సిగ్గు ఉండాలి? పత్రికలు, టీవీలు అని చెప్పుకోవడానికి మీ ఎల్లోమీడియాకు సిగ్గు ఉండాలి?2. 2.2లక్షల ఎకరాల్లో 6.5 లక్షల టన్నుల పంట, 76 వేల రైతు కుటుంబాలకు చెందిన సమస్య ఇది. గత 2 నెలలుగా మామిడి తోటల్లోనూ, ర్యాంపులవద్దా, ఫ్యాక్టరీల ముందు, పండిన పంటను కొనేవాడులేక రైతులు పారబోస్తున్నారు. ఇలాంటి ఘటనలకు మనమంతా సాక్షులమే. మరి వీళ్లంతా మీ కంటికి రౌడీలు, దొంగలు, అసాంఘిక శక్తులు మాదిరిగానే కనిపిస్తున్నారా? కష్టాల్లో ఉన్న రైతులకు చేదోడుగా మీరు ఉండకపోగా, ఒక బాధ్యత గల ప్రతిపక్షంగా మేం రైతుల్లో ధైర్యాన్ని నింపే ప్రయత్నంచేస్తే, ఆ కార్యక్రమంపై మీరు చేస్తున్న వెకిలి వ్యాఖ్యలు, రాస్తున్న వెకిలి రాతలు, వక్రీకరణలను ప్రజలంతా గమనిస్తూనే ఉన్నారు.3. మీ సిద్ధాంతం ప్రకారం చూస్తే ఇకపై రాష్ట్రంలో తమకు అన్యాయం జరిగిందని రోడ్డెక్కే ప్రతి రైతూ, ప్రతి యువకుడూ, ప్రతి నిరుద్యోగి, ప్రతి మహిళా, ప్రతి ఉద్యోగీ, వారికి అండగా నిలబడేవాళ్లంతా మీదృష్టిలో రౌడీలు, అసాంఘిక శక్తులు, దొంగలు... అంతేకదా చంద్రబాబుగారూ..! అంతేకాదు, అసలు వీరికి ఏ ఒక్కసమస్యాలేదని, అన్ని హామీలూ మీరు తీర్చేశారని, సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ అందుకొని ఆనందంతో వీరంతా కేరింతలు కొడుతున్నారనే కదా మీ వక్రభాష్యం. తమకు ధరలేదని ఆందోళన చేసిన మిర్చి రైతులు, ధాన్యం రైతులు, కోకో రైతులు, పొగాకు రైతులు.. వీళ్లందరూ బాగున్నారని, మంచి రేట్లు వచ్చినా, వీళ్లందరూ అసాంఘిక శక్తులు కాబట్టి వీరు రోడ్లు ఎక్కారనేగా మీ ఉద్దేశం. ఇదేం పద్ధతి, ఇదేం విధానం చంద్రబాబుగారూ..?4. మామిడి రైతులు కష్టాల్లో లేకపోతే, రైతులు పంటను తెగనమ్ముకోకపోతే, మీరు ఎంతమేర అమలు చేశారన్న విషయం పక్కనపెడితే, కిలోకు రూ.4లు ప్రభుత్వం నుంచి ఇస్తామన్న ప్రకటన ఎందుకు చేశారు? ఫ్యాక్టరీలు కిలో రూ.8ల చొప్పున కొనుగోలు చేయాలని దొంగ ఆదేశాలైనా ఎందుకు జారీచేశారు? కర్ణాటకలో కిలో రూ.16ల చొప్పున కనీస ధరకు కొనుగోలుచేస్తామని కేంద్ర ప్రభుత్వం, మీ ఎన్డీయేలోనే ఉన్న జేడీఎస్ పార్టీ నాయకుడు కుమారస్వామికి లేఖ ఎందుకు రాసింది? బంగారుపాళ్యంలో నా పర్యటన కార్యక్రమం ఖరారుకాగానే మీ వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడిని ఎందుకు ఢిల్లీకి పంపారు?. దాని అర్థం రైతులు నష్టపోతున్నట్టే కదా? మరి రైతులు నష్టపోయినట్టు ఓవైపు మీరు అంగీకరిస్తూ, ఆ నష్టాన్ని రైతుల పక్షంగా మేం ఎత్తిచూపితే మళ్లీ ఈ దౌర్బాగ్యపు మాటలు, రాతలు ఏంటి? ఈ ఆంక్షలు ఎందుకు?5. వైయస్సార్సీపీ హయాంలో రైతులకు ఏరోజు ఇలాంటి కష్టం రాలేదు. గతేడాది కూడా కిలో మామిడికి రూ.25-29ల ధర వచ్చింది. మరి మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎందుకు ధరలు పడిపోయాయి? ప్రతి ఏటా మే 10-15తేదీల మధ్య తెరవాల్సిన పల్ప్ ఫ్యాక్టరీలను, ఈ ఏడాది ఆ సమయానికి ఎందుకు తెరవలేదు? ఒక నెలరోజులు ఆలస్యంగా ఎందుకు తెరిచారు? అవికూడా కొన్ని మాత్రమే ఎందుకు తెరిచారు? సకాలానికి ఫ్యాక్టరీలు తెరవకపోయినా చంద్రబాబుగారూ మీరు ఎందుకు పట్టించుకోలేదు, ఒకేసారి సరుకు వచ్చేలా చేయడంద్వారా ఉద్దేశపూర్వకంగా దోపిడీకి ఆస్కారం కలిగించినట్టు కాదా? మీ గల్లా ఫ్యాక్టరీకి, మీ శ్రీని ఫుడ్స్‌కు… ఇలా మీవాళ్లకు మేలు చేయాలన్న ఉద్దేశంతోనే ఇదంతా చేయడంలేదంటారా? మీరు ఇస్తానన్న రూ.4లు ఎంతమంది రైతులకు ఇచ్చారు? ఎంతమంది రైతులకు రూ.8ల చొప్పున ఫ్యాక్టరీలు చెల్లించాయి? ఇదికూడా నిరుడు సంవత్సరం వైయస్సార్సీపీ పాలనతో పోలిస్తే ఎక్కడ రూ.29ల రేటు, ఎక్కడ ఈరోజు అమ్ముకుంటున్న రూ.2.5/3లు కేజీకి. దీన్ని నిలదీసే కార్యక్రమాన్ని ప్రతిపక్షనేతగా, రైతుల పక్షాన నిన్న బంగారుపాళ్యంలో నేను చేస్తే, మీ దగ్గర సమాధానాలు లేక రైతులు మీద, మామీద తప్పుడు మాటలు మాట్లాడతారా? తప్పుడు వక్రీకరణ రాతలు రాస్తారా?6. చంద్రబాబుగారూ.. మీరు వచ్చిన తర్వాత వరి, మిరప, పత్తి, జొన్న, కందులు, మినుములు, పెసలు, మొక్కజొన్న, సజ్జ, రాగులు, అరటి, ఉల్లి, చీనీ, కోకో, పొగాకు, చివరకు మామిడి… ఇలా ఏ పంటకూ కనీస మద్దతు ధరలు రావడంలేదన్నది వాస్తవం కాదా? గట్టిగా ప్రశ్నిస్తే, డ్రామాలతో రైతులను, ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. మిర్చిరైతులకు ధరలు రావడంలేదని గగ్గోలు పెడితే, కేంద్రంచేత కొనిపిస్తానంటూ డ్రామా చేశారు. చివరకు ఒక్క కిలో అయినా కొన్నారా? ఒక్క రూపాయి అయినా ఖర్చుపెట్టారా? టొబాకో రైతులు ఆందోళన చేస్తే, ఇంకో డ్రామా చేస్తూ, ప్రకటనలు చేయిస్తున్నారు. చిత్తశుద్ధితో మీరు వ్యవహరించారా?7. మా ప్రభుత్వం ఉన్నప్పుడు ధాన్యం కొనుగోలు కాక ఇతర పంటల కొనుగోలు విషయంలో రూ.3వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి పెట్టి రూ.7,800 కోట్లు ఖర్చు చేశాం. రైతులు నష్టపోతున్నా మీరెందుకు ఆ పనిచేయడం లేదు? ఏ పంటకు ఏ ధర ఉందనే దానిపై ఆర్బీకేల్లో రియల్ టైం మానిటరింగ్ చేసే CM APP ఏమైంది?8. గత ఏడాది మీరు ఇస్తానన్న రైతు భరోసా రూ.20వేలు ఇవ్వలేదు, జూన్ 21 ఇస్తానని చెప్పి, జులై రెండోవారం అవుతున్నా ఇప్పటికీ, ఈ ఏడాదికూడా దాని గురించి ప్రస్తావించడంలేదు. సీజన్ మొదలై వారాలు గడుస్తున్నా పరిస్థితి అగమ్యగోచరమే. మా హయాంలో మే నెల చివరికల్లా రైతులకు పెట్టుబడి సహాయం వారి చేతికి అందేది.9. వరదలు వచ్చినా, కరువులు వచ్చినా సమయానికే సీజన్ ముగిసేలోగా ఇచ్చే ఇన్పుట్ సబ్సిడీని ఇచ్చే మా విధానాన్ని గాలికి వదిలేశారు. ఉచిత పంటలబీమాను పూర్తిగా ఎత్తేశారు, ఆర్బీకేలను, ఇ-క్రాప్ విధానాన్ని, గ్రామంలోనే నాణ్యమైన ఎరువులు, విత్తనాలు, పురుగుల మందులు సప్లై చేసే వ్యవస్థను, విత్తనం నుంచి పంటల కొనుగోలు వరకూ రైతును చేయిపట్టుకుని నడిపించే వ్యవస్థను నిర్వీర్యం చేశారు. టెస్టింగ్ ల్యాబ్స్‌ను నాశనం చేస్తున్నారు. ఇలా ప్రతిదశలోనూ రైతుకు తోడుగా ఉండే ప్రతి కార్యక్రమాన్ని దెబ్బతీశారు. వీటిని ప్రశ్నిస్తే, మీ వైఫల్యాలను ఎత్తిచూపితే మాపైన, ఆందోళన చేస్తున్న రైతులపైనా అవాకులు, చవాకులు మాట్లాడుతున్నారు. ఇప్పటికైనా పద్ధతి మార్చుకోండి చంద్రబాబుగారూ..! రైతులకు తోడుగా నిలబడే కార్యక్రమాలు చేయండి.1.@ncbn గారూ, మీరు, మీ ఈనాడు, మీ ఆంధ్రజ్యోతి, మీ టీవీ-5లు సహా మీకు కొమ్ముకాస్తున్న ఎల్లోమీడియా మరింతగా దిగజారిపోయారు. నిన్న బంగారుపాళ్యంలో రైతులకు సంఘీభావంగా నా పర్యటనకు, మీరు ఎన్ని ఆంక్షలు పెట్టినా, వందలమందిని నోటీసులతో నిర్బంధించినా, అణచివేతకు దిగినా, చివరకు లాఠీఛార్జి చేసినా,… pic.twitter.com/9WFD13951r— YS Jagan Mohan Reddy (@ysjagan) July 10, 2025 -
బాబు.. 2,45,000 కోట్ల బడ్జెట్ ఏమైంది.. అప్పులపై అడిగితే దేశద్రోహులమా?: బుగ్గన
సాక్షి, హైదరాబాద్: చంద్రబాబు.. కేంద్రంలో భాగస్వామిగా ఉండి కూడా రాజధానిని ఎందుకు అభివృద్ధి చేయడం లేదని ప్రశ్నించారు మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. అమరావతిని అభివృద్ధి చేయలేక వైఎస్సార్సీపీపై విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి తెచ్చిన అప్పులు ఎక్కడికి పోతున్నాయని ప్రశ్నల వర్షం కురిపించారు.మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి హైదరాబాద్‌లోని ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ఎందుకు అప్పులు చేస్తున్నారని అడిగతే మేము దేశద్రోహులమా?. మీ అసమర్థతను కప్పి పుచ్చుకోవడానికి మాపై బురద చల్లడం ఎందుకు?. అమరావతిని అభివృద్ధి చేయలేక మాపై విమర్శలు చేస్తున్నారు. మేం అప్పు చేస్తే తప్పు.. మీరు అప్పులు చేస్తే ఒప్పా?. రాష్ట్రానికి తెచ్చిన అప్పులు ఎక్కడికి పోతున్నాయి. రూ.2,45,000 కోట్ల బడ్జెట్ ఎక్కడికి పోయింది?. ఒక్క పెన్షన్లకు తప్ప ఏ సంక్షేమ పథకానికైనా కేటాయింపులు చేస్తున్నారా?. రాష్ట్రంలో పొగాకు, మామిడి, మిర్చి రైతుల పరిస్థితి ఏంటి?. ఉద్యోగులకు పీఆర్సీ ఏర్పాటు చేశారా?. ఉద్యోగులకు ఒకటో తేదీన జీతాలు ఇచ్చే పరిస్థితి ఉందా?. తల్లికి వందనం ఎంతమందికి ఇచ్చారు?. ఉచిత గ్యాస్ సిలిండర్ అడిగితే దేశద్రోహులమా?. ఉచిత బస్సు ప్రయాణం అని హామీ ఇచ్చి ఇప్పుడు షరతులు పెడుతున్నారు. ఉచిత బస్సు ప్రయాణం జిల్లాలకే పరిమితం అంటున్నారు. ఆడబిడ్డ నిధి, అన్నదాత సుఖీభవ ఇచ్చారా?. దీపం ఎంత మందికి వచ్చంది?. 50 ఏళ్లకే పెన్షన్ ఇస్తామన్నారు.. ఇచ్చారా? అని ప్రశ్నించారు. ప్రజల తరఫున పోరాటం చేస్తాం, ప్రశ్నిస్తూనే ఉంటాం’ అని వ్యాఖ్యలు చేశారు. -
బనకచర్ల.. గురు శిష్యుల డ్రామా?
రాజకీయాల్లో కొందరు గాల్లో కత్తులు తిప్పుతూంటారు. అదే యుద్ధమని జనాన్ని నమ్మించే ప్రయత్నమూ జరుగుతూంటుంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి పరిస్థితే ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన బనకచర్ల ప్రాజెక్టుపై ఇరు రాష్ట్రాల్లో హడావుడి జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంతి గత ఏడాది అధికారంలోకి వచ్చింది మొదలు ఈ ప్రాజెక్టు గురించి మాట్లాడుతూనే ఉన్నారు. సుమారు రూ.85 వేల కోట్లతో గోదావరి నీటిని రాయలసీమకు తరలిస్తామని ప్రతిపాదించారు. కేంద్రం కూడా నిధుల రూపంలో సాయం చేయాలని కోరారు. అయితే.. పలు లిఫ్ట్‌లు, రిజర్వాయర్లు, సొరంగాలతో కూడిన బనకచర్ల ప్రాజెక్టు అంత తేలికగా అయ్యేది కాదన్నది అందరికీ తెలుసు. కేంద్ర ప్రభుత్వమేమో సాయం సంగతి దేవుడెరుగు... పంపిన ప్రతిపాదననే తిప్పి పంపింది. జలసంఘం ఆమోదం తరువాత పర్యావరణ అనుమతులు కూడా తీసుకుని మాట్లాడమని సూచించింది. ఇదంతా ఒక పార్శ్వమైతే.. ఇదే ప్రాజెక్టుకు సంబంధించి తెలంగాణలో ఇంకో రకమైన రాజకీయం నడుస్తోంది. కాంగ్రెస్, బీఆర్ఎస్లు ఈ అంవాన్ని పెద్ద వివాదంలా మార్చి వాదోపవాదాలు సాగిస్తున్నాయి. రెండు పార్టీలు ఈ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూండటం గమనార్హం. కానీ... ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంతున్నారు. తెలంగాణ ప్రయోజనాలకు విఘాతం కలిగించే ప్రాజెక్టులను అంగీకరించబోమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలు స్పష్టం చేస్తూనే కేసీఆర్ హయాంలోనే తెలంగాణకు నష్టం జరిగిందని విమర్శిస్తున్నారు. వీరు ఒక ప్రజెంటేషన్ ఇస్తే, దీనికి పోటీగా బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి టి.హరీష్ రావు మరో ప్రజెంటేషన్ ఇచ్చారు. అందులో కాంగ్రెస్ తెలంగాణకు ద్రోహం చేస్తోందని ఆరోపించారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిలు గురు శిష్యులని, అందుకే బనకచర్ల ప్రాజెక్టుకు సహకరిస్తున్నారని హరీష్ అంటున్నారు. చంద్రబాబు, రేవంత్‌లు హైదరాబాద్‌లో భేటీ అయినప్పుడే బనకచర్ల ప్రాజెక్టుకు ఓకే చేశారని హరీష్‌రావు ఆరోపిస్తున్నారు. ఆ తరువాత ఉత్తం కుమార్ రెడ్డి విజయవాడ వెళ్లి చంద్రబాబు వద్ద బజ్జీలు తిని మరీ ఈ ప్రాజెక్టుకు ఓకే చేసి వచ్చారని అన్నారు. అయితే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలోనే తెలంగాణ నీటి వాటాలలో నష్టం జరిగిందని, అప్పటి ఏపీ ముఖ్యమంత్రి జగన్‌తో సమావేశమైనప్పుడు ఇందుకు బీజం పడిందని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు. కేసీఆర్, జగన్‌లు ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు ఒక భేటీ జరిగిన మాట నిజమే. గోదావరి జలాలను ఇచ్చంపల్లి నుంచి జూరాలకు తరలించడానికి కేసీఆర్ ప్రతిపాదించగా, దానిని పరిశీలించడానికి జగన్ ఒప్పుకున్నారు. కానీ ఆ ప్రాజెక్టు వల్ల ఏపీకి ప్రయోజనం ఉండదన్న అభిప్రాయం ఏర్పడడంతో అది ముందుకు సాగలేదు. కేసీఆర్, జగన్‌లు అయినా, చంద్రబాబు, రేవంత్ అయినా సమావేశమైతే ఉభయ రాష్ట్రాల సమస్యల పరిష్కారానికి ప్రయత్నించవచ్చు. ఒకప్పుడు రేవంత్ రెడ్డి టీడీపీ పక్షాన ఎమ్మెల్యేగా, ఎంపీగా కూడా ఎన్నికయ్యారు. తదుపరి చంద్రబాబుకు చెప్పే కాంగ్రెస్‌లో చేరారు. తొలుత వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉండి, పిమ్మట పీసీసీ అధ్యక్షుడై, ఎన్నికలలో గెలవడంతో ముఖ్యమంత్రి అయ్యారు.అప్పట్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి పరోక్షంగా తెలంగాణ టీడీపీ కూడా సహకరించడం బహిరంగ రహస్యమే.చంద్రబాబు నాయుడు బీజేపీతో పొత్తు పెట్టుకున్నా, కాంగ్రెస్‌తో కూడా స్నేహం చేస్తున్నారన్నది రాజకీయ వర్గాలలో ఉన్న మాట. ఈ నేపథ్యంలో చంద్రబాబు, రేవంత్‌లు కలిసి కూర్చుని విభజన సమస్యలను చర్చించి పరిష్కారం కనుక్కుని ఉంటే బాగుండేది. తెలంగాణ నుంచి ఏపీకి సుమారు రూ.ఏడువేల కోట్ల విద్యుత్ బకాయిలు రావల్సి ఉంది. హైదరాబాద్‌లో ఉన్న ఉమ్మడి ఆస్తుల్లో వాటా తెచ్చుకోవడానికి చంద్రబాబు ప్రయత్నించి ఉండాల్సింది. తనను చంద్రబాబు శిష్యుడని చెప్పడాన్ని రేవంత్ అంత ఇష్టపడక పోయినట్లు కనిపిస్తుంటారు. అయినా వారిద్దరి మధ్య సంబంధ, బాంధవ్యాలు బాగానే ఉన్నాయని అంటారు. ఈ నేపథ్యంలో బనకచర్ల ప్రాజెక్టు విషయంలో రేవంత్ ఉదాసీనంగా ఉన్నారని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. గోదావరి జలాలలో 1500 టీఎంసీల నీటిని కేటాయించిన తర్వాత ఏపీ ప్రాజెక్టును చేపట్టాలని తెలంగాణ ప్రభుత్వం వాదనగా ఉంది. అయితే తాము వరద జలాలను మాత్రమే వాడుకోదలిచామని, తెలంగాణ ప్రాజెక్టులకు అడ్డుపడడం లేదని చంద్రబాబు చెబుతున్నారు. నిజానికి తెలంగాణ ప్రాజెక్టులకు ఏపీ ప్రభుత్వం, ఏపీ ప్రాజెక్టులకు తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకిస్తూ ఫిర్యాదులు చేసుకుంటున్నాయి. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు, కాళేశ్వరం ప్రాజెక్టులపై గతంలో ఏపీ కేంద్రానికి ఫిర్యాదు చేస్తే, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై పలు ఆరోపణలు చేస్తూ తెలంగాణ అడ్డుపడింది. ఇప్పుడు బనకచర్ల విషయంలో కూడా తెలంగాణ గట్టిగా అడ్డుపడుతున్నట్లు కనిపిస్తుంది. బీజేపీ కోణంలో చూస్తే వారికి తెలంగాణలో అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్న నేపథ్యంలో కేంద్రం ఏపీకి ఎంతవరకు సహకరిస్తుందన్నది సందేహమే. ఇక్కడ విశేషం ఏమిటంటే బనకచర్ల ప్రాజెక్టు చేపట్టడం వల్ల ఏపీకి వచ్చే లాభం ఏమీ లేదని, తెలుగుదేశానికి మద్దతుదారుగా పేరొందిన మాజీ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుతో సహా మరికొందరు ప్రత్యేకంగా సమావేశం పెట్టి ప్రకటన చేశారు. అంతేకాక 18.5 కిలోమీటర్ల వెలిగొండ ప్రాజెక్టు సొరంగాల తవ్వకాలు రెండున్నర దశాబ్దాలుగా సాగుతూనే ఉన్నాయని, అయినా అవి ఒక కొలిక్కి రాలేదని, అలాంటిది ఇప్పుడు ఏకంగా నల్లమల అడవులలో, కొండల్లో 26.5 కీలోమీటర్ల మేర సొరంగం తవ్వకం ఆరంభిస్తే అది ఎప్పటికి పూర్తి అవుతుందని వారు ప్రశ్నించారు. చంద్రబాబుకు ఒక లక్షణం ఉంది. తాను ఏమైనా ప్రతిపాదిస్తే, ఎవరూ దాన్ని వ్యతిరేకించరాదని భావిస్తారు. భిన్నాభిప్రాయం వ్యక్తం చేస్తే అభివృద్ది వ్యతిరేకులంటూ వారిపై తట్టెడు బురద వేసి ప్రజల మైండ్ ఖరాబు చేస్తుంటారు. ఇందుకు తనకు మద్దతు ఇచ్చే మీడియాను పూర్తిగా వాడుకుంటారు. అందువల్ల ఏపీలో తెలుగుదేశం మినహా ఇతర రాజకీయ పార్టీలేవి ఈ ప్రాజెక్టుపై పెద్దగా స్పందించడం లేదు. ఇదంతా ఏపీలోని కూటమి ప్రభుత్వం, తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం కలిసి ఆడుతున్న డ్రామా అని ఆయా రాజకీయ నేతలు భావిస్తున్నారు. సీపీఐ కార్యదర్శి కె.రామకృష్ణ మాట్లాడుతూ ఈ ప్రాజెక్టు కావాలని ఎవరు అడిగారని ప్రశ్నించారు. వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గురుశిష్యులు చంద్రబాబు, రేవంత్ కలిసి ఈ డ్రామా నడుపుతున్నారని, చంద్రబాబుకు ఈ ప్రాజెక్టు పూర్తిచేసే ఉద్దేశం లేదని అభిప్రాయపడ్డారు. గతంలో వైఎస్సార్సీపీ కూడా ఇదే తరహా ప్రాజెక్టుకు డీపీఆర్ పంపించింది. ప్రభుత్వం మారడంతో బనకచర్ల ప్రాజెక్టు ప్రముఖంగా ప్రస్తావనకు వస్తోంది. బనకచర్ల ప్రాజెక్టు చేపట్టడం అంత తేలిక కాదన్న సంగతి అందరికి తెలుసు. ఎందుకంటే ఏకంగా రూ.85 వేల కోట్ల వ్యయం అవుతుంది. అది అక్కడితో ఆగుతుందన్న నమ్మకం కూడా లేదు. కేంద్రం దీనికి నిధులు కేటాయించితే పెద్ద విశేషమే. తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్రం నిధులు ఇవ్వలేదు. అయినా కేసీఆర్ రుణాలు తెచ్చి ఆ ప్రాజెక్టును నిర్మించారు. కాని అందులో ఒక భాగం దెబ్బతినడం కేసీఆర్ ప్రభుత్వానికి ఇరకాటమైంది. కాళేశ్వరం ప్రాజెక్టు రుణాల వాయిదాలు సరిగా చెల్లించలేక పోతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ అంశాన్ని రాజకీయంగా వాడుకునే యత్నం చేస్తోంది. ఈ నేపథ్యంలో బనకచర్లకు రుణాలు వచ్చే అవకాశం ఎంతన్నది చెప్పలేం. ఏపీ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును చేపట్టినా, తెలంగాణకు వచ్చే నష్టం పెద్దగా ఉండకపోవచ్చు. అయినా రాజకీయ పక్షాలు పరస్పర విమర్శలు సాగిస్తూ సెంటిమెంట్‌ను రెచ్చగొట్టే యత్నం చేస్తున్నాయి. మరో వైపు ఏపీ ప్రభుత్వం తామేదో పెద్ద ప్రాజెక్టును చేపడితే ఆటంకాలు ఎదురవుతున్నాయని చెప్పి జనాన్ని మభ్యపెట్టే యత్నం చేస్తున్నట్లు అనిపిస్తుంది. పోలవరం ప్రాజెక్టు ఎత్తును కేంద్రం తగ్గించిన అంశాన్ని పక్కన బెట్టి డైవర్షన్ రాజకీయాలలో భాగంగా చంద్రబాబు ఈ వ్యూహం అమలు చేస్తున్నట్లు కనిపిస్తుంది. చంద్రబాబు నాయుడుకు ఒకప్పుడు భారీ ప్రాజెక్టులపై అంత విశ్వాసం ఉండేది కాదు. కాని వైఎస్ రాజశేఖరరెడ్డి భారీ ప్రాజెక్టులను చేపట్టడం ద్వారా మంచి పేరు తెచ్చుకున్న విషయాన్ని గుర్తించి, ఇప్పుడు ఆయన కూడా ఆ రాగం ఆలపిస్తున్నారు. అయితే ఆ పాట పాడుతున్నది చిత్తశుద్దితోనా, రాజకీయం కోసమా అన్నదానిపై ఎవరికి కావల్సిన విశ్లేషణ వారు చేసుకోవచ్చు.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
ఈ ప్రభుత్వం భయపడుతోంది: వైఎస్ జగన్
కేవలం 500 మంది మాత్రమే రావాలట! అంటే, కేవలం 500 మంది రైతులు మాత్రమే నష్టపోయారా? సమాధానం చెప్పండి. అసలు ఈ ప్రభుత్వం ఎందుకు భయపడుతోంది? ఎందుకు ఇన్ని ఆంక్షలు విధిస్తోంది? జగన్ వస్తే తప్పేమిటి? నేను రైతులతో మాట్లాడితే, వారి సమస్యలు లేవనెత్తితే తప్పేముంది? రైతులు ఇబ్బందులు పడుతున్నారు కాబట్టే ఇన్ని వేల మంది ఇక్కడికి వచ్చి వాళ్ల ఆవేదన చెబుతున్నారు.ఇవాళ ఇక్కడికి జగన్ వస్తున్నాడని తెలిసి 2 వేల మంది పోలీసులను మోహరించారు. ప్రతి గ్రామంలో ఏ రైతూ ఇక్కడికి రాకూడదని కట్టడి చేయాలని చూశారు. మీరు కనుక ఈ కార్యక్రమంలో పాల్గొంటే రౌడీషీట్లు తెరుస్తామని రైతులను బెదిరించారు. అయినా రైతులు స్వచ్ఛందంగా తరలి వస్తారు కాబట్టి, టూవీలర్స్‌పై ఎవరైనా వస్తే పెట్రోలు పోయొద్దంటూ బంక్‌ల యజమానులను ఆదేశించారు. మరీ ఇంత దుర్మార్గమా?మామిడిని ఫ్యాక్టరీలు కొనుక్కోక, రైతులకు కనీసం రెండున్నర, మూడు రూపాయలు కూడా దక్కని పరిస్థితుల్లో.. ఆ సరుకు వాహనాల్లోనే కుళ్లిపోతోంది. మామిడి రైతులు చివరకు లారీ కిరాయి కూడా ఇవ్వలేక అగచాట్లు పడుతున్నారు. అందుకే ఆ రైతులకు తోడుగా ఉండాలని కోరుతున్నాను. ప్రభుత్వం స్వయంగా వెంటనే మామిడి కొనుగోలు చేసి, రైతులను ఆదుకోకపోతే వారి పక్షాన వైఎస్సార్సీపీ గట్టిగా ఉద్యమిస్తుందని హెచ్చరిస్తున్నాను. -వైఎస్ జగన్సాక్షి ప్రతినిధి, తిరుపతి: ‘రాష్ట్రంలో ఇవాళ రైతులు పండించిన ఏ పంటకూ గిట్టుబాటు ధర లేని పరిస్థితి. వరి తీసుకుంటే దాదాపు రూ.300 నుంచి రూ.400 తక్కువకు అమ్ముకుంటున్నారు. మిరప, పత్తి, జొన్న, కందులు, మినుములు, పెసలు, మొక్కజొన్న, సజ్జ, రాగులు, అరటి, చీనీ, కోకో, పొగాకు, చివరికి మామిడి.. ఏ రైతు పరిస్థితి చూసుకున్నా దారుణం. ఒక్క ఆంధ్ర రాష్ట్రంలో తప్ప, వేరే రాష్ట్రంలో ఎక్కడైనా కిలో మామిడి రూ.2కే దొరుకుతుందా? కిలో మామిడికి కనీసం రెండున్నర రూపాయలు కూడా రావడం లేదని మామిడి రైతులు చెబుతున్నారు. ఇంత దుర్భర స్థితి ఈరోజు మన రాష్ట్రంలో చూస్తున్నాం’ అని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీస గిట్టుబాటు ధర లేక తీవ్ర నష్టాల్లో కూరుకుపోయిన మామిడి రైతులను పరామర్శించేందుకు బుధవారం ఆయన చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మార్కెట్ యార్డును సందర్శించారు. అక్కడ మామిడి రైతులను కలిసి, వారి కష్టాలు విన్నారు. అనంతరం అక్కడే మీడియాతో మాట్లాడారు. ‘ఇవాళ నేను మామిడి రైతుల సమస్యలను ఆరా తీసేందుకు ఇక్కడికి వస్తుంటే కూటమి ప్రభుత్వం భయపడుతోంది. అందుకే ఎక్కడా లేని విధంగా ఆంక్షలు పెట్టింది. నా పర్యటనను అడ్డుకునేందుకు విశ్వ ప్రయత్నం చేసింది. ఎక్కడికక్కడ రైతులను సైతం అడ్డుకుంది. రైతులకు మంచి జరగకూడదని కోరుకుంటోంది. ఎవరూ బయటకు తొంగి చూడకూడదని, రైతులు ఎన్ని అగచాట్లు పడుతున్నా కూడా, వాళ్ల జీవితాలు నాశనమైపోతున్నా కూడా ఎవరూ స్పందించ కూడదని ఉద్దేశంగా పెట్టుకుంది. అసలు జగన్ రైతుల్ని కలిస్తే తప్పేమిటి? రైతుల కోసం మాట్లాడితే తప్పేముంది? పోనీ రైతులు అగచాట్లు పడకుండా ఉండి ఉంటే, వారికి అసలు సమస్యే లేకపోతే ఇక్కడికి ఇంత మంది ఎలా వస్తారు? జగన్ వచ్చాడు కాబట్టి.. జగన్ వాళ్లకు తోడుగా నిలబడుతున్నాడు కాబట్టి.. వాళ్ల సమస్య ఇప్పుడైనా ప్రభుత్వం దృష్టికి కచ్చితంగా పోతుందని భావిస్తున్నాం. ఈ ప్రభుత్వాన్ని కుంభకర్ణుడి నిద్ర నుంచి లేపడం కోసమే ఇక్కడికి ఇన్ని వేల మంది వచ్చి తమ ఆక్రందన వినిపిస్తున్నారు. చిత్తూరు జిల్లాలో కిలో మామిడికి కనీసం రూ.12 (టన్నుకు రూ.12 వేలు) వచ్చేలా చూడాలి. ఈ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. లేదంటే వారి తరఫున వైఎస్సార్సీపీ పోరాడుతుంది’ అని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..మీడియాతో మాట్లాడుతున్న మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇన్నాళ్లూ గాడిదలు కాశారా?⇒ చంద్రబాబు ప్రభుత్వానికి సూటిగా నా ప్రశ్నలు.. ఏటా మామిడి కొనుగోళ్లు మే 10 నుంచి 15వ తేదీ మధ్యలో మొదలు పెడతారు. మరి ఈ ఏడాది ఎందుకు అలా మొదలు పెట్టలేదు?⇒ జూన్ 3వ వారం వరకు కొనుగోళ్లు ఎందుకు మొదలు కాలేదు?⇒ ఎప్పటిలాగే మే రెండో వారంలో మామిడి కొనుగోళ్లు జరిగేలా ఈ ప్రభుత్వం చొరవ చూపక పోవడం వల్ల జూన్ 3వ వారం నాటికి మామిడి పంట మార్కెట్‌ను ముంచెత్తడం నిజం కాదా?⇒ రైతులంతా మామిడి పల్ప్ కంపెనీల వద్ద బారులు తీరడం మీకు కనిపించ లేదా? ఎవరి వల్ల ఈ దుస్థితి ఏర్పడింది?⇒ పల్ప్ ఫ్యాక్టరీలకు ఒకేసారి పంట మొత్తం తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? దీంతో వాహనాల్లోనే మామిడి పంట కుళ్లిపోవడం మీకు కనిపించ లేదా? కేజీ మామిడి రూ. 2తో కొంటుండటం వాస్తవం కాదా? మీ పుణ్యాన ఈ పంటకు ఇక ధర రాదనే బాధతో చెట్లను కొట్టేసుకున్న రైతులను బెదిరిస్తారా?అశేష జనసందోహం నడుమ మార్కెట్ యార్డు లోపలికి వెళుతున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి ⇒ చిత్తూరు జిల్లాలో 52 మామిడి పల్ప్ కంపెనీలు ఉన్నాయి. మే 10–15 తేదీల్లో తెరవాల్సిన ఆ ఫ్యాక్టరీలు జూన్ 3వ వారం వరకు తెరవకపోతే మీరు ఏం గాడిదలు కాశారు?⇒ ఎంత మంది రైతుల నుంచి ఈ ఫ్యాక్టరీలు కిలో మామిడి రూ.8 చొప్పున కొన్నాయి?⇒ మీరు గొప్పగా ప్రచారం చేస్తున్న అదనంగా రూ.4 ఎంత మంది రైతులకు ఇచ్చారు? ఈ రోజు రైతులకు ఏ ఒక్కరికీ కూడా గిట్టుబాటు రాని పరిస్థితి ఉందంటే అది మీ నిర్వాకం కాదా?⇒ పక్కన కర్ణాటకలో జనతాదళ్‌కు చెందిన కేంద్ర మంత్రి కుమారస్వామి అడిగితే, కిలో మామిడి రూ.16 చొప్పున కొనేందుకు కేంద్రం ముందుకొచ్చిందట. నిజానికి అది మంచి రేటు అని కాదు.. కనీస రేటు అని చెప్పి, అదే పని మీరెందుకు చేయలేకపోయారు? మీరు ఎందుకు కేంద్రాన్ని అడగలేకపోయారు? ఈ విషయంలో చంద్రబాబు ప్రభుత్వం ఏం గాడిదలు కాస్తోంది?⇒ చిత్తూరు జిల్లాలో 6.45 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుంది. 2.20 లక్షల ఎకరాల్లో పంట పండుతుంది. 76 వేల మంది రైతులు వ్యవసాయం చేస్తూ మామిడి మీద బతుకుతారు. ఆ 76 వేల రైతుల కుటుంబాల్లో ఎంత మందికి, చంద్రబాబునాయుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత కేజీ మామిడి ధర రూ.12 చొప్పున దక్కింది? ⇒ వైఎస్సార్సీపీ ప్రభుత్వం హయాంలో నిరుడు కిలో మామిడి రూ.29కి రైతులు అమ్ముకున్న పరిస్థితి నుంచి ఈరోజు చంద్రబాబు ప్రభుత్వంలో రైతులు కేవలం రూ.2 కే కిలో అమ్ముకుంటున్నారు. అలా ఆ రైతుల్ని నడిరోడ్డుపై నిలబెట్టడం భావ్యమా? ⇒ ఇక్కడికి జగన్ వస్తున్నాడని చెప్పి, మూడు రోజుల నుంచి కిలో మామిడికి రూ.6 ఇస్తామని మెసేజ్‌లు పెడుతున్నారు. అయ్యా చంద్రబాబూ.. రైతులకు వాస్తవంగా కనీసం కిలో మామిడికి రూ.2 కూడా రావడం లేదంటే.. మీరు నిద్రపోతున్నారా?రైతన్నలకు అండగా గత ప్రభుత్వంమా ప్రభుత్వ హయాంలో వ్యవసాయం రూపురేఖలు మారుస్తూ రైతులకు తోడుగా ఉండేవాళ్లం. రైతన్నలకు మే మాసం వచ్చే సరికి పెట్టుబడి సహాయం అందేది. అడుగడుగునా రైతన్నలకు ఆర్బీకేలు తోడుగా ఉండేవి. అవి వారిని చేయి పట్టుకుని నడిపించే కార్యక్రమం జరిగేది. ఇదే జిల్లాలో వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో కిలో మామిడి రూ.22 నుంచి రూ.29 వరకు రైతులు అమ్ముకున్నారు. నాడు రైతులకు కనీస మద్దతు ధర రానప్పుడు మా ప్రభుత్వ హయాంలో సీఎం యాప్ ఉండేది. ఆర్బీకేల పరిధిలో ఏ ఒక్క పంటకు గిట్టుబాటు ధర రాకపోయినా వెంటనే అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్‌గా ఉన్న ఆర్బీకే అసిస్టెంట్ నోటిఫై చేసే వారు. జాయింట్ కలెక్టర్లు, జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్లుగా వ్యవహరిస్తూ, మార్క్‌ఫెడ్ పాత్ర పోషించే వారు. అలా అందరూ వెంటనే ఇన్వాల్వ్ అయ్యి.. ఆ ఆర్బీకే పరిధిలో ఈ–క్రాప్ ఆధారంగా పంటను కొనుగోలు చేసే వారు.ఇప్పుడవన్నీ కనుమరుగుఆ ప్రభుత్వం దిగిపోయిన తర్వాత ఈ సంవత్సర కాలంలో రైతుల బతుకులు తలకిందులయ్యాయి. వారు తీవ్ర కష్ట నష్టాల్లో కూరుకుపోయారు. ఈ రోజు ఏం జరుగుతోంది? మొదటి ఏడాది దాటిపోయింది. రైతన్నలకు ఇవ్వాల్సిన రైతు భరోసా రూ.20 వేలు ఎగరగొట్టేశారు. ఈ ఏడాది జూన్ కూడా అయిపోయింది. జూలైలో ఉన్నాం. ఇంత వరకు రైతులకు పెట్టుబడి సహాయం అందలేదు. ఇంకా చంద్రబాబునాయుడు గారి పుణ్యాన రైతులకు సమయానికే రావాల్సిన ఇన్పుట్ సబ్సిడీ రాకుండా పోయింది. ఆయన పుణ్యాన ఉచిత పంటల బీమా కూడా పూర్తిగా ఎగరగొట్టేసిన పరిస్థితి. ఆర్బీకేలన్నీ నిర్వీర్యమయ్యాయి. ఈ – క్రాప్ లేకుండా పోయింది. రైతులకు నాణ్యమైన విత్తనాలు, పురుగు మందులు, యూరియా, ఎరువులు ఇవన్నీ కూడా ఆర్బీకేల ద్వారా గ్రామ స్థాయిలోనే సరఫరా చేసే పరిస్థితి ఇవాళ లేకుండా పోయింది. నియోజకవర్గానికి ఒక అగ్రి టెస్టింగ్ ల్యాబ్ కూడా ఇవాళ నిర్వీర్యమైపోయిన పరిస్థితి. వ్యవసాయానికి సంబంధించిన అన్ని విభాగాలు ఇవాళ నిర్వీర్యమైపోయిన పరిస్థితి రాష్ట్రంలో కనిపిస్తోంది.భారీ జనసందోహానికి అభివాదం చేస్తున్న వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి కట్టడి ప్రయత్నాలు అత్యంత దారుణంశశిధర్రెడ్డి అనే వ్యక్తి రైతు కుటుంబానికి చెందిన వారు కాదా? పోలీసుల దాడిలో ఆయన తలకు తీవ్ర గాయమైంది. ఇంత దారుణమైన పరిస్థితి ఎందుకొచ్చింది అని అడుగుతున్నా.. రాష్ట్రంలో 62 శాతం మంది వ్యవసాయం మీద ఆధారపడి బతుకుతున్నారు. చిత్తూరు జిల్లాలో దాదాపు 80 శాతం మంది ఆ రంగం మీద బతుకుతున్నారు. మరి వీళ్లంతా రైతు బిడ్డలు కాదా? ఇక్కడికి రావొద్దని దాదాపు 1200 మంది రైతులను నిర్బంధించారు. ఇక్కడికి వచ్చిన రైతులపై విచ్చలవిడిగా లాఠీఛార్జ్ చేశారు. ఇది అత్యంత దారుణం. -
పోలీసులను అడ్డం పెట్టుకుని రాజకీయమా?.. ఇక్కడుంది జగన్
చంద్రబాబు నాయుడు గ్యారెంటీకి పవన్ కల్యాణ్ ష్యూరిటీ అన్నారు. కానీ, చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలే!. అందుకే ఆయన ఇంటిపేరు నారా కాదు.. మోసం అని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. సాక్షి, విజయవాడ: చంద్రబాబు మోసాలను ఎండగడుతూ వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించిన రీకాలింగ్ చంద్రబాబూస్ మేనిఫెస్టో కార్యక్రమం బుధవారం విజయవాడలో జరిగింది. మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆధ్వర్యంలో జరిగిన ‘‘బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ’’ సమావేశంలో పలువురు వైఎస్సార్సీపీ నేతలు పాల్గొని ప్రసంగించారు. మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ.. జగన్ మోహన్ రెడ్డి హయాంలో డీబీటీ ద్వారా నేరుగా ప్రజల ఖాతాల్లోనే నగదు జమ అయ్యేది. కూటమి ప్రభుత్వం ఏడాది కాలంలోనే ఫెయిల్యూర్ అయ్యింది. జగన్ పర్యటనలకు రాకుండా పోలీసులు అడ్డుపడినా ప్రజలు ఆగడం లేదు. కూటమి ప్రభుత్వం బుడమేరు ముంపు గ్రామాలకు న్యాయం చేయలేకపోయింది. మాజీమంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ.. చంద్రబాబు అంటేనే మోసం.. ఆయన జీవితమే మోసం. చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలే. అందుకే ఆయన ఇంటిపేరు నారా కాదు.. మోసం. మూడుసార్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు ఎప్పుడైనా అమ్మ ఒడి గురించి ఆలోచించారా?. చంద్రబాబుకు మాత్రం ఒక్కడే కొడుకు...కానీ ప్రజలను మాత్రం ఇద్దర్ని కనమంటాడు. చంద్రబాబు నాయుడు గ్యారెంటీకి పవన్ కళ్యాణ్ ష్యూరిటీ అన్నారు. ఇప్పుడేమైంది?. ఏపీలో పోలీసులను అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తున్నారు. సత్తెనపల్లిలో 113 మంది పై కేసులు పెట్టారు. ఏపీలో ఐపీఎస్ , ఐఏఎస్ అధికారులను జైలుకు పంపిస్తున్నారు. కేసులు పెట్టి భయపెట్టాలని చూస్తే ఎవరూ భయపడరు .. పారిపోరు. ఎక్కడా తగ్గేదే లేదు సోనియాగాంధీ, చంద్రబాబులను ఎదిరించి జగన్ పార్టీ పెట్టారు. ఆయన చిరంజీవిలాగా పార్టీ పెట్టి పారిపోయిన వ్యక్తి కాదు. మీరు ఎంత తొక్కితే అంత పైకి వచ్చే వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి. వంగవీటి మోహనరంగా , వైఎస్ రాజశేఖర్ రెడ్డి సన్నిహితులు. రంగా అనుచరుడిగా ఉన్న మల్లాది విష్ణుకి వైఎస్సార్ ఎమ్మెల్యేగా సీటు ఇచ్చారు. మల్లాది విష్ణు మళ్లీ అసెంబ్లీలో తన కంఠాన్ని వినిపిస్తారు. విజయవాడ పార్లమెంట్ పరిశీలకులు, మోదుగుల వేణుగోపాలరెడ్డి మాట్లాడుతూ.. జగన్ మోహన్ రెడ్డిది అబద్దాలు చెప్పే మనస్తత్వం కాదు. ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గెలిచాడు... ప్రజలు ఓడిపోయారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ని చూస్తే భారత రాజ్యాంగం గుర్తొస్తుంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డిని చూస్తే ఆరోగ్య శ్రీ గుర్తుకు వస్తుంది. ఎన్టీఆర్ ను చూస్తే రెండు రూపాయల కిలో బియ్యం గుర్తొస్తుంది. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు విగ్రహం పెట్టాలి...అప్పుడు మోసాలు దౌర్జన్యాలు గుర్తుకొస్తాయి. తెలుగుదేశం పార్టీ నేతలే ఇంత మెజార్టీని నమ్మలేకపోతున్నారు. అంబటి రాంబాబులాగా అందరూ ఉత్సాహంగా పనిచేయాలిడిప్యూటీ మేయర్ ,శైలజారెడ్డి మాట్లాడుతూ.. చంద్రబాబు ఎప్పుడు అధికారంలో ఉన్నా కరువు తాండవిస్తుంది. చంద్రబాబు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేరలేదు.చంద్రబాబు కుటంబానికి మాత్రమే న్యాయం జరిగింది. బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ మళ్లీ నిరూపించుకున్నారు. బ్రిటిష్ కాలం నాటి పాలన మళ్లీ మొదలైంది. విజయవాడ ధర్నా చౌక్ లో ప్రతి రోజూ ప్రభుత్వం పై ధర్నాలు జరుగుతున్నాయి. మెడికల్ విద్యార్థుల పట్ల అమానుషంగా ప్రవర్తించారు. చంద్రబాబు కాన్వాయ్ వద్ద ప్రజలు ఎవరూ లేరు. జగన్ కాన్వాయ్ వద్దకు ప్రజలు పెద్ద ఎత్తున వస్తున్నారు. కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిన సమయం దగ్గరపడింది. పూనూరు గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ.. చంద్రబాబు మేక తోలు కప్పుకున్న పులి. పల్నాడులో వైఎస్సార్సీపీ కార్యకర్తలను చంద్రబాబు హత్య చేయించారు. నాలుగు లక్షల మంది వాలంటీర్లకు ఉద్యోగాలు ఇచ్చిన ఘనత వైఎస్ జగన్ కి దక్కింది. ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే సమయం దగ్గర పడింది అని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో వెలంపల్లి శ్రీనివాసరావు, సెంట్రల్ నియోజకవర్గ కార్పొరేటర్లు , నాయకులు , కార్యకర్తలు హాజరయ్యారు. -
అచ్చెన్నా.. జగన్‌కు జనామోదం, మీకు జనాగ్రహమే
జగన్ బంగారుపాళ్యం పర్యటన ఒక సినిమా సెట్టింగ్లా ఉందంటూ మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వాఖ్యలపై వైఎస్సార్సీపీ సీనియర్ నేత భూమన కరుణాకర్‌రెడ్డి స్పందించారు. ఈ పర్యటనకు అడుగడుగునా అవాంతరాలు సృష్టించినా.. జనం తండోపతండాలుగా తరలి వచ్చారని, ఇది ప్రభుత్వంపైన జనాలకు ఉన్న ఆగ్రహమేనని భూమన అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తిరుపతి, సాక్షి: వైఎస్ జగన్మోహన్రెడ్డి చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం పర్యటన విజయవంతం కావడం పట్ల జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు భూమన కరుణాకర్‌రెడ్డి.. కార్యకర్తలకు, మామిడి రైతులకు కృతజ్ఞతలు తెలియజేశారు. అదే సమయంలో మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలపైనా భూమన మండిపడ్డారు. ‘‘మద్దతు ధర పేరిట మీ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. జగన్ పర్యటన ఖరారు కావడంతో.. కిలో రూ.6 ఇచ్చిన అగ్రిమెంట్లు ఉన్నాయి. మంత్రిగారూ(అచ్చెన్నను ఉద్దేశించి..) ఒక్కసారి చిత్తూరు జిల్లాలోని మామిడి రైతులు దగ్గరికి రండి. యాభై శాతం మామిడి తోటల్లో మామిడి పంట కోయలేదు. లక్ష యాభై వేల టన్నుల మామిడి ఫ్యాక్టరీలు కొనుగోలు చేశాయి. లక్ష డెబ్భై వేల టన్నులు తోటల్లో ఉందని స్వయానా ఫుడ్ ప్రిన్సిపాల్ సెక్రటరీ చిరంజీవి చౌదరి చెప్పారు. మామిడి రైతులు కడుపు మండి రోడ్డు పక్కనే మామిడి కాయలు పారాబోశారు.. అది గమనించండి ముందు.. మామిడి రైతుల్లో భరోసా నింపడానికి, ప్రభుత్వం పై ఒత్తిడి తెచ్చి మేలు చేయడానికి వైఎస్ జగన్ వచ్చారు. ఈ పర్యటనకు అడుగడుగునా అవాంతరాలు సృష్టించారు. మా పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. చాలామందిని గృహ నిర్బంధం చేశారు. సుమారు 1,600 మంది పోలీసులను మోహరించారు. ఎస్పీ స్థాయి అధికారి రౌడీ షీట్ తెరుస్తామని బెదిరించారు. భయానక వాతావరణం సృష్టించారు. ఇంకోపక్క.. జగన్ పర్యటనలో పాల్గొనవద్దని రైతులను అడ్డుకున్నారు. బంగారుపాళ్యంలో ఇవాళ హిట్లర్ పాలన తరహా ఛాయలు కనిపించాయి. జిల్లా ఎస్పీ అనుమతి మేరకే హెలిప్యాడ్, రూట్ మ్యాప్ ఇచ్చి మీరు అడ్డుకున్నారు. పోలీసు వ్యవస్థను ప్రయోగించినా.. జగన్ కోసం జనం ప్రాణాలను పణంగా పెట్టి మరీ భారీగా తరలి వచ్చారు. దారి పొడవునా భయపెట్టిన గుట్టలు, కొండలు, తుప్పలు దాటుకుని వచ్చారు. వీళ్లంతా దగా పడ్డ వారే. మా కార్యకర్తలు, మామిడి రైతులను పోలీసులు అడ్డుకుని లాఠీ చార్జి చేశారు. ‘నా కళ్ల ముందే కొడుతున్నారు..’ అని జగన్ కూడా అన్నారు. ఇది చూసి.. స్వాతంత్ర్య పోరాట స్పూర్తితో వీళ్లంతా ముందుకు కదిలారా? అని నాకనిపించింది. పోలీసులకు ధన్యవాదాలు చెప్తున్నా.. మీ నిర్బంధాలనే కోట గోడల్ని పగలగొట్టి రైతులు, వైఎస్సార్సీపీ కార్యకర్తలు తరలి వచ్చారుజగన్ ఇవాళ రోడ్ షో చేయలేదు. జగన్ వెంట వచ్చింది అభిమాన గణం. ఆ అభిమానంతో బంగారుపాళ్యం వెళ్లే దారులు అన్ని కిక్కిరిసి పోయాయి. అంచనాలకు మించి రైతులు వచ్చి తమ సమస్యలు చెప్పుకున్నారు. ఈ పర్యటనతో దేశంలోనే మా నాయకుడు(వైఎస్ జగన్).. అత్యంత ప్రజాదరణ నాయకుడు అని మరోసారి రుజువైంది. కూటమి ప్రభుత్వం అణచివేత చర్యతో జనాగ్రహం.. జగన్‌కు జనామోదం అని స్పష్టమైంది. కూటమి ప్రభుత్వ నియంతృత్వ చర్యల్ని ప్రజలు చూస్తున్నారు. మీ రాజకీయ గోతి మీరే త్రవ్వుకుంటున్నారు అనేది గ్రహించక పోతే మిమ్మల్ని ఎవరు కాపాడలేరు. చంద్రబాబు కూటమిని కూకటి వేళ్ళతో పీకేస్తారని జగన్ బంగారుపాళ్యం పర్యటన నిరూపించింది. ఇవాళ్టి జన ప్రవాహం కూటమి ఓటమి ఖరారు చేసేసింది అని భూమన అన్నారు.