నాగోబా జాతర ప్రారంభం

nagoba jatara in keslapur - Sakshi

సాక్షి, ఆదిలాబాద్: గిరిజనుల ఆరాధ్య దైవమైన నాగోబా జాతర ఆదివారం ప్రారంభమైంది. పవిత్ర గంగా జలాలతో కేస్లాపూర్‌కు చెందిన మెస్రం వంశస్థులు జాతరకు తరలివచ్చారు. కాగా... మంగళవారం రాత్రి నాగోబాకు జలాభిషేకం చేస్తారు.

ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెళ్లి మండలం కేస్లాపూర్‌లో జరిగే నాగోబా జాతరకు చుట్టుపక్కల ప్రాంతాల వారేగాక పొరుగున ఉన్న మహారాష్ట్ర, చత్తీస్‌ఘడ్ రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్దసంఖ్యలో విచ్చేస్తుంటారు. దీంతో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా భారీ ఏర్పాట్లు చేశారు.

Back to Top