Visakhapatnam: Janasena Workers Arrested In 2000 Note Exchange Case - Sakshi
Sakshi News home page

విశాఖలో నోట్ల మార్పిడి కలకలం.. జనసేన నాయకుడి అనుచరుడి అరెస్ట్‌

Jul 7 2023 9:54 AM | Updated on Jul 7 2023 1:47 PM

Visakhapatnam: Janasena Worker Arrest In 2000 Note Exchange Case - Sakshi

సాక్షి, విశాఖపట్నం: విశాఖలో కలకలం రేపిన నోట్ల మార్పిడి కేసులో జనసేన నాయకుడి అనుచరుడు సూరి అరెస్ట్‌ అయ్యారు. రూ. 2 వేల నోట్లు మార్పిడి కేసులో పోలీసులు ఇప్పటి వరకు నలుగురిపై కేసు నమోదు చేశారు. కాగా రూ. 90 లక్షలకు సరిపడా రూ. 500 నోట్లు ఇస్తే కోటి రూపాయలకు సరిపడా 2 వేల నోట్లు ఇస్తామని చెప్పి ఇద్దరు రిటైర్డ్‌ నేవల్‌ అధికారులు కొల్లి శ్రీను, శ్రీధర్‌లను ఓ ముఠా మోసం చేసింది. 

అయితే ఈ ముఠాకు ఏఆర్‌ ఆర్‌ఐ స్వర్ణలత నాయకత్వం వహించినట్లు పోలీసులు తేల్చారు. ప్రస్తుతం హోమ్ గార్డ్స్ ఏఆర్‌ సీఐగా పనిచేస్తున్న స్వర్ణలత.. ఆంధ్రప్రదేశ్ పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షురాలిగా ఉన్నారు.

అయితే బాధితులు అందించిన రూ. 90 లక్షల్లో స్వర్ణలత రూ. 15 లక్షలు నొక్కేసినట్లు తేలింది. అంతేగాక తన సిబ్బంది చేత బాధితులను బెదిరించి కొట్టి పంపేసింది. తాము మోసపోయామని గ్రహించిన రిటైర్డ్‌ అధికారులు పోలీసు ఉన్నతాధికారులను ఆశ్రయించడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీనిపై పోలీసులు పూర్తి స్థాయిలో విచారిస్తున్నారు.

నలుగురి అరెస్ట్:
విశాఖ నోట్ల మార్పిడి కేసులో నలుగుర్ని అరెస్టు చేసినట్లు సీపీ త్రివిక్రమ వర్మ తెలిపారు. రూ. 90 లక్షల 500 రూపాయల నోట్లకు కోటి రూపాయల రూ. 2 వేల రూపాయల నోట్లు ఇచ్చేట్లు ఒప్పందం కుదుర్చుకున్నట్లు దర్యాప్తులో తేలిందని వెల్లడించారు. మాజీ నేవల్ ఆఫీసర్‌లు నగదును తీసుకుని సీతంధర వద్ద వెళ్లారని,, ఆర్‌ఐ స్వర్ణలత సమక్షంలోనే డబ్బుల పంపకాలు జరిగినట్లు గుర్తించామని తెలిపారు. ఈ క్రమంలో సూరీని హోం గార్డుల చేత కొట్టించి.. 12 లక్షల రూపాయలను బాధితుల వద్ద నుంచి తీసుకొని వదిలేశారని పేర్కొన్నారు. బాధితులు డీసీపీకి ఫిర్యాదు చేస్తే దర్యాప్తు‍ ప్రారంభించినట్లు చెప్పారు.  
చదవండి: ఓట్ల ప్రక్షాళనతో దొంగ వేషాలు! బాబు బాగోతం తెలిసి రామోజీ పాత పాట!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement