Women Killed Husband With Help Of Lover Over Extra Marital Affair In Nandyal, Details Inside - Sakshi
Sakshi News home page

వివాహేతర సంబంధం: ప్రియుడితో కలిసి స్కెచ్‌, మరో మహిళతో ఫోన్‌ చేయించి

Jul 1 2023 3:11 PM | Updated on Jul 1 2023 3:45 PM

Women Killed Husband With Help Of Lover Over Extra Marital Affair - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, నంద్యాల: హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. పగిడ్యాల మండలం ప్రాతకోట గ్రామానికి చెందిన వెంకటన్న (42)ను సొంత భార్యనే పొట్టన పెట్టుకుంది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలసి హత్యకు పాల్పడినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. రూరల్‌ సీఐ సుధాకర్‌రెడ్డి తెలిపిన వివరాల మేరకు.. పగిడ్యాల మండలం ప్రాతకోట గ్రామానికి చెందిన రాము అలియాస్‌ వెంకటన్నకు భార్య శ్యామల, కొడుకు శరత్‌చంద్ర(9) ఉన్నారు. భార్య ఇంటివద్ద చీరల వ్యాపారం చేస్తుండగా.. వెంకటన్న మెడికల్‌ షాపు నిర్వహిస్తున్నాడు.

ఈనెల 19న వెంకటన్న హత్యకు గురయ్యాడు. కాగా భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టగా భార్యనే నిందితురాలని తేలింది. బేతంచెర్లకు చెందిన కుమారస్వామితో శ్యామలకు వివాహేతర సంబంధం ఉంది. భార్య ప్రవర్తనపై అనుమానం రావడంతో వెంకటన్న వేధింపులకు గురి చేసేవాడు. ఈ క్రమంలో భర్తను అడ్డు తొలగించుకునేందుకు ప్రియుడు కుమార్‌స్వామి, అతని స్నేహితులు ఐదుగురితో కలిసి శ్యామల హత్యకు కుట్ర పన్నింది. ఈ మేరకు బేతంచెర్లకు చెందిన దేవమణి అనే మహిళను రంగంలోకి దింపారు. ఆమె ఫోన్‌లో వెంకటన్నను పరిచయం చేసుకుని వల పన్నింది.

ఈనెల 19న ఫోన్‌ చేసి జూపాడుబంగ్లా మండలంలోని భాస్కరాపురం గ్రామ సమీపంలోని కేసీ కెనాల్‌ గట్టు వద్దకు రావాలని చెప్పడంతో వెంకటన్న బైక్‌పై వెళ్లాడు. కాగా అప్పటికే అక్కడ మాటు వేసిన కుమారస్వామి, అతని స్నేహితులు నలుగురితో కలిసి వెంకటన్న గొంతుకు బైక్‌ తీగ బిగించి చంపేశారు. ఆ తర్వాత ముఖం గుర్తు పట్టకుండా రాళ్లతో మోదారు. కాగా పోలీసులు శ్యామల ప్రవర్తనపై అనుమానం రావడంతో ఆ మేరకు కేసు దర్యాప్తు చేపట్టి ఛేదించినట్లు సీఐ తెలిపారు. హత్యకు పాల్పడిన శ్యామల, ఆమె ప్రియుడు కుమారస్వామి, అతని స్నేహితులు శ్రీనివాసులు, లక్ష్మన్న, హుసేన్‌ నాయుడు, రంగనాయకులు, దేవమణిని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచినట్లు పేర్కొన్నారు.

చదవండి: స్నేహితులను భార్యపైకి లైంగికదాడికి ఉసిగొల్పే భర్త...

Advertisement
 
Advertisement
Advertisement