కస్టమర్లుగా వచ్చి బ్యూటీపార్లర్లో చోరీ | - | Sakshi
Sakshi News home page

కస్టమర్లుగా వచ్చి బ్యూటీపార్లర్లో చోరీ

Sep 6 2023 1:40 AM | Updated on Sep 6 2023 12:13 PM

సీసీ ఫుటేజీలో నమోదైన అనుమానిత మహిళలు - Sakshi

ఒంగోలు టౌన్‌: ఫేస్‌వాష్‌ చేయించుకుంటామని వచ్చిన ముగ్గరు మహిళలు అదునుచూసి బ్యూటీపార్లర్‌ నిర్వాహకురాలిపై దాడి చేసి అందినకాడికి దోచుకువెళ్లారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...నగరంలోని శ్రీకృష్ణనగర్‌లో షేక్‌ రజియా అనే మహిళ ఇంటి వద్దే బ్యూటీపార్లర్‌ నిర్వహిస్తుంది. మంగళవారం ఉదయం 11 గంటల సమయంలో ముగ్గురు మహిళలు వచ్చి ఫేస్‌వాష్‌, ఐబ్రోస్‌ చేయించుకుంటామని చెప్పారు. దీంతో వారిని ఇంట్లోకి తీసుకెళ్లిన రజియా.. ఐ బ్రోస్‌ చేస్తుండగా ముగ్గురికీ పెడిక్యూర్‌ చేయాలని కోరారు. ఈ లోగా ఒక మహిళ బాత్రూమ్‌కువెళ్లిఆలస్యంగా వచ్చింది.

మిగిలిన వారు నమ్మకంగా మాట్లాడుతూ ఐ బ్రోస్‌ చేయించుకున్నారు. తరువాత ఒక మహిళకు పెడిక్యూర్‌ చేస్తుండగా రజియాపై ఒక్కసారిగా దాడికి దిగారు. దాడిలో రజియా మెడకు, కుడి చేతికి గాయాలయ్యాయి. అనంతరం మత్తు మందు చల్లడంతో రజియా స్పృహ కోల్పోయింది. కాసేపటికి తేరుకున్న రజియా ఇంట్లోకి వెళ్లి చూడగా ఆమె మెడలోని బంగారు నగలతో పాటుగా ఇంట్లోని కప్‌బోర్డులో దాచి ఉంచిన నగలు, రూ.40 వేల నగదు కూడా దోచుకొనిపోయినట్లు గుర్తించి తాలుకా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్సై కె.అంకమ్మ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement