18-Year-Old Girl Died In Srikakulam District - Sakshi
Sakshi News home page

చెరుకు మిషన్‌లోకి చున్నీ: యువతి మృతి

Jul 3 2023 10:47 AM | Updated on Jul 3 2023 11:32 AM

Young Woman Died In Srikakulam  - Sakshi

శ్రీకాకుళం: శ్రీకూర్మంలోని శ్రీకూర్మనాథాలయం వద్దనున్న చెరుకు మిషన్‌ వద్ద పని చేస్తున్న గాయత్రి (18) అనే యువతి చున్నీ మిషన్‌లోకి వెళ్లిపోవడంతో ఊపిరాడక మృతి చెందింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కండ్ర వీధికి చెందిన గాయత్రి ఆదివారం సాయంత్రం చెరుకు మిషన్‌ వద్ద పనిచేస్తూ ఉండగా ప్రమాదవశాత్తు చున్నీ మిషన్‌లోకి వెళ్లిపోయి ఊపిరాడక అపస్మారక స్థితికి వెళ్లిపోయింది.

స్థానికులు హుటాహుటిన రిమ్స్‌కు తరలించినా అప్పటికే ఆమె మృతి చెందింది. ఎస్‌ఐ ఎన్‌.కామేశ్వరరావు కేసు నమోదు చేశారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్‌ సీపీ యువనేత ధర్మాన రామ్‌మనోహర్‌ నాయుడు రిమ్స్‌ వైద్యులతో మాట్లాడారు.     

Advertisement
 
Advertisement
Advertisement