breaking news
-
మార్గదర్శి అవకతవకలు.. సీఐడీ కీలక ప్రకటన
సాక్షి, విజయవాడ: మార్గదర్శి చిట్‌ఫండ్స్ అవకతవకలకు సంబంధించి దర్యాప్తు వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. చిట్ ఫండ్ నిధుల మళ్లింపు.. అక్రమాల ఆరోపణలపై దర్యాప్తు చేస్తున్న ఏపీ సీఐడీ మంగళవారం ఓ కీలక ప్రకటన చేసింది. మార్గదర్శి లో రూ. కోటి పైన నగదు డిపాజిట్ చేసిన ఖాతాదారులకు నోటీసులు జారీ చేసినట్లు ఒక ప్రెస్‌నోట్‌లో తెలిపింది. ఆర్బీఐ, సీబీడీటీ నిబంధనల ప్రకారం నోటీస్ లు జారీ చేసినట్లు ఏపీ సీఐడీ సదరు నోట్లో పేర్కొంది. ఈ మేరకు మార్గదర్శి లో రూ. కోటి పైన నగదు లావాదేవీల వివరాలు తెలపాలని పేర్కొంది. ఆర్థిక నేరాల, మనీ లాండరింగ్ నివారణకు RBI, CBDT తీసుకొచ్చిన నిబంధనల మేరకే ఈ నోటీసులు జారీ చేసినట్లు ఏపీ సీఐడీ స్పష్టం చేసింది. ఇదీ చదవండి: ఇదేందయ్యా ఇది.. రామోజీ రాసిందే రసీదు! గత విచారణ సందర్భంగా రామోజీరావు(ఫైల్‌ఫోటో) మార్గదర్శి చిట్ ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు సంబంధించిన ఆర్థిక మోసం కేసులపై కొనసాగుతున్న విచారణలో. ఇప్పటికే సంస్థ ఎండీ, డైరెక్టర్లను ఏపీ సీఐడీ పలుమార్లు విచారించిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు నోటీసులు అందుకున్న బాధిత చందాదారులందరూ విచారణకు పూర్తిగా సహకరించాలని AP CID కోరుతోంది. ఇదీ చదవండి: మార్గదర్శి దర్యాప్తుపైనా ఈనాడు తప్పుడు రాతలే! -
నోట్ల మార్పిడి దందా కేసు: రిమాండ్‌లో ఉన్న ఆర్ఐ స్వర్ణలతకు మరో షాక్
సాక్షి, విశాఖపట్నం: నోట్ల మార్పిడి వ్యవహారంలో బెదిరించి డబ్బులు గుంజిన కేసులో ఇటీవల ఏఆర్ సీఐ స్వర్ణలత అరెస్టు కావడం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈ కేసులో రిమాండ్‌లో ఉన్న ఆర్ఐ స్వర్ణలతకు మరో షాక్ తగిలింది. 'ఏపీ 3'లో సీఐ స్వర్ణలత హీరోయిన్ కాదని దర్శకుడు కేవీఆర్ స్పష్టం చేశారు. సినిమాలో ఆమెది అతిథి పాత్ర మాత్రమేనని వెల్లడించారు. ఈ సినిమాలో ఆమె పెట్టుబడి పెట్టలేదని..ఈ చిత్రంలో బిగ్‌బాస్ ఫేమ్ లహరి హీరోయిన్గా చేస్తున్నట్లు వివరించారు. స్వర్ణలతకు సంబంధించి వైరల్ అయిన వీడియోలు తమ సినిమాలోనివి కాదన్నారు. కాగా, నోట్ల మార్పిడి దందా వ్యవహారంలో అరెస్ట్ అయిన ఏఆర్ ఆర్ఐ(హోంగార్డ్స్) స్వర్ణలతపై సస్పెన్షన్ వేటు పడింది. ఆమెతో పాటు కేసులో ఏ2గా ఉన్న ఎం.హేమ సుందర్‌ను కూడా సస్పెండ్ చేస్తూ నగర పోలీస్ కమిషనర్ సి.ఎం.త్రివిక్రమ్ వర్మ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా రూ.90 లక్షల విలువ గల రూ.500 నోట్లు ఇస్తే.. రూ.కోటి విలువ గల రూ.2 వేల నోట్లు ఇస్తామని ఇద్దరు రిటైర్డ్ నేవల్ ఆఫీసర్లను మోసం చేసిన విషయం తెలిసిందే. చదవండి: ఆర్ఐ స్వర్ణలత జీవితంలో ఈ కోణం కూడా చూడాల్సిందే.. -
ప్రకాశం జిల్లాలో ఘోర ప్రమాదం.. ఏడుగురు మృతి
సాక్షి, ప్రకాశం జిల్లా: దర్శి సమీపంలోని ఘోర ప్రమాదం జరిగింది. ఎన్ఎస్పీ కాలువలోకి ఆర్టీసీ ఇంద్ర బస్సు దూసుకుపోవడంతో ఏడుగురు మృతిచెందారు. ఈ ఘటనలో మరో 30 మంది గాయపడ్డారు. ఈ ప్రమాదంలో అబ్దుల్ అజీస్(65), జానీబేగం(65), అబ్దుల్ హనీ(60), నూర్జహాన్(58), షేక్ రమీజ్(48), షబీనా(35), షేక్ హీనా(6) మృతిచెందారు. బస్సు పొదిలి నుంచి కాకినాడ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. వివాహ రిసెప్షన్ కోసం కాకినాడ వెళ్లేందుకు పెళ్లి బృందం ఆర్టీసీ బస్సును అద్దెకు తీసుకున్నారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 35 నుంచి 40మంది వరకు ఉన్నట్లు సమాచారం. క్షతగాత్రులు ఆస్పత్రికి తరలించారు. బస్సు తలకిందులుగా పడటంతో ఒకరిపై ఒకరు పడి ఊపిరాడక 7 మంది మృతి చెందారు. దర్శి డిఎస్పీ అశోక్ వర్ధన్, సీఐ రామకోటయ్య ఆధ్వర్యంలో సహాయక చర్యలు చేపట్టారు. డ్రైవర్ నిద్ర మత్తు కారణంగా ఈ ఘటన జరిగినట్లుగా అనుమానిస్తున్నారు. బస్సు ప్రమాద ఘటనాస్థలిని ఎస్పీ మలిక గర్గ్ పరిశీలించారు. ఎదురుగా వస్తున్న బస్సును తప్పించబోయి ప్రమాదం చోటుచేసుకుందని ఎస్పీ తెలిపారు. రాత్రి ఒంటి గంట సమయంలో ప్రమాదం జరిగిందన్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందుతోందన్నారు. -
విశాఖ నుంచి కేరళకు గంజాయి
తిరువనంతపురం: ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్టణం నుంచి కేరళకు తీసుకువచ్చిన 155 కిలోల గంజాయిని ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారు. విశాఖ నుంచి తీసుకువచి్చన గంజాయిని తిరువనంతపురంలోని పల్లితురలోని ఓ గోదాములోకి మార్చుతుండగా అధికారులు నలుగురిని అరెస్ట్ చేశారు. గంజాయితోపాటు 61 గ్రాముల ఎండీఎంఏ అనే సింథటిక్ డ్రగ్‌ను స్వాధీనం చేసుకున్నారు. తిరువనంతపురం నుంచి విశాఖకు వెళ్లిన నలుగురిలో ఇద్దరు విమానంలో తిరిగి రాగా మిగిలిన ఇద్దరు వాహనంలో డ్రగ్స్‌ను తీసుకువచ్చారని అధికారులు తెలిపారు. -
వివాహేతర సంబంధం కారణంగా మహిళపై యాసిడ్ దాడి
సాక్షి ప్రతినిధి, విజయవాడ/భవానీపురం (విజయవాడ పశ్చిమ): ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం ఐతవరం గ్రామంలో వితంతు మహిళపై ఓ ఆటోడ్రైవర్ యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో బాలుడు, యువతి సహా ముగ్గురికి గాయాలయ్యాయి. ఆదివారం వేకువజామున ఈ ఘటన చోటుచేసుకోగా.. కొద్దిగంటల్లోనే నిందితుణ్ణి అరెస్ట్ చేశారు. ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ టీకే రాణా తెలిపిన వివరాల ప్రకారం.. ఐతవరం గ్రామానికి చెందిన 28 ఏళ్ల మహిళకు 8 ఏళ్ల క్రితం వివాహం కాగా.. ఆమెకు ఓ కుమారుడున్నాడు. భర్త మరణించడంతో ఆ మహిళ ఐతవరం వచ్చేసి తల్లిదండ్రుల వద్ద ఆశ్రయం పొందుతోంది. సుమారు 8 నెలల క్రితం నెల్లూరుకు చెందిన రాణింగారం మణిసింగ్ (32)తో ఆ మహిళకు ఫేస్బుక్ ద్వారా పరిచయం ఏర్పడింది. నెల్లూరులోనే ఆటో నడుపుతూ జీవనం సాగించే మణిసింగ్‌కు వివాహమై ఇద్దరు పిల్లలున్నారు. పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారి తీయడంతో ఆ మహిళ ఐతవరంలోనే వేరే ఇంటికి మారింది. ఆమె వద్దకు మణిసింగ్ తరుచూ వస్తుండేవాడు. ఇద్దరు పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకోగా.. మణిసింగ్‌కు క్షయ వ్యాధి సోకినట్టు తెలుసుకున్న సదరు మహిళ అతన్ని దూరం పెట్టింది. ఈ నేపథ్యంలో కక్ష పెంచుకున్న మణిసింగ్ ఆమెను హతమార్చాలని నిశ్చయించుకున్నాడు. నెల్లూరు నుంచే యాసిడ్ తెచ్చుకుని.. ఈ నెల 8వ తేదీ శనివారం నెల్లూరులో 100 మిల్లీలీటర్ల యాసిడ్ బాటిల్ కొనుగోలు చేసిన మణిసింగ్ మహిళ ఇంటికి చేరుకున్నాడు. అప్పటికే ఆ ఇంట్లో ఆమె కుమారుడితో పాటు ఆమె సోదరి కుమార్తె ఉన్నారు. వారితో కలిసి మణిసింగ్ భోజనం చేసి అక్కడే నిద్రించాడు. ఆదివారం వేకువజామున 4 గంటలకు అందరూ నిద్రమత్తులో ఉండగా మణిసింగ్ తన వెంట తెచ్చుకున్న యాసిడ్‌ను మహిళ ముఖంపై పోసి పరారయ్యాడు. ఈ ఘటనతో మహిళ శరీరం 20 శాతం గాయపడగా, ఆమె కుమారుడుకి, ఆమె సోదరి కుమార్తెకు స్వల్ప గాయాలయ్యాయి. బాధితుల ఆర్తనాదాలతో చుట్టుపక్కల వారు లేచి హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న నందిగామ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. నందిగామ శివారు ప్రాంతాల్లో సంచరిస్తున్న మణిసింగ్ను ఉదయం 10 గంటలకు అరెస్ట్ చేశారు. అతడిపై నాన్‌బెయిలబుల్ కేసులు కట్టారు. బాధితులకు అండగా ప్రభుత్వం యాసిడ్ దాడిలో గాయపడ్డ బాధితులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ తెలిపారు. గొల్లపూడి ఆంధ్రా హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బాధితులను ఆదివారం పరామర్శించి వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. నిందితుడికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామన్నారు. స్థానిక ఎమ్మెల్యే జగన్మోహనరావు బాధితుల్ని పరామర్శించారు. -
శ్రీకాళహస్తిలో ఘోర ప్రమాదం.. ఆరుగురు మృతి
సాక్షి, తిరుపతి: శ్రీకాళహస్తిలో విషాద ఘటన చోటుచేసుకుంది. లారీని కారు ఢీకొన్న ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదానికి అతి వేగమే కారణమని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఇక, మృతులు విజయవాడకు చెందినట్టు సమాచారం. వివరాల ప్రకారం.. శ్రీకాళహస్తి సమీపంలోని మెట్ట కండ్రిగ వద్దలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. ఎదురుగా వస్తున్న లారీని హైస్పీడ్‌లో ఉన్న కారు ఢీకొనడంతో కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు మృతి చెందగా, మరో ఇద్దరు త్రీవంగా గాయపడ్డారు. ఇక, ప్రమాదం జరిగిన సమయంలో కారులో 8 మంది ప్రయాణిస్తున్నారు. కాగా, వీరంతా తిరుపతి నుంచి శ్రీకాళహస్తికి వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. కాగా, ప్రమాదంలో గాయపడిన వారిని అంబులెన్స్‌లో వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఇది కూడా చదవండి: లారీ ఢీకొని.. నాలాలో కూరుకుపోయి.. -
విశాఖలో నోట్ల మార్పిడి కలకలం.. జనసేన నాయకుడి అనుచరుడి అరెస్ట్
సాక్షి, విశాఖపట్నం: విశాఖలో కలకలం రేపిన నోట్ల మార్పిడి కేసులో జనసేన నాయకుడి అనుచరుడు సూరి అరెస్ట్ అయ్యారు. రూ. 2 వేల నోట్లు మార్పిడి కేసులో పోలీసులు ఇప్పటి వరకు నలుగురిపై కేసు నమోదు చేశారు. కాగా రూ. 90 లక్షలకు సరిపడా రూ. 500 నోట్లు ఇస్తే కోటి రూపాయలకు సరిపడా 2 వేల నోట్లు ఇస్తామని చెప్పి ఇద్దరు రిటైర్డ్ నేవల్ అధికారులు కొల్లి శ్రీను, శ్రీధర్‌లను ఓ ముఠా మోసం చేసింది. అయితే ఈ ముఠాకు ఏఆర్ ఆర్ఐ స్వర్ణలత నాయకత్వం వహించినట్లు పోలీసులు తేల్చారు. ప్రస్తుతం హోమ్ గార్డ్స్ ఏఆర్ సీఐగా పనిచేస్తున్న స్వర్ణలత.. ఆంధ్రప్రదేశ్ పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షురాలిగా ఉన్నారు. అయితే బాధితులు అందించిన రూ. 90 లక్షల్లో స్వర్ణలత రూ. 15 లక్షలు నొక్కేసినట్లు తేలింది. అంతేగాక తన సిబ్బంది చేత బాధితులను బెదిరించి కొట్టి పంపేసింది. తాము మోసపోయామని గ్రహించిన రిటైర్డ్ అధికారులు పోలీసు ఉన్నతాధికారులను ఆశ్రయించడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీనిపై పోలీసులు పూర్తి స్థాయిలో విచారిస్తున్నారు. నలుగురి అరెస్ట్: విశాఖ నోట్ల మార్పిడి కేసులో నలుగుర్ని అరెస్టు చేసినట్లు సీపీ త్రివిక్రమ వర్మ తెలిపారు. రూ. 90 లక్షల 500 రూపాయల నోట్లకు కోటి రూపాయల రూ. 2 వేల రూపాయల నోట్లు ఇచ్చేట్లు ఒప్పందం కుదుర్చుకున్నట్లు దర్యాప్తులో తేలిందని వెల్లడించారు. మాజీ నేవల్ ఆఫీసర్లు నగదును తీసుకుని సీతంధర వద్ద వెళ్లారని,, ఆర్ఐ స్వర్ణలత సమక్షంలోనే డబ్బుల పంపకాలు జరిగినట్లు గుర్తించామని తెలిపారు. ఈ క్రమంలో సూరీని హోం గార్డుల చేత కొట్టించి.. 12 లక్షల రూపాయలను బాధితుల వద్ద నుంచి తీసుకొని వదిలేశారని పేర్కొన్నారు. బాధితులు డీసీపీకి ఫిర్యాదు చేస్తే దర్యాప్తు ప్రారంభించినట్లు చెప్పారు. చదవండి: ఓట్ల ప్రక్షాళనతో దొంగ వేషాలు! బాబు బాగోతం తెలిసి రామోజీ పాత పాట! -
నువ్వే కావాలి అంటూ లవ్ ప్రపోజ్.. క్లోజ్‌గా వీడియో కాల్స్ మాట్లాడి..
సాక్షి, ఏలూరు: సోషల్ మీడియాలో హాయ్ అంటూ ఆమెకు దగ్గరయ్యాడు. ప్రతీరోజూ చాటింగ్, కాల్స్ చేసి ఆమెకు నమ్మకం కలిగించాడు. ఇంతలోనే నువ్వంటే ఇష్టమని మనసులోని మాట తనకు చెప్పేశాడు. తర్వాత తన అసలు రంగు బయటపెట్టాడు యువకుడు. వీడియో కాల్ చేసి ఆమెతో అసభ్యకరంగా మాట్లాడుతూ.. వీడియోలు రికార్డు చేశాడు. అనంతరం.. ఆమెను వేధింపులకు గురిచేశాడు. దీంతో, రంగంలోకి దిగిన పోలీసులు.. రంగుల రాజాను అదుపులోకి తీసుకున్నాడు. వివరాల ప్రకారం.. విజయనగరం జిల్లాకు చెందిన నవీన్.. ఇన్స్‌స్టాగ్రామ్‌లో హైదరాబాద్‌లో ఎంబీఏ చేస్తున్న యువతితో పరిచయం పెంచుకున్నాడు. తరుచు ఆమెతో చాటింగ్, కాల్స్ చేస్తూ చనువుతో మెదిలాడు. ఇలా కొద్దిరోజులు గడిచాక.. ఆమెను ప్రేమిస్తున్నానంటూ మనసులోని కపట ప్రేమను వ్యక్తం చేశాడు. అతడి మాటలు నమ్మిన బాధితురాలు నవీన్‌కు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దీంతో, స్పీడ్ పెంచిన నవీన్.. యువతితో చనువు పెంచుకుని వీడియో కాల్స్ చేస్తూ అసభ్యకరంగా వీడియోలు తీసి రికార్డు చేసుకున్నాడు. ఇక, కొద్దిరోజులు గడిచిన తర్వాత వారిద్దరూ ఏకాంతంగా మాట్లాడుతున్న వీడియోలను ఆమెకు చూపించిన బెదిరింపులకు దిగాడు. డబ్బులు కావాలని డిమాండ్ చేశాడు. తాను అడిగిన డబ్బులు ఇవ్వకపోతే ఆ వీడియోలను ఆమె బంధువులకు, సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానంటూ బెదిరించి బాధితురాలు దగ్గరి నుంచి రూ.25వేలు వసూలు చేశాడు. తాజాగా వీడియోలను అడ్డుపెట్టుకుని మరో లక్ష రూపాయాలు డిమాండ్ చేశాడు. దీంతో, చేసేదేమీ లేక బాధితురాలు ఈ విషయాన్ని తన పేరెంట్స్ చెప్పింది. ఈ క్రమంలో వారంతా కలిసి ఓ ప్లాన్ చేశారు. తన ఇంటి వద్దే నవీన్‌కు డబ్బులు ఇస్తానని చెప్పి.. అక్కడికి రావాలని కోరింది. ఈ క్రమంలో నవీన్.. ఆమె ఇంటి వద్దకు రావడంతో.. అతడిని పట్టుకోవాలని వారు ప్రయత్నించారు. నవీన్ అక్కడి నుంచి తప్పించుకున్నాడు. దీంతో, బాధితురాలు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నవీన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇది కూడా చదవండి: ఘాతుకం: కళ్లకు గంతలు.. కాళ్లు చేతులు వైర్లతో కట్టేసి.. ప్రేయసిని పూడ్చిపెట్టాడు -
టీడీపీ నేతల జీఎస్టీ స్కాంలో సంచలన విషయాలు
సాక్షి, హైదరాబాద్: టీడీపీ నేతల జీఎస్టీ స్కాంలో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. దేశ వ్యాప్తంగా 2600 బోగస్ కంపెనీలను జీఎస్టీ విజిలెన్స్ విభాగం గుర్తించింది.. ఢిల్లీ కేంద్రంగా 10వేల కోట్లకు పైగా స్కాం జరిగినట్లు బట్టబయలైంది. హైదరాబాద్‌లో 326పైగా బోగస్ కంపెనీలను అధికారులు గుర్తించారు. రాత్రికి రాత్రికి బోగస్ గోదాంలు సృష్టిస్తున్న జీఎస్టీ ఫేక్ బిల్లింగ్ మాఫియా.. ఇతరుల ఆధార్, పాన్ కార్డ్ లతో జీఎస్టీ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు పొందుతున్నారు. ఎలాంటి స్టాక్ లేకుండా 4 నుండి 6 శాతానికి బోగస్ కంపెనీల నుంచి వ్యాపారవేత్తలు బిల్స్ కొంటున్నారు. బోగస్ కంపెనీల నుంచి కొంటున్న బిల్స్‌ని 15 నుండి 18 శాతానికి వ్యాపారవేత్తలు అమ్ముతున్నారు. బిల్స్ లేకుంటే కంపెనీలు స్టాక్ రిజెక్ట్ చేస్తుండటంతో జీఎస్టీ మాఫియా.. బోగస్ కంపెనీలు సృష్టించి సొమ్ము చేసుకుంటున్నాయి. బోగస్ కంపెనీలపై దాడులకు జీఎస్టీ అధికారులు సిద్దమవుతున్నారు. చదవండి: జీఎస్టీ అధికారి కిడ్నాప్ కేసులో గుంటూరు టీడీపీ నేతలు కాగా, జీఎస్టీ సీనియర్ అధికారిని కిడ్నాప్ చేసిన కేసులో గుంటూరు టీడీపీ నేతలు, కుటుంబ సభ్యులను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. గుంటూరు నగర టీడీపీ నేత సయ్యద్ ముజీబ్, ఆయన కుటుంబ సభ్యులు సయ్యద్ ఫిరోజ్, సయ్యద్ ఇంతియాజ్‌లకు హైదరాబాద్ సరూర్‌నగర్ పరిధిలోని క్రాంతినగర్ రోడ్ నంబర్ 2లో ఇనుము వ్యాపారం ఉంది. ప్రస్తుతం గుంటూరులోని ఆర్టీసీ కాలనీలో నివాసం ఉంటున్నారు. జీఎస్టీ చెల్లించకపోవటంతో బుధవారం జీఎస్టీ, ఇంటెలిజెన్స్ అధికారులు హైదరాబాద్‌లోని దుకాణాన్ని సీజ్‌చేసేందుకు వెళ్లారు. ఆ అధికారులపై ముజీబ్, ఫిరోజ్, ఇంతియాజ్, వారి కారు డ్రైవర్ షేక్ ముషీర్ దాడిచేశారు. గుంటూరు నుంచి తాము వెళ్లిన కారులోనే అధికారుల్ని కిడ్నాప్ చేశారు. అధికారుల డ్రైవర్ ద్వారా సమాచారం అందుకున్న సరూర్‌నగర్ పోలీసులు కిడ్నాప్‌నకు పాల్పడిన నలుగురిని అదుపులోకి తీసుకుని అధికారులను రక్షించారు. ముజీబ్ ప్రస్తుతం గుంటూరు తూర్పు నియోజకవర్గం నుంచి టికెట్ ఆశిస్తున్నారు. ఆ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. లోకేశ్ పాదయాత్రలో కూడా పాల్గొన్నారు. హైదరాబాద్‌లో కిడ్నాప్ వ్యవహారంలో గుంటూరు టీడీపీ నేతలు అరెస్ట్ కావడం చర్చనీయాంశమైంది. -
Hyderabad: జీఎస్టీ అధికారి కిడ్నాప్ కేసులో గుంటూరు టీడీపీ నేతలు
సాక్షి ప్రతినిధి, గుంటూరు: జీఎస్టీ సీనియర్ అధికారిని కిడ్నాప్ చేసిన కేసులో గుంటూరు టీడీపీ నేతలు, కుటుంబ సభ్యులను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. గుంటూరు నగర టీడీపీ నేత సయ్యద్ ముజీబ్, ఆయన కుటుంబ సభ్యులు సయ్యద్ ఫిరోజ్, సయ్యద్ ఇంతియాజ్‌లకు హైదరాబాద్ సరూర్‌నగర్ పరిధిలోని క్రాంతినగర్ రోడ్ నంబర్ 2లో ఇనుము వ్యాపారం ఉంది. ప్రస్తుతం గుంటూరులోని ఆర్టీసీ కాలనీలో నివాసం ఉంటున్నారు. జీఎస్టీ చెల్లించకపోవటంతో బుధవారం జీఎస్టీ, ఇంటెలిజెన్స్ అధికారులు హైదరాబాద్‌లోని దుకాణాన్ని సీజ్‌చేసేందుకు వెళ్లారు. ఆ అధికారులపై ముజీబ్, ఫిరోజ్, ఇంతియాజ్, వారి కారు డ్రైవర్ షేక్ ముషీర్ దాడిచేశారు. గుంటూరు నుంచి తాము వెళ్లిన కారులోనే అధికారుల్ని కిడ్నాప్ చేశారు. అధికారుల డ్రైవర్ ద్వారా సమాచారం అందుకున్న సరూర్‌నగర్ పోలీసులు కిడ్నాప్‌నకు పాల్పడిన నలుగురిని అదుపులోకి తీసుకుని అధికారులను రక్షించారు. ముజీబ్ ప్రస్తుతం గుంటూరు తూర్పు నియోజకవర్గం నుంచి టికెట్ ఆశిస్తున్నారు. ఆ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. లోకేశ్ పాదయాత్రలో కూడా పాల్గొన్నారు. హైదరాబాద్‌లో కిడ్నాప్ వ్యవహారంలో గుంటూరు టీడీపీ నేతలు అరెస్ట్ కావడం చర్చనీయాంశమైంది. కుటుంబసభ్యులంతా నేరచరితులే... గుంటూరుకు చెందిన ముజీబ్ కుటుంబ సభ్యులు తొలినుంచి నేరచరిత్ర కలిగి ఉన్నారు. గుంటూరు ఆర్టీసీ కాలనీలో ఒక భూమిని ఆక్రమించిన కేసులో ముజీబ్ సోదరుడు ఫిరోజ్, ఇంతియాజ్, బషీర్లపై రౌడీషీట్లున్నాయి. ఆటోనగర్‌లో సైతం గతంలో కత్తులు తీసుకుని ఆ ప్రాంతమంతా హల్చల్ సృష్టించిన విషయంలో కాకాని పోలీసుస్టేషన్లో కేసు నమోదైంది. దీంతోపాటు కొంతమందిపై దాడిచేసిన కేసులున్నాయి. ఈ క్రమంలో తెలంగాణలోని హైదరాబాద్‌లో ముజీబ్, అతడి సోదరులపై అధికారులను కిడ్నాప్ చేసిన కేసు నమోదైంది. తొలినుంచి వివాదాలకు దిగే ముజీబ్, అతడి కుటుంబ సభ్యులపై మరోమారు కేసు నమోదవడంపై టీడీపీలో కూడా చర్చ జరుగుతోంది. ముజీబ్ సోదరుడు సయ్యద్ ఫిరోజ్ రౌడీïÙట్ కలిగి ఉండటంతో పాటు టీడీపీ నగర ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. ముజీబ్ తండ్రి మాత్రం తన కుమారుడు అమాయకుడని, అతడిపై కుట్ర జరిగిందని పేర్కొంటున్నారు. -
రూ.21 కోట్లు కొల్లగొట్టేశారు.. కుటుంబ సభ్యుల నిర్వాకం..
సాక్షి ప్రతినిధి, కాకినాడ: కుటుంబ సభ్యులనే డైరెక్టర్లుగా నియమించుకుని అధిక వడ్డీల ఆశ చూపి అమాయకులను బురిడీ కొట్టించి న కాకినాడ కార్తికేయ బిల్డింగ్ సొసైటీ గుట్టురట్టు అయ్యింది. సకాలంలో రాష్ట్ర ప్రభుత్వం స్పందించడంతో అక్రమార్కుల ఆస్తులను సీజ్‌చేసి వేలం వేసేందుకు మార్గం సుగమమైంది. తద్వారా సొసైటీ బాధితులకు ప్రభు త్వం నుంచి భరోసా లభించింది. కాకినాడ కేంద్రంగా ఏర్పాటైన కార్తికేయ బిల్డింగ్ సొసై టీ డిపాజిటర్లకు మెచ్యూరిటీ సొమ్ములు ఇవ్వకుండా బోర్డు తిప్పేసిన వ్యవహారాన్ని ‘కొంప ముంచిన కార్తికేయ’.. శీర్షికన ‘సాక్షి’ గత ఏప్రిల్ 2న వెలుగులోకి తీసుకొచ్చింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ‘కార్తికేయ’లో జరిగిన రూ.కోట్ల కుంభకోణంపై ప్రత్యేక దృష్టిపెట్టి సహకార శాఖ ద్వారా విచారణ జరిపించింది. ఆ శాఖ కమిషనర్ అహ్మద్‌బాబు, కాకినాడ జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా సహకార శాఖ ద్వారా వివిధ కోణాల్లో విచారణ జరిపించింది. కార్తికేయ బిల్డింగ్ సొసైటీ ఆర్థిక కుంభకోణం విలువ రూ.21.58 కోట్లుగా లెక్క తేల్చి ప్రభుత్వానికి నివేదిక సిద్ధంచేసింది. అధిక వడ్డీల ఆశచూపి.. అధిక వడ్డీలు ఇస్తామంటూ 300 మంది డిపాజిటర్లను నమ్మించి సుమారు రూ.19.40 కోట్ల వరకు సొసైటీ వారి నుంచి సేకరించింది. ఈ మొత్తానికి ఇవ్వాల్సిన వడ్డీయే రూ.2.05 కోట్లకు పైగా ఉంది. డిపాజిట్ల మొత్తంలో రూ.10 కోట్లను సొసైటీ ఖాతాలో ఎక్కడా నమోదు చేయకుండానే నొక్కేశారని తేలింది. అలాగే, అసలు రుణాలేమీ ఇవ్వకుండానే ఇచి్చనట్లుగా 361 మంది బినామీ పేర్లతో రూ.5.36 కోట్లు స్వాహా చేశారు. ఇందుకు వడ్డీ రూ.2 కోట్లు వచ్చినట్లుగా రికార్డుల్లో చూపించారు. అంతేకాక.. రుణాలివ్వగా వాటి నుంచి వచ్చిన వడ్డీ రూ.1.65 కోట్లు అసలు సొసైటీలో జమచేయకుండానే వాటినీ దారి మళ్లించేశారు. ఈ వడ్డీ సొమ్ములో ఒక్కపైసా కూడా సొసైటీ నగదు పుస్తకంలో లేకపోవడం చూసి సహకార శాఖ అధికారులు విస్తుపోయారు. పిల్లల పెళ్లిళ్లు, ఇల్లు కట్టుకోవడం వంటి భవిష్యత్ అవసరాలకు ఉపయోగపడుతుందనే ముందుచూపుతో రిటైరైన ఉద్యోగులు, చిరుద్యోగులు, సన్న, చిన్నకారు రైతులు ‘కార్తికేయ’లో ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన రూ.2.56 కోట్లను కూడా మాయం చేసేసి డిపాజిటర్ల నోట మట్టికొట్టారు. కుటుంబ సభ్యులే డైరెక్టర్లుగా.. ఈ మొత్తం వ్యవహారంపై జిల్లా సహకార అ«ధికారి బొర్రా కనక దుర్గాప్రసాద్ ఆదేశాల మేరకు అసిస్టెంట్ రిజి్రస్టార్ ఎన్విఎస్ఎస్ దుర్గాప్రసాద్ విచారణ జరిపి కుంభకోణాన్ని నిర్థారించారు. బిల్డింగ్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షుడు, అప్పటి ప్రెసిడెంట్ కోడి వీరవెంకట సత్యనారాయణ తన భార్య పద్మావతి, ఇద్దరు కుమారులు వెంకటేశ్, శంకర్‌ను డైరెక్టర్లుగా నియమించుకుని ప్రజల సొమ్మును దిగమింగారు. వీరితో పాటు చేపూరి గంగరాజు, బాలం విజయకుమార్, గ్రంథి వీరేంద్ర, టేకి త్రినా«థ్ పుష్పరాజ్యం, అంజుమ్ సుల్తానా, దొమరసింగు సింహాద్రిరావు, ఇరుసుమల్ల పార్వతి, ముసినాడ సాంబశివరావు, సొసైటీ మేనేజర్ మీర్ అమీర్‌హుస్సేన్, అకౌంటెంట్ కోన కనకమహాలక్ష్మి కుమ్మక్కై ఈ కుంభకోణానికి పాల్పడినట్లుగా తేలింది. ప్రభుత్వ చొరవతో ఆస్తులు సీజ్.. మరోవైపు.. రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో స్పందించడంతో కోడి వీరవెంకట సత్యనారాయణ పేరుతో ఉన్న మూడు విలువైన ఆస్తులను సీజ్‌చేశారు. ఇందులో కాకినాడ వాకలపూడిలోని 1,400 చదర పు గజాలు ఖాళీ స్థలం, కాకినాడ నూకాలమ్మ గుడి వద్ద ఉన్న బిల్డింగ్ సొసైటీ భవనంతోపాటు మరో ఇల్లు సీజ్ చేశా రు. వీటి విలువ రూ.10 కోట్ల నుంచి రూ.12 కోట్ల వరకు ఉంటాయి. త్వరలో వీటిని వేలం వేసి ఆ సొమ్ముతో డిపాజిటర్లకు ప్రభుత్వం న్యాయం చేయనుంది. చదవండి: ఇదే నాకు మొదటి పెళ్లి... నాకు మందు, సిగరేట్లు కావాలి బాధ్యులపై క్రిమినల్ కేసులు.. కుంభకోణానికి పాల్పడ్డ కోడి వీరవెంకట సత్యనారాయణ సహా 14 మందిపై జిల్లా సహకార అధికారి బొర్రా దుర్గాప్రసాద్ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు క్రిమినల్ కేసులు నమోదుచేశారు. కాకినాడ టూటౌన్ ఇన్స్పెక్టర్ బి. నాగేశ్వర్‌నాయక్ వీరిపై ఐపీసీ 120బి, 420, 406, 408, 109 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ప్రభుత్వం ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించి విచారణ కొనసాగిస్తోందని దుర్గాప్రసాద్ ‘సాక్షి’కి చెప్పారు. -
విషాదం.. స్కూల్ బస్సు కిందపడి ఒకరు.. ఆర్టీసీ బస్సు ఢీకొని మరో చిన్నారి
సాక్షి, తూర్పుగోదావరి: బైక్‌ను ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో ఆరేళ్ల చిన్నారి మృతి చెందిన ఘటన రాజమహేంద్రవరంలో చోటుచేసుకుంది. ఒకటో తరగతి చదువుతున్న ఈశ్వర్(6) తన తండ్రితో కలిసి బైక్‌పై స్కూల్‌కు వెళ్తున్నారు. ఈ క్రమంలో ఆల్కాట్ తోట సమీపంలోని ఐఓసి వద్ద రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన ఆర్టీసీ బస్సు వీరిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బాలుడు బస్సు కిందపడి అక్కడికక్కడే మరణించాడు. బైక్ నుంచి పక్కకు పడిన బాలుడి తండ్రికి గాయాలయ్యాయి. దీంతో ఆగ్రహం చెందిన మృతుని బంధువులు రాళ్లతో ఆర్టీసీ బస్సు అద్దాలు పగలగొట్టారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వైఎస్సార్ కడప: జిల్లాలోని జమ్మలమడుగులో విషాదం చోటుచేసుకుంది. ప్రైవేటు స్కూల్ బస్సు కింద పడి నాలుగేళ్ల చిన్నారి మృతి చెందింది. ఇంట్లో నుంచి చిన్నారి సఫినా స్కూల్ బస్సులో పాఠశాలకు బయల్దేరింది. అయితే పాఠశాలకు చేరుకున్నాక బస్సు దిగుతుండగా కాలు జారి కిందపడిపోయింది. ఈ విషయాన్ని గమనించని డ్రైవర్ బస్సును ముందుకు వెళ్లనివ్వడంతో చిన్నారి అక్కడికక్కడే మరణించింది. సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాదంపై విచారణ చేపట్టారు. ప్రస్తుతం బస్సు డ్రైవర్ పరారీలో ఉన్నాడు. కూతురు మరణంతో తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. చదవండి: మాజీ ఐఆర్ఎస్ అధికారి ఇంట్లో చోరీ వెనుక భారీ కుట్ర -
Viveka Case: సునీత బాధితురాలా? ఫిర్యాదుదారా? నిర్ణయించనున్న సుప్రీం
న్యూఢిల్లీ: వివేకా హత్య కేసులో సునీత బాధితురాలా? లేక ఫిర్యాదుదారా ? దేనికి కాంపిటెంట్ అన్న విషయాన్ని త్వరలోనే నిర్ణయిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. ఈ కేసు ఇవ్వాళ జస్టిస్ కృష్ణ మురారి, జస్టిస్ సంజయ్ కుమార్ ధర్మాసనం ముందుకు రాగా.. విచారణను సుప్రీంకోర్టు బుధవారానికి వాయిదా వేసింది. ఏం జరిగింది? ఈ కేసులో తనకు న్యాయ సహాయం కావాలని కోరుతూ ఇప్పటికే సుప్రీంను ఆశ్రయించాడు దస్తగిరి. తనకు ఆర్థిక స్థోమత లేనందున కోర్టు న్యాయ సాయానికి అడ్వొకేట్ ను కేటాయించాలని కోరాడు. అయితే, వివేకా కేసులో దస్తగిరి అప్రూవర్‌గా మారడాన్ని సవాల్ చేస్తూ శివశంకర్ రెడ్డి, కృష్ణారెడ్డి సుప్రీంకోర్టులో ఇప్పటికే పిటిషన్ దాఖలు చేశారు. వివేకానందరెడ్డిని హత్య చేసిందే దస్తగిరి అయినప్పుడు.. అదే నిందితుడు.. బాధితుడు ఎలా అవుతాడని అడిగారు కృష్ణారెడ్డి. వివేకా హత్యపై అసలు ఫిర్యాదు చేసిందే తానని, అందరికంటే ముందు పోలీసులకు తానే ఫిర్యాదు చేసినందున తనను బాధితుడిగా గుర్తించాలంటూ వివేకా పీఏ కృష్ణారెడ్డి పిటిషన్ లో కోరారు. కేసులో తాను కూడా బాధితురాలినేనని, తాను ఇంప్లీడ్ అవుతానంటూ సునీత పిటిషన్ వేశారు. సునీత వాదనేంటీ? దస్తగిరి విషయంలో ఇంప్లిడ్ పిటిషన్ వేసిన సునీత రెడ్డిని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఏ హోదాలో ఇంప్లీడ్ అవుతున్నారని అడిగింది. దానికి తాను బాధితురాలిని అని, ఈ కేసుకు సంబంధించిన ఏ విషయంలో అయినా.. తనను బాధితురాలిగా చూడాలని సుప్రీంకోర్టుకు కోరింది సునీత. కేసుకు సంబంధించి అదనపు సమాచారం ఇచ్చేందుకు మరింత గడువు ఇవ్వాలని సుప్రీంకోర్టును కోరారు. సుప్రీంకోర్టు ఏం చెప్పింది? ఈ పిటిషన్‌ను పరిశీలించిన సర్వోన్నత న్యాయస్థానం కేసును హైకోర్టుకు బదిలీ చేయడమే సబబని పేర్కొంది. ఇప్పటికే కేసును క్షుణ్ణంగా పరిశీలిస్తోన్న తెలంగాణ హైకోర్టే పిటిషన్ విచారించడం సరైందని జస్టిస్ కృష్ణ మురారి, జస్టిస్ సంజయ్ కుమార్ ధర్మాసనం తెలిపింది. తెలంగాణ హైకోర్టులో పిటిషన్ పెండింగులో ఉన్నందున ముందు అక్కడ తేల్చుకోవాలని సూచించింది. అయితే సునీత తరపు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా.. ఇక్కడే పిటిషన్ ను విచారించాలని పట్టుబట్టారు. ఈ కేసును ఏపీ నుంచి తెలంగాణకు బదిలీ చేసే సమయంలో వివేకా సతీమణీ, కుమార్తెలను బాధితులుగా సుప్రీంకోర్టు గుర్తించిందంటూ లుథ్రా తెలిపారు. చివరికి ఏం జరిగింది? సునీత తరపు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనల అనంతరం ఈ కేసు తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేసింది సుప్రీంకోర్టు. సునీత బాధితురాలా? లేక ఫిర్యాదుదారా ? దేనికి కాంపిటెంట్ అన్న విషయాన్ని త్వరలోనే నిర్ణయిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. -
చెరుకు మిషన్‌లోకి చున్నీ: యువతి మృతి
శ్రీకాకుళం: శ్రీకూర్మంలోని శ్రీకూర్మనాథాలయం వద్దనున్న చెరుకు మిషన్ వద్ద పని చేస్తున్న గాయత్రి (18) అనే యువతి చున్నీ మిషన్‌లోకి వెళ్లిపోవడంతో ఊపిరాడక మృతి చెందింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కండ్ర వీధికి చెందిన గాయత్రి ఆదివారం సాయంత్రం చెరుకు మిషన్ వద్ద పనిచేస్తూ ఉండగా ప్రమాదవశాత్తు చున్నీ మిషన్‌లోకి వెళ్లిపోయి ఊపిరాడక అపస్మారక స్థితికి వెళ్లిపోయింది. స్థానికులు హుటాహుటిన రిమ్స్‌కు తరలించినా అప్పటికే ఆమె మృతి చెందింది. ఎస్ఐ ఎన్.కామేశ్వరరావు కేసు నమోదు చేశారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్ సీపీ యువనేత ధర్మాన రామ్మనోహర్ నాయుడు రిమ్స్ వైద్యులతో మాట్లాడారు. -
Nellore: 3 నెలల కిందటే పెళ్లి.. నారాయణ కళాశాలలో హౌస్‌సర్జన్ ఆత్మహత్య
సాక్షి, నెల్లూరు: శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా నెల్లూరు రూరల్ పరిధి లోని చింతారెడ్డిపాళెంలో ఉన్న నారాయణ వైద్య కళాశాలలో ఓ హౌస్‌సర్జన్ తన రూమ్‌లోనే ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన శనివారం అర్ధరాత్రి జరిగింది. నెల్లూరు రూరల్ పోలీసులు, మృతురాలి కుటుంబ సభ్యుల కథనం.. శ్రీకాకుళం జిల్లా పలాసకు చెందిన చైతన్య(24) నారాయణ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ చదువుతోంది. మూడు నెలల కిందట శ్రీకాకుళం జిల్లాకు చెందిన శరత్‌చంద్రతో ఆమెకు వివాహమైంది. శరత్చంద్ర విజయనగరంలోని వైద్య కళాశాలలో ఆర్థో విభాగంలో పీజీ చదువుతున్నాడు. పెళ్లయిన నాటి నుంచి చైతన్యను భర్త వేధింపులకు గురిచేసేవాడని, నగదు, కారు ఇవ్వాల్సిందిగా ఒత్తిడి తెస్తుండేవాడని తెలుస్తోంది. భర్త నుంచి వేధింపులు అధికం కావడంతో మనస్తాపం చెందిన చైతన్య రూమ్‌లో తన చున్నీతో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. చైతన్యకు తల్లి జ్యోతికుమారి ఫోన్ చేయగా ఎంతకీ లిఫ్ట్ చేయకపోవడంతో హాస్టల్ వార్డెన్‌కు కాల్ చేసింది. హాస్టల్ సిబ్బంది చైతన్య గది వద్దకు వెళ్లి రూమ్ తలుపులు పగులగొట్టి చూడగా చైతన్య మృతదేహం ఫ్యాన్‌కు వేలాడుతూ ఉంది. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో రూరల్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఇది కూడా చదవండి: తెలుగు తల్లి ఫ్లైఓవర్‌పై ఘోర ప్రమాదం.. ఇద్దరు మృతి -
తెలుగు తల్లి ఫ్లైఓవర్‌పై ఘోర ప్రమాదం.. ఇద్దరు విద్యార్థులు మృతి
సాక్షి, విశాఖపట్నం: విశాఖపట్నంలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. నగరంలోని తెలుగు తల్లి ఫ్లైఓవర్‌పై టాటా హేరియర్ వాహనం అతివేగంగా దూసుకొచ్చి ఓ బైకు, స్కూటీలను ఢీకొంది. ఈ ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న విద్యార్థులు ప్రయాణీకులు ఫ్లైఓవర్ మీద నుండి 30 అడుగుల కిందకి పడిపోయారు. వివరాల ప్రకారం.. తెలుగు తల్లి ఫ్లైఓవర్‌పై టాటా హేరియర్ వాహనం బీభత్సం సృష్టించింది. టాటా హేరియర్ నడుపుతున్న వ్యక్తి మద్యం మత్తులో వేగంగా వాహనాన్ని నడపడం వల్ల వాహనం బైకు, స్కూటీలను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న వ్యక్తి ఫ్లైఓవర్ మీద నుండి 30 అడుగుల కిందకి పడిపోయాడు. దీంతో.. ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ క్రమంలో వారిని ఆసుపత్రికి తరలిస్తుండగా.. జైకృష్ణ అనే విద్యార్ధి మృతిచెందగా.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ యశ్వంత్ చనిపోయాడు. మరో విద్యార్థి హరి కుమార్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. ఈ ఘటనలో స్కూటీ నుజ్జునుజ్జు అయ్యింది. కాగా, కాకాని చార్విక్ అనే వ్యక్తి మద్యం మత్తులో కారు డ్రైవింగ్ చేయడం వల్లే ఈ ప్రమాదం జరిగింది. ఇక, మురళీనగర్‌లో నివాసం ఉంటున్న చార్విక్ రియల్ ఎస్టేట్ కాంట్రాక్టర్‌గా పనిచేస్తున్నారు. చార్విక్ స్వస్థలం గన్నవరం. అయితే, చార్విక్ నిన్న(శవివారం) రాత్రి ఓ పార్టీలో ఫుల్‌గా మద్యం సేవించి కారు డ్రైవింగ్ చేసినట్టు సమాచారం. ఇది కూడా చదవండి: థియేటర్ ధ్వంసం.. పవన్ అభిమానులపై కేసు -
థియేటర్ ధ్వంసం.. పవన్ అభిమానులపై కేసు
సత్యనారాయణపురం(విజయవాడసెంట్రల్): తొలిప్రేమ సినిమా ప్రదర్శించిన థియేటర్‌ను ధ్వంసం చేసిన పవన్ కళ్యాణ్ అభిమానులపై విజయవాడ సత్యనారాయణపురం పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... పవన్ కళ్యాణ్ నటించిన తొలిప్రేమ సినిమా శుక్రవారం నగరంలోని గాంధీనగర్‌లో ఉన్న కపర్థి థియేటర్లో ప్రదర్శించారు. సెకండ్ షో రాత్రి 10.30 గంటలకు మొదలవగా, 10.45కి కొంతమంది అభిమానులు స్క్రీన్ వద్దకు చేరి డ్యాన్సులు చేశారు. స్క్రీన్‌ను చింపేందుకు ప్రయతి్నంచగా, థియేటర్ సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో పవన్ అభిమానులు రెచి్చపోయి సిబ్బందిపై దాడి చేశారు. స్క్రీన్‌ను చించివేశారు. కుర్చీలు, తలుపులు విరగ్గొట్టారు. అద్దాలను పగులగొట్టారు. సినిమాకు వచ్చిన గుర్తుతెలియని వ్యక్తులు థియేటర్లో విధ్వంసం సృష్టించి రూ.4 లక్షలు ఆస్తి నష్టం కలిగించారని థియేటర్ మేనేజర్ బి.మోహనరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు.పోలీసులు శనివారం కేసు నమోదు చేసి ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. విచారణకు మూడు బృందాలను ఏర్పాటు చేశారు. ఇది కూడా చదవండి: చనిపోయినట్లు భావించి అంత్యక్రియలకు ఏర్పాట్లు -
వివాహేతర సంబంధం: ప్రియుడితో కలిసి స్కెచ్, మరో మహిళతో ఫోన్ చేయించి
సాక్షి, నంద్యాల: హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. పగిడ్యాల మండలం ప్రాతకోట గ్రామానికి చెందిన వెంకటన్న (42)ను సొంత భార్యనే పొట్టన పెట్టుకుంది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలసి హత్యకు పాల్పడినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. రూరల్ సీఐ సుధాకర్‌రెడ్డి తెలిపిన వివరాల మేరకు.. పగిడ్యాల మండలం ప్రాతకోట గ్రామానికి చెందిన రాము అలియాస్ వెంకటన్నకు భార్య శ్యామల, కొడుకు శరత్చంద్ర(9) ఉన్నారు. భార్య ఇంటివద్ద చీరల వ్యాపారం చేస్తుండగా.. వెంకటన్న మెడికల్ షాపు నిర్వహిస్తున్నాడు. ఈనెల 19న వెంకటన్న హత్యకు గురయ్యాడు. కాగా భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టగా భార్యనే నిందితురాలని తేలింది. బేతంచెర్లకు చెందిన కుమారస్వామితో శ్యామలకు వివాహేతర సంబంధం ఉంది. భార్య ప్రవర్తనపై అనుమానం రావడంతో వెంకటన్న వేధింపులకు గురి చేసేవాడు. ఈ క్రమంలో భర్తను అడ్డు తొలగించుకునేందుకు ప్రియుడు కుమార్‌స్వామి, అతని స్నేహితులు ఐదుగురితో కలిసి శ్యామల హత్యకు కుట్ర పన్నింది. ఈ మేరకు బేతంచెర్లకు చెందిన దేవమణి అనే మహిళను రంగంలోకి దింపారు. ఆమె ఫోన్లో వెంకటన్నను పరిచయం చేసుకుని వల పన్నింది. ఈనెల 19న ఫోన్ చేసి జూపాడుబంగ్లా మండలంలోని భాస్కరాపురం గ్రామ సమీపంలోని కేసీ కెనాల్ గట్టు వద్దకు రావాలని చెప్పడంతో వెంకటన్న బైక్‌పై వెళ్లాడు. కాగా అప్పటికే అక్కడ మాటు వేసిన కుమారస్వామి, అతని స్నేహితులు నలుగురితో కలిసి వెంకటన్న గొంతుకు బైక్ తీగ బిగించి చంపేశారు. ఆ తర్వాత ముఖం గుర్తు పట్టకుండా రాళ్లతో మోదారు. కాగా పోలీసులు శ్యామల ప్రవర్తనపై అనుమానం రావడంతో ఆ మేరకు కేసు దర్యాప్తు చేపట్టి ఛేదించినట్లు సీఐ తెలిపారు. హత్యకు పాల్పడిన శ్యామల, ఆమె ప్రియుడు కుమారస్వామి, అతని స్నేహితులు శ్రీనివాసులు, లక్ష్మన్న, హుసేన్ నాయుడు, రంగనాయకులు, దేవమణిని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచినట్లు పేర్కొన్నారు. చదవండి: స్నేహితులను భార్యపైకి లైంగికదాడికి ఉసిగొల్పే భర్త... -
తలకోన జలపాతం: విహారయాత్రలో విషాదం.. సుమన్ మృతి
సాక్షి, తిరుపతి: తలకోన జలపాతం వద్ద విషాదకర ఘటన చోటుచేసుకుంది. విహారం కోసం వెళ్లిన యాత్ర.. విషాదకరంగా ముగిసింది. జలపాతం వద్ద ఈత కొడుతూ ప్రమాదవశాత్తు బండరాళ్ల మధ్య ఇరుక్కుపోయ చెన్నైకి చెందిన సుమన్(23) మృతిచెందాడు. దీంతో, వారి కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. వివరాల ప్రకారం.. స్నేహితుడితో కలిసి సరదాగా విహారయాత్రకు వెళ్లి సుమన్ మృత్యువాతపడ్డాడు. జలపాతం వద్ద ఈత కొడుతూ ప్రమాదవశాత్తు బండరాళ్ల మధ్య ఇరుక్కుపోయిన సుమన్ మృతదేహాన్ని పోలీసులు వెలికితీశారు. కాగా, చెన్నైలో ఎమ్మెస్సీ చదువుతోన్న సుమంత్ తిరుపతికి చెందిన సహ విద్యార్ధితో కలిసి తలకోనకు వచ్చి ప్రమాదానికి గురయ్యాడు. జలపాతంపై నుంచి దూకుతూ వీడియో తీయమని స్నేహితుడిని కోరాడు. ఈ క్రమంలో పై నుంచి తలకిందులుగా నీళ్లలోకి దూకిన సుమంత్ కనిపించకపోకవడంతో స్నేహితుడు ఆందోళన చెందాడు. సుమంత్ తలభాగం బండరాళ్లతో చిక్కుకుపోయిన విషయం తెలుసుకున్న స్నేహితుడు వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. ఘటనా స్థలానికి చేరుకున్న ఎర్రవారిపాలెం పోలీసులు శుక్రవారం రాత్రి వరకు సుమంత్‌ను బయటికి తీయడానికి ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. చీకటిపడటంతో శనివారం ఉదయం వెలికితీస్తామన్నారు. ఈ రోజు ఉదయం పోలీసులు సుమంత్ మృతదేహాన్ని వెలికితీశారు. కాగా తలకోనలో తరచూ ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఈ ఏడాది ఇప్పటి వరకూ ముగ్గురు యువకులు జలపాతంలో మునిగి మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు. ఇది కూడా చదవండి: ప్లాట్‌ఫామ్‌పై పిచ్చి చేష్టలు.. లోకల్ ట్రైన్ ఢీకొనడంతో గాల్లోకి ఎగిరి.. -
సారీ కవిత నా వల్ల మాటలు పడ్డావ్.. తల్లీకొడుకు ఆత్మహత్యాయత్నం
సాక్షి, విజయనగరం: జిల్లాలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. తల్లీకొడుకుల సెల్పీ సూసైడ్‌యత్నం స్థానికంగా కలకలం సృష్టించింది. కాగా, వీరి ఆత్మహత్యకు కొడుకు ప్రేమ వ్యవహారమే కారణమని తెలుస్తోంది. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. వివరాల ప్రకారం.. యూసిన్ అనే యువకుడు పార్వతీపురానికి చెందిన ఓ యువతితో ప్రేమలో పడ్డాడు. కొన్నాళ్లు బాగానే ఉన్నప్పటికీ తాజాగా వారి మధ్య విబేధాలు నెలకొన్నాయి. దీంతో, ఆమెతో దూరంగా ఉంటున్నాడు యాసిన్. అయితే, సదరు యువకుడిని ఆమె బంధువులు వేధింపులకు గురిచేయడంతో పాటుగా బెదిరించారు. అతనిపై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెడుతూ ఘోరంగా అవమానించారు. తన తల్లి గురించి కూడా దారుణమైన కామెంట్స్ చేశారు. ఈ క్రమంలో వారి బెదిరింపులు, వేధింపుల కారణంగా యాసిన్, అతడి తల్లి తీవ్ర ఆవేదనకు గురయ్యారు. అవమాన భారంతో ఆత్మహత్య చేసుకునేందుకు తల్లీ కొడుకు పురుగుల మందు తాగారు. ఈ సందర్బంగా తమ ఆత్మహత్యలకు సదరు యువతి కుటంబమే కారణమని సెల్ఫీ వీడియో తీసుకుంటూ సూసైడ్‌యత్నం చేశారు. విషయాన్ని చుట్టుపక్కల వారు గమనించడంతో ఇద్దరిని ఆస్పత్రికి తరలించారు. అయితే వారిద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇది కూడా చదవండి: హాయ్ అంటూ దగ్గరయ్యాడు.. నమ్మకంతో ఆమె వీడియో కాల్స్ చేసి.. -
అనంతలో టీడీపీ మూకల దాష్టీకం
సాక్షి, అనంతపురం: తాడిపత్రి లో తెలుగు దేశం పార్టీ నేతలు, కార్యకర్తలు రెచ్చిపోయారు. గంగాదేవి పల్లిలో జగనన్న కాలనీ కోసం భూమిని చదును చేస్తుండగా.. అక్కడివారిపై దాడికి దిగారు. జగనన్న కాలనీ భూమిని వైఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తల చదును చేస్తుండగా.. అడ్డుకుని టీడీపీ వర్గం కర్రలతో దాడి చేసింది. ఈ దాడిలో ఐదుగురు వైఎస్సార్ సీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. ఈ దాడికి సంబంధించి.. 24 మంది కార్యకర్తలపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఎమ్మెల్యే పరామర్శ టీడీపీ వర్గం దాడిలో గాయపడ్డ వారిని ఆసుపత్రిలో పరామర్శించారు తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి. ఇదీ చదవండి: ఓటర్ల సవరణ జాబితాపై ఫోకస్ పెట్టండి -
రూ.2000 నోట్లు మార్పిడి.. 90 లక్షలు నష్టం.. ఎలాగంటే!
పార్వతీపురం: ‘రెండు వేల రూపాయల నోట్లు రూ.కోటి ఇస్తాం. మీరు రూ.500 నోట్లు రూ.90లక్షలు ఇవ్వండి చాలు..’ అని నమ్మబలికిన ఇద్దరు వ్యక్తులు మోసం చేశారు. రూ.పది లక్షలు లాభం ఆశ చూపించి రూ.90లక్షలతో ఉడాయించారు. ఈ ఘటన పార్వతీపురంలో సోమవారం జరిగింది. పార్వతీపురం రూరల్ ఎస్ఐ వై.సింహాచలం తెలిపిన వివరాల ప్రకారం... పార్వతీపురానికి చెందిన ఆబోతుల అనిల్‌కుమార్, ఎల్.అనిల్‌కుమార్ ఓ ప్రైవేట్ బ్యాంకులో రుణాలు ఇప్పిస్తుంటారు. వారి వద్దకు స్థానిక వడ్డీ వ్యాపారుల ద్వారా వారం రోజుల కిందట ఎన్.చక్రపాణి(కాకినాడ), ఎస్కే నజీమ్(భీమవరం) వచ్చి కలిశారు. తమకు తెలిసినవారి వద్ద రూ.2వేల నోట్లు ఉన్నాయని, రూ.500 నోట్లు రూ.90 లక్షలు ఇస్తే... రూ.2వేల నోట్లు రూ.కోటి ఇస్తారని చెప్పారు. ఆ తర్వాత ఇద్దరిని పార్వతీపురం పిలిపించి ఆబోతుల అనిల్‌కుమార్, ఎల్.అనిల్‌కుమార్‌లతో మాట్లాడించారు. ఒకే రోజు రూ.10 లక్షలు వస్తుందని ఆశతో ఆబోతుల అనిల్‌కుమార్, ఎల్.అనిల్‌కుమార్ వారితో ఒప్పందానికి అంగీకరించారు. తమ వద్ద ఉన్న నగదుతోపాటు స్నేహితులు, బంధువుల వద్ద కొంత తీసుకువచ్చి రూ.90 లక్షలను సోమవారం ఆ వ్యక్తులకు ఇచ్చారు. కొద్దిసేపు ఇక్కడే ఉంటే రూ.కోటి తెస్తామని చెప్పి వెళ్లిన ఇద్దరు తిరిగి రాలేదు. దీంతో తాము మోసపోయినట్టు గుర్తించిన ఆబోతుల అనిల్‌కుమార్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మధ్యవర్తులుగా వ్యవహరించిన చక్రపాణి, నజీమ్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులను పట్టుకుంటామని ఎస్ఐ తెలిపారు. చదవండి: ఏపీలో బంగారం తవ్వకాలు! ఎన్ఎండీసీ రూ. 500 కోట్ల వ్యయం.. -
అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి
ఏలూరు: అనుమానాస్పద స్థితిలో ఓ యువకుడు మృతి చెందగా, స్నేహితుడే హత్య చేశాడని మృతుడి బంధువులు, స్నేహితులు ఆరోపిస్తుండగా, ప్రమాదవశాత్తూ కాల్వలో పడి మృతి చెందాడని పోలీసులు చెబుతున్నారు. ఆదివారం రాత్రి తణుకులో మృతుడి బంధువులు, స్నేహితులు రోడ్డుపై బైఠాయించడంతో ఉద్రిక్తతకు దారి తీసింది. పోలీసులు, మృతుడి బంధువులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. తాడేపల్లిగూడెంలోని పాతవూరుకు చెందిన నల్లా జగత్ కల్యాణ్ (18), సప్పా అజయ్‌కుమార్ స్నేహితులు. ఈ నెల 20న అర్ధరాత్రి తాడేపల్లిగూడెంలో మద్యం తాగిన వీరు టిఫిన్ చేసేందుకు మోటారు సైకిల్‌పై తణుకు వచ్చారు. స్థానిక తేతలి వైజంక్షన్ వద్ద టిఫిన్ చేసి తిరిగి బయలుదేరారు. అయితే మరుసటి రోజు అజయ్‌కుమార్ మాత్రమే తాడేపల్లిగూడెం చేరుకోవడంతో స్నేహితులు ఆరా తీశారు. తనకు తెలియదని తన మోటారు సైకిల్ తీసుకుని ఎక్కడికో వెళ్లి ఉంటాడని పొంతన లేని సమాధానాలు చెప్పాడు. దీంతో అనుమానం వచ్చిన స్నేహితులు తాడేపల్లిగూడెం పోలీసులకు సమాచారం అందించారు. అజయ్‌కుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేయగా, మద్యం మత్తులో అసలేం జరిగిందో గుర్తు లేదని చెప్పాడు. ఇదిలా ఉంటే ఈనెల 24న తణుకు మండలం తేతలి గ్రామం పరిధిలోని కాల్వలో గుర్తు తెలియని మృతదేహం ఉందని వచ్చిన సమాచారంతో తణుకు రూరల్ పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. కల్యాణ్ ఆచూకీ కోసం గాలిస్తున్న స్నేహితులు, బంధువులు తణుకు వద్ద దొరికిన మృతదేహం కల్యాణ్దిగా నిర్థారించారు. దీంతో మరోసారి పోలీసులు అజయ్‌కుమార్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా తానే హత్య చేశానని ఒప్పుకోవడంతో తొలుత హత్యగా భావించారు. ప్రమాదమే అంటున్న పోలీసులు కల్యాణ్ మృతదేహాన్ని శనివారం గుర్తించిన తణుకు పోలీసులు అదే ప్రాంతంలో మోటారు సైకిల్‌ను ఆదివారం గుర్తించారు. దీంతో అజయ్కుమారే హత్య చేసినట్లుగా భావించారు. అయితే విచారణ చేపట్టిన పోలీసులు మృతదేహం, బైక్ దొరికిన ప్రాంతంలో లభ్యమైన ఆధారాలు నేపథ్యంలో రోడ్డు ప్రమాదంలోనే కల్యాణ్ మృతి చెందినట్లు నిర్థారణకు వచ్చారు. తాడేపల్లిగూడెం డీఎస్పీ శరత్‌రాజ్‌కుమార్, సీఐ నాగరాజు, తణుకు రూరల్ సీఐ ఆంజనేయులు, ఎస్సై గుర్రయ్య ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. తణుకు జాతీయ రహదారిపై టిఫిన్ చేసిన అనంతరం తేతలి వంతెన వద్దకు వచ్చేసరికి అదుపుతప్పి బైక్‌తో సహా కల్యాణ్ కాల్వలోకి పడిపోయి ఉంటాడని పోలీసులు చెబుతున్నారు. మద్యం తాగి ఉన్న అజయ్‌కుమార్ గట్టుపై పడి స్పృహ వచ్చి చూసేసరికి కల్యాణ్ లేకపోవడంతో దువ్వ సెంటర్ వరకు నడిచి వచ్చి అక్కడే గుడిలో నిద్రించి ఉదయాన్నే తాడేపల్లిగూడెం వెళ్లాడు. కల్యాణ్ కోసం ఆరా తీసిన స్నేహితులకు ఏం జరిగిందో తనకు గుర్తు లేదని, బైక్‌పై ఎక్కడికో వెళ్లి ఉంటాడని చెప్పాడు. ఇదే నిజమని బంధువులు, స్నేహితులు భావిస్తున్న తరుణంలో కల్యాణ్ మృతదేహం లభ్యం కావడం అనుమానాలను రేకెత్తించాయి. రోడ్డుపై బైఠాయించి నిరసన కల్యాణ్ మృతదేహం లభ్యమైన తర్వాత అజయ్‌కుమార్‌ను అదుపులోకి తీసుకున్న తాడేపల్లిగూడెం పోలీసులు తమదైన శైలిలో విచారణ చేయడంతో తానే హత్య చేశానని ఒప్పుకున్నాడని పోలీసులకు తమకు సమాచారం ఇచ్చినట్లు స్నేహితులు, బంధువులు చెబుతున్నారు. ఆదివారం ఉదయం వరకు హత్యగానే భావించినప్పటికీ రోడ్డు ప్రమాదంలోనే కల్యాణ్ మృతి చెందాడని, దీంతో అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లుగా కేసు నమోదు చేయడంపై మృతుడి బంధువులు, స్నేహితులు ఆదివారం రాత్రి ఆందోళనకు దిగారు. తణుకు ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని తీసుకెళ్లబోమంటూ బైఠాయించి మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలంటూ బంధువులు రాస్తారోకోకు దిగారు. సీఐ ఆంజనేయులు, ఎస్సై గుర్రయ్య వారికి నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. తణుకు రూరల్ సీఐ సీహెచ్ ఆంజనేయులు మాట్లాడుతూ అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశామని పోస్టుమార్టం నివేదిక ఆధారంగా సమగ్ర దర్యాప్తు చేసి చర్యలు తీసుకుంటామని చెప్పారు. -
‘తమ్ముళ్లే’ ఆ గంజాయి బాబులు!
సాక్షి, పుట్టపర్తి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వస్తున్న జనాదరణ చూసి ఓర్వలేక.. ఎన్నికల్లో ప్రత్యక్షంగా ఎదుర్కొనే దమ్ములేక టీడీపీ నేతలు విష సంస్కృతికి తెరలేపారు. శ్రీసత్యసాయి జిల్లా ముదిగుబ్బలో గంజాయి సేవించి హల్చల్ చేసిన యువకులు టీడీపీ కార్యకర్తలు అయినప్పటికీ వారు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అనుచరులని తప్పుడు ప్రచారం చేస్తూ బురదజల్లేందుకు ప్రయత్నిస్తున్నారు. రాప్తాడు నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ పరిటాల సునీత కుమారుడు శ్రీరామ్‌కు సన్నిహితంగా ఉండే కార్తీక్.. ఈ నెల 23న తన స్నేహితులతో కలిసి గంజాయి సేవించి వాహనాలతో రోడ్లపై హడావుడి చేశారు. అడ్డొచ్చిన వాహనాలను ఢీకొట్టారు. ఎదురు మాట్లాడిన వ్యక్తిని చితకబాదారు. పోలీసులు పట్టుకుంటే ‘వైఎస్సార్సీపీ రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి’ స్టిక్కర్ చూపించారు. తాము చేసిన అరాచకాన్ని అధికార పార్టీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డిపైకి నెట్టేందుకే ఈ స్టిక్కర్’ చూపించినట్లు తెలుస్తోంది. బురద జల్లేందుకే.. నిజానికి.. 2019 ఎన్నికల్లో రాప్తాడు నుంచి టీడీపీ తరఫున పోటీచేసి ఘోరంగా ఓడిపోయిన పరిటాల శ్రీరామ్.. రాజకీయంగా ఎదుర్కొనే సత్తాలేక ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డిపై బురదజల్లేందుకు ఆకతాయిలను రోడ్లపై వదిలినట్లు సామాజిక మాధ్యమాల్లో విస్తృత ప్రచారం జరుగుతోంది. గంజాయి మత్తులో వీరంగం చేయడంతో పాటు అధికార పార్టీ నేతలను లాగాలని చూడటం తెలుగు తమ్ముళ్లకు సరికాదని వైఎస్సార్సీపీ శ్రేణులు సోషల్ మీడియాలో కౌంటర్ ఇచ్చాయి. ఇక ముదిగుబ్బ పోలీసుల అదుపులో ఉన్న కార్తీక్ గురించి వైఎస్సార్సీపీ నేతలు ఆరా తీయగా పరిటాల శ్రీరామ్‌కు అత్యంత సన్నిహితుడిగా తేలింది. అదేవిధంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌తో దిగిన అతని ఫొటోలూ సేకరించారు. -
అత్తను నరికిన అల్లుడు
చిట్టినగర్ (విజయవాడ పశ్చిమ): అత్తను ఆమె అల్లుడే కత్తితో దారుణంగా నరికి చంపాడు. ఈ ఘటన విజయవాడ కొత్తపేట పోలీస్‌స్టేషన్ పరిధిలోని నైనవరం ఫ్లై ఓవర్‌పై శనివారం రాత్రి చోటుచేసుకుంది. మామను కూడా చంపేందుకు ప్రయత్నించగా.. వేగంగా బైక్ నడిపి తప్పించుకోగలిగాడు. ఈ ఘటన వివరాలు... ఎన్టీఆర్ జిల్లా విజయవాడ వైఎస్సార్ కాలనీకి చెందిన గోగుల నాగమణి (50), గురుస్వామి భార్యాభర్తలు. వీరికి ముగ్గురు సంతానం కాగా, రెండో కుమార్తె లలితను ఏకలవ్యనగర్‌కు చెందిన కుంభా రాజేశ్‌కు ఇచ్చి వివాహం చేశారు. కొంతకాలంగా రాజేశ్, లలిత మధ్య గొడవలు జరగడంతో పోలీస్ స్టేషన్లో కేసు కూడా పెట్టారు. అప్పటి నుంచి లలిత పుట్టింట్లోనే ఉంటోంది. విడాకుల కోసం కోర్టులో దరఖాస్తు చేసుకోగా.. కేసు చివరి దశలో ఉంది. ఈ క్రమంలో రాజేశ్ తన అత్త, మామలను చంపేందుకు ప్లాన్ చేశాడు. కాలనీ నుంచే అత్తమామలను వెంబడించి.. శనివారం రాత్రి 8.30 గంటల సమయంలో వైఎస్సార్ కాలనీ నుంచి సాయిరాం థియేటర్ వద్ద ఉంటున్న పెద్ద కుమార్తె ఇంటికి నాగమణి, గురుస్వామి బైక్‌పై బయలుదేరారు. వీరి బైక్‌ను ఇంటి నుంచే రాజేశ్ మరో వ్యక్తితో కలిసి మరో ద్విచక్ర వాహనంపై వెంబడించాడు. నైనవరం ఫ్లై ఓవర్ మధ్యన ఉన్న పోలీస్ అవుట్ పోస్ట్ వద్దకు వచ్చేసరికి బైక్ వెనుక కూర్చున్న రాజేశ్ అత్త నాగమణిపై కత్తితో వేటు వేశాడు. భుజంపై కత్తి వేటుపడగా.. నాగమణి పెద్దగా కేకలు వేస్తూ కిందపడిపోయింది. దీంతో ఆమె మెడపై కత్తితో నరికాడు. అదే సమయంలో బైక్‌పై ఉన్న గురుస్వామి భయంతో వేగంగా అక్కడి నుంచి వెళ్లి తప్పించుకున్నాడు. కాగా, రక్తం మడుగులో పడి ఉన్న నాగమణి కొద్దిసేపు గాయాలతో విలవిల్లాడింది. ఆమె ఘటనాస్థలంలోనే మృతిచెందింది. నాగమణి కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకున్నారు. ఈ ఘటన నేపథ్యంలో ఫ్లై ఓవర్‌కు మూడు వైపులా ట్రాఫిక్ నిలిచిపోయింది. కొత్తపేట సీఐ సుబ్రహ్మణ్యం, సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కుటుంబ కలహాలే హత్యకు కారణమని పోలీసులు తేల్చారు. నిందితుడు రాజేశ్, అతడికి సహకరించిన వ్యక్తి పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు.