breaking news
-
చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి
సాక్షి, చిత్తూరు: చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వరుసగా మూడు వాహనాలు ఢీకొనడంతో నలుగురు మృతి చెందారు. వడమాలపేట చెక్‌పోస్ట్ దగ్గర ఆగి ఉన్న లారీని మరో లారీ ఢీకొట్టింది. రోడ్డుకు అడ్డంగా పడిన లారీని మరో కారు ఢీకొట్టగా, ప్రమాదానికి గురైన కారును బైక్ ఢీకొట్టింది. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. -
కర్నూలు: తుపాకీతో కాల్చుకుని హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్య
సాక్షి, కర్నూలు: కర్నూలులో విషాదం చోటుచేసుకుంది. లోకాయుక్తా కార్యాలయంలో హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విధి నిర్వహణలో ఉన్న సత్యనారాయణ.. గన్‌తో పేల్చుకుని అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. సత్యనారాయణకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమార్తె హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తున్నారు. కానిస్టేబుల్ ఆత్మహత్యకు గల కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. చదవండి: నా భర్తను తగలబెట్టారు: రవీందర్ భార్య -
మార్గదర్శి దందాపై విచారించాలి
సాక్షి, అమరావతి: మార్గదర్శి చిట్‌ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్ ఆర్థిక అవకతవకలు, తప్పుడు రికార్డుల నిర్వహణ, నిధుల మళ్లింపు, ఇతర చట్ట ఉల్లంఘనలపై రామోజీ, శైలజా కిరణ్ తదితరులపై నమోదు చేసిన కేసులో తాము దాఖలు చేసిన చార్జిషీట్లను గుంటూరు, విశాఖపట్నంలోని డిపాజిటర్ల పరిరక్షణ చట్టం ప్రత్యేక కోర్టులు ‘రిటర్న్’ చేస్తూ గత నెల 28న జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ సీఐడీ హైకోర్టును ఆశ్రయించింది. ఈ ఉత్తర్వులను రద్దు చేయడంతో పాటు, కేసును విచారణకు స్వీకరించేలా ఆ కోర్టులను ఆదేశించాలని కోరుతూ సీఐడీ అదనపు ఎస్పీ ఈ అప్పీళ్లను దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాల్లో మార్గదర్శి చైర్మన్ చెరుకూరు రామోజీరావు, ఎండీ శైలజా కిరణ్, ఆడిటర్ కుదరవల్లి శ్రవణ్‌లతో పాటు వైస్ ప్రెసిడెంట్లు, డైరెక్టర్లు, జనరల్ మేనేజర్లు, బ్రాంచ్ మేనేజర్లు ఇలా మొత్తం 15 మందిని ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఈ అప్పీళ్లపై హైకోర్టు వచ్చే వారం విచారణ జరిపే అవకాశం ఉంది. ఒకే రోజు రెండు కోర్టులు దాదాపు ఒకే రకం ఉత్తర్వులు మార్గదర్శి చిట్ ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్ ఆర్థిక అవకతవకలు, తప్పుడు రికార్డుల నిర్వహణ, నిధుల మళ్లింపు, ఇతర చట్ట ఉల్లంఘనలపై చిట్స్ అసిస్టెంట్ రిజిస్ట్రార్లు సీఐడీకి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా రామోజీరావు, శైలజా కిరణ్‌లతో పాటు మొత్తం 15 మందిపై ఐపీసీ, డిపాజిటర్ల పరిరక్షణ చట్టం, చిట్‌ఫండ్ చట్టాల కింద సీఐడీ కేసులు నమోదు చేసింది. దర్యాప్తు చేసి డిపాజిటర్ల పరిరక్షణ చట్టం కింద ఏర్పాటైన ప్రత్యేక కోర్టుల్లో చార్జిషీట్లు దాఖలు చేసింది. ఈ చార్జిషీట్లను పరిశీలించిన ప్రత్యేక కోర్టులు, సీఐడీ దాఖలు చేసిన చార్జిషీట్లను రిటర్న్ చేశాయి. గుంటూరులో ప్రిన్సిపల్ జిల్లా జడ్జి ఉత్తర్వులు జారీ చేయగా, విశాఖపట్నంలో మెట్రో పాలిటన్ సెషన్స్ జడ్జి ఉత్తర్వులిచ్చారు. రెండు కోర్టులు కూడా ఆగస్టు 28వ తేదీనే ఉత్తర్వులు వెలువరించడం విశేషం. రెండు కోర్టులు ఇచ్చిన ఉత్తర్వులు దాదాపు ఒకే రకంగా ఉండటం గమనార్హం. జాప్యానికి చాలా కారణాలు.. ‘డిపాజిటర్ల పరిరక్షణ చట్టంలోని సెక్షన్ 5 కింద ప్రత్యేక కోర్టు తన పరిధిని వినియోగించాలంటే, నిందితులు చందాదారులకు చెల్లించాల్సిన ప్రైజ్ మొత్తాలను ఎగవేసినట్లు ఫిర్యాదుతో పాటు ప్రాథమిక ఆధారాలను కోర్టు ముందుంచాల్సి ఉంటుంది. చార్జిషీట్లను పరిశీలిస్తే, ఏ చందాదారు కూడా తమకు చెల్లించాల్సిన మొత్తాలను నిందితులు ఎగవేసినట్లు ఎక్కడా చెప్పలేదు. జాప్యానికి అనేక కారణాలుంటాయి. నిధుల మళ్లింపు డిపాజిటర్ల చట్టం పరిధిలోకి రాదు. భవిష్యత్తు చందా చెల్లింపుల కోసం కొంత మొత్తాలను మార్గదర్శి తమ వద్దే అట్టిపెట్టుకున్నట్లు, ఆ మొత్తాలకు వడ్డీ చెల్లిస్తామని చెప్పినట్లు కొందరు చందాదారులు తమ వాంగ్మూలాల్లో చెప్పారు. దీనిని ఎగవేతగా భావించడానికి వీల్లేదు. ప్రైజ్ మొత్తాలను ఎగవేశారనేందుకు ఆధారాలు సమర్పిస్తేనే ప్రత్యేక కోర్టు జోక్యం చేసుకోవడానికి వీలుంటుంది. కేసు విచారణకు స్వీకరించేంత ఆధారాలు ఏవీ చార్జిషీట్లో లేవు. అందువల్ల చార్జిషీట్లను రిటర్న్ చేస్తున్నాం. ఫిర్యాదుదారు సంబంధిత కోర్టును గానీ, సంబంధిత సమార్థాధికారిని గానీ ఆశ్రయించాలి’ అని రెండూ ప్రత్యేక కోర్టులు వేర్వేరుగా ఉత్తర్వులు జారీ చేశాయి. కళ్లెదుటే చట్ట ఉల్లంఘన కనిపిస్తున్నా.. ఈ ఉత్తర్వులపై సీఐడీ తన అప్పీళ్లలో అభ్యంతరం వ్యక్తం చేసింది. ‘గడువు ముగిసి, ష్యూరిటీలు సమర్పించిన తర్వాత కూడా బ్రాంచ్ మేనేజర్లు సకాలంలో చెల్లింపులు చేయలేదని పలువురు చందాదారులు దర్యాప్తు సంస్థకు వాంగ్మూలం ఇచ్చారు. కుంటిసాకులు చెబుతూ ష్యూరిటీలను తిరస్కరించడం, అదనపు ష్యూరిటీలు సమర్పించాలని కోరడంతో పాటు ప్రైజ్ మొత్తాలను చెల్లించకుండా మార్గదర్శి ఇబ్బంది పెడుతోందంటూ చందాదారులు స్పష్టంగా చెప్పారు. తమ బ్రాంచ్ బ్యాంకు ఖాతాల్లో తమ మొత్తాలున్నాయో లేదో తెలుసుకోకుండా చందాదారులను మార్గదర్శి అధికారులు అడ్డుకున్నారు. సకాలంలో చెల్లింపులు చేయకపోవడం, చెల్లించాల్సిన ప్రైజ్ మొత్తాన్ని డిపాజిట్‌గా తమ వద్దే అట్టిపెట్టుకోవడం, తక్కువ వడ్డీ చెల్లించడం, చెల్లింపులు ఎగవేయడం వంటివన్నీ కూడా డిపాజిటర్ల పరిరక్షణ చట్టంలోని సెక్షన్ 5 కిందకే వస్తాయి. ఇన్ని ఉల్లంఘనలు స్పష్టంగా కనిపిస్తున్నా కూడా ప్రత్యేక కోర్టు మాత్రం వాటిని పట్టించుకోకుండా ప్రైజ్ మొత్తాల ఎగవేత జరిగినట్లు కనిపించడం లేదని పేర్కొనడం సరికాదు. చందాదారులకు చెల్లించాల్సిన ప్రైజ్‌మనీ చెల్లించకుండా వడ్డీ చెల్లింపు పేరుతో తమ వద్దే అట్టిపెట్టుకోవడానికి ప్రధాన కారణం ఏమిటంటే, చెల్లింపులు చేయడానికి సరిపడనంత డబ్బు లేకపోవడమే. తమ వద్ద డబ్బు లేదు కాబట్టి, చందాదారులకు చెల్లించాల్సిన డబ్బునే భవిష్యత్తులో చెల్లించాల్సిన చందాగా తమ వద్ద అట్టిపెట్టుకుని ఆ మొత్తాలను మార్గదర్శి రోటేషన్ చేస్తూ వస్తోంది. ప్రత్యేక ఖాతాల్లో చందాదారుల డబ్బు ఉంచాల్సి ఉన్నప్పటికీ, అలా ఉంచకుండా దానిని ఇతర అవసరాలకు మళ్లించేస్తోంది. ఈ విషయాలన్నింటినీ తగిన ఆధారాలతో చార్జిషీట్లో స్పష్టంగా పేర్కొన్నాం. చార్జిషీట్లను రిటర్న్ చేస్తూ ఇచ్చిన ఉత్తర్వుల్లో ప్రత్యేక కోర్టులు పలు అంశాలను స్పష్టంగా నిర్ధారించాయి. స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు వినకుండానే అలా నిర్ధారించడం చట్ట విరుద్ధం’ అని సీఐడీ తన అప్పీళ్లలో వివరించింది. ఎగవేతలపై స్పష్టంగా వాంగ్మూలాలు ‘చార్జిషీట్లోని అంశాలపై మినీ ట్రయల్ నిర్వహించడానికి వీల్లేదని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. డిపాజిటర్ల పరిరక్షణ చట్టంలోని సెక్షన్ 5కు ప్రత్యేక కోర్టులు భాష్యం చెప్పాయి. అలా చెప్పి ఉండకూడదు. డిపాజిటర్ల పరిరక్షణచట్ట నిబంధనల ప్రకారం ప్రైజ్ మొత్తాల ఎగవేత శాశ్వతమా లేక తాత్కాలికమా అన్న దాని మధ్య ఎలాంటి తేడా లేదు. కేసును విచారణకు స్వీకరించకుండానే ఆయా అంశాల మధ్య తేడాలు లేవనెత్తడం సమంజసం కాదు. చార్జిషీట్లను లోతుగా పరిశీలిస్తే మార్గదర్శి పాల్పడిన ఉల్లంఘనలు, ఎగవేతలపై చందాదారుల వాంగ్మూలాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. డిపాజిటర్ల పరిరక్షణచట్ట నిబంధనల ప్రకారం ఓ ఆర్థికసంస్థ ఉల్లంఘనలు, ఎగవేతలపై చందాదారుడే ఫిర్యాదుదారు అయి ఉండాల్సిన అవసరం లేదు. చందాదారులకు చెల్లించాల్సిన మొత్తాల ఎగవేత, చెల్లింపుల్లో జాప్యం అంశాలను ప్రత్యేక కోర్టులు పరిగణనలోకి తీసుకోలేదు. సీతంపేట బ్రాంచ్‌లో చందాదారులకు చెల్లింపులు చేయడానికి తగినంత మొత్తాలు లేవన్న విషయం చార్జిషీట్లో స్పష్టంగా ఉంది. ప్రత్యేక కోర్టు ఈ విషయాన్ని పట్టించుకోలేదు. చార్జిషీట్లో పేర్కొన్నవన్నీ ప్రాథమిక ఆధారాలే అయినప్పటికీ, వాటిని సరైన దృష్టికోణంలో ప్రత్యేక కోర్టులు చూడలేకపోయాయి’ అని సీఐడీ తన అప్పీళ్లలో పేర్కొంది. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని చార్జిషీట్లను రిటర్న్ చేస్తూ ప్రత్యేక కోర్టులు జారీచేసిన ఉత్తర్వులను రద్దు చేయాలని హైకోర్టును కోరింది. తదుపరి తమ కేసును విచారణకు స్వీకరించేలా కూడా ప్రత్యేక కోర్టులను ఆదేశించాలని అభ్యర్థించింది. -
టీడీపీ నేతల కనుసన్నల్లోనే విధ్వంసం.. యువగళం వలంటీర్లు అరెస్ట్
సాక్షి, పశ్చిమగోదావరి జిల్లా: టీడీపీ నేతల కనుసన్నల్లోనే భీమవరంలో విధ్వంసకాండ జరిగిందని పోలీసులు గుర్తించారు. 44 మంది యువగళం వలంటీర్లను అరెస్ట్ చేయగా, 13 మంది టీడీపీ నేతలపై కేసు నమోదు చేశారు. మాజీ ఎంపీ తోట సీతారామలక్ష్మి, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, టిడిపి రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు కేసులు నమోదయ్యాయి. భీమవరం, ఉండి, వీరవాసరం మండలాల టీడీపీ నాయకులపై ఐపీసీ సెక్షన్ 307, 324, 332, రెడ్ విత్ 149 తదితర సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పటికే సీఎం జగన్, ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన లోకేష్‌కు భీమవరం పోలీసులు నోటీసులు జారీ చేశారు. చదవండి: జనంపై టీడీపీ దండయాత్ర! -
ఒంగోలు బ్యూటీపార్లర్ కేసు: మార్గదర్శి మేనేజర్ భార్య అరెస్ట్
ఒంగోలు టౌన్: ఒంగోలులోని శ్రీకృష్ణనగర్‌లో బ్యూటీషియన్‌పై దాడి చేసి చోరీకి పాల్పడిన కేసులో ఒంగోలు మార్గదర్శి బ్రాంచి మేనేజర్ కరణం నాగేశ్వరరావు భార్య కరణం మోహన దీప్తి ఉరఫ్ దీప్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రకాశం జిల్లా పోలీసు కార్యాలయంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎస్పీ మలికా గర్గ్ కేసు వివరాలను వెల్లడించారు. ఒంగోలుకి చెందిన షేక్ రజియా శ్రీకృష్ణ నగర్‌లోని తన ఇంటిలో బ్యూటీ పార్లర్ నిర్వహిస్తున్నారు. ఆమె భర్త షేక్ మీరా ఉద్యోగ నిమిత్తం ఉదయం వెళ్లి రాత్రి ఇంటికి తిరిగి వస్తారు. కూతురు కాలేజికి వెళ్లి సాయంత్రం వస్తుంది. దీంతో రజియా ఒంటరిగా ఇంట్లో ఉంటుంది. రజియాకు షేక్ సాహెర భాను అనే స్నేహితురాలు ఉంది. ఆమెకు రజియా వద్ద రూ.10 లక్షలకు పైగా విలువైన బంగారు నగలు ఉన్నాయని తెలుసుకుని ఆ విషయాన్ని తనకు పరిచయమున్న కరణం దీప్తి, ముండ్రు లక్ష్మి నవత ఉరఫ్ నవ్య, అలహరి అపర్ణలకు చెప్పింది. దీంతో అప్పటికే అనేక చోరీలు చేసి ఉన్న ఈ కిలాడీ ముఠా బ్యూటీ పార్లర్ మీద కన్నేశారు. వీరు మంగళవారం ఉదయం 11 గంటల సమయంలో బ్యూటీపార్లర్‌కు వచ్చారు. మేకప్ చేయించుకునేందుకు వచ్చినట్లు నమ్మించారు. మొదట ఇద్దరు ఐ బ్రోస్ చేయించుకున్నారు. మరొకరికి పెడిక్యూర్ చేస్తుండగా అదను చూసి ముందుగా వేసుకున్న పథకం ప్రకారం రజియా మీద ఒక్కసారిగా దాడికి పాల్పడ్డారు. ఆమె ప్రతిఘటించడంతో వెంట తెచ్చుకున్న మత్తు కలిగించే ద్రావణాన్ని స్ప్రే చేశారు. తేలికపాటి యాసిడ్ లాంటి ద్రావణాన్ని ఆమె మీద చల్లారు. క్లోరోఫాం ప్రయోగించడంతో ఆమె స్పృహ తప్పి పడిపోయారు. ఆ తరువాత వాళ్లు చేతికి అందిన కాడికి దోచుకొని పోయారు. రజియా మెడలోని బంగారు నగలు, ఇంట్లో కప్‌బోర్డులో దాచిన నగలు, రూ.40 వేల నగదు దోచుకొని వెళ్లారు. ఈ కేసు వివరాలను తెలుసుకున్న ఎస్పీ మలికా గర్గ్ వెంటనే పోలీసులను రంగంలోకి దించారు. సీఐ భక్తవత్సలరెడ్డి పోలీసు సిబ్బందితో కలిసి పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాలను పరిశీలించారు. చదవండి: అవమానించడంతోనే పెట్రోల్ పోసుకున్నా సీసీ కెమెరాల్లో ముగ్గురు నిందితులను గుర్తించిన పోలీసులు హైడ్రామా మధ్య వారిని అదుపులోకి తీసుకున్నారు. కరణం మోహన దీప్తితో పాటుగా బజాజ్ ఫైనాన్స్‌లో ఉద్యోగం చేసే ముండ్ర వెంకటరావు భార్య లక్ష్మి నవత, శ్రీనివాసరావు భార్య అలహరి అపర్ణ, దాసరి భాను ఉరఫ్ షేక్ సాహెరా భానులను అరెస్ట్ చేసి చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల విచారణలో ఒంగోలు తాలూకా పరిధిలో పెళ్లూరు, పొదిలి, దొనకొండలలో కూడా చోరీలకు పాల్పడినట్లు నిందితులు అంగీకరించారు. 24 గంటల్లోపే కేసును ఛేదించడమే కాకుండా చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్న పోలీసులను ఎస్పీ అభినందించారు. ఒంగోలు డీఎస్పీ నారాయణస్వామి రెడ్డి, సీఐ భక్తవత్సలరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
దివ్యాంగ బాలికపై లైంగిక దాడి కేసులో నిందితుడికి జీవిత ఖైదు
విజయవాడ స్పోర్ట్స్: దివ్యాంగ బాలిక(13)పై లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తికి మరణించే వరకు (జీ వి త ఖైదు) జైలు శిక్ష విధిస్తూ విజయవాడ పోక్సో కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి డాక్టర్ ఎస్.రజిని మంగళవారం తీర్పు చెప్పారు. విజయవాడ సీవీఆర్ ఫ్లై ఓవర్ ప్రాంతానికి చెందిన ఓ మహిళకు పిల్లలు లేకపోవడంతో తన అక్క కుమార్తెను దత్తత తీసుకుంది. ఆ బాలికను ఈ ఏడాది జనవరి 17వ తేదీన తా ను పని చేసే కంపెనీ వద్దకు ఆమె తీసుకువెళ్లింది. ఆమె పని చేస్తుండగా, కొద్దిసేపటి తర్వాత బాలిక కనిపించలేదు. కంపెనీ సెక్యూరిటీ సహాయంతో చుట్టుపక్కల వెదుకుతుండగా, సమీపంలోనే ఓ షాపు వెనుక ముళ్లపొదల వద్ద ఆ బాలికపై ఒక వ్యక్తి లైంగికదాడికి పాల్పడుతుండటంతో ఆమె గట్టిగా కేకలు వేసింది. దీంతో అఘాయిత్యానికి పాల్పడుతున్న వ్యక్తి పారిపోయాడు. బాలిక సైగల ద్వారా ఇచ్చిన సమాచారం మేరకు లైంగిక దాడికి పాల్పడి నది డ్రైవర్ రమేష్ అని గుర్తించి ఆమె కొత్తపేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కర్నూలు జిల్లా పాములపాడుకు చెందిన రమేష్ విజయవాడ వన్‌టౌన్ మిల్క్ ప్రాజెక్ట్ సమీపంలో నివాసం ఉంటూ బొలెరో వాహనం డ్రైవర్‌గా పని చేస్తున్నట్లు పోలీ సు విచారణలో తేలింది. దిశా ఏసీపీ వీవీ నాయు డు ఈ కేసు విచారణ అధికారిగా వ్యవహరించారు. దిశా, సీఎంఎస్ అధికారుల సమక్షంలో 25 మంది సాక్షులను న్యాయమూర్తి విచారించారు. బాధితు రాలి తరఫున ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ గుజ్జుల నాగిరెడ్డి వాదనలు వినిపించారు. విచారణలో నేరం రుజువు కావడంతో నిందితుడు రమేష్ కు మరణించే వరకు జైలు శిక్షతోపాటు రూ.30 వేలను జరిమానాగా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. నిందితుడు చెల్లించిన జరిమా నా రూ.30వేలు, మరో రూ. 50వేలను బాధితురాలికి నష్టపరిహారంగా చెల్లించాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థను న్యాయ మూర్తి ఆదేశించారు. ఈ ఘటన జరిగిన ఎనిమిది నెలల్లోనే న్యాయస్థానం తీర్పు వెలువరించేలా ట్రయిల్ నిర్వహించిన పోలీసులను సీపీ టీకే రాణా అభినందించారు. -
బాబు బంగ్లాకే ముడుపులు.. మళ్లీ ఆ ముగ్గురే
సాక్షి, అమరావతి: తీగ లాగితే డొంకంతా కదులుతోంది! ముడుపుల చిట్టాలన్నీ చంద్రబాబు బంగ్లాకే దారి తీస్తున్నాయి!! అమరావతిలో తాత్కాలిక నిర్మాణాలు, టిడ్కో ఇళ్ల కాంట్రాక్టుల్లో ప్రజాధనాన్ని లూటీ చేసిన వ్యవహారంలో ఆదాయపన్ను (ఐటీ) శాఖ తీగ లాగితే... చంద్రబాబు కనుసన్నల్లో సాగిన ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్ఎస్డీసీ) కుంభకోణం పునాది బయటపడుతోంది. కుంభకోణాలు వేర్వేరైనా కొల్లగొట్టిన ప్రజాధనాన్ని షెల్ కంపెనీల ద్వారా తరలించడంలో పాత్రధారులు మాత్రం వారే. ఆ అక్రమార్జన అంతా చివరకు చేరింది సూత్రధారి చంద్రబాబు చెంతకే అన్నది స్పష్టమవుతోంది. టీడీపీ హయాంలో భవన నిర్మాణ ప్రాజెక్టుల కాంట్రాక్టులను కట్టబెట్టడంలో అక్రమార్జనకు సంబంధించి చంద్రబాబుకు ఐటీ శాఖ నోటీసుల ప్రకంపనలు కొనసాగుతున్నాయి. ఆ కుంభకోణంలో పాత్రధారులుగా ఉన్న మనోజ్ వాసుదేవ్ పార్థసాని, చంద్రబాబు పీఏస్ పెండ్యాల శ్రీనివాస్, యోగేశ్ గుప్తా ఏపీఎస్ఎస్డీసీ అవినీతి బాగోతంలోనూ కీలకంగా వ్యవహరించారని వెల్లడైంది. ఇప్పటికే ఏపీఎస్ఎస్డీసీ కుంభకోణం కేసు దర్యాప్తులో కీలక ప్రగతి సాధించిన సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) తాజా పరిణామాలతో తక్షణం రంగంలోకి దిగింది. ముడుపుల తరలింపులో సూత్రధారులుగా వ్యవహరించిన యోగేశ్ గుప్తా, మనోజ్ వాసుదేవ్ పార్థసాని, పెండ్యాల శ్రీనివాస్‌లను విచారించాలని నిర్ణయించింది. ఈమేరకు వారికి నోటీసులు జారీ చేసి దర్యాప్తును వేగవంతం చేసేందుకు సిద్ధమైంది. బాబు అవినీతి ‘స్కిల్’... టీడీపీ హయాంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రధాన సూత్రధారిగా ఏపీఎస్ఎస్డీసీ కుంభకోణం జరిగినట్లు ‘సిట్’ ఇప్పటికే కీలక ఆధారాలు సేకరించింది. జర్మనీకి చెందిన సీమెన్స్ కంపెనీకి ఏమాత్రం తెలియకుండా ఆ కంపెనీ పేరుతో ఒప్పందం కుదుర్చుకున్నట్లుగా మోసగించి ప్రజాధనాన్ని కొల్లగొట్టినట్లు ఆధారాలతో సహా నిరూపించింది. రూ.3,300 కోట్ల ప్రాజెక్టును కాగితాలపై చూపించి సీమెన్స్ కంపెనీ 90 శాతం నిధులు సమకూరుస్తుందని బుకాయించి రాష్ట్ర ప్రభుత్వం 10 శాతం నిధులను కేటాయించేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. సీమెన్స్ కంపెనీ ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండానే ప్రభుత్వ వాటా 10 శాతం కింద జీఎస్టీతో కలిపి మొత్తం రూ.371 కోట్లను అడ్డగోలుగా చెల్లించేశారు. అలా నిధులు చెల్లించడం నిబంధనలకు విరుద్ధమని అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావుతోపాటు మరో ముగ్గురు సీనియర్ ఐఏఎస్ అధికారులు వారించిన ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ఖాతరు చేయలేదు. ఏకపక్షంగా రూ.371 కోట్లను సీమెన్స్ భాగస్వామ కంపెనీగా ఒప్పందంలో చూపించిన డిజైన్ టెక్ కంపెనీకి విడుదల చేశారు. అందులో రూ.241 కోట్లను పలు షెల్ కంపెనీలను సృష్టించి హవాలా మార్గంలో టీడీపీ ప్రభుత్వంలో ముఖ్య నేత కొల్లగొట్టారు. ఈ కేసులో సిట్ అధికారులు 8 మందిని అరెస్టు చేశారు. హవాలా మార్గంలో నల్లధనాన్ని చలామణిలోకి తెచ్చినందున కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ కూడా రంగంలోకి దిగింది. మనీలాండరింగ్‌కు పాల్పడ్డారని నిర్ధారించి ఈ కేసులో నలుగురిని అరెస్టు చేయడంతోపాటు డిజైన్ టెక్ కంపెనీకి చెందిన రూ.31.20 కోట్లను అటాచ్ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. షెల్ కంపెనీలు.. బోగస్ ఇన్వాయిస్లు టీడీపీ ప్రభుత్వంలో అమరావతిలో తాత్కాలిక నిర్మాణాల కాంట్రాక్టులను కట్టబెట్టిన కుంభకోణంలో పాత్రధారులుగా ఉన్నవారే ఏపీఎస్ఎస్డీసీ కుంభకోణంలోనూ కీలక పాత్ర పోషించారని సిట్ గుర్తించింది. షాపూర్జీ– పల్లోంజీ కంపెనీ ప్రతినిధి మనోజ్ వాసుదేవ్ పార్థసాని, షెల్ కంపెనీల సృష్టికర్త యోగేశ్ గుప్తా, చంద్రబాబు పీఎస్ పెండ్యాల శ్రీనివాస్.. ఈ ముగ్గురూ అమరావతి భవన నిర్మాణాల కాంట్రాక్టు అవినీతి సొమ్మును చంద్రబాబుకు చేర్చడంతో కీలకంగా వ్యవహరించారన్నది ఇప్పటికే నిర్ధారణ అయ్యింది. రూ.8 వేల కోట్ల విలువైన నిర్మాణాల కాంట్రాక్టుల్లో భారీ అవినీతికి పాల్పడి ఆ నల్లధనాన్ని మనోజ్ వాసుదేవ్ పార్థసాని షెల్ కంపెనీల ద్వారా చంద్రబాబుకు చేర్చారు. అందుకోసం షెల్ కంపెనీలను సృష్టించడంలో యోగేశ్ గుప్తా కీలక పాత్ర పోషించారు. ఆయన నివాసంలో ఐటీ శాఖ అధికారులు సోదాలు కూడా నిర్వహించారు. మరోవైపు ఆ షెల్ కంపెనీల పేరుతో మళ్లించిన నిధులను డ్రా చేసి మనోజ్ వాసుదేవ్ పార్థసాని నగదు రూపంలో చంద్రబాబు పీఎస్ పెండ్యాల శ్రీనివాస్‌కు హైదరాబాద్‌లో అందించారు. ఆ విధంగా చంద్రబాబుకు చేరిన అక్రమార్జనలో రూ.118 కోట్లకు సంబంధించి లెక్కలు చెప్పాలని ఐటీ శాఖ నోటీసులు జారీ చేయడం జాతీయస్థాయిలో చర్చనీయాంశంగా మారింది. బాబుకు ముడుపులు చేరాయిలా... అమరావతిలో తాత్కాలిక నిర్మాణ కాంట్రాక్టుల అవినీతి దందాలో సూత్రధారులుగా వ్యవహరించిన యోగేశ్ గుప్తా, మనోజ్ పార్థసాని, పెండ్యాల శ్రీనివాస్ ఏపీఎస్ఎస్డీసీ కుంభకోణంలో ప్రధాన భూమిక పోషించిన తీరు ఇదీ.. ► ఏపీఎస్ఎస్డీసీ నిధులను కొల్లగొట్టేందుకు యోగేశ్ గుప్తా పలు షెల్ కంపెనీలను సృష్టించాడు. ముంబై, పుణే కేంద్రాలుగా సృష్టించిన షెల్ కంపెనీల పేరిట నకిలీ ఇన్వాయిస్లను సమర్పించారు. ఆ ఇన్వాయిస్ల ఆధారంగా షెల్ కంపెనీలకు ఏపీఎస్ఎస్డీసీ రూ.371 కోట్లను విడుదల చేసింది. దీనిపై ఆధారాలు సేకరించిన అనంతరం సిట్ అధికారులు ఏపీఎస్ఎస్డీసీ కుంభకోణంలో కేసులో యోగేశ్ గుప్తాను ఏ–22గా పేర్కొంటూ కేసు నమోదు చేశారు. ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నాడు. ► నకిలీ ఇన్వాయిస్ల ఆధారంగా షెల్ కంపెనీలకు చేరిన రూ.371 కోట్లను యోగేశ్ గుప్తా డ్రా చేసి మనోజ్ పార్థసానికి అందించాడు. ఆయన అందులో రూ.241 కోట్లను ముంబై నుంచి హైదరాబాద్‌కు తరలించాడు. రూ.241 కోట్ల నగదు మొత్తాన్ని హైదరాబాద్‌లో ఉన్న చంద్రబాబు పీఎస్ పెండ్యాల శ్రీనివాస్‌కు అందించాడు. ► ఆ రూ.241 కోట్ల నగదు మొత్తం పెండ్యాల శ్రీనివాస్ ద్వారా చివరకు హైదరాబాద్‌లో చంద్రబాబు నివాసానికి చేరినట్లు స్పష్టమవుతోంది. ఆ ముగ్గురికీ సిట్ నోటీసులు ఏపీఎస్ఎస్డీసీ నిధులను కొల్లగొట్టడంతో పాత్రధారులుగా వ్యవహరించిన యోగేశ్ గుప్తా, మనోజ్ పార్థసాని, పెండ్యాల శ్రీనివాస్‌లకు సిట్ అధికారులు తాజాగా నోటీసులు జారీ చేశారు. విజయవాడలో సిట్ అధికారుల ఎదుట వచ్చే సోమవారం విచారణకు హాజరు కావాలని యోగేశ్ గుప్తా, మనోజ్ పార్థసానికి నోటీసులిచ్చారు. చంద్రబాబు పీఎస్ పెండ్యాల శ్రీనివాస్ ఈనెల 14న విచారణకు హాజరు కావాలని అందులో పేర్కొన్నారు. -
కస్టమర్లుగా వచ్చి బ్యూటీపార్లర్‌లో చోరీ
ఒంగోలు టౌన్: ఫేస్‌వాష్ చేయించుకుంటామని వచ్చిన ముగ్గరు మహిళలు అదునుచూసి బ్యూటీపార్లర్ నిర్వాహకురాలిపై దాడి చేసి అందినకాడికి దోచుకువెళ్లారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...నగరంలోని శ్రీకృష్ణనగర్‌లో షేక్ రజియా అనే మహిళ ఇంటి వద్దే బ్యూటీపార్లర్ నిర్వహిస్తుంది. మంగళవారం ఉదయం 11 గంటల సమయంలో ముగ్గురు మహిళలు వచ్చి ఫేస్‌వాష్, ఐబ్రోస్ చేయించుకుంటామని చెప్పారు. దీంతో వారిని ఇంట్లోకి తీసుకెళ్లిన రజియా.. ఐ బ్రోస్ చేస్తుండగా ముగ్గురికీ పెడిక్యూర్ చేయాలని కోరారు. ఈ లోగా ఒక మహిళ బాత్రూమ్‌కువెళ్లిఆలస్యంగా వచ్చింది. మిగిలిన వారు నమ్మకంగా మాట్లాడుతూ ఐ బ్రోస్ చేయించుకున్నారు. తరువాత ఒక మహిళకు పెడిక్యూర్ చేస్తుండగా రజియాపై ఒక్కసారిగా దాడికి దిగారు. దాడిలో రజియా మెడకు, కుడి చేతికి గాయాలయ్యాయి. అనంతరం మత్తు మందు చల్లడంతో రజియా స్పృహ కోల్పోయింది. కాసేపటికి తేరుకున్న రజియా ఇంట్లోకి వెళ్లి చూడగా ఆమె మెడలోని బంగారు నగలతో పాటుగా ఇంట్లోని కప్‌బోర్డులో దాచి ఉంచిన నగలు, రూ.40 వేల నగదు కూడా దోచుకొనిపోయినట్లు గుర్తించి తాలుకా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్సై కె.అంకమ్మ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
సాఫ్ట్వేర్ ఉద్యోగిని శ్రీవిద్య అనుమానాస్పద మృతి
కర్ణాటక: ప్రేమించి పెళ్లి చేసుకుని భర్తే సర్వం అని ఆ యువతి అతని వెంట నడచింది. వివాహం జరిగి ఆరు నెలలు కూడా తిరక్కుండానే అనంతలోకాలకు వెళ్లిపోయింది. దీంతో ఆమె కన్నవాళ్లు, బంధువులు శోక సంద్రంలో మునిగిపోయారు. రెండు రోజుల క్రితం కర్ణాటకలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మృతురాలి కుటుంబీకుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ఉమ్మడి చిత్తూరు జిల్లా తంబళ్లపల్లి పరిధిలోని పెద్దతిప్పసముద్రం మండలంలోని మల్లెల దళితవాడకు చెందిన నరసింహులు, ఉషారాణి దంపతుల కుమార్తె శ్రీవిద్య (22) మదనపల్లిలోని ఓ ప్రైవేటు కళాశాలలో డిగ్రీ పూర్తి చేసింది. నీరుగంటివారిపల్లిలో కాపురం ఉండే మల్లీశ్వరి, మారపరెడ్డి దంపతుల కుమారుడు విజయ్ కుమార్‌రెడ్డి (23)తో కాలేజీ రోజుల్లోనే ప్రేమ మొదలైంది. యువకుని కుటుంబీకులు అడ్డుచెప్పినా ఇద్దరూ ఈ ఏడాది మార్చి నెలలో మదనపల్లిలోని ఓ ఆలయంలో దండలు మార్చుకుని అనంతరం అక్కడే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో పెళ్లి నమోదు చేసుకున్నారు. బెంగళూరులో కాపురం తరువాత బెంగళూరులోని మునిరెడ్డిపాళ్యలో కాపురం పెట్టారు. యువతి సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసుకుంటుండగా యువకుడు ఉద్యోగ అన్వేషణలో ఉన్నాడు. రెండు రోజుల క్రితం దంపతులిద్దరూ తీవ్రంగా గొడవ పడ్డారు. అనంతరం ఏం జరిగిందో ఏమో శ్రీవిద్య ఇంట్లోనే మంచంపై శవమై తేలింది. విజయ్‌కుమార్‌రెడ్డి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఆమె తల్లిదండ్రులు మృతదేహాన్ని సోమవారం మల్లెలదళితవాడకు తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. ఇది హత్యా, ఆత్మహత్యా అనేది అక్కడి పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది. -
భీమవరంలో ఉద్రిక్తత.. టీడీపీ నేతల దాడిలో పలువురికి గాయాలు
సాక్షి, భీమవరం: టీడీపీ నేత నారా లోకేశ్ యువగళం పాదయాత్రలో పచ్చ గూండాలు మరోసారి రెచ్చిపోయారు. లోకేశ్ భీమవరం పాదయాత్రలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. వైఎస్సార్సీపీ నేతలు, పోలీసులపై టీడీపీ నేతలు దాడి చేశారు. ఈ క్రమంలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. వివరాల ప్రకారం.. భీమవరంలో లోకేశ్ పాదయాత్ర సందర్భంగా ఉద్రిక్తత నెలకొంది. లోకేశ్ పాదయాత్రలో పచ్చమూకలు రెచ్చిపోయి మరోసారి దాడులకు తెగబడ్డారు. వైఎస్సార్సీపీ నేతలపై కర్రలు, రాళ్లతో దాడి శారు. ఈ క్రమంలో వారిని అడ్డుకున్న పోలీసులపై టీడీపీ గూండాలు దాడికి పాల్పడ్డారు. దీంతో, వైఎస్సార్సీపీ శ్రేణులకు, పోలీసులకు తీవ్రగాయాలయ్యాయి. ఈ నేపథ్యంలో ఇరువురిని పోలీసులు చెదరగొట్టారు. ఎల్లో గూండాలు కవ్వింపు చర్యలకు పాల్పడుతూ దాడులు చేయడం గమనార్హం. ఇది కూడా చదవండి: చంద్రబాబు ఐటీ స్కాంపై రంగంలోకి ఏపీ సీఐడీ -
చంద్రబాబుకు షాక్.. టీడీపీ నేత అరెస్ట్
సాక్షి, విజయవాడ: టీడీపీ నేత, రౌడీషీటర్ రెహమాన్ అరెస్ట్ అయ్యాడు. అయితే, ల్యాండ్ సెటిల్మెంట్ విషయంలో బెదిరింపులకు పాల్పడిన రెహమాన్‌తో పాటు మరో రౌడీ షీటర్ రాజాను కూడా పోలీసులు అరెస్ట్ చేసినట్టు తెలిపారు. వివరాల ప్రకారం.. టీడీపీ నేత రెహమాన్‌ను పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. కాగా, గతంలోనే రెహమాన్, రాజాపై పోలీసులు రౌడీ షీట్స్ ఓపెన్ చేశారు. ఇక, పెనమలూరు నియోజకవర్గ టీడీపీలో రెహమాన్ కీలకంగా ఉన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు, టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్‌తో రెహమాన్‌కు సత్సంబంధాలు ఉన్నాయి. మరోవైపు.. ఇటీవల నారా లోకేశ్ యువగళం పాదయాత్రలో కూడా రెహమాన్ యాక్టివ్‌గా పనిచేశారు. ఇదిలా ఉండగా.. ఇటీవల పుంగనూరులో ఎల్లో బ్యాచ్ రౌడీమూకలు దాడులకు తెగబడిన విషయం తెలిసిందే. ఈ కేసులో ప్రధాన నిందితుడు, టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ చల్లా రామచంద్రారెడ్డి(చల్లా బాబు) సహా 67 మంది టీడీపీ నాయకులు, కార్యకర్తలు సోమవారం పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఈ కేసులో నిందితులకు పుంగనూరు కోర్టు రిమాండ్ విధించింది. పుంగనూరు టీడీపీ ఇన్‌ఛార్జి చల్లా రామచంద్రారెడ్డితో పాటు.. 66 మంది నిందితులను కోర్టు ఆదేశాలతో కడప సెంట్రల్ జైలుకు తరలించారు. భారీ బందోబస్తు మధ్య నిందితులను రిమాండ్‌కు తరలించారు. ఇది కూడా చదవండి: జనసేన నేతపై చీటింగ్ కేసు -
కడప జైలుకు పుంగనూరు నిందితులు
సాక్షి, చిత్తూరు జిల్లా: పుంగనూరు విధ్వంసం కేసులో ప్రధాన నిందితుడు, టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ చల్లా రామచంద్రారెడ్డి(చల్లా బాబు) సహా 67 మంది టీడీపీ నాయకులు, కార్యకర్తలు సోమవారం పోలీసుల ఎదుట లొంగిపోయిన సంగతి తెలిసిందే. ఈ కేసులో నిందితులకు పుంగనూరు కోర్టు రిమాండ్ విధించింది. పుంగనూరు టీడీపీ ఇన్‌ఛార్జి చల్లా రామచంద్రారెడ్డితో పాటు.. 66 మంది నిందితులను కోర్టు ఆదేశాలతో కడప సెంట్రల్ జైలుకు తరలించారు. భారీ బందోబస్తు మధ్య నిందితులను రిమాండ్‌కు తరలించారు. కాగా, ఆగస్ట్ 4వ తేదీన టీడీపీ అధినేత చంద్రబాబు అన్నమయ్య జిల్లాలోని అంగళ్లులో, చిత్తూరు జిల్లా పుంగనూరులో రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారు. అప్పటికే పన్నిన పక్కా కుట్రతో టీడీపీ నేతలు, కార్యకర్తలు, కిరాయి మూకలు రాళ్లు, కట్టెలతో దాడి చేసి సుమారు 47 మంది పోలీసులను గాయపరిచారు. రెండు పోలీస్ వాహనాలను తగలబెట్టారు. రణధీర్ అనే కానిస్టేబుల్ కంటి చూపు కోల్పోయాడు. ఈ విధ్వంసానికి సంబంధించి ఇప్పటివరకు 277 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ప్రధాన నిందితుడు చల్లా బాబు సహా నిందితులంతా పారిపోగా.. పోలీసులు ఇప్పటికే 110 మందిని అరెస్టు చేసి కడప సెంట్రల్ జైలుకు తరలించారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో... టీడీపీ నేత చల్లా బాబును అదుపులోకి తీసుకునేందుకు జిల్లా పోలీస్ శాఖ 4 ప్రత్యేక బృందాలను రంగంలోకి దించింది. పోలీసులకు దొరకకుండా ఉండేందుకు చల్లా బాబు తన సెల్‌ఫోన్ పడేసి.. కొత్త ఫోన్ తీసుకున్నాడు. సిమ్‌కార్డులు మార్చేస్తూ ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో తిరిగినట్లు తెలిసింది. ఎన్నిసార్లు మకాం మార్చేసినా పోలీసులు సమీపిస్తుండటంతో చల్లా బాబుతో పాటు టీడీపీ మూకల్లో ఆందోళన తలెత్తింది. చదవండి: నరం లేని నాలుక.. సీపీఐ మరీ దయనీయంగా.. ఈ నేపథ్యంలో తనపై నమోదైన 7 కేసుల్లో బెయిల్ కోరుతూ చల్లా బాబు హైకోర్టుకు వెళ్లగా.. న్యాయస్థానం మూడు కేసుల్లో బెయిల్ నిరాకరించింది. ఇక తిరగలేక, తప్పించుకోలేక చల్లా బాబు సహా 67 మంది నిందితులు సోమవారం పుంగనూరు పోలీస్‌స్టేషన్‌లో డీఎస్పీ సుధాకర్‌రెడ్డి ఎదుట లొంగిపోయారు. వారికి మద్దతుగా టీడీపీ నాయకులు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, పల్లె రఘునాథరెడ్డి, దొరబాబు, సుగుణమ్మ తదితరులు పోలీస్‌స్టేషన్‌కు వచ్చారు. ఈ సందర్భంగా టీడీపీ కార్యకర్తలు కొద్దిసేపు పోలీస్‌స్టేషన్ వద్ద నినాదాలు చేస్తూ హల్చల్ చేశారు. కాగా, ఆదివారం రాత్రి పుంగనూరుకు చెందిన సద్దామ్ హుస్సేన్, ఇమ్రాన్, ఫయాజ్, షామీర్, నూరుల్లాను రిమాండ్‌కు పంపించారు. పూచీకత్తు సమర్పించిన దేవినేని ఉమా మదనపల్లె: అంగళ్లులో జరిగిన అల్లర్ల కేసులో బెయిల్ పొందిన టీడీపీ నేత దేవినేని ఉమా సోమవారం మదనపల్లె డీఎస్పీ కార్యాలయంలో రూ.2 లక్షల బాండ్, ఇద్దరు జామీనుదారులను పూచీకత్తుగా సమర్పించారు. -
ఉత్తరాంధ్రలో మరో భారీ మోసం.. విదేశీ ఉద్యోగాల పేరుతో..
విశాఖపట్నం: స్వీడన్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ అమృత్ ఎంటర్ప్రైజెస్ నిరుద్యోగులకు టోకరా వేసింది. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచే కాకుండా కడప తదితర ప్రాంతాలకు చెందిన సుమారు 70 మంది నుంచి రూ.కోటి వరకు వసూలు చేసి బోర్డు తిప్పేసింది. దీంతో బాధితులు సోమవారం నాలుగో పట్టణ పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు తెలిపిన వివరాలివీ.. దొండపర్తిలోని టీఎస్ఎన్ కాలనీలో అమృత్ ఎంటర్‌ప్రైజస్ అనే సంస్థను ఏర్పాటు చేసి విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. అది నమ్మి కార్యాలయానికి ఫోన్ చేసిన వారికి అర్హత గల ఉద్యోగాలు ఇప్పిస్తామని.. అందుకు డబ్బు లు చెల్లించాలని మేనేజర్లు శాంతి, లలిత నమ్మించారు. అలాగే నీరజ్, సౌరభ్ తెరవెనుక ఉండి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, విజయవాడ, కడప, హైదరాబాద్ తదితర ప్రాంతాలకు చెందిన సుమారు 70 మంది నుంచి రూ.లక్ష, రూ.2 లక్షలు చొప్పున రూ.కోటి వరకు ఆన్లైన్లో వసూలు చేశారు. డబ్బులు చెల్లించినట్లు మేనేజర్లు నిరుద్యోగులకు రసీదులతో పాటు అపాయింట్మెంట్ ఆర్డర్లు అందజేశారు. అయితే రోజులు గడుస్తున్నప్పటికీ ఉద్యోగాలు రాకపోవడంతో కొంతమంది దొండపర్తిలోని అమృత్ ఎంటర్‌ప్రైజెస్‌కు వెళ్లారు. కార్యాలయం మూసివేసి ఉండడంతో.. సంస్థ బోర్డు తిప్పేసినట్లు గ్రహించి ఆందోళనకు గురయ్యారు. దీనిపై బాధితులు నాలుగో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
పుంగునూరులో పోలీసులపై దాడి కేసు: లొంగిపోయిన ఏ-1 నిందితుడు
చిత్తూరు జిల్లా: పుంగునూరులో పోలీసులపై దాడి కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న టీడీపీ ఇంచార్జ్ చల్లాబాబు సోమవారం పోలీసులకు లొంగిపోయాడు. పుంగునూరులో పోలీసులపై దాడి అనంతరం తప్పించుకుని తిరుగుతున్న చల్లాబాబు నెలరోజుల తర్వాత లొంగిపోయాడు. ఆగస్టు 1వ తేదీనే అల్లర్లకు చంద్రబాబు అండ్‌కో స్కెచ్ వేసింది. పుంగనూరు హైవేపై చంద్రబాబు మీటింగ్ ఉంటే పుంగనూరు పట్టణంలోకి బలవంతంగా దూసుకెళ్లాలని పథకం వేశారు. పోలీసులు అడ్డుకుంటే కర్రలు, రాళ్లు బీర్ బాటిళ్లతో రెచ్చిపోవాలని ప్లాన్ చేశారు. అల్లర్లపై పుంగనూరు టీడీపీ ఇన్ఛార్జ్ చల్లా బాబుకు ముందే ఆదేశాలు వచ్చాయి. అంగళ్లు, పుంగనూరులో గొడవల పథకాన్ని వాంగ్మూలంలో చల్లా బాబు అనుచరులు స్పష్టంగా చెప్పారు. ఇప్పటివరకూ ఈ దాడి ఘటనకు సంబంధించి 110 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరో 63 మంది టీడీపీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేసి జడ్జి ముందు హాజరుపరిచే అవకాశం ఉంది. నేరాల్లో ఘనుడు చల్లా బాబు పుంగనూరులో దాడి కేసులో ప్రధాన సూత్రదారి, పాత్రదారి ఆ నియోజకవర్గం టీడీపీ ఇన్చార్జి చల్లా బాబు అలియాస్ చల్లా రామచంద్రారెడ్డి అని పోలీసులు తేల్చారు. దాడులకు కుట్ర పన్నడం, వ్యూహాన్ని అమలుపరచడంలో ఇతనిదే ప్రధాన పాత్రగా పోలీసులు నిర్ధారించారు. చల్లా బాబు గత చరిత్ర అంతా నేర పూరితమేనని పోలీసు విచారణలో తేలింది. పుంగనూరు నియోజకవర్గ పరిధిలోని పలు పోలీస్ స్టేషన్లలో పలు కేసులు ఉన్నాయి. ఇతను ఆలయ భూములు, ప్రభుత్వ భూముల ఆక్రమణకు పాల్పడినట్టు కూడా ఆరోపణలు ఉన్నాయి. చల్లా బాబుపై ఉన్న పాత కేసుల్లో మచ్చుకు కొన్ని.. 1.1985లో రొంపిచెర్ల పోలింగ్ స్టేషన్‌పై బాంబు దాడి కేసు 2. రొంపిచెర్ల క్రైం నం.368, 2021లో ఐపీసీ సెక్షన్లు, 143, 188, 341,269, 270, 290 రీడ్‌విత్ 149 ఐపీసీ, సెక్షన్ 3 ఈడీయాక్ట్ 3. క్రైం నం.18–2021 ఐపీసీ సెక్షన్లు 353, 506 రీడ్‌విత్ 34 కింద కేసు 4. క్రైం నం.8–2022 ఐపీసీ సెక్షన్లు 188, 341 కింద చౌడేపల్లి పోలీస్ స్టేషన్లో కేసు 5. క్రైం నం.89–2023 ఐపీసీ సెక్షన్లు 143, 341, 506 రీడ్‌విత్149 కింద సోమల పీఎస్‌లో కేసు 6. క్రైం నం.72–2022 ఐపీసీ సెక్షన్లు› 341, 143, 290 రీడ్‌విత్ 149 కింద కేసు 7. క్రైం నం.26–2022 ఐపీసీ సెక్షన్లు 341, 353, 143, 147, 148 రీడ్‌విత్ 149 కింద కల్లూరు పోలీసు స్టేషన్లో కేసు చదవండి: పుంగనూరు అల్లర్లు.. బయటపడ్డ చంద్రబాబు కుట్ర ‘నారా’జకీయం: తండ్రి పుంగనూరులో.. కొడుకు తుక్కులూరులో.. -
బాపట్ల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి
సాక్షి, బాపట్ల: బాపట్ల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని ఆటో ఢీకొనడంతో ఐదుగురు మృతిచెందారు. సంతమాగులూరులోని బాలాజీ హైస్కూల్ వద్ద ఘటన జరిగింది. వినుకొండ నుంచి నరసరావుపేట వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. మృతులను నరసరావుపేటకి చెందినవారిగా గుర్తించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వారిని నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చదవండి: స్కూటీపై వెళ్తుండగా ముఖానికి చున్ని అడ్డువచ్చి .. -
ఎదురెదురుగా ఢీకొన్న ఆర్టీసీ బస్సులు
కొవ్వూరు: దొమ్మేరు గ్రామ శివారున రెండు ఆర్టీసీ బస్సులు ఎదురెదురుగా ఢీకొన్న ప్రమాదంలో 26 మంది గాయపడ్డారు. వివరాలివీ.. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం నుంచి రాజమహేంద్రవరం వస్తున్న పల్లె వెలుగు బస్సును.. కొవ్వూరు నుంచి ఏలూరు వెళ్తు మరో పల్లె వెలుగు బస్సు ఢీకొంది. లారీని ఓవర్టేక్ చేసే ప్రయత్నంలో ఈ ప్రమాదం జరిగింది. దీంతో రెండు బస్సుల ముందు భాగాలూ దెబ్బ తిన్నాయి. ప్రమాదానికి గురైన రెండు బస్సులూ కొవ్వూరు డిపోకు చెందినవే. ఈ ప్రమాదంలో స్వల్పంగా గాయపడిన 18 మందికి కొవ్వూరు ప్రభుత్వాసుపత్రిలో ప్రథమ చికిత్స అందించిన అనంతరం ఇళ్లకు పంపించారు. మరో ముగ్గురికి కొవ్వూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదంలో కేవీ సాగర్ (కొవ్వూరు), వి.మంగయమ్మ, ఎం.శేషారెడ్డి (ఏలూరు), రాజయ్య (దేవరపల్లి మండలం యాదవోలు), సీహెచ్ రామకృష్ణ (బంగారమ్మపేట), తుపాకుల దుర్గారావు (చింతూరు) తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఐదుగురిని రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ప్రమాదం జరిగిన సమయంలో లారీ ముందు వెళ్తున్న మోటార్ సైక్లిస్టు బస్సు ముందు చక్రంలో పడిపోయారు. అయితే, అదృష్టవశాత్తూ స్వల్పగాయాలతో బయటపడ్డారు. ఆయన మోటార్ సైకిల్ నుజ్జునుజ్జయ్యింది. హైవే పెట్రోలింగ్ ఏఎస్సై జీఆర్కే గంగాధర్ ఆధ్వర్యాన క్షతగాత్రులను సకాలంలో ఆసుపత్రికి తరలించారు. కొవ్వూరు ఆర్టీసీ డిపో మేనేజర్ వైవీవీఎన్ కుమార్ స్థానిక ప్రభుత్వాసుపత్రికి చేరుకుని, క్షతగాత్రులను పరామర్శించారు. క్షతగాత్రులకు తక్షణ వైద్య సేవలందించేందుకు ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు నగళ్లపాటి శ్రీనివాస్, వరిగేటి సుధాకర్ సహకరించారు. సూపరింటెండెంట్ సాయికిరణ్ వెంటనే ఆసుపత్రికి చేరుకుని వైద్య సేవలను పర్యవేక్షించారు. పట్టణ ఎస్సై బి.దుర్గాప్రసాద్ క్షతగాత్రులతో మాట్లాడి, ప్రమాద వివరాలు అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలి : మంత్రి వనిత ఈ ప్రమాదంపై రాష్ట్ర హోం మంత్రి తానేటి వనిత స్పందించారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ఆర్టీసీ, పోలీసులు అధికారులను ప్రమాద వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టమూ లేకపోయినప్పటికీ 26 మంది గాయపడటం దురదృష్టకరమని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. -
చిత్తూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం.. డీఎస్పీ తండ్రి మృతి
సాక్షి, చిత్తూరు జిల్లా: పలమనేరు మండలం జగమర్ల వద్ద జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. లారీని వెనుక నుంచి కారు ఢీకొనడంతో గిరి గౌడ్ (80) మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుడిని కర్ణాటకలోని ఉనసూర్ ఎక్సైజ్ డీఎస్పీ తండ్రిగా గుర్తించారు. డీఎస్పీ తల్లి తీవ్రంగా గాయపడగా, డీఎస్పీ విజయకుమార్‌కు రెండు కాళ్లు విరిగాయి. చికిత్స నిమిత్తం వారిని జాలప్ప ఆస్పత్రికి తరలించారు. స్వల్ప గాయాలతో ప్రమాదం నుంచి ఎక్సైజ్ సీఐ లోకేష్ బయటపడ్డారు. చదవండి: కోరుట్ల దీప్తి కేసు.. వెలుగులోకి అసలు నిజాలు? -
ఐటీ దర్యాప్తు తప్పించుకునేందుకు కొత్త ఎత్తుగడ
సాక్షి, హైదరాబాద్: తాత్కాలిక రాజధాని అమరావతి పేరుతో బడా కంపెనీల నుంచి సబ్ కాంట్రాక్టుల ద్వారా భారీ ఎత్తున అయాచిత లబ్ధి పొందారు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడు. ఆ అక్రమార్జనకుగానూ ఆదాయ పన్ను శాఖ నోటీసులు సైతం అందుకున్నారు కూడా. అయితే వ్యవస్థలను మేనేజ్ చేయడంలో దిట్ట అయిన బాబు.. ఐటీ నోటీసులపై దర్యాప్తును అడ్డుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. సాంకేతిక కారణాలను సాకుగా చూపి చంద్రబాబు ఈ వ్యవహారం నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తూ వస్తున్నారు. ఒకవైపు సబ్ కాంట్రాక్టుల ద్వారా భారీ ఎత్తున నగదు పొందారని ఐటీ శాఖ సాక్ష్యాధారాల్ని చూపుతోంది. కానీ, ఐటీ శాఖ సరిగా పరిశీలన చేయలేదని బుకాయిస్తున్నారు చంద్రబాబు. పైగా మనుగడలో లేని ఐటీ నిబంధనలను సాకుగా చూపి దర్యాప్తు ఆలస్యం చేసే ప్రయత్నం చేశారాయన. అయితే.. చంద్రబాబు లేవనెత్తిన టెక్నికల్ అభ్యంతరాలను ఇప్పటికే ఐటీ శాఖ తిరస్కరించింది. దీంతో కేసు మెరిట్స్ లోపలికి వెళ్లకుండా.. మరిన్ని టెక్నికల్పాయింట్స్ తెరపైకి తెచ్చి దర్యాప్తు ఆలస్యం చేయడానికి చంద్రబాబు కొత్త ఎత్తుగడ వేస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో మరిన్ని సాకుల కోసం వెతుకుతోంది చంద్రబాబు అండ్ కో. లోకేష్ సన్నిహితుడికి కూడా.. టీడీపీ హయాంలో అంటే 2016 నుంచి 2019 మధ్య కాలంలో ఇన్ ఫ్రా సంస్థల సబ్ కాంట్రాక్ట్‌ల ద్వారా రూ.118 కోట్ల ముడుపులు చేతులు మారినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ ఆరోపణల నేపథ్యంలో ఐటీ శాఖ విచారణ చేపట్టింది. బడా ఇన్ఫ్రా కంపెనీలకు అమరావతి ప్రాజెక్టుల కాంట్రాక్టులు అప్పజెప్పి.. వాటి ద్వారా సబ్ కాంట్రాక్టుల పేరుతో ప్రజా ధనాన్ని తన ఖాతాల్లోకి మళ్లించుకున్నారాయన. ఆ లెక్క లేని ఆదాయంపైనే ఐటీ శాఖ చంద్రబాబును ప్రశ్నిస్తోంది. చంద్రబాబుకు నగదు ముట్టినట్లు ఐటీ తనిఖీల్లో క్రిస్టల్ క్లియర్‌గా బయటపడింది. నగదు ఎవరెవరికి ఎలా డెలివరీ అయ్యిందో ఉదాహరణలతో వివరించింది కూడా. దీన్ని బ్లాక్ మనీగా ఎందుకు గుర్తించవద్దో చెప్పాలంటూ చంద్రబాబుకు తాజాగా మరో నోటీసు జారీ చేసింది. ఈ క్రమంలో.. లోకేష్ సన్నిహితుడు కిలారు రాజేశ్‌కు నగదు డెలివరీ అయిన సాక్ష్యాన్ని పట్టుకుంది ఐటీ శాఖ. ఐటీ నోటీసులపై దర్యాప్తును అడ్డుకునేందుకు చంద్రబాబు విశ్వప్రయత్నాలు చేస్తున్నట్లు డెక్కన్ క్రానికల్ ఒక కథనం ప్రచురించింది. -
విశాఖ రీతి సాహ కేసు.. నలుగురు అరెస్ట్
సాక్షి, విశాఖపట్నం: సంచలనంగా మారిన రీతి సాహ కేసులో పోలీసులు స్పీడ్ పెంచారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా కీలక విషయాలు బయటకు వస్తున్నాయి. ఇప్పటి వరకు ఈ కేసులో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల ప్రకారం.. రీతి సాహ కేసులో పోలీసులు దూకుడు పెంచారు. ఈ కేసులో సీఐడీ పోలీసులు విచారణలో విస్తుపోయే విషయాలు బయటకు వస్తున్నాయి. ఈ కేసులో అరెస్ట్‌ల పర్వం కూడా మొదలైంది. తాజాగా నలుగురిని పోలీసులు అరెస్ట్‌చేశారు. సాధన హాస్టల్‌కు చెందిన ఇద్దరు, బైజూస్ యజమాన్యానికి చెందిన ఇద్దరిని అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. వీరిలో సాధన హాస్టల్ ఓనర్ లక్ష్మీ, వార్డెన్ కుమారి, ఆకాష్ బైజూస్ కాలేజీ మేనేజర్ సూర్యకాంత్, అసిస్టెంట్ మేనేజర్ రామేశ్వర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే, వీరి నిరక్ష్యం కారణంగానే రీతి సాహ చనిపోయినట్టు పోలీసులు నిర్ధారించారు. మరోవైపు.. వెంకటరామ, కేర్ ఆసుపత్రిలో కూడా సీఐడీ దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో వీరిపై కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇక, ఈ కేసు దర్యాప్తులో భాగంగా బెంగాల్ పోలీసులు, సీఐడీ విశాఖలోనే మకాం వేసి దూకుడు పెంచారు. ఇది కూడా చదవండి: ఐటీ నోటీసులు.. అడ్డంగా బుక్కైనా నోరు విప్పని చంద్రబాబు -
‘వివేకా కేసులో సునీత స్వార్థం స్పష్టంగా కనిపిస్తోంది’
సాక్షి, హైదరాబాద్: వైఎస్ వివేకా హత్య కేసులోని నిందితుడు సునీల్ యాదవ్ బెయిల్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. ఈ కేసులో ఏ2గా ఉన్న సునీల్ యాదవ్‌కు వివేకా హత్యతో ఎలాంటి సంబంధం లేదని, ఉద్ధేశపూర్వకంగా ఇరికించారని ఆయన న్యాయవాది కోర్టుకు తెలిపారు. వివేకా హత్య జరిగిన ప్రాంతంలో.. సునీల్ యాదవ్ ఉన్నాడన్న గూగుల్ టేకౌట్ సమాచారం తప్పని వాదనలు వినిపించారు. టేక్ ఔట్ కథలన్నీ కట్టుకథలే కాగా, ‘2021 ఏప్రిల్ 29 తెల్లవారుజామున 2:30 గంటలకు సునీల్ యాదవ్ సంఘటన స్థలంలో ఉన్నాడని గూగుల్ టేకౌట్ ఆధారంగా సీబీఐ చెప్పిందని.. అయితే అదే సీబీఐ 23 జనవరి 2023 ఛార్జ్‌షీట్‌లో గూగుల్ టేకౌట్ విషయంలో పొరపాటు జరిగిందని అంగీకరించినట్లు తెలిపారు. యూనివర్సల్ టైం ప్రకారం ఉదయం 2:30కాగా భారత కాలమానం ప్రకారం ఐదున్నర గంటలు కలపాలని, అప్పుడు సమయం ఇండియన్ కాలమానం ప్రకారం ఉదయం 8:12అవుతుందని తెలిపారు. ఉదయం 8:12కు సీబీఐ చెప్పినట్టు సునీల్ యాదవ్ అక్కడుంటే హత్యతో సంబందం లేనట్టేనని పేర్కొన్నారు. కావున సునీల్‌కు వెంటనే బెయిల్ మంజూరు చేయాలని ఆయన తరపు న్యాయవాది కోరారు. వాదనలు విన్న హైకోర్టు.. తదుపరి విచారణను సెప్టెంబర్ 8కు వాయిదా వేసింది. చదవండి: ‘లోకేశ్.. హిందుస్తాన్ టైమ్స్పై దావా వేసే దమ్ముందా?’ దస్తగిరి విషయంలో అలా.. సునీల్ విషయంలో ఇలా.! షేక్ దస్తగిరి తానే స్వయంగా హత్య చేశానని అంగీకరించినా.. ఆయన ముందస్తు బెయిల్ విషయంలో సునీత ఎక్కడా అభ్యంతరం తెలుపలేదని, కానీ, సునీల్ యాదవ్ బెయిల్ విషయంలో ఇంప్లీడ్ అయ్యారని తెలిపారు. సునీత స్వార్థ ప్రయోజనాల కోసం పక్షపాతంగా వ్యవహరిస్తోందని, ఈ కేసులో ఆమె బాధితురాలు కానే కాదు, తనకు తాను బాధితులుగా ప్రచారం చేసుకుంటుందని తెలిపారు. తండ్రి వివేకా హత్యతో ఆమె కుటుంబం మాత్రమే లబ్ధిదారులు అన్న విషయం గమనించాలని, కోర్టు విచారణ ప్రక్రియను పిటిషన్లు, కౌంటర్లతో దుర్వినియోగం చేస్తుందని, సీబీఐ దర్యాప్తు, ప్రాసిక్యూషన్‌లో ఉద్దేశ పూర్వకంగా జోక్యం చేసుకుంటుందని, అన్ని విషయాల్లో సునీత ప్రమేయం దర్యాప్తును ప్రాసిక్యూషన్ తప్పుపట్టించేలా ఉందని తెలిపారు. బాధితుడు వివేకా మాత్రమే, సునీత కాదు రెండవ భార్య షేక్ షమీంతో పాటు ఆమె కొడుక్కి ఆస్థి దక్కకుండా సునీత నిలువరించారని, ఈ హత్య కేసులో సునీత భర్త రాజశేఖరరెడ్డి మామ శివ ప్రకాష్ రెడ్డిలపై ప్రైవేటు పిటిషన్ పెండింగ్‌లో ఉందని తెలిపారు. ఒక వర్గం మీడియా ప్రచారం ఏకంగా హైకోర్టు న్యాయమూర్తినే విమర్శించిన తీరు ఇప్పటికే కోర్టు రికార్డుల్లో ఉందని, సీబీఐకి ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ ఢిల్లీ నుంచి వస్తున్నారని, ఈ కేసులో సునీత బాధితురాలు కాదని, తండ్రే ఆమె బాధితుడని సునీల్ యాదవ్ తరపు లాయర్ వాదనలు వినిపించారు. అజేయ కల్లం పిటిషన్ పై సీబీఐకి నోటీసులు వివేకా హత్యకేసులో తన స్టేట్ మెంట్ ను తప్పుదోవ పట్టించారంటూ మాజీ చీఫ్ సెక్రటరీ అజయ్ కల్లo వేసిన పిటిషన్ ను హైకోర్టు విచారించింది. తన పేరుతో కోర్టుకు ఇచ్చిన వాంగ్మూలంలో తాను చెప్పని విషయాలను సీబీఐ పేర్కొందని, పూర్తిగా కేసును పక్కదోవ పట్టించేలా సీబీఐ అధికారి వ్యవహరించారంటూ హైకోర్టును ఆశ్రయించిన అజేయ కల్లం. ఈ పిటిషన్ ను స్వీకరించిన హైకోర్టు కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐని ఆదేశించింది. తదుపరి విచారణను ఈనెల 15 కు వాయిదా వేసింది. -
బాబు ‘బ్లాక్‌మనీ యవ్వారం’.. బిగ్ ట్విస్ట్
సాక్షి, ఢిల్లీ: మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఊహించని ఝలక్ తగిలింది. ఆయన విజ్ఞప్తిని తోసిపుచ్చి మరీ.. షోకాజ్ నోటీసులు కూడా జారీ చేసింది ఆదాయ పన్నుల శాఖ. చంద్రబాబు వద్ద ఉన్న రూ. 118 కోట్లను బ్లాక్ మనీగానే గుర్తించింది ఐటీ శాఖ. ఈ పరిణామాలను చంద్రబాబు అస్సలు ఊహించి ఉండడు. సీఎంగా ఉన్న టైంలో ఇన్ఫ్రా సంస్థల సబ్ కాంట్రాక్టు ల రూపంలో రూ. 118 కోట్ల ముడుపులు అందుకున్నారాయన. ఈ క్రమంలో చంద్రబాబు పీఏ శ్రీనివాస్‌కు ముడుపులు డెలివరీ చేసినట్లు షాపూర్జి పల్లోంజి మనోజ్ వాసుదేవ్ వాంగ్మూలం ఇచ్చాడు కూడా. అందుకే తాజా నోటీసుల్లో.. ఇన్ఫ్రా కంపెనీల ద్వారా అందుకున్న రూ. 118 కోట్లను బ్లాక్ మనీగా(వెల్లడించని)ఎందుకు పరిగణించరాదో తెలపాలని బాబును కోరింది ఐటీ శాఖ. అంతకు ముందు రీ అస్సెస్ చేయాలని చంద్రబాబు కోరగా.. షోకాజ్ నోటీసులపై చంద్రబాబు అభ్యంతరాలను తిరస్కరించింది ఐటీ శాఖ. ఆపై నోటీసులు జారీ చేసింది. 2016 నుంచి 2019 మధ్య నడిచిన ముడుపుల బాగోతం నడిచింది. ఐటీ శాఖ అధికారులు.. షాపూర్జి పల్లోంజి మనోజ్ వాసుదేవ్ పార్థసాని నివాసాల్లో తనిఖీల చేపట్టగా.. ఈ స్కాం బయటపడింది. బోగస్ కాంట్రాక్టులు, వర్క్ ఆర్డర్ల ద్వారా నగదు స్వాహా చేసినట్లు ఒప్పుకున్నాడు మనోజ్ వాసుదేవ్ (ఎంవిపి). షాపూర్జి పల్లోంజి (ఎస్ పి సి ఎల్), ఎల్ అండ్ టి సంస్థల నుంచి సబ్ కాంట్రాక్టుల ద్వారా ముడుపులు.. ఫోనిక్స్ ఇన్ఫ్రా& పౌర్ ట్రేడింగ్ అనే సబ్ కాంట్రాక్టు సంస్థ ద్వారా నగదు మళ్లింపు జరిగింది. 2016లో చంద్రబాబు పిఏ శ్రీనివాస్ తో టచ్‌లో ఉంటూ వచ్చిన పార్థసారథి.. ఆ శ్రీనివాస్ ద్వారానే సబ్ కాంట్రాక్టుల సంస్థల నుంచి ముడుపుల్ని తన బాస్ చంద్రబాబుకు అందించారు. చంద్రబాబు సీఎంగా ఉన్న హయాంలో పలు నిర్మాణ కంపెనీలకు కాంట్రాక్టులు కట్టబెట్టారు. అయితే.. బోగస్ సబ్ కాంట్రాక్టుల ద్వారా బాబు లబ్ధి పొందినట్లు నోటీసుల్లో పేర్కొంది ఐటీ. 2017లో బాబు మయాంలో షాపూర్ జీ సంస్థ తరపున ఎంవీపీ టెండర్ వేశారు. ఎంవీపీ కంపెనీ, అనుబంధ సంస్థపై 2019లో సోదాలు నిర్వహించింది. ఐటీ శాఖ. ఆ సమయంలో బోగస్ సబ్ కాంట్రాక్ట్ పేరుతో నిధులు మళ్లించిన విషయాన్ని ఐటీ అధికారులు గుర్తించారు. ఎంవీపీ కార్యాలయం నుంచి కీలక పత్రాలు, ఎక్సెల్షీట్లు, కీలకమైన మెసేజ్‌లు స్వాధీనం చేసుకున్నారు కూడా. ఇక నిధులు మళ్లించినట్లు ఆధారాలు సేకరించిన ఐటీ.. మళ్లిన ఆ నిధులు చంద్రబాబుకు చేరినట్లు అభియోగం నమోదు చేసింది. 2016లో ఆగష్టులో చంద్రబాబు నాయుడు సెక్రటరీ శ్రీనివాస్ తనను కలిసి.. పార్టీకి ఫండ్ ఇవ్వాల్సిందిగా చెప్పినట్లు ఎంవీపీ ఐటీకి స్టేట్మెంట్ ఇచ్చారు. బోగస్ సబ్ కాంట్రాక్టు సంస్థల ద్వారా చంద్రబాబు ముడుపులు పొందగా.. ప్రాథమిక ఆధారాలు సేకరించారు ఆదాయ పన్ను శాఖ అధికారులు.ఇప్పుడు చంద్రబాబుకు నోటీసులు అందిన విషయాన్ని హిందుస్థాన్ టైమ్స్ దినపత్రిక బయటపెట్టింది. The Income Tax department has issued a show-cause notice to TDP chief #ChandrababuNaidu, asking why an amount of ₹118 crore, allegedly received by him, should not be treated as “undisclosed income”. (Reports @utkarsh_aanand)https://t.co/IeAQiZnlU2 — Hindustan Times (@htTweets) September 1, 2023 ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో.. అమరావతిలో సచివాలయం, శాసనసభ, న్యాయస్థానం భవన నిర్మాణాల్లో చంద్రబాబు యథేచ్ఛగా దోపిడీకి పాల్పడ్డారు. కాంట్రాక్టు సంస్థలను బెదిరించి మరీ భారీ వసూళ్లు చేశారు. తన మనుషుల ద్వారా బోగస్ కంపెనీలు సృష్టించి సబ్ కాంట్రాక్టుల రూపంలో నిధులు కొల్లగొట్టారు. ఆదాయ పన్ను శాఖ అధికారుల సోదాల్లో ఈ అవినీతి బాగోతం అంతా బట్టబయలైంది. ఈ విషయాన్నే ఐటీ శాఖ అప్రైజల్ రిపోర్ట్ వెల్లడించింది కూడా. ఇక.. చంద్రబాబు నేర చరిత్ర ఇదే కాదు.. ఇంకా చాలా ఉంది. ఇదీ చదవండి: గ్యారెంటీ లేని బాబు ష్యూరిటీ.. జనం నమ్ముతారా? -
చంద్రబాబుకు ఐటీ నోటీసులు
సాక్షి, హైదరాబాద్: తెలుగు దేశం పార్టీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడుకు ఆదాయ పన్నుల శాఖ(ఐటీ) నోటీసులు జారీ చేసింది. టీడీపీ హయాంలో సబ్ కాంట్రాక్ట్‌ల ద్వారా చంద్రబాబుకు ముడుపులు అందాయనే అభియోగాలు ఇప్పుడు సంచలనంగా మారాయి. ఈ కేసు దర్యాప్తు ఎన్నికల సమయంలో వేగవంతంగా జరుగుతున్న తరుణంలో రాజకీయాల్లో ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది. టీడీపీ ప్రభుత్వంలో సబ్ కాంట్రాక్ట్‌ల ద్వారా చంద్రబాబుకు ముడుపులు అందినట్లు ఐటీ శాఖ గర్తించింది. టీడీపీ హయాంలో అంటే 2016 నుంచి 2019 మధ్య కాలంలో ఇన్ ఫ్రా సంస్థల సబ్ కాంట్రాక్ట్‌ల ద్వారా రూ.118 కోట్ల ముడుపులు చేతులు మారినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ ఆరోపణల నేపథ్యంలో ఐటీ శాఖ విచారణ చేపట్టింది. బోగస్ సబ్ కాంట్రాక్టు సంస్థల ద్వారా ముడుపులు పొందినట్లు ఐటీశాఖకు ఖచ్చితమైన సమాచారం అందింది. ఇందుకు సంబంధించి ఆదాయ పన్ను శాఖ అధికారులు ప్రాథమిక ఆధారాలను సైతం సేకరించినట్లు తెలుస్తోంది. 2016లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పీఏ శ్రీనివాస్ ద్వారా షాపూర్జి పల్లోంజి సంస్థ ప్రతినిధి మనోజ్ వాసుదేవ్ పార్థసాని సబ్ కాంట్రాక్టర్‌గా అవతారం ఎత్తారని ఐటీకి సమాచారం అందింది. ఈ నేపథ్యంలో షాపూర్జి పల్లోంజి సంస్థ ప్రతినిధి మనోజ్ వాసుదేవ్ పార్థసాని నివాసాల్లో తనిఖీలు చేపట్టారు. అనంతరం మనోజ్ వాసుదేవ్‌ను విచారించారు. బోగస్ కాంట్రాక్టులు, వర్క్ ఆర్డర్ల ద్వారా ముడుపులు చేతులు మారినట్లు షాపూర్జి పల్లోంజి సంస్థ ప్రతినిధి మనోజ్ వాసుదేవ్ అంగీకరించినట్లు ఐటీ తెలిపింది. మనోజ్ వాసుదేవ్ స్వయంగా 2016 నుంచి 2019 వరకు ఎన్ని కాంట్రాక్ట్‌లు పొందారు..అందుకు ఎలా డబ్బు సమకూర్చారు.. ముడుపులు ఎలా చేతులు మారాయనే అంశాలకు సంబంధించి ఐటీ శాఖకు మనోజ్ వాసుదేవ్ వాంగ్మూలం ఇచ్చారని ఐటీ స్పష్టం చేసింది. షాపూర్ జీ పల్లోంజీ సంస్థ ప్రతినిధి, ఎల్‌అండ్‌టి సంస్థల నుంచి సబ్ కాంట్రాక్టుల ద్వారా ముడుపులు అందినట్లు ఐటీశాఖకు మనోజ్ వాసుదేవ్ తెలియజేసినట్లు పెద్దఎత్తున ప్రచారం జరిగింది. అంతేకాదు ఫోనిక్స్ ఇన్ఫ్రా& పౌర్ ట్రేడింగ్ అనే సబ్ కాంట్రాక్టు సంస్థ ద్వారా నగదు మళ్లించారని ఆరోపణలు సైతం వినిపించాయి. చంద్రబాబు సమాధానంపై ఐటీ అభ్యంతరాలు షాపూర్జి పల్లోంజి సంస్థ ప్రతినిధి మనోజ్ వాసుదేవ్ ఇంట్లో ఐటీ శాఖ సోదాలు చేసే సమయంలో కీలకమైన సమాచారం సేకరించినట్లు తెలుస్తోంది. వాట్సాప్ ద్వారా కొన్ని మెసేజ్‌లు, చాట్లు,ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ఎక్స్ఎల్ షీట్లను కూడా ఐటీ శాఖ స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో సబ్ కాంట్రాక్ట్‌ల ద్వారా నిధులు మళ్లించి వాటిని చంద్రబాబుకు అందేలా చేశారని ఐటీ తన అభియోగంలో వెల్లడించింది. మరోవైపు 2016లో ఆగష్టులో చంద్రబాబు సెక్రటరీ శ్రీనివాస్ తనను కలిసి పార్టీకి ఫండ్ ఇవ్వాల్సిందిగా చెప్పినట్లు మనోజ్ వాసు దేవ్ ఐటీకి స్టేట్మెంట్ సైతం ఇచ్చినట్లు తెలుస్తోంది.ఈ క్రమంలో ఆగస్ట్ 4న హైదరాబాద్ ఐటీ సెంట్రల్ సర్కిల్ కార్యాలయం నుంచి సెక్షన్ 153సీ కింద మరోసారి నోటీసు జారీ చేసినట్లు తెలుస్తోంది. The Income Tax department has issued a show-cause notice to TDP chief #ChandrababuNaidu, asking why an amount of ₹118 crore, allegedly received by him, should not be treated as “undisclosed income”. (Reports @utkarsh_aanand)https://t.co/IeAQiZnlU2 — Hindustan Times (@htTweets) September 1, 2023 -
చిత్తూరు: ఏనుగు బీభత్సం.. భార్యభర్తల మృతి
సాక్షి, చిత్తూరు జిల్లా: గుడిపాల మండలం ‘190 రామాపురం’లో ఒంటరి ఏనుగు బీభత్సం సృష్టించింది. ఏనుగు దాడి చేయడంతో ఇద్దరు మృతిచెందారు. మృతులను రామాపురం హరిజనవాడకు చెందిన దంపతులు వెంకటేష్, సెల్వీగా గుర్తించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, అటవీశాఖ అధికారులు దర్యాప్తు జరుపుతున్నారు. భార్యభర్తలు మృతితో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. చిత్తూరు జిల్లాలో అడవి ఏనుగులు వరుస దాడులు కొనసాగుతున్నాయి. ఇటీవల కుప్పంలో సమీపంలో కూడా అడవి ఏనుగులు దాడి చేసిన సంగతి తెలిసిందే. దీంతో సమీప ప్రాంత ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. చదవండి: హైదరాబాద్‌లో ‘కంత్రీ’ బాబా.. నవ వధువు కళ్లకు గంతలు కట్టి.. -
భార్యతో వివాహేతర సంబంధం.. కత్తితో నరికి..చెరువులో పడేసి..
స్టేషన్‌ఘన్‌పూర్: మండలంలోని శివునిపల్లికి చెందిన తీగల కరుణాకర్(35) దారుణహత్యకు గురయ్యాడు. అదే గ్రామానికి చెందిన చిక్కుడు నాగరాజు.. కరుణాకర్‌ను కత్తితో దారుణంగా చంపి శివునిపల్లి శివారు నమిలిగొండ చెరువులో పడేశాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్టేషన్‌ఘన్‌పూర్ ఏసీపీ శ్రీనివాసరావు కథనం ప్రకారం శివునిపల్లి ఎస్సీ కాలనీకి చెందిన తీగల యోబు, మరియ దంపతుల రెండో కుమారుడు కరుణాకర్ హైదరాబాద్‌లో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. అదేవిధంగా శివునిపల్లికి చెందిన చిక్కుడు నాగరాజు హమాలీ పనిచేస్తుంటాడు. నమిలిగొండ శివారులో వారివురి వ్యవసాయ భూములు పక్కపక్కనే ఉన్నాయి. ఈ క్రమంలో కరుణాకర్‌కు, నాగరాజు భార్యకు మధ్య పరిచయం ఏర్పడింది. ఈనెల 25న హైదరాబాద్‌లో ఉన్న కరుణాకర్.. నాగరాజు భార్య ఫోన్‌కు ఫోన్ చేయగా ఇంట్లో ఉన్న ఆయన ఫోన్ లిఫ్ట్ చేశాడు. ఇదీ గమనించని కరుణాకర్ తాను సాయంత్రం వస్తున్నానని, కలుస్తామని చెప్పగా నాగరాజు కోపంతో రగిలిపోయాడు. ఈ విషయంపై ఏమి తెలియనట్లు బయటకు వెళ్లాడు. అనంతరం సాయంత్రం ఆమెకు మరోసారి ఫోన్ రావడంతో తమ వ్యవసాయ భూముల సమీపంలో ఉన్న మామిడితోట వద్దకు వెళ్లింది. గమనించిన నాగరాజు కత్తి తీసుకుని మామిడితోటకు వెళ్లాడు. అక్కడ తన భార్యతో కరుణాకర్ మాట్లాడుతున్న విషయం గుర్తించి ఒక్కసారిగా కత్తితో దాడి చేసి హతమార్చాడు. అనంతరం మృతదేహాన్ని కచ్చువల, సంచిలో కట్టి నమిలిగొండ చెరువులో పడేసి వెళ్లాడు. ఈనెల 25వ తేదీ రాత్రి నుంచి కరుణాకర్ కనిపించకపోవడంతో కుటుంబీకులు చుట్టుపక్కల గ్రామాలు, బంధువుల ఇళ్లలో వెతికారు. అతడి ఆచూకీ కోసం పోలీసులను కూడా ఆశ్రయించారు. ఈ క్రమంలో నిందితుడు స్వయంగా మంగళవారం పోలీసులకు లొంగిపోయినట్లు సమాచారం. దీంతో విషయం తెలుసుకున్న స్టేషన్‌ఘన్‌పూర్, రఘునాథపల్లి సీఐలు రాఘవేందర్, శ్రీనివాస్‌రెడ్డి.. చెరువు వద్దకు చేరుకుని మృతదేహాన్ని బయటికి తీయించారు. దీంతో మృతుడి భార్య, సోదరులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. విషయం తెలుసుకున్న ఏసీపీ శ్రీనివాసరావు ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. దీనిపై మృతుడి భార్య కవిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రాఘవేందర్ తెలిపారు. కాగా, హత్య ఒక్కరే చేశారా.. మరెవరైనా ఉన్నారా? హత్యకు వివాహేతర సంబంధమే కారణమా? లేదా ఇతర కారణాలు ఉన్నాయా అనే పోలీసులు కోణాల్లో విచారణ చేస్తున్నారు. -
శ్రీకాకుళం: భారీ అగ్నిప్రమాదం.. రూ.6కోట్ల నష్టం!
సాక్షి, శ్రీకాకుళం: జిల్లాలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. పాతపట్నంలోని ఓ షాపింగ్ మాల్లో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న ఆంధ్రా-ఒడిశా ఫైర్ సిబ్బంది శ్రమించి.. మంటల్ని చల్లార్చారు. పాత పట్నంలోని స్నేహ షాపింగ్ మాల్లో మంటలు చెలరేగాయి. రెండు అంతస్తుల్లోని వస్త్రాలు అగ్నికి ఆహుతి కాగా.. రూ. 6 కోట్ల ఆస్తినష్టం సంభవించినట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని అధికారులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. #WATCH | Andhra Pradesh | Fire breaks out in a shopping mall in Pathapatnam, of Srikakulam district due to an electrical short circuit. Fire engines have reached the spot to put out the fire. Details awaited. pic.twitter.com/dx7GhFJNzr — ANI (@ANI) August 30, 2023