breaking news
-
'స్థానిక ఎన్నికలు' నిష్పాక్షికంగా జరిపించండి
సాక్షి, అమరావతి: జెడ్పీటీసీ, ఎంపీటీసీ, పంచాయతీ (స్థానిక) ఎన్నికలను ప్రశాంతంగా, నిష్పాక్షికంగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టాలని అధికార యంత్రాంగాన్ని హైకోర్టు ఆదేశించింది. ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునేలా చూడాలని సూచించింది. ఎన్నికల ప్రక్రియ మొదలైనందున ఈ వ్యవహారంలో ఇంతకుమించి జోక్యం చేసుకోలేమని పేర్కొంది. స్థానిక ఎన్నికలను స్వేచ్ఛగా, ప్రశాంతంగా నిర్వహించేలా చర్యలు చేపట్టాలంటూ వైఎస్సార్సీపీ సమర్పించిన వినతిపత్రాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘం తదుపరి చర్యల నిమిత్తం డీజీపీకి పంపిందని గుర్తుచేసింది. ఈ వ్యాజ్యంలో తదుపరి ఉత్తర్వులు అవసరం లేదని స్పష్టం చేసింది. ఇంతటితో పరిష్కరిస్తున్నట్లు తెలిపింది. ⇒ స్థానిక ఎన్నికల ప్రక్రియలో సీసీ టీవీల ఏర్పాటు, వెబ్ క్యాస్టింగ్, స్వతంత్ర పరిశీలకులు, అభ్యర్థులకు పోలీసు రక్షణ, ఎన్నికల ప్రక్రియను వీడియో తీసే విషయంలో అధికారులు కనీస చర్యలు తీసుకోవడం లేదంటూ వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎన్నికల్లో పోటీ చేసేవారందరికీ సమాన అవకాశాలు ఉండేలా చర్యలు తీసుకునేలా ఆదేశాలివ్వాలని కోరారు. ఈ వ్యాజ్యంపై న్యాయమూర్తి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు గురువారం విచారణ జరిపి ఉత్తర్వులు జారీ చేశారు. దాడులకు పాల్పడుతున్నా పోలీసులు పట్టించుకోవట్లే.. పిటిషనర్ తరఫు న్యాయవాది వడ్లమూడి కిరణ్‌కుమార్ వాదనలు వినిపిస్తూ... స్థానిక ఉప ఎన్నికలకు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసిన సంగతిని వివరించారు. అధికార పార్టీ కండబలం, ధనబలంతో ప్రతిపక్ష నాయకులపై దాడులకు పాల్పడుతోందని, అయినా పోలీసులు చోద్యం చూస్తున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో ఎన్నికలు నిష్పాక్షికంగా, స్వేచ్ఛాయుతంగా జరిగే పరిస్థితుల్లేవని పేర్కొన్నారు. పారదర్శకంగా జరిగేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు వినతిపత్రం సమర్పించినట్లు చెప్పారు. దీనిపై కమిషన్ ఎలాంటి చర్యలు తీసుకోలేదని వివరించారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ తరఫు న్యాయవాది స్పందిస్తూ, పిటిషనర్ సమర్పించిన వినతిపై స్పందించామని తెలిపారు. వారు కోరిన అన్ని చర్యలు తీసుకోవాలని రాష్ట్ర డీజీపీకి ఎన్నికల కమిషన్ సూచించిందన్నారు. అవసరమైతే అదనపు బలగాలను మోహరించాలని కూడా చెప్పిందన్నారు.ప్రశాంత ఎన్నికల బాధ్యత అధికారులదే!హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రామకృష్ణప్రసాద్శాంతిభద్రతలను పరిరక్షిస్తూ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చూసే బాధ్యత అధికార యంత్రాంగంపై ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. పులివెందుల జెడ్పీటీసీ పరిధిలోని పులివెందుల డీఎస్పీ, పులివెందుల గ్రామీణ సీఐ, పట్టణ సీఐలను ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలంటూ పిటిషనర్ ఇచ్చిన వినతిపత్రాలను రాష్ట్ర ఎన్నికల కమిషన్ తదుపరి చర్యల నిమిత్తం ఎన్నికల అధికారి (కలెక్టర్), జిల్లా ఎస్పీకి పంపిన విషయాన్ని రికార్డు చేసింది. తమ ముందు దాఖలైన వ్యాజ్యాలను పరిష్కరిస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణప్రసాద్ ఉత్తర్వులు జారీచేశారు. ఎన్నికల్లో అక్రమాలపై ఫిర్యాదులకు సెల్ ఏర్పాటు చేయాలి ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోకుండా తటస్థంగా వ్యవహరించేలా పులివెందుల పోలీసులను ఆదేశించాలని... ఎన్నికల కమిషన్ ఆమోదం లేకుండా ప్రతిపక్ష పార్టీ నేతలను అరెస్టు చేయొద్దని ఆదేశాలివ్వాలంటూ పులివెందుల మండలం తుమ్మలపల్లికి చెందిన తుమ్మల హనుమంత్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఎన్నికల నిర్వహణకు తటస్థ అధికారులను వినియోగించేలా ఆదేశాలివ్వడంతో పాటు ఎన్నికల అక్రమాలపై ఫిర్యాదులకు విభాగం (సెల్) ఏర్పాటుచేసేలా ఆదేశాలివ్వాలని కోరారు. ఎన్నికల కమిషన్‌కూ వినతిపత్రాలు ఇచ్చామని, ఎలాంటి స్పందన లేదని పేర్కొన్నారు. వీటిపై జస్టిస్ రామకృష్ణప్రసాద్ విచారణ జరిపారు. ఎన్నికల సంఘం తరఫు న్యాయవాదులు వివేక్ చంద్రశేఖర్, సి.విశ్వనాథ్‌లు వాదనలు వినిపిస్తూ పిటిషనర్ వినతిపత్రాలను జిల్లా కలెక్టర్, ఎస్పీకి పంపామని.. ఆ మేరకు ప్రొసీడింగ్స్ కూడా జారీ అయ్యాయని తెలిపారు. ఈ వివరాలను రికార్డ్ చేసిన న్యాయమూర్తి, ఎన్నికల సందర్భంగా శాంతిభద్రతలను పరిరక్షించాల్సిన బాధ్యత అధికార యంత్రాంగంపై ఉందన్నారు. -
టీడీపీ గూండాల అరాచకంపై గవర్నర్‌కు వైఎస్సార్సీపీ ఫిర్యాదు
సాక్షి, విజయవాడ: వైఎస్సార్ కడప జిల్లాలో స్థానిక సంస్థల ఉప ఎన్నికల సందర్భంగా టీడీపీ గూండాల అరాచకం, నిర్వీర్యమైన శాంతిభద్రతలు, అధికారపార్టీకి అండగా నిలుస్తున్న పోలీస్ యంత్రాంగంపై విజయవాడలో వైఎస్సార్సీపీ ప్రతినిధి బృందం గవర్నర్ అబ్ధుల్ నజీర్‌ను కలిసి ఫిర్యాదు చేసింది. శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ నేతృత్వంలో పలువురు నాయకులు గవర్నర్‌ను కలిశారు.ఈ సందర్బంగా పులివెందుల్లో టీడీపీ గూండాలు పట్టపగలు మారణాయుధాలతో దాడులు చేయడం, వాహనాలను ధ్వంసం చేయడం, వైఎస్సార్సీపీ నేతలను హతమార్చేందుకు ప్రయత్నించిన తీరు, పోలీసులు పట్టించుకోకుండా అధికార పార్టీకి ఎలా అండగా నిలుస్తున్నారో అన్ని ఆధారాలతో సహా గవర్నర్‌కు వివరించారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్‌పై దాడి చేసి, ఎలా గాయపరిచారో తెలియచేశారు. నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం రాజ్‌భవన్ వెలుపల బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ ఏమన్నారంటే...కడప జిల్లా పులివెందుల్లో జెడ్పీటీసీ ఉప ఎన్నికల సందర్బంగా ఎమ్మెల్సీ రమేష్ యాదవ్‌తో పాటు పార్టీ నేతలు ఎన్నికల ప్రచారాన్ని ముగించుకుని తిరిగి వస్తుండగా టీడీపీకి చెందిన గూండాలు పది వాహనాల్లో వచ్చి వారిపై విచక్షణారహితంగా దాడి చేశారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, వేల్పుల రవి, ఇతరులను హతమార్చేందుకు ప్రయత్నించారు. ఈ దాడులు చూస్తుంటే ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా అనే అనుమానం కలుగుతోంది. బీసీ నాయకుడు రమేష్ యాదవ్ శాసనమండలి సభ్యుడుగా ఉన్నారు. ఆయనకు కనీస రక్షణ కల్పించాల్సిన బాధ్యత పోలీసులపై లేదా? ప్రభుత్వ ఆదేశాల మేరకే పోలీసులు దాడి జరుగుతుంటే, పట్టించుకోకుండా ఉన్నారు.కర్నూలు డీఐజీ కోయ ప్రవీణ్ ఈ ఘటనపై చేసిన వ్యాఖ్యలు చూస్తేనే ఇది అర్థమవుతోంది. ఆయన మాటలను కూడా గవర్నర్ దృష్టికి తీసుకువెళ్ళాం. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా నిర్వీర్యం అయ్యాయి. తక్షణం గవర్నర్ దీనిపై దృష్టి సారించాలని కోరాం. ఎన్నికల కమిషన్‌కు కూడా దీనిపై ఫిర్యాదు చేశాం. కడప జిల్లాలో స్థానిక సంస్థల ఉప ఎన్నికలు నిష్పక్షపాతంగా, చట్టబద్దంగా, శాంతియుత వాతావరణంలో జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరాం.ఆ విషయాన్ని కూడా గవర్నర్‌కు వివరించాం. కూటమి ప్రభుత్వం అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్న వైనంను ఆధారాలతో సహా గవర్నర్‌కు తెలియచేశాం. డీఐజీ కోయ ప్రవీణ్ మాట్లాడిన మాటలు పోలీస్ వ్యవస్థకే సిగ్గుచేటు. అన్ని సందర్భాల్లోనూ ఒకే పార్టీ అధికారంలో ఉండదని గుర్తుంచుకోవాలి. వ్యవస్థలు చట్టప్రకారం పనిచేయాలే తప్ప రాజకీయ పార్టీలకు తొత్తులుగా మారకూడదు.గవర్నర్‌ను కలిసిన వారిలో ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, మొండితోక అరుణ్ కుమార్, రమేష్ యాదవ్, కల్పలతారెడ్డి, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, మాజీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ, మాజీ మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాస్, కారుమూరి నాగేశ్వరరావు, మేరుగు నాగార్జున, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, పార్టీ నేతలు దేవినేని అవినాష్, నౌడు వెంకటరమణ తదితరులు ఉన్నారు. -
నేతన్నలను చంద్రబాబు సర్కార్ ఏ రకంగా ఆదుకున్నట్లు?: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నేతన్నలకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా సంత్ కబీర్ అవార్డు అందుకుంటున్న లక్క శ్రీనివాసులు (తిరుపతి), నేషనల్ హ్యాండ్లూమ్ అవార్డులు అందుకుంటున్న కర్నాటి మురళి (చీరాల), జుజరె నాగరాజు (పొందూరు)లకు ఆయన అభినందనలు తెలిపారు.‘‘నేతన్నల జీవితాలు బాగుపడాలన్న ఉద్దేశంతో మా ప్రభుత్వ హయాంలో వారికి ప్రతి అడుగులోనూ అండగా నిలిచాం. మేనిఫెస్టోలో చెప్పినట్టుగా 'వైఎస్సార్ నేతన్న నేస్తం పథకం’ ద్వారా ప్రతి ఏటా రూ.24,000 నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లో క్రమం తప్పకుండా జమ చేశాం. వైఎస్సార్ నేతన్న నేస్తం కింద రూ.969.77 కోట్లు, నేతన్నల పింఛన్ కోసం రూ.1,396.45 కోట్లు, ఆప్కోకు పాత బకాయిలు రూ.468.84 కోట్లు చెల్లించాం. అంతేకాదు వివిధ పథకాల ద్వారా నేతన్నలకు రూ.3,706.16 కోట్లు సాయం చేశాం. ఇది ఒక రికార్డు’’ అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.‘‘నేతన్నలకు ఉచిత విద్యుత్, పవర్ లూమ్స్ కు రాయితీపై విద్యుత్ అందించాం. చేనేత వస్త్రాలకు ఆన్లైన్ ద్వారా అంతర్జాతీయ మార్కెటింగ్ సౌకర్యం కల్పించి నేతన్నల ఆదాయం పెంచేందుకు ప్రముఖ ఈ-కామర్స్ సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నాం. ఇలా ప్రతి అడుగులోనూ చేనేతలకు అండగా నిలిచాం. ఈ ప్రభుత్వం చేనేతలకు నడుస్తున్న పథకాలను ఆపేసి ఇచ్చిన హామీలను పూర్తిగా గాలికి వదిలేసింది. జీఎస్టీ రీయింబర్స్ చేస్తామని చెప్పారు. ఇప్పటి వరకు అమలు చేయలేదు. దీన్ని అమలు చేయాలంటే దాదాపు రూ.250 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుందని నేతన్నలు చెబుతున్నారు. రెండు బడ్జెట్లలో పెట్టింది సున్నా.ఈ రోజు జాతీయ చేనేత దినోత్సవం జరుపుకున్న నేతన్నలందరికీ శుభాకాంక్షలు.ఈ రోజు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి చేతుల మీదుగా సంత్ కబీర్ అవార్డు అందుకుంటున్న లక్క శ్రీనివాసులు (తిరుపతి), నేషనల్ హ్యాండ్లూమ్ అవార్డులు అందుకుంటున్న కర్నాటి మురళి (చీరాల), జుజరె నాగరాజు… pic.twitter.com/x0ewriEn5z— YS Jagan Mohan Reddy (@ysjagan) August 7, 2025..పవర్లూమ్లకు 500 యూనిట్లు, హ్యాండ్ లూమ్‌లకు 200 యూనిట్లు ఉచిత విద్యుత్ అన్నారు. 14 నెలలు గడిచినా అమలు చేయలేదు. కరెంటు సబ్సిడీ ఇవ్వలేదు, కానీ కరెంటు ఛార్జీలు అమాంతంగా పెంచారు. ఇప్పటికే రాష్ట్ర ప్రజలకు రూ.19వేల కోట్ల మేర కరెంటు షాక్ ఇచ్చారు. మరి ఈ ప్రభుత్వం చేనేతలను ఏ రకంగా ఆదుకున్నట్లు?. పత్రికల్లో ప్రకటనలు తప్ప ఏమీ కనిపించడం లేదు. అన్ని వర్గాల మాదిరిగానే చంద్రబాబు చేనేతలను వంచించారు, మోసం చేశారు’’ అంటూ వైఎస్ జగన్ ఎక్స్ వేదికగా నిలదీశారు. -
ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, సతీష్‌రెడ్డిపై కేసు నమోదు
సాక్షి, వైఎస్సార్ జిల్లా: వైఎస్సార్ జిల్లాలో కూటమి వేధింపులు కొనసాగుతున్నాయి. పులివెందులలో వైఎస్సార్సీపీ శ్రేణులపై జరిగిన దాడిని నిరసిస్తూ శాంతియుతంగా చేసిన ర్యాలీపై ఎన్నికల కోడ్ ఉల్లంఘిచారంటూ వైఎస్సార్సీపీ నేతలపై కేసులు నమోదు చేశారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ రెడ్డితో పాటు పలువురిపై కేసులు నమోదయ్యాయి.న్యాయం కోసం పోలీసులకు వినతిపత్రం ఇస్తే దానిపైనా కూడా పోలీసులు కేసు పెట్టారు. ఎన్నికల కోడ్ ఉందంటూ కేసు నమోదు చేశారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, వేల్పుల రాము, హేమాద్రిపై టీడీపీ మూకలు దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. అంతకు ముందు సురేష్ రెడ్డి, అమరేశ్వర రెడ్డిపై కూడా దాడి చేశారు.వైఎస్సార్సీపీ శ్రేణులపై వరుస దాడులు, హత్యాయత్నాలపై వైఎస్సార్సీపీ శాంతియుత ర్యాలీ నిర్వహించింది. ముందురోజే నిందితులను అరెస్ట్ చేసి ఉంటే ఎమ్మెల్సీపై దాడి జరిగేది కాదని వైఎస్సార్సీపీ పేర్కొంది. ఇంతవరకు నిందితులను అరెస్ట్ చేయకుండా ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ వైఎస్సార్సీపీ నేతలపై కేసులు నమోదు చేయడం పట్ల ఆ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. -
డీఐజీ కోయ ప్రవీణ్ తీరుపై మాజీ మంత్రి పేర్ని నాని ఫైర్
సాక్షి, మచిలీపట్నం: వైఎస్సార్ కడప జిల్లాలో స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో జరుగుతున్న హింసపై కర్నూలు డీఐజీ కోయ ప్రవీణ్ స్పందించిన తీరును మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ కృష్ణాజిల్లా అధ్యక్షుడు పేర్ని వెంకట్రామయ్య (నాని) తీవ్రంగా ఖండించారు. మచిలీపట్నంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ శాంతి భద్రతలను కాపాల్సిన బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న పోలీస్ అధికారి కర్నూలు డీఐజీ కోయ ప్రవీణ్ 'వైఎస్సార్సీపీ వారు పత్తి యాపారం చేస్తే ఇట్లాగే ఉంటుంది' అంటూ వ్యాఖ్యానించడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.కడప జిల్లాలో కొందరు ప్రభుత్వ ఉద్యోగులు తాము నిర్వర్తించాల్సిన బాధ్యతను గాలికి వదిలి, పత్తియాపారం చేయడం వల్లే వరుసగా హింసాత్మక సంఘటనలు జరుగుతున్నాయని అన్నారు. కడప జిల్లాలో స్థానిక సంస్థల ఉప ఎన్నికల సందర్భంగా నామినేషన్ ఘట్టం నుంచి ప్రచారం వరకు హింస, దౌర్జన్యాలు, దాడులు జరుగుతున్నాయని, నామినేషన్ నాడు ఎవరైతే దౌర్జన్యాలకు, దాడులకు పాల్పడ్డారో వారే ప్రతి రోజూ తమ అరాచకాన్ని కొనసాగిస్తున్నారంటే ఎలా అర్థం చేసుకోవాలని ప్రశ్నించారు.ముందు వారిని నియంత్రించాల్సిన అధికారులు పత్తి యాపారం చేస్తున్నారా అని నిలదీశారు. 'మేం ఉన్నాం కాబట్టే తలలు తెగలేదు' అని డీఐజీ కోయ ప్రవీణ్ చెప్పిన దానిని బట్టి చూస్తే, టీడీపీ వారు వేసుకున్న ప్లాన్ ప్రకారం ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, వేల్పుల రాముల తలలు తెగేవేనని, ఆయన ఉండబట్టే అది జరగలేదని అర్థమవుతోంది.ఇటువంటి సమర్థులైన, నిజాయితీపరులైన అధికారికి ప్రెసిడెన్షియల్ పోలీస్ మెరిటోరియల్ అవార్డు, లేదా గ్యాలెంటీ అవార్డులు ఇవ్వాలని తాము రాష్ట్రపతికి విజ్ఞప్తి చేస్తామని అన్నారు. అంతే కాకుండా ఇదే అధికారి గాయపడిన వైఎస్సార్సీపీ నాయకుల గురించి మాట్లాడుతూ వారి శరీరంలో గాయాలు కనిపించడం లేదు కానీ, వారు ధరించిన దుస్తులపై మాత్రం రక్తపు మరకలు కనిపిస్తున్నాయని ఆశ్చర్యం వ్యక్తం చేయడం మరో విడ్డూరమని అన్నారు. అధికారంలో ఉన్న రాజకీయ పార్టీకి కొమ్ముకాసే కొందరు అధికారులకు తాత్కాలికంగా రాజకీయ శుక్లాలు వస్తాయని, ఆ పార్టీ అధికారానికి దూరం కాగానే వారికి ఆ శుక్లాలు తొలగిపోయి వాస్తవాలు కనిపిస్తాయని అన్నారు. -
వైఎస్ జగన్ హయాంలోనే చేనేత రంగానికి మేలు: వైఎస్సార్సీపీ
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో జాతీయ చేనేత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర పార్టీ కార్యాలయ ఇన్చార్జ్, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, దేవాంగ కార్పొరేషన్ మాజీ చైర్మన్ సురేంద్రబాబు, ఆప్కో మాజీ చైర్మన్ చిల్లపల్లి మోహన్‌రావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా చేనేత రంగానికి వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన మేలును వారు గుర్తు చేశారు.కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత చేనేత రంగానికి చీకటి రోజులు వచ్చాయని మండిపడ్డారు. చేనేత కార్మికులకు ఎన్నికలకు ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా ఈ ప్రభుత్వం పూర్తిగా అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎవరెవరు ఏం మాట్లాడారంటే..ఐదేళ్లలో చేనేతలకు రూ.3700 కోట్లు లబ్ధి: ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డిగడిచిన వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఐదేళ్ల పాటు చేనేతలు సంతోషంగా జీవించారు. వైఎస్ జగన్ సీఎంగా ఉన్న ఐదేళ్లలో వివిధ కార్యక్రమాల రూపంలో దాదాపు రూ.3700 కోట్లతో చేనేతలకు అండగా నిలబడ్డారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా నేతన్న నేస్తం పథకాన్ని తీసుకొచ్చి చేనేతల కుటుంబానికి వైఎస్ జగన్ అండగా నిలిచారు. 85 వేల కుటుంబాలకు రూ.1.20 లక్షల చొప్పున మేలు చేసిన ఘనత వైఎస్ జగన్‌కి దక్కుతుంది. కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక సమాజానికి నాగరికత నేర్పి, దర్జా తెచ్చింది నేతన్నల జీవితాలు మళ్లీ చితికిపోతున్నాయి.ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకపోగా ప్రతి ఏడాది ఇచ్చిన హామీలనే కొత్తగా ప్రచారం చేసుకుంటున్నారు. అధికారంలో ఉన్నా లేకున్నా చేనేతల పక్షాన వైఎస్సార్సీపీ అండగా నిలబడి వారి సమస్యల పరిష్కారం కోసం పోరాడుతుంది. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా గతేడాది ఆగస్టు 7న విజయవాడలో జరిగిన చేనేత దినోత్సవం కార్యక్రమంలో ఏవైతే హామీలిచ్చారో అవే హామీలను మళ్లీ ఈ ఏడాది కూడా ఇస్తున్నారే కానీ అమలు చేయకుండా సీఎం చంద్రబాబు చేనేతలను మోసగిస్తున్నారు.జీఎస్టీపై చంద్రబాబు తిరకాసు హామీలు: సురేంద్రబాబుస్వాతంత్ర్యం వచ్చిన తర్వాత చూస్తే చేనేతలకు ఎవరైనా నేరుగా సాయం అందించారంటే అది ఖచ్చితంగా సీఎంగా వైయస్ జగనే అని చెప్పక తప్పదు. ఐదేళ్లలో రూ.1.20 లక్షలు నేరుగా చేనేతల బ్యాంకు ఖాతాలో జమ చేసి మా కుటుంబాలకు వెన్నుదన్నుగా నిలిచారు. జీఎస్టీ అనేది కేంద్రం పరిధిలోని అంశమే అయినా యువగళం పాదయాత్రలో నారా లోకేష్ చాలా సందర్భాల్లో చేనేతలకు జీఎస్టీ ఎత్తివేస్తామని, లేదంటే రీయింర్స్‌మెంట్ చేస్తామని హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం కొలువుదీరిన ఈ 14 నెలల్లో ఏనాడూ చేనేతల జీఎస్టీ గురించి లోకేష్ మాట్లాడిన పాపాన పోలేదు.జీఎస్టీ కౌన్సిల్లోనూ టీడీపీ ప్రస్తావించలేదు. జీఎస్టీ తీసుకొచ్చినప్పుడు రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వమే అధికారంలో ఉంది. 15వ జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్ లో ఒడిశా ప్రభుత్వం మాత్రమే చేనేతలకు జీఎస్టీని వ్యతిరేకిస్తే ఏపీలో ఆనాటి ఆర్థికశాఖ మంత్రిగా ఉన్న యనమల రామకృష్ణుడు మాత్రం జీఎస్టీకి అనుకూలమని చెప్పేసి వచ్చారు. చేనేతలకు జీఎస్టీ విధించడాన్ని మేం వ్యతిరేకిస్తున్నామని ప్రతిపక్షంలో ఉండగా వైఎస్ జగన్ జీఎస్టీ కౌన్సిల్‌కి లేఖ రాయడం జరిగింది. 2021లో జీఎస్టీని 5 శాంతం నుంచి 12 శాతం పెంచుతామని కేంద్రం చెప్పినప్పుడు రాష్ట్ర ఆర్థికశాఖ ద్వారా కేంద్రానికి లేఖ రాసి, దానిని అడ్డుకున్నారు.వైఎస్ జగన్ నేతృత్వంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అడుగడుగునా చేనేతలకు అండగా నిలిచింది. నేతన్న నేస్తం ఇస్తామని చీరాల సభలో నారా చంద్రబాబు ప్రకటించి ఇంతవరకు దాని ఊసెత్తడం లేదు. చేనేతలకు 200 యూనిట్లు ఉచిత విద్యుత్తు ఇస్తామని జీవో జారీ చేసి 6 నెలలు గడిచినా ఇంతవరకు దానికి అతీగతీ లేదు. గతేడాది విజయవాడలో నిర్వహించిన చేనేత దినోత్సవం రోజున ఆరోగ్య బీమా కింద తక్షణమే రూ.10 కోట్లు రిలీజ్ చేస్తామని సీఎం చంద్రబాబు చెప్పారు. వాటికి ఇప్పటికీ మోక్షం లభించలేదు సరికదా ఈ ఏడాది దాన్ని రూ.5 కోట్లకు తగ్గించి మోసం చేస్తున్నాడు. జీఎస్టీ ఎత్తివేయడానికి రీయింబర్స్మెంట్ కింద ఏడాదికి రూ.67 కోట్లు ఖర్చవుతుందని అదే రోజు చంద్రబాబు చెప్పారు.చేనేతకు అండగా నిలిచిన వైఎస్ జగన్: చిల్లపల్లి మోహన్రావువైఎస్ జగన్ 2019లో ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసి 2020 ఆగస్టు 7న చేనేత దినోత్సవ కార్యక్రమం జరుపుకొనే నాటికి రెండు విడతల్లో చేనేత నేస్తం ఇచ్చారు. చేనేత కార్మికుల సమస్యల మీద అధ్యయనానికి మమ్మల్ని నాటి సీఎం వైఎస్ జగన్ రాష్ట్ర పర్యటనకు పంపించి రిపోర్టు తయారు చేయించారు. రాష్ట్రంలో 87 శాతం చేనేతలంతా ప్రైవేట్ మాస్టర్ వీవర్స్ మీద ఆధారపడి ఉన్నారు. ఆ కారణం చేత అందరికీ మేలు జరిగేలా సొంత మగ్గం ఇంట్లో ఉండి పనిచేసుకుంటున్న వారికి కూడా అమలయ్యేలా 85 వేల కుటుంబాలకు ఐదేళ్లు వైఎస్ జగన్ నేతన్న నేస్తం ద్వారా రూ. 900 కోట్లు లబ్ధి చేకూర్చారు. కానీ ఇప్పుడు చంద్రబాబు సొసైటీలకు మాత్రమే మినహాయింపులు ఉంటాయని షరతులు విధిస్తున్నారు.వైఎస్ జగన్ సీఎం అయ్యాక రూ.5 వేలుగా ఉండే చేనేతల తలసరి ఆదాయం ఏకంగా మూడు రెట్లు పెరిగిపోయింది. ఆప్కోకి పాత బకాయిలు రూ. 400 కోట్లు రద్దు చేసిన ఘనత వైఎస్ జగన్‌కి దక్కుతుంది. గత తెలుగుదేశం హయాంలో ఆప్కోకి పేరుకుపోయిన ముడి సరుకుకి సంబంధించి రూ.100 కోట్ల బకాయిలు కూడా వైఎస్ జగన్ ప్రభుత్వమే చెల్లించింది.ఇప్పుడున్న సొసైటీలన్నింటికీ పాత బకాయిలు నాటి వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోనే తీర్చేశాం. కూటమి ప్రభుత్వం వచ్చాక చేనేతలు ఎవరూ సంతోషంగా లేరు. ఆప్కో సేల్స్ పెరిగితే సొసైటీలకు పని పెరుగుతుందని భావించి తిరుపతి, కడపలో మూడంతస్తుల సొంత భవనం, గుంటూరు, ఒంగోలు, గన్నవరం ఎయిర్పోర్ట్, రేణిగుంట ఎయిర్పోర్ట్, తదితర ప్రాంతాల్లో అత్యాధునిక షోరూమ్‌లను వైఎస్సార్సీపీ హయాంలోనే ఏర్పాటు చేశాం. గతంలో వైఎస్సార్ కూడా సీఎంగా ఉండగా కేంద్రంతో మాట్లాడి 11.3 శాతం ఎక్సైజ్ డ్యూటీని ఒక్క రోజులో రద్దు చేయించారు. -
‘ఎన్నిక ఏదైనా అక్రమాలు చేయడం చంద్రబాబుకి అలవాటే’
ఎన్నిక ఏదైనా అక్రమాలు చేయడం చంద్రబాబుకి అలవాటేనని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. పులివెందులలో టీడీపీ గూండాల అరాచకం, పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపైనా ఆయన తాడేపల్లిలోని పార్టీ కేంద్రకార్యాలయంలో గురువారం మీడియాతో మాట్లాడారు. సాక్షి,తాడేపల్లి: పులివెందులలో టీడీపీ నేతల తీరును మాజీ మంత్రి అంబటి రాంబాబు ఖండించారు. ‘‘పులివెందులలో టీడీపీ నేతలు నిసిగ్గుగా ప్రవర్తించారు. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నిక గెలవడం కోసం చంద్రబాబు అనేక కుట్రలు చేస్తున్నారు. కోండెపి జెడ్పీటీసీ గెలిచినట్లు టీడీపీ నేతలే ప్రకటించుకున్నారు. పైగా గాయపడినవారిపైనే పోలీసులు అక్రమ కేసులు బనాయిస్తున్నారు.డీఐజీ కోయ ప్రవీణ్ కామెంట్స్‌ను ఖండిస్తూ.. పోలీసులు టీడీపీ కార్యకర్తల మాదిరి ప్రవర్తిస్తున్నారు. చంద్రబాబు ఆదేశాలతోనే పని చేస్తున్నారు. డీఐజీ కోయ ప్రవీణ్ తప్పుడు మాటలు మాట్లాడడం సిగ్గు చేటు. ఖాకీ బట్టలు వేసుకుని కోయ ప్రవీణ్ చంద్రబాబు కాళ్ల పూజ చేస్తున్నాడు. ఇప్పటికైనా లా అండ్ ఆర్డర్‌ను ప్రవీణ్ కాపాడాలి. చంద్రబాబు సింగపూర్ ప్రచారంపై.. రాష్ట్ర ప్రభుత్వం తరఫున చంద్రబాబు 58 సార్లు సింగపూర్ వెళ్లారు. మరి ఏం ాధించారో చెప్పాలి. తాజాగా చంద్రబాబు కుమార సమేతంగా సింగపూర్ పర్యటనకు వెళ్లారు. ఏపీలో పెట్టుబడులు పెట్టడం లేదని సింగపూర్ ప్రభుత్వం ప్రకటించింది. కానీ, పెట్టుబడులు పెడుతోందని చంద్రబాబు తప్పుడు ప్రచారం చేశారు. ప్రజలను మభ్య పెడుతున్నారు. ఫ్రీ బస్సు స్కీమ్ మోసం.. ఎన్నికలకు ముందు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అని ప్రకటించారు. ఇప్పుడేమో మహిళలకు ఉచిత బస్సు పథకం కూడా అరకొరగా అమలు చేసేందుకు కుటరలు చేస్తున్నారు అని అంబటి విమర్శనాస్త్రాలు సంధించారు. -
‘నాకేమైనా జరిగితే ఎమ్మెల్సీ ఆలపాటే కారణం’
సాక్షి, విజయవాడ: నగరంలోకి శాతవాహన కళాశాల వివాదం మరోసారి తెర మీదకు వచ్చింది. టీడీపీ ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ తనను వేధిస్తున్నారంటూ ఆ కాలేజీ ప్రిన్సిపాల్ వంకాయలపాటి శ్రీనివాస్ మళ్లీ ఆరోపణలకు దిగడం చర్చనీయాంశమైంది. టీడీపీ ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తనను బెదిరిస్తున్నారని తాజాగా నగర పోలీస్ కమిషనర్‌కు శాతావాహన ప్రిన్సిపాల్ శ్రీనివాస్ ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో ఆలపాటి కాల్ రికార్డ్ ఆడియోను మీడియాకు విడుదల చేశారాయన. ‘‘టీడీపీ ఎమ్మెల్సీ ఆలపాటి నాకు ఫోన్ చేసి బెదిరిస్తున్నారు. నా ఫోన్ సీఐడీతో ట్యాపింగ్ చేయిస్తున్నారని చెబుతున్నారు. గతంలో ఒకసారి ఫ్యామిలీ అందరినీ చంపేస్తానని ఆలపాటి బెదిరించారు. వారం క్రితం ఆలపాటి నాకు ఫోన్ చేసి నిన్ను వదలను అని బెదిరించారు. సీపీని కలిసి నన్ను రక్షించాలని కోరా.. .. గతంలో ఒకసారి కూడా నన్ను కిడ్నాప్ చేసి గుంటూరు ఇంటికి తీసుకు వెళ్ళారు. ఆ సమయంలో కూడా పోలీసులకి నా కుమారుడు ఫిర్యాదు చేస్తే అర్ధరాత్రి నన్ను విడిచి పెట్టారు. ఈ విషయాన్ని సీఎం దృష్టికి ఈ విషయం తీసుకెళ్లానని ఆలపాటి నన్ను బెదిరిస్తున్నారు. నేను ఆలపాటి పై డిజిపికి కూడా ఫిర్యాదు చేశాను. శాతవాహన కళాశాల విషయంలో ఆలపాటికి సంబంధం లేకపోయినా ఆయన చెప్పినట్టు వినాలని నన్ను బెదిరిస్తున్నారు. అధికార పార్టీ నేత కాబట్టి నేనేం చేయలేక రక్షణ కోసం పోలీసులని ఆశ్రయించాను అని శ్రీనివాస్ మీడియాతో అన్నారు. -
గవర్నర్‌ను కలవనున్న వైఎస్సార్సీపీ బృందం
సాక్షి, తాడేపల్లి: పులివెందులలో టీడీపీ అరాచకాలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లాలని వైఎస్సార్సీపీ నిర్ణయించింది. జెడ్పీటీసీ ఉప ఎన్నికల ప్రచారంలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్‌పై టీడీపీ గుండాలు దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ విషయమై.. గురువారం సాయంత్రం వైఎస్సార్సీపీ నేతలు గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను కలవనున్నారు. సీనియర్ నేత, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ నేతృత్వంలోని బృందం ఆయన్ని కలిసి జరిగిన పరిణామాలను వివరించనుంది. అదే సమయంలో దాడికి పాల్పడిన వారి మీద చర్యలు తీసుకోకుండా ఏకపక్షంగా బాధితులమీద కేసులు నమోదు అవుతున్న విషయం పైనా ఫిర్యాదు చేయనుంది. పులివెందులలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చర్యలు చేపట్టాలని బొత్స బృందం గవర్నర్‌ను కోరనున్నట్లు సమాచారం. -
ఆడలేక మద్దెల ఓడు అన్నట్లు..
ఆంధ్రప్రదేశ్ మంత్రులు లోకేశ్, పి.నారాయణల వ్యాఖ్యలు చూస్తే మతిపోతుంది. ఎవరో ఒకరు టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి ప్రభుత్వంపై ఫిర్యాదు చేస్తే సింగపూర్ తమ రాష్ట్రంలో పెట్టుబడులకు తటపటాయిస్తోందని వీరు అంటున్నారు. మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ఇంకో అడుగు ముందుకేసి ఏమన్నారంటే.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం సిఐడీ ద్వారా సింగపూర్‌లోని ప్రముఖులు కొందరిని బెదిరించిందీ అని! నవ్విపోదురు గాక అన్నట్టుగా లేవూ ఈ వ్యాఖ్యలు? తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ఎంతటికైనా సిద్ధపడతారన్నమాట వీళ్లు! కాకపోతే ఆ క్రమంలో తమ అసమర్థతను తామే బయటపెట్టుకున్న విషయాన్ని వారు మరచిపోతున్నారు. పెట్టుబడులు పెట్టేందుకు తటపటాయిస్తోందంటే సింగపూర్ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం విశ్వసనీయతను సందేహిస్తున్నట్లే అవుతుంది కదా?వాస్తవానికి పెట్టుబడిదారులైనా, ప్రభుత్వాలైనా అజ్ఞాత వ్యక్తుల మెయిళ్ల ఆధారంగా నిర్ణయాలు తీసుకోరు. మెయిళ్లలోని విషయాలను విచారించి నిర్ధారించుకోవచ్చు అంతే. ఫిర్యాదులు ఉన్నా లేకపోయినా కూడా ఇది జరుగుతూంటుంది. ముఖ్యమంత్రి, మంత్రులు చెప్పేదాంట్లో నిజానిజాలెంత? అన్నది బేరీజు వేసుకుంటారు. అన్నింటినీ పరిగణలోకి తీసుకున్న తరువాత లాభమొస్తుందనుకుంటే పెట్టుబడి పెడతారు లేదంటే లేదు. అంతే. ప్రభుత్వాల తీరుతెన్నులు, ఆయా ప్రాజెక్టుల ప్రయోజనం, పెట్టుబడులు పెడితే వచ్చే లాభనష్టాలు, ప్రభుత్వాలు కల్పించే రాయితీలు, సదుపాయాలు మొదలైన వాటిపై ఆధారపడి ఆయా సంస్థలు నిర్ణయాలు తీసుకుంటాయి. ఈ విషయం ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్ వంటి వారికి తెలియకుండా ఉంటుందా!జగన్ నిర్వాకం వల్ల సింగపూర్‌తో సంబంధాలు దెబ్బతిన్నాయని, వాటిని పునరుద్దరించడానికి వెళుతున్నారని చంద్రబాబు టూర్‌కు ముందే వ్యాఖ్యానించారు. తన పరపతి అంతా ఉపయోగించి అమరావతి ప్రాజెక్టులో సింగపూర్ వారిని మళ్లీ భాగస్వాములను చేస్తామని ప్రచారం చేసుకున్నారు. తీరా అక్కడికెళ్లాక ఏమైంది? అమరావతి ప్రాజెక్టులో పెట్టుబడులు పెట్టడం లేదని ఆ దేశ మంత్రి టాన్ సే కుండబద్ధలు కొట్టారు. సాంకేతిక సహకారం మాత్రం అందిస్తామన్నారు. అది కూడా మాట వరసకు అన్నట్లే అనిపిస్తుంది. సింగపూర్ కంపెనీలు కూడా పెద్దగా ఆసక్తి చూపని విషయం ఇప్పటికే స్పష్టమైంది. లేకుంటే టీడీపీ మీడియా ఇప్పటికే ఫలానా కంపెనీ ఇంత పెట్టుబడి పెడుతుంది అంటూ ఊదరగొట్టేది. అది కాకుండా లోకేశ్ చేసిన ఆరోపణలను ప్రముఖంగా ఇచ్చారు. మురళికృష్ణ అనే వ్యక్తి కూటమి ప్రభుత్వానికి స్థిరత్వం లేదని, ఎప్పుడైనా పడిపోవచ్చని ఫిర్యాదులు చేశారట. ఆ వ్యక్తి రాస్తే సింగపూర్ ప్రభుత్వం ఎలా నమ్ముతుంది! కూటమికి 164 సీట్లు ఉన్న సంగతి ఆ దేశంవారికి తెలియకుండా ఉంటుందా!మరో కోణం చూద్దాం. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వ కార్యకలాపాలపై అభిప్రాయలు చెప్పేందుకు ఎవరికైనా స్వేచ్ఛ ఉంది. ఈ అభిప్రాయాలు ప్రభుత్వానికి అనుకూలంగా ఉండవచ్చు లేకపోవచ్చు కూడా. భావ ప్రకటన స్వేచ్ఛ అది. దీని గురించి మంత్రి లోకేశ్‌కు తెలుసో తెలియదో కానీ ఏ మార్గం ద్వారానైనా సరే ప్రభుత్వంపై ఫిర్యాదు చేయడం తప్పు కాదు కానీ.. దుష్ప్రచారం చేయడం తప్పు. అలాంటి తప్పుడు ప్రచారాలపై ప్రభుత్వాలు కచ్చితంగా చర్య తీసుకుంటాయి. కూటమి నేతలు జగన్ ప్రభుత్వంపై ఎన్ని రకాల అసత్య ప్రచారాలు చేశారో గుర్తు లేదా? వైసీపీ ప్రభుత్వ అప్పులపై అబద్ధపు ప్రచారం చేయడమే కాకుండా.. రకరకాలుగా కేంద్రానికి ఫిర్యాదులు కూడా చేశారే! అయినా ఫలితం లేకపోవడంతో అప్పటి రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి నేరుగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిసి అప్పుల వివరాలు దాచేస్తోందంటూ చిత్రమైన ఆరోపణ కూడా చేశారు. జగన్ ప్రభుత్వం ఈ తాటాకు చప్పుళ్లకు వెరవలేదు సరికదా.. కూటమి నేతల మాదిరిగా బేలగా మాట్లాడనూ లేదు. తాము పెట్టుబడులు తీసుకురావడానికి ప్రయత్నిస్తుంటే వైసీపీ వారు పుల్లలు పెడుతున్నారన్నట్లుగా లోకేశ్ ఆరోపించారు. మురళీకృష్ణ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కంపెనీతో సంబంధాలు ఉన్న వాడని ఆరోపించారు. తీరా చూస్తే ఎన్నారై అయిన ఆ వ్యక్తి ఎన్నికలకు ముందు టీడీపీ కూటమి విజయం కోసం శ్రమించారని, డబ్బు కూడా ఖర్చు చేశాడని తేలింది. టీడీపీ అధికారంలోకి వచ్చాక ఎదురైనా చేదు అనుభవాలు, లోకేశ్‌ను కలిసేందుకు కూడా సిబ్బంది ముడుపులు అడగటంతో బాధతో సింగపూర్ ప్రభుత్వానికి మెయిల్ పెట్టాడని తెలిసింది. లోకేశ్ వీటిల్లో నిజానిజాలు నిర్ధారించుకోకుండానే తండ్రి మాదిరిగానే తన వైఫల్యాలను ఇతరులపై నెట్టేసే ప్రయత్నం చేశారు. టీడీపీ నేతలు చిలకలూరిపేట వద్ద ఉన్న తన భవనాన్ని కూడా కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు సెటిల్ చేసుకోవడానికి రూ.కోటి డిమాండ్ చేశారని మురళీకృష్ణ వాపోతున్నాడు. ఈ అంశంపైనే చంద్రబాబు, లోకేశ్‌లను కలవడానికి ప్రయత్నించి విఫలమైనట్టు సమాచారం. ఈ నేపథ్యంలో సింగపూర్ కంపెనీలు తమకు వచ్చిన ఫిర్యాదులను చూపించి చంద్రబాబును ప్రశ్నించారంటూ మీడియాలో మరో కథనం వచ్చింది.ఈ వ్యవహారంపై చంద్రబాబు కూడా లోకేశ్‌పై అసంతృప్తి వ్యక్తం చేశారని ఆ వార్త చెబుతోంది. ఇది నిజమా? కాదా? అన్నది పక్కనబెడితే లోకేశ్ హుందా రాజకీయం చేయకుండా, అసత్య ప్రచారాలకు పూనుకుని దెబ్బతిన్నట్లు అనిపిస్తుంది. మురళీ కృష్ణ ఎవరో తెలిసి కూడా అతని గురించి అబద్ధం చెప్పారన్న భావనకు ఆయన అవకాశం ఇచ్చారనిపిస్తుంది. ఇక మంత్రి నారాయణ చేసిన వ్యాఖ్య అయితే అర్థం పర్థం లేనిది.గత ప్రభుత్వం సీఐడీ వారిని పంపించి ఎంక్వైరీ చేయించిందని, దానివల్ల ఆ దేశ ప్రభుత్వానికి, ఏపీకి సంబంధాలు దెబ్బతిన్నాయాని, వాటిని మళ్లీ పునరుద్దించడానికి చంద్రబాబు ఆధ్వర్యంలో సింగపూర్ వెళ్లామని అన్నారు. ఇన్ని విద్యా సంస్థలు నడిపే వ్యక్తి ఇలా మాట్లాడడం ఎబ్బెట్టుగా ఉంది. ఒక రాష్ట్రం అధికారులు ఇంకో దేశంలోకి వెళ్లి విచారణ చేయడం సాధ్యమా? కేంద్రంతో సంబంధం లేకుండా చేస్తారా? ఆ మాత్రం పరిజ్ఞానం కూడా ఈయనకు లేదా! ఏదో ఒకటి మాట్లాడి బట్ట కాల్చి మీద వేయడం అంటే ఇదేనేమో! నిజానికి సింగపూర్ ప్రభుత్వం గతంలో ఏపీతో ఎలాంటి ఒప్పందం చేసుకోలేదు. కేవలం ఆ దేశ కంపెనీలు అవగాహన కుదుర్చుకున్నాయి. వాటికి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవడానికి 1700 ఎకరాల భూమి కేటాయించడమే కాకుండా, ఏపీ ప్రజల సొమ్ము వేల కోట్ల రూపాయల ఖర్చు చేసి రోడ్లు తదితర సదుపాయాలు కల్పించాలని తలపెట్టారు. దానిపై అనేక విమర్శలు వచ్చాయి. అయినా ఆ ప్రాజెక్టు లాభసాటి కాదని భావించి ఆ కంపెనీలు వెనక్కి తగ్గాయని చెబుతారు. మరో సంగతి చెప్పాలి. చంద్రబాబుకు సన్నిహితుడుగా భావించే సింగపూర్ మంత్రి ఈశ్వరన్ అవినీతి కేసులో జైలుకు వెళ్లింది వాస్తవమా? కాదా? అన్నదాని గురించి చంద్రబాబు, లోకేశ్, నారాయణలు ఎవరూ మాట మాత్రం కూడా ప్రస్తావన తేకుండా జాగ్రత్తపడ్డారు. ఏది ఏమైనా ఎదుటివారిపైన రాయి వేసే ముందు అది తమకే తగులుతుందేమో అని ఆలోచించుకోవాలి. ఏతావాతా సింగపూర్ నుంచి చంద్రబాబు బృందం రిక్త హస్తాలతోనే తిరిగి వచ్చినట్లేనా? అంటే కూటమి ప్రభుత్వంపై ఆ దేశ ప్రభుత్వానికి, సంస్థలకు నమ్మకం లేనట్లు అనుకోవాలా?:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
పులివెందులలో రౌడీ రాజ్యం.. వైఎస్సార్సీపీ నేతలపైనే ఎదురు కేసులు
సాక్షి, వైఎస్సార్ జిల్లా: పులివెందులలో జెడ్పీటీసీ ఉప ఎన్నికల పోరు వేళ.. తెలుగు దేశం పార్టీ రౌడీలు రాజ్యమేలుతున్నారు. వైఎస్సార్సీపీ నాయకులే టార్గెట్‌గా దాడులకు తెగబడిన పచ్చదండు.. ఇప్పుడు పోలీసుల సాయంతో గాయపడినవాళ్లపైనే తిరిగి కేసులు పెట్టి దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు.బుధవారం.. వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, వేల్పుల రాముపై దాడి జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటనలో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. వేల్పుల రాము, హేమాద్రిలతో పాటు 52 మందిపై పోలీసులు ఎస్సీ ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేయడం కొసమెరుపు. మంగళవారం బీటెక్ రవీ అనుచరులు వీరంగం సృష్టించడం, తదనంతరం బుధవారం నల్లగొండువారి పల్లె ఘటనల్లో వైఎస్సార్సీపీ నేతలపై దాడులు జరిగిన సంగతి తెలిసిందే. అయితే రెండు రోజులుగా జరుగుతున్న పరిణమాల్లో దాడికి పాల్పడిన ఒక్కరినీ పోలీసులు అరెస్ట్ చేయలేదు. పైగా ఒంటిపై గాయాలే కనపడకపోతే ఎలా అరెస్ట్ చేస్తాం? అంటూ డీఐజీ కోయ ప్రవీణ్ వెటకారంగా మాట్లాడడమూ చర్చనీయాంశంగా మారింది. పులివెందులలో వైఎస్సార్సీపీ నేతలపై జరిగిన దాడులకు సంబంధించి పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వైఎస్సార్సీపీ నేతలను అవమానించేలా పోలీసులు వ్యవహరిస్తున్నారు. పైగా తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న వారిపై ఎదురు కేసులు పెడుతున్నారు. మరో వైపు గ్రామాల్లో వైఎస్సార్సీపీ నాయకులపై కొనసాగుతున్న బైండోవర్ కేసులు పెడుతున్నారు. రక్తమొడుతున్నట్లు తలలు పగులగొట్టినా.. ఒంటిపై గాయాలు లేవంటూ కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ వ్యాఖ్యానించడం గమనార్హం. ప్రచారం చేసే పల్లెల్లో కాకుండా వేరే చోటికి వెళ్లి పత్తి వేపారం చేస్తే రక్షణ కల్పించలేమని, తాము లేకపోతే తలకాయలే ఎగిరి పోయేయంటూ వివాదాస్పద వాఖ్యలు చేశారు. ప్రభుత్వ పెద్దల ఆదేశాలతోనే పోలీసులు దాడులకు తెగబడిన వాళ్ల జోలికి వెళ్లడం లేదని, ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని వైఎస్సార్సీపీ మండిపడుతోంది. -
రామకుప్పంలో ప్రజాస్వామ్యం ఖూనీ
సాక్షి, చిత్తూరు: స్వయానా సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలో టీడీపీ అప్రజాస్వామికంగా వ్యవహరించింది. అడ్డదారిలో మణీంద్రం ఎంపీటీసీ స్థానాన్ని కైవసం చేసుకుంది. నామినేషన్ల పరిశీలనకు వెళ్లకుండా వైఎస్సార్సీపీ అభ్యర్థి హర్పితను టీడీపీ గూండాలు అడ్డుకున్నారు. దీంతో ఆమె నామినేషన్‌ను ఎన్నికల అధికారులు తిరస్కరించారు.2021లో జరిగిన ఎన్నికల్లో ఎంపీటీసీగా గెలుపొందిన శాంతకుమారి అనారోగ్యంతో మృతి చెందిన నేపథ్యంలో ఉప ఎన్నిక అవసరమైంది. గత నెల 30 నుంచి ఈనెల 1వ తేదీ వరకు నామినేషన్ల ప్రక్రియ జరిగింది. టీడీపీ అభ్యర్థులుగా అరుణ, విశాలాక్షి, వైఎస్సార్సీపీ అభ్యర్థిగా శాంతకుమారి తనయ హర్పిత నామినేషన్లు దాఖలు చేశారు. అయితే.. హర్పితను రెండో సెట్ నామినేషన్ వేయనీయకుండా టీడీపీ శ్రేణులు అడ్డుకున్నాయి. దీంతో ఆమె తనకు రక్షణ కల్పించాలని పోలీసులను ఆశ్రయించారు. అయితే పోలీసులు ఈ విషయాన్ని అస్సలు పట్టించుకోలేదు. ఈలోపు రామకుప్పం మండలంలో ఒక్క స్థానం గెలవని టీడీపీ, అప్రజాస్వామికంగా వైఎస్సార్సీపీ ఎంపీటీసీలను తమ వైపు తిప్పుకుంది. అదే సమయంలో టీడీపీ గూండాల వల్ల హర్పిత నామినేషన్ల పరిశీలనకు వెళ్లలేకపోయారు. ఫలితంగా మణీంద్రం ఎంపీటీసీ స్థానాన్ని టీడీపీ కైవసం చేసుకున్నట్లు అధికారులు ప్రకటించారు. రామకుప్పంలో ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యిందనే చర్చ జోరందుకుందక్కడ. -
ఎందుకీ రౌడీ రాజకీయాలు? : వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల్లో సీఎం చంద్రబాబు తీవ్ర అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ రౌడీ రాజకీయాలు చేస్తున్నారని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. పులివెందుల మండలం నల్లగొండువారిపల్లెలో బీసీ సామాజిక వర్గానికి చెందిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ రమేశ్ యాదవ్, వేముల మండల పార్టీ పరిశీలకుడు వేల్పుల రామలింగారెడ్డిపై టీడీపీ మూకలు హత్యాయత్నానికి పాల్పడ్డాయన్నారు. వైఎస్సార్సీపీ నాయకులు ప్రయాణిస్తున్న కారును ధ్వంసం చేసి రమేశ్‌యాదవ్, రామలింగారెడ్డిను తీవ్రంగా గాయపరిచారన్నారు. ఏం పాపం చేశారని దాడి చేశారు? ఎందుకు ఇలా గాయపరిచారు? అని ‘ఎక్స్’ వేదికగా వైఎస్ జగన్ నిలదీశారు. ఈమేరకు బుధవారం తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశారు. ‘మంగళవారం సాయంత్రం పులివెందులలో జరిగిన మరో ఘటనలో.. ఓ వివాహానికి హాజరైన వైఎస్సార్సీపీ నాయకులపై ఫంక్షన్ హాల్లోనే టీడీపీ వాళ్లు దాడి చేశారు. ఈ ఘటనలో అమరేష్‌రెడ్డి, సైదాపురం సురేష్‌రెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. అడ్డుకోబోయిన పెళ్లివారిని, శ్రీకాంత్, నాగేశ్, తన్మోహన్రెడ్డి తదితరులను కూడా దారుణంగా కొట్టారు..’ అని పేర్కొన్నారు. ‘ఇప్పటివరకూ దాదాపు 100 మందికిపైగా వైఎస్సార్సీపీ కార్యకర్తలను బైండోవర్ చేశారు. ఇంకా చాలామందిని బైండోవర్ చేసి నిర్బంధించాలని యత్నిస్తున్నారు. ఇంత బరి తెగించి దాడులు చేసిన టీడీపీ వారిపై కేసులు లేవు. అరెస్టులు కూడా లేవు. టీడీపీ నుంచి ఒక్కరిని కూడా బైండోవర్ చేయలేదు’ అని ధ్వజమెత్తారు. ‘మా పార్టీకి చెందిన నాయకుడిని బెదిరించి, భయపెట్టి తమవైపు లాక్కుని.. ఆ పార్టీ మారిన వ్యక్తితో తప్పుడు ఫిర్యాదు ఇప్పించారు. దాన్ని అడ్డు పెట్టుకుని వైఎస్ భాస్కర్‌రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, ఎంపీ అవినాష్‌రెడ్డి పీఏ రాఘవరెడ్డి, మరో కార్యకర్త గంగాధర్‌రెడ్డిపై పోలీసులు మరో తప్పుడు కేసు పెట్టారు..’ అని మండిపడ్డారు. ‘పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక షెడ్యూల్ వచ్చినప్పటి నుంచి చంద్రబాబు ఆదేశాల మేరకు ఒక పథకం ప్రకారం కుట్రలు చేస్తూ ప్రశాంతంగా ఉన్న పల్లెల్లో హింసను రాజేస్తున్నారు. ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఈ ఎన్నిక జరగకూడదని... వైఎస్సార్సీపీకి చెందిన కార్యకర్తలు, నాయకులెవరూ తిరగకూడదని పోలీసులను ఉపయోగించుకుని చంద్రబాబు ఈ అరాచకాలన్నీ చేయిస్తున్నారు..’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఒకవైపు అక్రమ కేసులు, అరెస్టులు, బైండోవర్లతో పోలీసులు మా పార్టీ నాయకులను, కార్యకర్తలను బెదిరిస్తుంటే మరోవైపు టీడీపీ గ్యాంగ్‌లు టార్గెట్ చేసి దాడులకు పాల్పడుతున్నాయి. ఈ గ్యాంగ్‌లు దాడులు చేసేందుకు వీలుగా ఉద్దేశ పూర్వకంగానే పోలీసులు ప్రేక్షక పాత్రను పోషిస్తున్నారు. రెండు రోజులుగా వరుసగా దారుణ ఘటనలకు కారకులైన వారిలో ఒక్కరిని కూడా అరెస్టు చేయలేదు. చంద్రబాబు ఆదేశాల మేరకు ఈ ప్రాంత డీఐజీ ఈ కుట్రను అమలు చేస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఒక జడ్పీటీసీ స్థానం కోసం చంద్రబాబు ఇంతగా దిగజారిపోతారా?’ అని వైఎస్ జగన్ సూటిగా ప్రశ్నించారు. ‘పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో శాంతి భద్రతలు దిగజారడంతో పాటు పోలీసులు టీడీపీకి కొమ్ముకాయడం, వ్యవస్థలను నీరుగార్చడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామన్నారు. ఈ అంశాన్ని గవర్నర్ దృష్టికి తెస్తామని ప్రకటించారు. చంద్రబాబు రౌడీ రాజకీయాలను పులివెందుల సహా రాష్ట్ర ప్రజలు ఎవరూ సహించరని, ఆయనకు తగిన బుద్ధి చెబుతారని స్పష్టం చేశారు. ‘ఎల్లకాలం మీ ప్రభుత్వమే ఉండదు. కళ్లు మూసి తెరిచేసరికి మరో మూడేళ్లు అయిపోతాయి. ఆ తర్వాత మీరు చేసిన ఈ అన్యాయాలన్నీ వడ్డీతో సహా తిరిగి చుట్టుకుంటాయని గుర్తుపెట్టుకోవాలి’ అని హెచ్చరించారు. -
బరితెగించిన 'బాబు గ్యాంగ్'
పూర్వం రాజుల కాలంలో బందిపోట్లుండేవారు.. ఉన్నట్లుండి మెరుపు దాడులు చేస్తూ దోచుకెళ్లేవారు.. ప్రస్తుతం రాష్ట్రంలో చంద్రబాబు దొంగల ముఠా అంతకు మించి అన్నట్లు బరితెగించి వ్యవహరిస్తోంది.. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నిక నేపథ్యంలో చంద్రబాబు ఆదేశాల మేరకు ఆ ముఠా అక్కడి ప్రజలను భయాందోళనకు గురి చేయడమే లక్ష్యంగా మెరుపు దాడులకు ఉపక్రమించింది.. గుంపులు గుంపులుగా వాహనాల్లో రావడం.. ఆయుధాలు చేత పట్టుకుని విచక్షణా రహితంగా దాడులు చేసి వెళ్లడం పరిపాటిగా మారింది.. ఇదంతా పోలీసుల కనుసన్నల్లోనే జరుగుతుండటం దుర్మార్గం.. ఎలాగైనా సరే పోలింగ్ రోజున ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు రాకుండా చేసి.. ఓటింగ్ క్యాప్చర్ చేసి గెలవాలనే కుతంత్రంతో ఇలా చేస్తోంది.. ఈ అరాచకం చంద్రబాబు అండ్ గ్యాంగ్ ఆటవిక పాలనకు అచ్చుగుద్దినట్లు అద్దం పడుతోంది.సాక్షి, టాస్క్‌ఫోర్స్: వైఎస్సార్ కడప జిల్లా పులివెందుల రూరల్ మండలం జెడ్పీటీసీ ఉప ఎన్నిక వేళ చంద్రబాబు అండ్ గ్యాంగ్ బరితెగించింది. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరిగితే డిపాజిట్ కూడా దక్కదనే భయంతో ప్రజల్లో భయాందోళనలు సృష్టించడమే లక్ష్యంగా కుట్రలు, కుతంత్రాలకు తెగబడింది. ఇందులో భాగంగానే కొద్ది రోజులుగా వైఎస్సార్సీపీ నేతలపై వరుస దాడులకు పాల్పడుతూ వసు్తన్న ఈ సైకో గ్యాంగ్.. తాజాగా వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, వేముల మండల నాయకుడు వేల్పుల రామలింగారెడ్డి (వేల్పుల రాము)లపై బుధవారం పులివెందుల రూరల్ మండలం నల్లగొండువారిపల్లెలో హత్యాయత్నం చేసింది. ఇనుప సమ్మెటలు, రాడ్లు చేత పట్టుకుని టీడీపీ రౌడీ మూకలు విచక్షణారహితంగా దాడికి దిగాయి. వాడే.. టార్గెట్.. వేయండి.. అంటూ సైకోల్లా అరుపులు, కేకలతో అరగంటపాటు రెచ్చిపోయాయి. ఈ దాడిలో రామలింగారెడ్డి తలకు బలమైన గాయం కాగా, ఎమ్మెల్సీ భుజం ఎముక విరిగింది. ఊహించని పరిణామాన్ని ఎదుర్కొన్న వైఎస్సార్సీపీ నేతలకు ఆ గ్రామ మహిళలు అండగా నిలిచి, ప్రతిఘటించేందుకు సిద్ధమవడంతో టీడీపీ మూకలు అక్కడి నుంచి తోకముడిచాయి. ప్రత్యక్ష సాక్షుల కథనం మేరకు... పులివెందుల మండలం నల్లగొండువారిపల్లె గ్రామానికి చెందిన చెన్నారెడ్డి.. వేల్పుల రామలింగారెడ్డికి సమీప బంధువు. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక సందర్భంగా ఆయనతో చర్చించేందుకు ఎమ్మెల్సీ రమేష్ యాదవ్‌తో కలిసి వేల్పుల రామలింగారెడ్డి బుధవారం ఆ గ్రామానికి వెళ్లారు. అక్కడ ఆయనతో మాట్లాడిన తర్వాత పక్కనే ఉన్న సింగిల్ విండో మాజీ అధ్యక్షుడు ఈశ్వరరెడ్డితో మాట్లాడేందుకు వెళ్తుండగా, ఒక్కమారుగా టీడీపీ రౌడీ మూకలు వారిని చుట్టుముట్టాయి. వేల్పుల రామలింగారెడ్డి తలపై రాడ్డుతో కొట్టారు. దీంతో తల పగిలి ఆయన కింద పడిపోయారు. పక్కనే ఉన్న ఎమ్మెల్సీ రమేష్ యాదవ్‌పైనా అదే స్థాయిలో దాడి చేశారు. రమేష్ యాదవ్ తల తిప్పడంతో భుజంపై రాడ్ల దెబ్బలు పడ్డాయి. దాంతో ఆయన భుజం ఎముకలు విరిగిపోయాయి. ఆపై ఎమ్మెల్సీ రేంజ్ రోవర్, వేల్పుల రామలింగారెడ్డికి చెందిన ఫార్చ్యూనర్, స్కార్పియో వాహనాలను సమ్మెటలతో ధ్వంసం చేయగా..అలజడి రేగడంతో ఇళ్లలో నుంచి బయటకు వచ్చిన మహిళలు.. కింద పడిపోయిన రామలింగారెడ్డికి అడ్డుగా నిలిచారు. ఆయనపై మళ్లీ దాడి చేయబోతుండగా టీడీపీ మూకలను అడ్డుకున్నారు. కొంత మంది మహిళలు ఆయనను లాక్కెళ్లి పక్కనే ఉన్న ఇంట్లో వేసి తాళం వేశారు. దీంతో టీడీపీ రౌడీలు.. తాళం వేసిన ఇంటి లోపలికి పెట్రోల్ చల్లారు. నిప్పు పెట్టేందుకు విఫలయత్నం చేశారు. గొడవ జరుగుతోందనే విషయం గ్రామం మొత్తానికి తెలియడంతో గ్రామస్తులంతా అక్కడికి వచ్చారు. గ్రామస్తులు తిరగబడటంంతో టీడీపీ రౌడీ మూకలు అక్కడి నుంచి పలాయనం చిత్తగించారు.తుద ముట్టించేందుకు పక్కా ప్రణాళికవేల్పుల రామలింగారెడ్డి ఆ ప్రాంతంలో టీడీపీ నాయకులకు కంటగింపుగా ఉన్నారు. టిఫెన్ బెరైటీస్ కంపెనీ కేర్‌టేకర్‌గా కొనసాగుతున్నారు. అందులో నిల్వ ఉన్న కోట్లాది రూపాయల విలువైన బెరైటీస్ దోపిడీపై.. టీడీపీ నేత, ఎమ్మెల్సీ బీటెక్ రవి సహకారంతో వేముల పార్థసారథిరెడ్డి, మబ్బుచింతపల్లె శ్రీనాథరెడ్డి దొంగిలించారని ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. టిఫెన్ బెరైటీస్‌లో అక్రమ మైనింగ్‌కు అడ్డుగా నిలవగంతో ఆయన టీడీపీ నేతలకు టార్గెట్ అయ్యారు. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. రెండు రోజుల క్రితం కనంపల్లె, మోట్నూతల గ్రామాల్లో ప్రచారం చేపట్టారు. ఈ పరిస్థితుల్లో టీడీపీ శ్రేణులు మరింతగా రెచ్చిపోయాయి. పక్కా ప్రణాళికతో ఆయన్ను తుద ముట్టించాలని టీడీపీ శ్రేణులు కుట్ర పన్నాయి. బుధవారం ఆయన ఎమ్మెల్సీ రమేష్ యాదవ్‌తో కలిసి నల్లగొండువారిపల్లెకు వెళ్లారని తెలుసుకుని.. ఇనుçప సమ్మెటలు, రాడ్లు.. పెట్రోల్ బాటిళ్లు తదితర మారణాయుధాలతో అక్కడికి వెళ్లి మాటు వేశారు. ఇవన్నీ పరిశీలిస్తే వేల్పుల రామలింగారెడ్డిని అంతం చేయాలని పక్కా ప్రణాళికతోనే టీడీపీ మూకలు వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో తలపై రాడ్డుతో కొట్టగానే రామలింగారెడ్డి కింద పడిపోగా, ఆ వెంటనే ఎమ్మెల్సీ రమేష్ యాదవ్‌పై వారు దాడికి దిగారు. ఆ సమయంలో గుంపులో నుంచి ‘వీడితో పాటు వాడిని కూడా వదలొద్దు’ అంటూ కేకలు విన్పించడంతో మళ్లీ రామలింగారెడ్డి వైపు తిరిగారు. అప్పటికే మహిళలు అడ్డుగా నిలవడంతో రెండోసారి దాడి చేయడం సాధ్యపడలేదని తెలుస్తోంది. గ్రామంలో కాకుండా మార్గం మద్యలో దాడి జరిగి ఉంటే రామలింగారెడ్డి, ఎమ్మెల్సీ రమేష్ హత్యకు గురై ఉండే వారని గ్రామస్తులు చెబుతున్నారు. హైకోర్టు ఆదేశించినా భద్రత కరువుటీడీపీ నేతలతో ప్రాణహాని ఉందని, టిఫెన్ బెరైటీస్ కంపెనీకి కేర్ టేకర్‌గా ఉన్న తనకు పలువురితో ముప్పు ఉందని.. భద్రత కల్పించాలని వేల్పుల రామలింగారెడ్డి పోలీసు యంత్రాంగాన్ని అభ్యర్థించారు. ఏడాదిగా ఎలాంటి స్పందన లేకపోవడంతో హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు వన్ ప్లస్ వన్ భద్రత కల్పించాలని ఆదేశించింది. గన్మెన్ల జీతాలు సొంతంగా చెల్లించేందుకు ఆయన అంగీకరించడంతో ఆ దిశగా హైకోర్టు ఉత్తర్వులిచ్చింది. హైకోర్టు ఉత్తర్వులు వెలువడి నెల అవుతున్నా, వాటిని పోలీసులు అమలు పరచలేదు. అంటే ఆయన్ను తుద ముట్టించే కుట్రలో వారు కూడా భాగస్వాములు కావడం దుర్మార్గం. ఈ దాడిలో ఆయన ఆ గ్రామ మహిళల అండతో వెంట్రుక వాసిలో ప్రాణాలు దక్కించుకున్నారు. ఈ ఘటనపై వైఎస్సార్సీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులు ఏ ఒక్కరిపై బుధవారం రాత్రి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు.వరుస ఘటనలు.. యథేచ్ఛగా నిందితులుమంగళవారం పులివెందుల శ్రీకర్ ఫంక్షన్ హాల్లో వివాహానికి వెళ్లిన వైఎస్సార్సీపీ నేతలు సైదాపురం సురేష్‌కుమార్‌రెడ్డి (చంటి), అమరేష్‌రెడ్డి, నాగేష్, శ్రీకాంత్, తన్మోహన్రెడ్డి పై టీడీపీ రౌడీ మూకలు హత్యాయత్నం చేశాయి. అక్కులగారి విజయ్‌కుమార్‌రెడ్డి, మహబూబ్‌బాషా (కిరికిరి బాషా) ముఠా దాడి చేసి వెళ్లిపోయింది. ఈ విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేస్తే.. కేసు నమోదు చేసి చేతులు దులుపుకున్నారు. బుధవారం వేల్పుల రామలింగారెడ్డి, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్‌లపై హత్యాయత్నం ఘటనలో కూడా అదే ముఠాతో పాటు వేముల పార్థసారథిరెడ్డి సోదరుడు పేర్ల శేషారెడ్డి సమీప బంధువులు పాల్గొన్నారు. ఈ ఘటనలోనూ పోలీసులు వెంటనే స్పందించక పోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రశాంతమైన పులివెందులలో ఉద్రిక్తతలకు బ్రేక్ వేయాల్సిన పోలీసు వ్యవస్థ నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నందునే వరుస ఘటనలు తెరపైకి వస్తున్నాయని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.కర్రలు, రాళ్లతో దాడి చేశారు.. మా గ్రామంలో సింగిల్ విండో ప్రెసిడెంట్ ఈశ్వరరెడ్డి, చెన్నారెడ్డిల ఇళ్ల వద్దకు వేల్పుల రామలింగారెడ్డి, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్‌లు మాట్లాడేందుకు వచ్చారు. ఇది తెలుసుకున్న టీడీపీ అల్లరి మూకలు 15 వాహనాల్లో మా ఊరికి వచ్చారు. వచ్చీ రాగానే నాలుగు వాహనాలను ధ్వంసం చేసి.. రామలింగారెడ్డి, రమేష్ యాదవ్‌లను గాయపరిచారు. కర్రలు, రాడ్లతో కొట్టారు. – సునీల్ కుమార్‌రెడ్డి, గ్రామస్తుడు, నల్లగొండువారిపల్లె ఎదురుపడి ఉంటే చంపేసేవారు మా గ్రామం రోడ్డుపై వేల్పుల రామలింగారెడ్డి, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్‌లు ఎదురుపడి ఉంటే టీడీపీ మూకలు వారిని చంపేసేవి. వాహనాలపై పెట్రోలు పోసి నిప్పంటించే ప్రయత్నం చేశారు. గ్రామస్తులు అడ్డుపడకపోతే వారిని హతమార్చేవారు. – వెంకట్రామిరెడ్డి, గ్రామస్తుడు, నల్లగొండువారిపల్లె ఇలాంటి సంస్కృతి ఎన్నడూ లేదుజెడ్పీటీసీ ఉప ఎన్నిక ప్రజాస్వామ్యయుతంగా జరగకూడదనే టీడీపీ వారు ఇలా దాడులకు పాల్పడ్డారు. ఇంటిపై పెట్రోలు పోసి.. నిప్పంటించబోయారంటే ఎంతగా తెగించారో ఇట్టే తెలుస్తోంది. 40 ఏళ్లుగా ఇలాంటి సంస్కృతి ఎన్నడూ లేదు. – వై.వేణుగోపాల్‌రెడ్డి, గ్రామస్తుడు, నల్లగొండువారిపల్లెపోలీసుల తీరుపై శాంతియుత ర్యాలీవైఎస్సార్సీపీ నాయకులపై వరుసగా హత్యాయత్నాలు జరుగుతున్నా పోలీసు అధికారులు కనీస చర్యలు తీసుకోకపోవడం, నిందితుల్ని అరెస్టు చేయకుండా యథేచ్ఛగా మరిన్ని దాడులు చేసేందుకు ఆస్కారం కల్పించడంపై వైఎస్సార్సీపీ శ్రేణులు కడపలో బుధవారం శాంతియుతంగా నిరసన ర్యాలీ చేపట్టారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి, జిల్లా అధ్యక్షుడు పోచంరెడ్డి రవీంద్రనాథరెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాదరెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్‌కుమార్‌రెడ్డి, కడప మేయర్ సురేష్‌బాబు, మాజీ మంత్రి అంజాద్‌బాషా, కమలాపురం ఇన్చార్జి నరేన్ రామాంజులరెడ్డి ఈ ర్యాలీలో పాల్గొన్నారు. వందలాది మందితో 3 కిలోమీటర్ల మేర ర్యాలీ కొనసాగింది. అనంతరం అర్బన్ పోలీసు స్టేషన్లో డీఎస్పీ మురళీనాయక్‌కు వినతిపత్రం అందించారు.బాబు డైరెక్షన్.. బీటెక్ రవి యాక్షన్⇒ పులివెందుల నియోజకవర్గంలో భయాందోళనలు సృష్టించడమే లక్ష్యంగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు డైరెక్షన్లో ఎమ్మెల్సీ బీటెక్ రవి యాక్షన్ చేస్తున్నారు. మంగళవారం రాత్రి వైఎస్సార్సీపీ నేతలు సురేష్ కుమార్‌రెడ్డి, అమరేష్‌రెడ్డి తదితరులపై హత్యాయత్నం ఘటనలో టీడీపీ వర్గీయులైన అక్కులగారి విజయ్‌కుమార్‌రెడ్డి, కిరికిరిబాషా బృందంపై వైఎస్సార్సీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ వెంటనే మీడియా ముందుకు వచ్చిన బీటెక్ రవి.. సురేష్ కుమార్‌రెడ్డికి వైఎస్సార్సీపీ నేతలకు మధ్య తేడాలు వచ్చాయని, అందుకే ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారని.. దీంతో వైఎస్సార్సీపీ శ్రేణులు ఆయనపై దాడి చేసి, నింద తమపై మోపారని చెప్పుకొచ్చారు. బుధవారం నాటి ఘటనతో టీడీపీకి సంబంధం లేనిదని తప్పించుకోజూశారు. ⇒ మరోవైపు రామలింగారెడ్డి వేముల మండలానికి చెందిన ఎస్సీ కార్యకర్తలను కులం పేరుతో దూషించడంతోనే ఘర్షణ చోటుచేసుకుందని ఇష్యూను డైవర్ట్ చేసే ప్రయత్నం చేశారు. కొద్ది రోజులుగా ఇక్కడ ఏం జరుగుతోందో స్థానికులందరికీ స్పష్టంగా తెలిసినా, బీటెక్ రవి ఇలా బరితెగించి మాట్లాడటంపై విస్తుపోతున్నారు. ⇒ టీడీపీ పులివెందుల ఇన్చార్జి బీటెక్ రవి కుట్రలు, ఎత్తుగడలకు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి తోడయ్యారు. వరుసగా వైఎస్సార్సీసీ నాయకులపై దాడి చేయడం ఈ కుట్రలో భాగం. బహుళ ప్రయోజనాలు ఆశించి ఇలా దాడులు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో మరింత మంది వైఎస్సార్సీపీ నేతల్ని టార్గెట్ చేసి దాడి చేయనున్నట్లు సమాచారం. ఇలా వరుస దాడులతో పులివెందుల మండల ఓటర్లలో భయాందోళన సృష్టించడమే లక్ష్యంగా పని చేస్తున్నారు. తద్వారా జెడ్పీటీసీ ఉప ఎన్నికలను వైఎస్సార్సీపీ బహిష్కరించేలా చేయడం, లేదా ఒకవేళ ఓటింగ్ జరిగినా ఓటర్లు ఎవరూ పోలింగ్ కేంద్రాలకు రాకుండా చూడటమే లక్ష్యమని తెలుస్తోంది.ఓటమి తప్పదనే భయోత్పాతంవైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మండిపాటుసాక్షి, అమరావతి: పులివెందులలో టీడీపీ గూండాల దాడి ఘటనను వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ తీవ్రంగా ఖండించారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగితే తమకు ఓటమి తప్పదన్న సంగతి అర్థమై, కూటమి నేతలు ఇలా భయోత్సాతం సృష్టిస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ గూండాల దాడిలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, వేల్పుల రామలింగారెడ్డిను బుధవారం ఆయన ఫోన్లో పరామర్శించారు. వారితోపాటు టీడీపీ నేత బీటెక్ రవి అనుచరుల దాడిలో మంగళవారం గాయపడ్డ వైఎస్సార్సీపీ నేతలు సైదాపురం సురేష్ రెడ్డి (చంటి), అమరేష్ రెడ్డితో కూడా మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితిపై వాకబు చేశారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని అడ్డదారుల్లో గెలవాలనే ప్రయత్నాన్ని కూటమి నేతలు చేస్తున్నారని, దీనిని తిప్పికొడదామని పార్టీ నేతలకు జగన్ సూచించారు. టీడీపీ కూటమి నేతలు వ్యవస్థలను అడ్డంపెట్టుకుని అధికార దుర్వినియోగానికి పాల్పడడం దారుణమన్నారు. ఈ అనైతిక కార్యక్రమాలన్నింటినీ ప్రజలు గమనిస్తున్నారని.. జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీకి తగిన బుద్ధి చెబుతారన్నారు. వైఎస్సార్సీపీ నేతలంతా ధైర్యంగా ఉండాలని, పార్టీ అందరికీ అండగా ఉంటుందని జగన్ భరోసా ఇచ్చారు. -
వైఎస్సార్సీపీలో నూతన నియామకాలు
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో పదవుల భర్తీలో భాగంగా పలు నియామకాలను ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టారు. ఆయన ఆదేశాల మేరకు వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. పార్టీ యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్లుగా ఐదుగురు నియమితులయ్యారు.శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాలకు అన్నంరెడ్డి అదీప్ రాజు.. కాకినాడ, కోనసీమ, తూర్పు, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాలకు కారుమూరి సునీల్ కుమార్.. కృష్ణ, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాలకు పేర్ని కిట్టు.. ప్రకాశం, నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాలకు భూమన అభినయ్ రెడ్డి.. వైఎస్సార్, కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి జిల్లాలకు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిలను పార్టీ నియమించింది. -
ఓటమి తప్పదనే పులివెందులలో టీడీపీ గూండాల అరాచకాలు: వైఎస్ జగన్
సాక్షి, వైఎస్సార్ జిల్లా: తన సొంత నియోజకవర్గం పులివెందులలో గత రెండ్రోజులుగా జరిగిన పరిణామాలపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఆరా తీశారు. టీడీపీ శ్రేణుల మూక దాడిలో గాయపడిన నలుగురిని బుధవారం సాయంత్రం ఆయన ఫోన్ ద్వారా పరామర్శించారు. ఈ క్రమంలో చోటు చేసుకున్న అరాచ ఘటనలను తీవ్రంగా ఖండించారాయన. అధికారాన్ని అడ్డుపెట్టుకుని అడ్డదారుల్లో గెలవాలనే ప్రయత్నాన్ని కూటమి నేతలు చేస్తున్నారని, దీనిని బలంగా తిప్పికొడదామని వైఎస్ జగన్ ఈ సందర్భంగా బాధితులకు సూచించారు. ‘‘వ్యవస్ధలను అడ్డం పెట్టుకుని అధికార దుర్వినియోగానికి పాల్పడడం దారుణం. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగితే తమకు ఓటమి తప్పదన్న సంగతి అర్ధమై ఇలా కూటమి నేతలు భయోత్సాతం సృష్టిస్తున్నారు. ఈ అనైతిక కార్యక్రమాలన్నీ ప్రజలు గమనిస్తున్నారు. జెడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీకి తగిన బుద్ది చెబుతారు’’ అని జగన్ బాధితులతో అన్నారు. వైఎస్సార్సీపీ నాయకులంతా ధైర్యంగా ఉండాలని, పార్టీ అందరికీ అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు.పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక నేపథ్యంలో టీడీపీ గూండాలు బరి తెగించారు. పోలీసులు చూస్తుండగానే.. ఎమ్మెల్సీ, వైఎస్సార్సీపీ బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు రమేష్ యాదవ్‌పై దాడికి దిగారు. ఈ దాడిలో మరో నేత వేల్పుల రాము కూడా తీవ్రంగా గాయపడ్డారు. దీంతో ఇద్దరినీ ఆస్పత్రికి తరలించారు. ఇప్పటికే ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి సహా పలువురు పార్టీ నేతలు బాధితుల్ని పరామర్శించి సంఘీభావం తెలిపారు. ఈ ఇద్దరితో పాటు టీడీపీ నేత బీటెక్ రవి అనుచరుల దాడిలో గాయపడ్డ సురేష్ రెడ్డి, అమరేశ్వర్ రెడ్డిలతోనూ వైఎస్ జగన్ ఫోన్లో మాట్లాడి ధైర్యం చెప్పారు. -
వైఎస్సార్సీపీకి ఓటేసిన కూటమి కార్పొరేటర్లు
సాక్షి, విశాఖపట్నం: జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికలో కూటమికి గట్టి షాక్ తగిలింది. వైఎస్సార్సీపీ కార్పొరేటర్ పద్మ రెడ్డి విజయం సాధించారు. భారీగా క్రాస్ ఓటింగ్ జరగ్గా.. కూటమి కార్పొరేటర్లు వైఎస్సార్సీపీకి ఓటు వేశారు. మొత్తం సీట్లు గెలుస్తామంటూ కూటమి నేతలు బీరాలు పలికారు. 50 ఓట్లతో పద్మ రెడ్డి గెలుపొందారు. పార్టీ ఫిరాయింపు కార్పొరేటర్లను ఓటింగ్‌కు వాడుకున్నా కానీ కూటమికి భంగపాటు తప్పలేదు.కార్పొరేటర్ పద్మా రెడ్డి మాట్లాడుతూ.. తనకు ఓటు వేసిన 50 మంది కార్పొరేటర్లకు ధన్యవాదాలు తెలిపారు. బీసీ వర్గానికి చెందిన మహిళను మార్చారనే బాధ కార్పొరేటర్లలో ఉందన్నారు. గతంలో స్టాండింగ్ ఎన్నికలకు ఎక్కడా డబ్బులు ఖర్చు చేయలేదు. ఇప్పుడు కూటమి క్యాంపు రాజకీయాలకు తెర లేపింది. కూటమి బాధితులు తమకు సహకరించారని ఆమె పేర్కొన్నారు.కూటమి పాలనకు చెంప పెట్టు: కేకే రాజువైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు మాట్లాడుతూ.. జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో కార్పొరేటర్లు ఇచ్చిన తీర్పు కూటమి పాలనకు చెంప పెట్టు అన్నారు. ‘‘గతంలో అడ్డగోలుగా మేయర్ పదవిని కూటమి కైవసం చేసుకుంది. బీసీ మహిళకు జగన్ అవకాశం ఇస్తే అడ్డదారిలో మహిళా మేయర్‌ను దించేశారు. స్టాండింగ్ కమిటీ ఎన్నికలకు ఎన్నడూ డబ్బుతో రాజకీయం చేయలేదు. స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో కూడా క్యాంప్ రాజకీయం చేశారు. మాకున్న బలం 32 మంది కార్పొరేటర్లు. వైఎస్సార్సీపీ తరఫున పోటీ చేసిన అందరికీ 32 ఓట్ల కంటే అధికంగా వచ్చాయి.50 ఓట్లతో ఒక స్టాండింగ్ కమిటీ సీట్ గెలిచాం. కూటమి కార్పొరేటర్లు కూడా మాకు ఓటు వేశారు. ఇప్పటికైనా చంద్రబాబు కళ్ళు తెరవాలి. గెలిచిన స్థానాన్ని ప్రకటించడానికి కూడా ఇబ్బంది పెట్టారు. వైఎస్సార్సీపీ నుంచి బయటకు వెళ్లిన కార్పొరేటర్లు పశ్చాత్తాప పడి మాకు ఓట్లు వేసి ఉండచ్చు. కూటమి భయభ్రాంతులకు గురి చేసినా పోటీ చేసిన వారికి అభినందనలు’’ అని కేకే రాజు పేర్కొన్నారు. -
పులివెందులలో టీడీపీ రౌడీ రాజకీయాలు.. పోలీసులకు ముందే తెలుసు
పులివెందులలో బీసీ నేత.. ఎమ్మెల్సీ రమేష్ యాదవ్‌పై టీడీపీ శ్రేణుల దాడికి పాల్పడడంపై వైఎస్సార్సీపీ భగ్గుమంది. జెడ్పీటీసీ ఉపఎన్నికలను హింసాత్మకంగా మారుస్తున్నారంటూ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో.. పోలీసులకు తెలిసే పథకం ప్రకారం ఈ దాడి జరిగిందని అంటోంది.సాక్షి, విజయవాడ: పులివెందులలో టీడీపీ గూండాల దాడి ఘటనపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్నికి వైఎస్సార్సీపీ బుధవారం ఫిర్యాదు చేసింది. ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, వేల్పుల రామలింగారెడ్డి గాయపడిన విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లి.. తగిన చర్యలు తీసుకోవాలని కోరింది. అదే సమయంలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిపించాలని కోరుతూ ఓ వినతి పత్రం అందజేసింది. అనంతరం పార్టీ నేతలు మీడియాతో మాట్లాడారు.‘‘చంద్రబాబుకి వయసు పెరిగేకొద్దీ బుద్ధి సన్నగిల్లుతోంది. పులివెందులకు టీడీపీ గూండాలను పంపి దాడులు చేయిస్తున్నారు. కత్తులు, రాళ్లతో దాడి చేసి ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, వేల్పుల రామలింగారెడ్డి చంపాలని చూశారు. అక్కడి పోలీసులకు తెలిసే ఇదంతా జరిగింది. పథకం ప్రకారమే చంపేందుకు ప్రయత్నించారు. ఏదోరకంగా రౌడీయిజం చేసి ఎన్నిక గెలవాలని చూస్తున్నారు. ఇల్లు అలకగానే పండుగ కాదు. రేపు జగన్ వచ్చాక పరిస్థితి ఏంటో ఆలోచించుకోండి’’ అని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు.మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ.. ఏపీలో పోలీస్ యంత్రాంగం ఉందా?. టీడీపీ గుండాలు దాడులు చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారు. కావాలనే వందల మందిని బైండోవర్ చేస్తున్నారు అని అన్నారు.ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ మాట్లాడుతూ.. అరాచకం,దౌర్జన్యాలతో గెలవాలని చూస్తున్నారు. పులివెందులలో టీడీపీ గూండాలకు సహకరించిన పోలీసులు, అధికారులను చట్టం ముందు నిలబెడతాం అని అన్నారు.అంతకు ముందు.. పులివెందుల దాడి ఘటనను ఖండిస్తూ ఎన్నికల కమిషనర్ కార్యాలయం బయట వైఎస్సార్సీపీ నేతలు ధర్నా చేపట్టారు. కార్యాలయం ఎదుట బైఠాయించి.. దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి , విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
పులివెందుల పౌరుషానికి సంబంధించిన ఎన్నిక ఇది: సతీష్‌రెడ్డి
సాక్షి, వైఎస్సార్ జిల్లా: కడప ఎస్పీని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ రెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి కలిశారు. పులివెందుల, ఒంటిమిట్ట ఎన్నికల నేపథ్యంలో టీడీపీ అరాచకాలపై ఫిర్యాదు చేశారు. ఎన్నికలు నిష్పక్షపాతంగా నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. నిన్న వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడికి సంబంధించి కూడా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. నిందితులపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని కోరారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని వినతి పత్రం అందజేశారు.అనంతరం సతీష్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఇది పులివెందుల పౌరుషానికి సంబంధించిన ఎన్నిక. టీడీపీ నేతల ఆగడాలను అంతులేకుండా పోతోంది. దాడులకు పాల్పడుతూ మా శ్రేణులను రెచ్చగొడుతున్నారు. టీడీపీ దాడులకు భయపడేది లేదు. ఏ క్షణంలోనైనా మమ్మల్ని అరెస్ట్ చేయొచ్చు. తర్వాత మా కేడర్‌ను అరెస్ట్ చేయొచ్చు. మాపై దాడులు చేసినా.. మా ప్రాణాలు లేకుండా పోయినా.. మా ఆడవాళ్లు ముందరుండి ఎన్నిక నడిపిస్తారు. పులివెందుల మహిళల చేతుల్లో ఎన్నిక బాధ్యత పెడుతున్నాం. గ్రామాల్లో మగాళ్లను తరిమేసినా మా ఆడవాళ్లు ఎన్నికను గెలిపిస్తారు’’ అని ఆయన పేర్కొన్నారు.వైఎస్సార్సీపీ సానుభూతిపరులు సురేష్ కుమార్‌రెడ్డి, అమరేశ్వర రెడ్డిపై దాడి అమానుషమన్నారు. వివాహానికి వెళ్తున్న వీరిపై టీడీపీ నాయకులు మూకుమ్మడిగా దాడి చేశారు. వారిని చంపాలని అధికార పార్టీ నాయకులకు చెందిన అనుచరులు దాడులు చేశారు. శాంతియుతంగా ఉన్న పులివెందులలో అరాచకాలు సృష్టిస్తున్నారు. పులివెందులలో భయాందోళనలకు గురి చేసేలా అల్లర్లు చేస్తున్నారు. దాడి చేసిన దుండగులపై ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు లేవు’’ అంటూ సతీష్‌రెడ్డి మండిపడ్డారు.‘‘ఇవాళ మళ్ళీ దాడులు చేసిన వాళ్లే ఉదయం రసూల్ అనే వైఎస్సార్సీపీ నాయకుడిపై దాడికి ప్రయత్నించారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరిగేలా చూడాలి. ఎటువంటి అల్లర్లకు ఆస్కారం లేకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తామని ఎస్పీ హామీ ఇచ్చారు. వైఎస్సార్సీపీ సానుభూతి పరులపై బైండోవర్ పెడతామని బెదిరిస్తున్నారు. టీడీపీ నాయకుల మాట విని దాడులు చేస్తే చూస్తూ ఊరుకుని కూర్చునే వారు లేరు. గత ప్రభుత్వ హయాంలో అన్ని ఎన్నికలు శాంతియుతంగా ఎన్నికలు నిర్వహించారు. అనవసరమైన నిందలు, ఆరోపణలు చేస్తూ ప్రజలలో అపోహలు సృష్టిస్తున్నారు...2019 నుండి 24 వరకు జగన్ సీఎం గా ఉండగా ఎప్పుడూ ఇలా జరగలేదు. టీడీపీ నాయకులు స్వేచ్చగా తిరగలేదా?. రాంగోపాల్ రెడ్డి పట్టభద్రుల ఎమ్మెల్సీగా నిలబడితే ఎక్కడైనా గొడవలు జరిగాయా?. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరిగాయి. శాంతిభద్రతలు కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. మద్యం స్కాం అంటూ విష ప్రచారం చేస్తున్నారు. వెంకటేష్ నాయుడు అనే వ్యక్తి అందరితో ఫోటోలు దిగారు. టీడీపీ నాయకులు, బీజేపీ నాయకులతో అనేక ఫోటోలు ఉన్నాయి. కేవలం జగన్ తో ఫోటో దిగితే తమకు సంబంధించిన వ్యక్తి ఎలా అవుతాడు?. ఎల్లో మీడియా లో విష ప్రచారం తగదు. దుష్ప్రచారం తో ప్రజలను నమ్మించాలని చూస్తే ప్రజలు అన్ని గమనిస్తూనే ఉంటారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా ప్రజలు స్వచ్ఛందంగా జగన్ పర్యటనకు తరలివస్తున్నారు’’ అని సతీష్‌రెడ్డి అన్నారు. -
పులివెందులలో పట్టపగలు ప్రజాస్వామ్యం ఖూనీ: వైఎస్సార్సీపీ
సాక్షి, విశాఖపట్నం: పులివెందుల్లో వైఎస్సార్సీపీ నేతలపై టీడీపీ గూండాల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ అన్నారు. పులివెందులలో ప్రజాస్వామ్యాన్ని కూటమి సర్కార్ పట్టపగలే ఖూనీ చేసిందన్నారు. నల్లగొండువారిపల్లెలో ప్రభుత్వ అండతో రెచ్చిపోయిన టీడీపీ గూండాలు.. చివరికి ఎమ్మెల్సీ రమేష్ యాదవ్‌పై కూడా దాడికి దిగడం దారుణమని బొత్స అన్నారు.ఒక శాసనమండలి సభ్యుడికి పోలీసులు కనీస భద్రత కల్పించలేరా..?. వైఎస్సార్సీపీ నేత వేల్పుల రాముతో పాటు పలువురిపైన దాడులు చేశారు. వాహనాలను ధ్వంసం చేసి, పెట్రోల్ పోసి నిప్పంటిస్తామంటూ అరాచకం సృష్టించారు. టీడీపీ గూండాల దాడులకు పోలీసులు మద్దతిస్తున్నారా?. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నామా.? నియంత పాలనలో ఉన్నామా.?’’ అంటూ బొత్స నిలదీశారు.‘‘సీఎం చంద్రబాబు ఈ ఘటనకు బాధ్యత వహించాలి. పులివెందుల్లో శాంతిభద్రతలను కాపాడేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ తక్షణం చర్యలు తీసుకోవాలి’’ అని బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు.వైఎస్సార్ జిల్లా: పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలో మేము ముందుగా చెప్పినట్లే టీడీపీ అరాచకాలు ప్రారంభమయ్యాయని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘వరుసగా బైండోవర్ కేసులు, కౌన్సిలింగ్ అంటూ వైఎస్సార్సీపీ కార్యకర్తలను స్టేషన్లకు పిలిపిస్తున్నారు. మా వాళ్ళపై ప్రత్యక్ష దాడులకు దిగుతున్నారు. పులివెందులలో హింస చెలరేగిపోతోంది’’ అంటూ రాచమల్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.కేవలం వైఎస్ జగన్‌ను ఓడించాం అని చెప్పుకునేందుకు తాపత్రయ పడుతున్నారు. నిన్న మా వాళ్లు పెళ్లికి వెళ్తే దాడులకు దిగారు. హత్యాయత్నం చేశారు. అందర్నీ భయబ్రాంతులకు గురిచేస్తున్నారు. ప్రజలని ఓటింగ్‌కి రాకుండా చేయాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. 16 మందిపై హత్యాయత్నం కేసు పెట్టామన్నారు. వాళ్లను అరెస్ట్ చేశారా..?. దేనికోసం వారు ఈ దాడులకు దిగుతున్నారు అనేది బయటకు చెప్పాలి. వెంటనే వారిని రిమాండ్‌కి పంపండి. ఇవాల మరొక నాయకుడు వేల్పుల రాముపై దాడికి దిగారు....ప్రజాస్వామ్యంలో ఇది సక్రమమైన పద్ధతేనా..? ప్రజలు దీన్ని హర్షిస్తారా..?.. పోలీసులు చట్టప్రకారం వ్యవహరిస్తే ఇలాంటి దాడులు ఎందుకు జరుగుతాయి..?. రానున్న రోజుల్లో హత్యలు కూడా చేయడానికి వెనుకాడరు. ఈ హింసను ప్రజలు, పులివెందుల ఓటర్లు గమనించాలి’’ అని రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి పేర్కొన్నారు. -
‘వైఎస్సార్సీపీ కార్యకర్తలే టార్గెట్.. మొత్తం టీడీపీ బ్యాచ్ పులివెందులలోనే ఉంది’
సాక్షి, పులివెందుల: పులివెందులలో ఎన్నిక నిర్వహిస్తున్నది ఎన్నికల సంఘమా? లేక ప్రభుత్వమా? అని ప్రశ్నించారు వైఎస్సార్సీపీ ఎంపీ అవినాష్ రెడ్డి. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలో తాము ఓడిపోతామనే టీడీపీ అసహనానికి గురైంది. ఉప ఎన్నిక సజావుగా జరగకుండా చూడాలని కుట్ర చేస్తోంది. జిల్లా మొత్తం నుంచి టీడీపీ కార్యకర్తలు పులివెందులలో దిగారని ఆరోపించారు.వైఎస్సార్సీపీ ఎంపీ అవినాష్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా మాట్లాడుతూ.. ప్రజల్లో కూటమి ప్రభుత్వంపై అసంతృప్తి స్పష్టంగా కనిపిస్తోంది. కూటమి ప్రభుత్వం హామీలు ఇచ్చి మోసం చేసింది. సూపర్ సిక్స్, సెవెన్ పేరుతో ప్రజలకు నిండా ముంచారు. ఉప ఎన్నికల్లో గెలివలేరని కూటమికి అర్థమైంది. అందుకే కూటమి నేతలు కుట్రలు చేస్తున్నారు. ఇండిపెండెంట్లు, వైఎస్సార్సీపీ కార్యకర్త పెళ్లికి వెళ్తే దాడి చేశారు. వాళ్లపై కేసులు నమోదైనా.. మరోసారి దాడికి యత్నించారు. ఉప ఎన్నిక సజావుగా జరగకుండా చూడాలని కూటమి కుట్ర చేస్తోంది. జిల్లా మొత్తం నుంచి టీడీపీ కార్యకర్తలు పులివెందులలో దిగారు. వైఎస్సార్సీపీ నాయకులను కావాలనే బైండోవర్ చేస్తున్నారు.ఎన్నిక నిర్వహిస్తున్నది ఎన్నికల సంఘమా? లేక ప్రభుత్వమా?. పులివెందుల ప్రజలు ఎంతో తెలివైన వాళ్లు. ఈ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డిని గెలిపిస్తారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా కార్యకర్తలు సంయమనం పాటించాలి. పోలీసులు బెదిరించి మరీ పోలీసు స్టేషన్లకు తరలిస్తున్నారు. నల్లపురెడ్డిపల్లికి చెందిన భాస్కర్ రెడ్డిపై కేసులు లేకపోయినా బైండోవర్ అంటూ స్టేషన్‌కు తరలించారు. ఎన్నిక జరిగే పులివెందుల మండలానికి సంబంధం లేని లింగాల రామలింగారెడ్డిపై కేసులు లేకపోయినా బైండోవర్ నమోదు చేశారు. ఇలా ఈ రెండు రోజుల్లోనే 100 మందికి పైగా వైఎస్సార్సీపీ నాయకులను బైండోవర్ చేశారు అని ఆరోపించారు. -
బిల్డప్ బాబు కొత్త బొంకులు.. పచ్చ మీడియాపై సెటైర్లు!
‘చంద్రబాబు.. మీ మోసం మరోసారి రుజువైంది’ అంటున్నారు మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్. ఎన్నికల సందర్భంగా ప్రతి రైతుకూ ఏడాదికి రూ.20 వేల చొప్పున పెట్టుబడి సాయం అందిస్తామని టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి తమ ‘సూపర్ సిక్స్’ హామీల్లో ప్రకటిస్తే.. పద్నాలుగు నెలలు అధికారంలో ఉన్న తరువాత ఇప్పుడు కేవలం ఐదు వేల చొప్పున పంపిణీ చేయడంపై జగన్ ఈ వ్యాఖ్య చేశారు.పైగా.. ‘అన్నదాత సుఖీభవ కింద రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం’ అన్న చంద్రబాబు వ్యాఖ్యలనూ తప్పుపట్టారు. మాటిచ్చి తప్పడం చంద్రబాబుకు ఇదేమీ కొత్త కాదు. గతాన్ని చూస్తే ఇలాంటి సంఘటనలు బోలెడు కనిపిస్తాయి. కానీ, బాబు తప్పిదాలను కప్పిపుచ్చేందుకు ఎప్పటికప్పుడు కలరింగ్ ఇస్తూనే ఉంటారు. ఇప్పుడు కూడా చంద్రబాబు తన మాట నిలబెట్టుకున్నాడూ అనే అభిప్రాయం కలిగించేలా చేసేందుకు ఆయన వ్యాఖ్యలను హైలైట్ చేస్తున్నారు. అయితే ఇచ్చిన మాట నిలబెట్టుకున్నదెవరూ? ఎప్పటికప్పుడు కొత్త కొత్త సాకులు, బొంకులతో మాట తప్పింది ఎవరన్నది రైతులకు తెలియదా?.జగన్ ప్రభుత్వం ఏటా రైతులకు పెట్టుబడి సాయం కింద రూ.13,500 క్రమం తప్పకుండా చెల్లించిన విషయం ఇక్కడ చెప్పుకోవాల్సి ఉంటుంది. చెప్పినదాని కంటే ఒక ఏడాది ఎక్కువగానే ఇచ్చింది కూడా. అయినా ఆ రోజుల్లో ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు విమర్శలు కురిపించేవారు. కేంద్రమిస్తున్న నిధులను కూడా తన పథకంలోకి కలిపి ఎలా ఇస్తారని ప్రశ్నించే వారు. తాము అధికారంలోకి వస్తే రైతులకు ఏడాదికి రూ.20 వేలు ఇస్తామని హామీ ఇచ్చారు. కేంద్రం ఇచ్చే సాయంతో దీనికి సంబంధం లేదన్నట్లే చెప్పారు. 2014లో రూ.89వేల కోట్ల రుణాలు మాఫీ చేస్తానని హామీ ఇచ్చి రూ.15 వేల కోట్లతో సరిపెట్టిన విషయంపై రైతుల్లో అసంతృప్తి ఉన్నప్పటికీ ఈసారి మాట తప్పరేమో అనుకుని ఉండవచ్చు. కానీ ఆయన తీరేమీ మారలేదు. తొలి ఏడాది పెట్టుబడి సాయం మొత్తం ఇవ్వలేదు. రెండో ఏడు కూడా ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకతను తట్టుకోలేక.. ఈ విషయాన్ని తరచూ ప్రస్తావిస్తున్న ప్రతిపక్ష నేతకు అడ్వాంటేజ్ వస్తుందేమో అన్న బెంగతో అరకొర అమలుకు సిద్ధమయ్యారు. ఇదే పూర్తి సాయం అన్న బిల్డప్‌కు తెరలేపారు.‘తల్లికి వందనం’ తీరులోనే ‘అన్నదాత సుఖీభవ’ లోనూ ఏడు లక్షల మందిని తగ్గించారని లెక్కలు చెబుతున్నాయి. అంతేకాక ఇరవై వేల బదులు రూ.14 వేలే ఇస్తామని ప్రకటించారు. ఆరు వేల చొప్పున కోత పెట్టారన్నమాట. దీన్ని మాట నిలబెట్టుకోవడం అంటారా? కాకపోతే చంద్రబాబు ఏ అసత్యాన్ని అయినా అలవోకగా చెప్పగల నేర్పరి. కూటమి ఎన్నికల ప్రణాళికనూ, ప్రభుత్వం అమలు చేసిన వాటిని పోల్చి చూస్తే ఈ విషయం తేలికగా తెలిసిపోతుంది. తల్లికి వందనం స్కీమ్ తర్వాత అన్నీ అమలు చేసేశామని, ఇంకెవరైనా అమలు కాలేదంటే నాలుక.. అంటూ వెంటనే సర్దుకుని మందం అనుకోవాలని వ్యాఖ్యానించారు. ఇప్పుడు అన్నదాత సుఖీభవ అమలలో కోత పెట్టినా, ఒక ఏడాది ఎగ్గొట్టినా, ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం అని చంద్రబాబు చెప్పగలిగారు. నిజాయితీగా వ్యవహరించి ఉంటే.. ఇంత ఇవ్వాలని అనుకున్నాం.. కానీ అలా చేయలేకపోతున్నాం.. మన్నించాలని అడుగుతారు. అలా మాట్లాడకపోతే మానే.. అంతా చేసేసినట్లు మభ్య పెట్టాలని అనుకోవడమే చంద్రబాబు స్పీచ్ హైలైట్. దీనిని దృష్టిలో ఉంచుకునే జగన్ తన ప్రకటనలో చంద్రబాబు మోసం మరోసారి నిజమైందని అన్నారు.ఒక్కో రైతుకు ఇప్పటికి రూ.40 వేల చొప్పున ఇవ్వాల్సి ఉంటే ఇచ్చింది కేవలం ఐదు వేలే అని వ్యాఖ్యానించారు. వచ్చే రోజుల్లో మిగిలిన తొమ్మిది వేలు ఇచ్చినా రూ.26 వేల వరకు రైతులకు బాకీ పడినట్లే అవుతుంది కదా!. ప్రకాశం జిల్లాలో జరిగిన ఈ కార్యక్రమంలో కొన్ని వింతలు కూడా చోటు చేసుకున్నాయి. ప్రభుత్వం నిర్వహించిన సభలో నులక మంచాలు వాడారట. వాటిపై చంద్రబాబు కూర్చున్నారట. ప్రజలూ అలాగే చేశారట. ఇది సింప్లిసిటీ అనుకోవాలన్నది వారి లక్ష్యం కావచ్చు. కాని కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని నులక మంచాల దశకు తీసుకువెళ్లిందన్న విమర్శలకు ఆస్కారం ఇచ్చారని కూడా భావించవచ్చు. నిత్యం హెలికాప్టర్లో చిన్న, చితక కార్యక్రమాలకు కూడా కోట్లు ఖర్చు చేస్తూ అటెండ్ అవుతుండే చంద్రబాబు నులక మంచంపై కూర్చుంటే రైతులకు ఒరిగేది ఏం ఉంటుంది. వారికి ఇవ్వవలసిన గత ఏడాది బకాయి రూ.20 వేలు ఇచ్చి ఉంటే రైతులు కూడా శభాష్ అని ఉందురు కదా!.మరో సన్నివేశం ఏమిటంటే చంద్రబాబు హెలికాఫ్టర్ దిగి ఆటోలో ప్రయాణించడం. దీని కోసం ప్రత్యేక ఏర్పాట్లు, ఆటో డ్రైవర్‌తో ఐటీ గురించి కూడా మాట్లాడించడం, కెమెరాల కోసం చేతులు ఊపుతూ వెళ్లడం అంతా తమాషాగా ఉంది. సత్య నాదెళ్ల మైక్రోసాఫ్ట్ సీఈవో అయ్యారంటే అది మనం చూపిన చొరవ అని అనడంలో కొందరైనా నమ్మకపోతారా అన్న భావన ఉండవచ్చు. కానీ, ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి అలా మాట్లాడితే నవ్వుల పాలు అవుతామన్న సంగతిని విస్మరిస్తున్నారు. చంద్రబాబు ఈ మధ్య ఎక్కడికి వెళ్లినా బడ్డి కొట్టు వద్దకో, సెలూన్ షాప్ వద్దకో వెళ్లి సామాన్యులను పలకరిస్తున్నారు. అది తప్పు కాదు. కానీ, ముందస్తు ఏర్పాట్లు చేసుకుని వెళ్లడం వల్ల అదంతా షోగా మారుతోందే తప్ప, వాస్తవ పరిస్థితి తెలుసుకునే ఆలోచన ఉన్నట్లు అనిపించదు.టీడీపీ మీడియా ఆహో, ఓహో అని భజన చేయవచ్చు. నిప్పులు చెరుగుతున్న ఎండలో చంద్రబాబు కూర్చున్నారని, భారీ వేదికలు లేవని, షామియానాలు లేవని గొప్ప విషయంగా ప్రచారం చేశారు. నిజమే.. ఇకపై అన్ని కార్యక్రమాలు ఇలాగే ప్రభుత్వానికి ఖర్చు లేకుండా చేస్తారని కూడా ఈ మీడియా గ్యారంటీ ఇచ్చి ఉండాల్సింది. పెంచిన వెయ్యి ఫించన్ ఇవ్వడం కోసం లక్షల రూపాయల వ్యయం చేస్తూ చంద్రబాబు చేస్తున్న ప్రచారార్భాటాన్ని కూడా టీడీపీ మీడియా ఆపగలిగితే మెచ్చుకోవచ్చు. ఇక యథా ప్రకారం వైఎస్సార్సీపీపై బురద చల్లుడు కూడా చంద్రబాబు సాగించారు. మహిళలపై వైఎస్సార్సీపీ వారు దౌర్జన్యాలు చేశారని, పార్టీ కార్యకర్త కాన్వాయ్ కింద పడితే పొదల్లో పడేశారనో, ఇంకా ఏవేవో వ్యాఖ్యలు చేసి చంద్రబాబు తన స్థాయిని తగ్గించుకుంటున్నారు.టీడీపీ వారికి మాత్రమే ముఖ్యమంత్రి అన్నట్లు వ్యవహరించడం పద్దతి అనిపించదు. వైఎస్సార్సీపీ మహిళా నేతలపై కొందరు టీడీపీ నేతలు, ఎమ్మెల్యేలు చేస్తున్న అరాచక వ్యాఖ్యలపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా, వైఎస్సార్సీపీ నేతల ఇళ్లపై దాడులు చేస్తున్నవారిపై కనీసం కేసులు పెట్టకుండా ఉంటున్న ఈ ప్రభుత్వాన్ని ప్రజా ప్రభుత్వం అనాలా? లేక కొందరి కోసమే పని చేసే ప్రభుత్వం అనుకోవాలా?. -కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
పులివెందులలో పచ్చ అరాచకం.. వైఎస్సార్సీపీ నేతలపై బైండోవర్
సాక్షి,వైఎస్సార్: పులివెందులలో పచ్చ నేతల అరాచకం తారాస్థాయికి చేరుకుంది. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలో తాము ఓడిపోతామనే అసహనానికి గురైంది. అధికారబలాన్ని ఉపయోగించి వైఎస్సార్సీపీ కీలక నాయకులను అరెస్ట్ చేసి బైండోవర్ కేసులు నమోదు చేస్తోంది.ఎటువంటి కేసులు లేకపోయినా కావాలని బైండోవర్ కేసులు నమోదు చేస్తున్నారు. నల్లపురెడ్డిపల్లికి చెందిన భాస్కర్ రెడ్డిపై కేసులు లేకపోయినా బైండోవర్ అంటూ స్టేషన్‌కు తరలించింది. మంగళవారం ఎన్నిక జరిగే పులివెందుల మండలానికి సంబంధం లేని లింగాల రామలింగారెడ్డిపై కేసులు లేకపోయినా బైండోవర్ నమోదు చేసింది. ఇలా ఈ రెండు రోజుల్లోనే 100 మందికి పైగా వైఎస్సార్సీపీ నాయకులను బైండోవర్ చేసింది. మరో వైపు కూటమి శ్రేణులు.. వైఎస్సార్సీపీ నేతలపై ప్రత్యక్ష దాడులకు తెగబడుతున్నారు. వివాహానికి వెళ్లిన వైఎస్సార్సీపీ నేతలపై విచక్షణారహితంగా దాడి చేశారు. హత్యా యత్నానికి ప్రయత్నించారు. కాగా, పులివెందులలో విచ్చలవిడిగా టీడీపీ మూకలు చెలరేగిపోతున్నా .. పోలీసులు కట్టడి చేయకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
బాబూ.. నేను ఎమ్మెల్యేను!
ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ): యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్‌కుమార్ (జనసేన పార్టీ)కి మంగళవారం దుర్గగుడిలో చేదు అనుభవం ఎదురైంది. అమ్మవారి దర్శనానికి వస్తున్నట్లు ఆయన ఆలయ అధికారులకు, ప్రొటోకాల్‌కు సమాచారం అందించారు.ఈ క్రమంలో ఉదయం 11.30 గంటల సమయంలో కారులో ఘాట్‌రోడ్డు మీదగా ఓం టర్నింగ్‌కు చేరుకున్న ఎమ్మెల్యే కారును సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. ప్రొటోకాల్ నుంచి సమాచారం లేనందున అక్కడే కారు నిలుపుకోవాలని డ్రైవర్‌కు సూచించారు. కారులో ఎమ్మెల్యే ఉన్నారని డ్రైవర్ చెప్పినా సిబ్బంది వినలేదు. దీంతో ఎమ్మెల్యే కారు అద్దం కిందకు దింపి తాను ఎమ్మెల్యేనని చెప్పుకోవాల్సి వచ్చింది. ఇంతలో విషయం తెలుసుకున్న ప్రొటోకాల్ అధికారులు సెక్యూరిటీ సిబ్బందిని హెచ్చరించడంతో వారు కారును సమాచార కేంద్రం వరకు అనుమతించారు.దీంతో, అక్కడికి చేరుకున్న ఎమ్మెల్యే సిబ్బంది నిర్వాకంపై మండిపడ్డారు. ఆలయ ఈవో శీనానాయక్‌కు ఫోన్లో ఫిర్యాదు చేశారు. అంతటితో ఆగక తాను ఈ అంశాన్ని తేలికగా తీసుకోనని, ఆలయ ప్రొటోకాల్‌లో ఏం జరుగుతుందో తనకు తెలుసంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మహా నివేదన అనంతరం ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం చేయించినా ఆయన శాంతించలేదు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. -
తప్పుడు సాక్ష్యాలు.. అక్రమ కేసులు: వైఎస్ జగన్
ఈరోజు మనం వాదిస్తోంది దెబ్బ తిన్న వాళ్ల గురించి. కళ్ల ఎదుటే దొంగ స్టేట్మెంట్లు, దొంగ సాక్ష్యాలు, తప్పుడు కేసులు, అక్రమ అరెస్టులు. ఒక కేసులో బయటకు రాగానే, వెంటనే మరో కేసు పెట్టి లోపల వేస్తున్నారు. అలా వరసగా కేసులు పెట్టి.. జైల్లోనే ఉంచేస్తున్నారు. అందుకే ఈ వ్యవస్థలో మార్పు రావాలి. దెబ్బ తగిలిన వ్యక్తికి ఎంత బాధ ఉంటుందో, దెబ్బ తగిలించిన వ్యక్తికి కూడా తెలియాలి. అది వారికి అర్థం కావాలి. అధికారం ఉంది కదా అని, దాన్ని దుర్వినియోగం చేస్తున్న వ్యక్తికి తెలియాలి. ఇందులో మీ పాత్ర కీలకం. మీ సేవలను గుర్తుంచుకుంటాం. – న్యాయవాదులతో వైఎస్ జగన్మోహన్రెడ్డిసాక్షి, అమరావతి: ప్రతిపక్షంగా కష్టకాలంలో ఉన్న పార్టీకి లాయర్లు అందిస్తున్న సేవలు అభినందనీయమని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. పార్టీ కార్యకర్తలపై తప్పుడు సాక్ష్యాలతో అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్న ఈ సమయంలో పార్టీకి పెద్దన్నల్లా లాయర్లు పని చేస్తున్నారని ప్రశంసించారు. కలియుగం అంటే ఏమిటన్నది ఈ 14 నెలల చంద్రబాబు పాలన చూస్తే అర్థమవుతుందన్నారు. ఎక్కడా న్యాయం, ధర్మం లేదని తేల్చి చెప్పారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, చోటుచేసుకున్న పరిస్థితులపై మంగళవారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన పార్టీ లీగల్ సెల్ ప్రతినిధులతో చర్చించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘రాష్ట్రంలో ప్రస్తుతం ప్రత్యేక పరిస్థితులున్నాయి’. ఈ సమయంలో మీరు పోషిస్తున్న పాత్ర ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మీరు పార్టీకి అన్ని విధాలుగా ఒక పెద్దన్న పాత్ర పోషిస్తున్నారు. అడగకపోతే అమ్మ అయినా అన్నం పెట్టదు అన్నట్లుగా.. కోరకపోతే దేవుడు కూడా వరమివ్వడు అన్నట్లుగా.. పిటిషన్లు వేసి, మీరు న్యాయస్థానంలో నిలబడకపోతే, న్యాయం కూడా దక్కదు. అందుకే మీరు పోషిస్తున్న పాత్ర అభినందనీయం’ అని ప్రశంసించారు. వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..స్వరం వినిపిస్తే జీర్ణించుకోలేని పరిస్థితి తమకు గిట్టని వారు, నచ్చని వారు ఎవరైనా ఉంటే, ఎవరైనా తమ స్వరం గట్టిగా వినిపిస్తే తట్టుకుని, జీర్ణించుకునే పరిస్థితి లేదు. ఎలాగైనా తీసుకుని పోయి వారిని జైల్లో వేయాలి. ఎలాగైనా వారిని తీసుకెళ్లి చిత్ర హింసలు పెట్టాలి. వారి పరువు తీయాలనే నీచమైన సంస్కృతి ఈరోజు చూస్తున్నాం. ఒక మనిషిని జైల్లో పెట్టడం అంటే తన పరువు, ప్రతిష్టతో ఆడుకోవడం. అవన్నీ తెలిసి కూడా, ఏ తప్పు చేయకపోయినా కూడా బురద చల్లుతున్నారు. తప్పు చేశాడు అని చెప్పి, దాని కోసం దొంగ సాక్ష్యాలు సృష్టిస్తున్నారు. కేసులు పెడుతున్నారు. వాటికి అసలు ఆధారాలు, సాక్ష్యాలు ఉండవు. ఏ కేసు చూసినా మోడస్ ఆపరెండి ఒక్కటే. తొలిసారి ఇలాంటి పరిస్థితులు చూస్తున్నాం. ఇలాంటి పరిస్థితుల మధ్య బా«ధితుల తరఫున గట్టిగా నిలబడి, వారి స్వరం వినిపించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుకే మీ పాత్ర చాలా ముఖ్యం. మన భుజాల మీద బాధ్యత మరింత పెరిగింది. ముఖ్యంగా కష్టకాలంలో, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, వైఎస్సార్సీపీకి పెద్దన్నగా మీ పాత్రను పార్టీ ఎప్పటికీ మర్చిపోదు.నాడు లీగల్ కమ్యూనిటీకి ఎంతో మేలుగతంలో మనం (వైఎస్సార్సీపీ ప్రభుత్వం) లాయర్లు, లీగల్ కమ్యూనిటీకి ఏం చేశామనేది నా కంటే, మీరే బాగా చెబుతారు. గతంలో ఎప్పుడూ జరగని విధంగా, ఎవరూ ఊహించని విధంగా యువ న్యాయవాదులకు ప్రభుత్వం నుంచి క్రమం తప్పకుండా ‘లా నేస్తం’ ఇచ్చాం. అలా యువ లాయర్లకు అండగా, తోడుగా నిలిచాం. నిజంగా అట్టడుగు వర్గాలకు తోడుగా ఉండాలని, జీపీలు, ఏజీపీల నియామకాల్లో 52% రిజర్వేషన్ ఇచ్చాం. అది కేవలం వైఎస్సార్సీపీ హయాంలోనే జరిగింది. న్యాయవాదుల సంక్షేమం కోసం రూ.100 కోట్లు కేటాయించి, అందులో రూ.25 కోట్లు ఖర్చు చేశాం. లాయర్ల ఇన్సూరెన్స్ పథకానికి కూడా మూడో వంతు ప్రభుత్వమే చెల్లించింది. ఇవన్నీ అప్పట్లో గర్వపడే విధంగా చేశాం. అయితే కూటమి ప్రభుత్వంలో చివరకు లాయర్లను కూడా మోసం చేశారు. సూపర్‌సిక్స్, సూపర్ సెవెన్ ఏవీ లేవు. అంతా మోసం. మన ప్రభుత్వంలోని పథకాలన్నీ రద్దు చేశారు. వారి హామీలు మోసాలుగా మారాయి. మరోవైపు అన్ని వ్యవస్థలు దిగజారిపోయాయి. విద్య, వ్యవసాయం, ఆరోగ్య రంగం, శాంతి భద్రతలు ఇంకా పరిపాలనలో పారదర్శకత.. ఏది తీసుకున్నా అన్నీ అస్తవ్యస్తం. అన్నింట్లో తిరోగమనం. అన్ని వ్యవస్థల్ని నిర్వీర్యం చేశారు.విచ్చలవిడిగా అవినీతి రాష్ట్రంలో అవినీతి మామూలుగా లేదు. విచ్చలవిడిగా సాగుతోంది. గ్రామాల్లో ఎక్కడ చూసినా బెల్టుషాప్‌లు. ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరకు మద్యం అమ్ముతున్నారు. అందుకోసం వేలం పాటలు నిర్వహిస్తున్నారు. పోలీసులు దగ్గరుండి మద్యం అమ్మిస్తున్నారు. ఇది కళ్ల ముందు కనిపిస్తున్న పచ్చి నిజం. ఎక్కడ చూసినా చట్ట విరుద్ధంగా పర్మిట్ రూమ్‌లు. అక్కడ బాటిళ్లు కాకుండా, పెగ్‌ల ద్వారా మద్యం అమ్ముతున్నారు. అదీ చట్ట విరుద్ధమే. అది కూడా ఎమ్మార్పీ కంటే ఎక్కువే. ఇసుక ఫ్రీ అన్నారు. కానీ ఎవరికీ ఇవ్వడం లేదు. అంతా దోపిడి. గతంలో మన ప్రభుత్వంలో ఇసుక సరఫరాలో ప్రభుత్వానికి ఏటా రూ.750 కోట్లు రాయల్టీగా వచ్చేది. ఇప్పుడు అది రాకపోగా, ఇసుక ధర రెట్టింపు అయింది. ఏ నియోజకవర్గం తీసుకున్నా కళ్ల ముందే పేకాట క్లబ్‌లు. వాటన్నింటినీ ఎమ్మెల్యేలు నడిపిస్తున్నారు. పోలీసులు దగ్గరుండి అన్నీ చూసుకుంటున్నారు. ఇది కూడా కళ్ల ముందే కనిపిస్తున్న నిజం.ఈ సమావేశంలో వైఎస్సార్సీపీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.మనోహర్‌రెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి(లీగల్) పొన్నవోలు సుధాకర్‌రెడ్డి, పలువురు సీనియర్ న్యాయవాదులు, ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన పార్టీ లీగల్ సెల్ ప్రతినిధులు పాల్గొన్నారు.అమరావతి నిర్మాణంలో యథేచ్ఛగా దోపిడీఅమరావతి నిర్మాణం పేరుతో యథేచ్ఛగా దోపిడీ చేస్తున్నారు. చదరపు అడుగు రూ.4 వేలు లేదా రూ.4,500కు లగ్జరీగా ఎక్కడైనా బ్రహ్మాండంగా కట్టొచ్చు. ఆ రేటుకు హైదరాబాద్, బెంగళూరులోనూ కట్టొచ్చు. కానీ అమరావతిలో చదరపు అడుగు నిర్మాణాన్ని రూ.9,500, రూ.10 వేలకు ఇచ్చారు. 10 శాతం మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చి, 8 శాతం తీసుకుంటున్నారు. ఇది కూడా కళ్లముందే కనిపిస్తున్న నిజం. ఇంకా విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందం (పీపీఏ)లోనూ అవినీతి. మనం యూనిట్ రూ.2.49కి ఒప్పందం చేసుకుంటే, అప్పుడు మనపై బురద చల్లారు. ఆ తర్వాత వాళ్లు అదే యూనిట్ విద్యుత్‌కు రూ.4.60 చొప్పున పీపీఏ చేసుకున్నారు. ఎక్కడ చూసినా అవినీతే. ఏ పని చేయాలన్నా, కంపెనీ నడపాలన్నా, మైనింగ్ చేయాలన్నా, గ్రావెల్ తరలించాలన్నా ముందు ఎమ్మెల్యేను కలవాలి. లంచం ఇవ్వాలి. వారు కొంత తీసుకుని, పైకి కొంత పంపిస్తారు. ఇన్ని మోసాలు, దారుణాలు చేస్తున్న వారికి దేవుడు తప్పక బుద్ధి చెబుతాడు. తంతే ఎక్కడ పడతారో.. వాళ్లకూ తెలియదు.వారిని చట్టం ముందు నిలబెడతాం⇒ ఇప్పుడు పార్టీ కోసం పని చేస్తున్న వారెవ్వరినీ జగన్ 2.0లో మర్చిపోము. పక్కాగా డేటా బేస్ తయారు చేయమని మన లీగల్ విభాగం ప్రతినిధులకు చెబుతున్నాను. ఆ డేటా బేస్ ఆధారంగా వారందరికీ తగిన గుర్తింపు ఇస్తాం. త్వరలోనే ఒక యాప్ వస్తుంది. దాని తయారీలో సీనియర్ లాయర్లు కూడా పాలు పంచుకుంటున్నారు. ⇒ రాష్ట్రంలో ఎక్కడ, ఏ వైఎస్సార్సీపీ కార్యకర్తకు అన్యాయం జరిగినా.. ఆ యాప్ ఓపెన్ చేసుకుని, తన పూర్తి వివరాలు, తనకు జరిగిన అన్యాయం, అది ఎవరి వల్ల జరిగింది? దానికి సంబంధించి ఉన్న ఆధారాలు అప్లోడ్ చేస్తే అది ఆటోమేటిక్‌గా ఇక్కడ మన డిజిటల్ లైబ్రరీలో నిక్షిప్తం అవుతుంది. రేపు మనం అధికారంలోకి రాగానే, ఆ డేటా ఓపెన్ చేసి చూస్తాం. ఇప్పుడు వేధిస్తున్న వారెవ్వరినీ వదలిపెట్టబోం. చట్టం ముందు నిలబెడతాం. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. తప్పు చేసిన వారిని జైలుకు పంపిస్తాం. ⇒ దెబ్బ తగిలిన వ్యక్తికి ఎంత బాధ ఉంటుందో, దెబ్బ తగిలించిన వ్యక్తికి కూడా తెలియాలి. అందుకే లాయర్ల ద్వారా ఆ యాప్‌ను అభివృద్ధి చేస్తున్నాం. ఈ పరిస్థితుల్లో న్యాయవాదుల పాత్ర చాలా ముఖ్యం. పెద్దన్న మాదిరిగా లాయర్లు తోడుగా ఉండాలి. లాయర్ల సేవలను పార్టీ ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది.