
ఎన్నిక ఏదైనా అక్రమాలు చేయడం చంద్రబాబుకి అలవాటేనని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. పులివెందులలో టీడీపీ గూండాల అరాచకం, పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపైనా ఆయన తాడేపల్లిలోని పార్టీ కేంద్రకార్యాలయంలో గురువారం మీడియాతో మాట్లాడారు.
సాక్షి,తాడేపల్లి: పులివెందులలో టీడీపీ నేతల తీరును మాజీ మంత్రి అంబటి రాంబాబు ఖండించారు. ‘‘పులివెందులలో టీడీపీ నేతలు నిసిగ్గుగా ప్రవర్తించారు. పులివెందుల జెడ్‌పీటీసీ ఎన్నిక గెలవడం కోసం చంద్రబాబు అనేక కుట్రలు చేస్తున్నారు. కోండెపి జెడ్‌పీటీసీ గెలిచినట్లు టీడీపీ నేతలే ప్రకటించుకున్నారు. పైగా గాయపడినవారిపైనే పోలీసులు అక్రమ కేసులు బనాయిస్తున్నారు.
డీఐజీ కోయ ప్రవీణ్ కామెంట్స్‌ను ఖండిస్తూ.. పోలీసులు టీడీపీ కార్యకర్తల మాదిరి ప్రవర్తిస్తున్నారు. చంద్రబాబు ఆదేశాలతోనే పని చేస్తున్నారు. డీఐజీ కోయ ప్రవీణ్ తప్పుడు మాటలు మాట్లాడడం సిగ్గు చేటు. ఖాకీ బట్టలు వేసుకుని కోయ ప్రవీణ్ చంద్రబాబు కాళ్ల పూజ చేస్తున్నాడు. ఇప్పటికైనా లా అండ్ ఆర్డర్‌ను ప్రవీణ్ కాపాడాలి.
చంద్రబాబు సింగపూర్ ప్రచారంపై.. రాష్ట్ర ప్రభుత్వం తరఫున చంద్రబాబు 58 సార్లు సింగపూర్ వెళ్లారు. మరి ఏం ాధించారో చెప్పాలి. తాజాగా చంద్రబాబు కుమార సమేతంగా సింగపూర్ పర్యటనకు వెళ్లారు. ఏపీలో పెట్టుబడులు పెట్టడం లేదని సింగపూర్ ప్రభుత్వం ప్రకటించింది. కానీ, పెట్టుబడులు పెడుతోందని చంద్రబాబు తప్పుడు ప్రచారం చేశారు. ప్రజలను మభ్య పెడుతున్నారు.
ఫ్రీ బస్సు స్కీమ్ మోసం.. ఎన్నికలకు ముందు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అని ప్రకటించారు. ఇప్పుడేమో మహిళలకు ఉచిత బస్సు పథకం కూడా అరకొరగా అమలు చేసేందుకు కుటరలు చేస్తున్నారు అని అంబటి విమర్శనాస్త్రాలు సంధించారు.